పస్తాపూర్‌లో నిర్వహించిన బోనాల ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే గీతారెడ్డి
జహీరాబాద్ టౌన్ : మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని, మహిళలను పూజించే భారత దేశంలో అత్యాచారాలు, లైంగిక వేధింపుల విషయంలో అగ్రస్థానంలో ఉందని ఎమ్మెల్యే గీతారెడ్డి, పీఏసీ చైర్మన్ గీతారెడ్డి ఆరోపించారు. పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో గల ఆమె నివాసగృహంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
యుద్దవాతావరణం ఉన్న అప్ఘనిస్తాన్, సిరియా దేశంలో సైతం మహిళలపై అఘాయిత్యాలు జరగడం లేదన్నారు. శాంతి దేశమైన భారత్‌లో మహిళలకు రక్షణ కరువైందని, హత్యచారాలు, వివక్ష, లైంగిక దాడుల్లో అగ్రస్థానంలో నిలవడం శోచనీయమన్నారు. ఈ విషయం ఎన్‌ఆర్‌పీసీ సర్వే ద్వారా వెల్లడైందన్నారు. ఎన్‌ఆర్‌పీసీ నివేదిక ప్రకారం 2016 సంవత్సంలో 15 వేలు, 2017 సంవత్సరంలో 14 వేల నేరాలు జరిగాయన్నారు.
నేషనల్ క్రైమ్స్ రిసర్చ్ బ్యూరో వారు ఇచ్చిన గణాంకల ప్రకారం మహిళల వేదింపుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో రెండవ స్థానంలో నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల పట్ల వివక్షత చూపుతుందన్నారు. రాష్ట్ర క్యాబినేట్‌లో ఒక్క మహిళ కూడా లేరని, మహిళా కమిషన్ కూడా లేదని ఆమె ఆరోపించారు. ఆర్థికాభివృద్ధిలో రాష్ట్ర నంబర్ వన్ స్థానంలో ఉంటే మహిళల వివిక్షలో కూడా రెండవ స్థానంలో నిలవడం విచారకమన్నారు.
రాష్ట్రంలోని దళిత గిరిజన ఐఏఎస్ అధికారుల పట్ల ప్రభుత్వం వివక్షత చూపుతుందని ఆమె ఆరోపించారు. సినియర్ ఐఏఎస్ అధికారులను కాదని జూనియర్స్‌కు పదొన్నతులు కల్పిస్తుందన్నారు. టీఎస్‌ఐపాస్ పాలసిని రూపొందించిన ఐఏఎస్ అధికారి ప్రదీప్ చంద్రను ప్రిన్సిపల్ సెక్రటరీగా పొడగించలేక పొయిందన్నారు. ప్రభుత్వ విధానం వల్లే పంచాయతీ ఎన్నికలకు బ్రేక్ పండిదని ఎమ్మెల్యే ఆరోపించారు.
బీసీలోని అన్ని ఉపకులాలకు న్యాయం జరిగిలా రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు వెళ్లాలని ఆమె కోరారు. విలేకరుల సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మంకాల్ సుభాశ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కండెం నర్సింలు, ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాల అధ్యక్షులు హన్మంత్‌రావు, పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment