హోంశాఖను నిర్వహిస్తున్న సీఎం రేవంత్ పనితీరు తీవ్ర ఆందోళనకరం
కాంగ్రెస్ పాలనలో మహిళలకు భద్రత లేదు
మాజీ మంత్రి టి.హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. వారిపై గతంలోకంటే ఇప్పుడు దాడులు పెరిగా యని పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో నేరాల రేటు 22.5 శాతం పెరిగిందన్నారు. అత్యాచార కేసులు 28.94 శాతం పెరిగాయని, ఏడాదిలో మొత్తం 2,945 కేసు లు నమోదయ్యాయని వివరించారు.
మహిళలపై అఘా యిత్యాలకు సంబంధించి రాష్ట్రంలో రోజుకు సగటున 8 కేసు లు నమోదవుతున్నాయని, ఇందులో 82 శాతం మైనర్ బాలి కల అపహరణ కేసులు నమోదవడం సిగ్గుచేటని అన్నారు. ఇవన్నీ గమనిస్తే.. కాంగ్రెస్ పాలనలో మహిళలకు భద్రత లేదని స్పష్టమవుతోందని, ప్రజా భద్రత పూర్తిగా దిగజారిందని ఆయన ధ్వజమెత్తారు. అంబర్‌పేటలో రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ గంగారెడ్డి, ఆయన భార్య హత్య (నాలుగు నెలల క్రితం) కేసు ఇంకా పరి ష్కారం కాలేదని, ఆర్నెల్లక్రితం హత్యకు గురైన బీఆర్‌ఎస్ నాయకుడు శ్రీధర్‌రెడ్డి కేసులో కూడా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.
రాష్ట్రంలో 163కి పైగా ప్రధాన కేసులు ఇప్పటికీ పరిష్కారం కాలేదని, రూ.10 కోట్ల విలువైన ఆర్థిక మోసాలకు సంబంధించి రికవరీ జరగలేదని ఆక్షేపించారు. రాష్ట్రంలో నేరాల గుర్తింపు రేటు 31 శాతంగా ఉందని, ఈ విషయంలో బిహార్‌లాంటి రాష్ట్రాలతో పోటీపడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు గోల్డెన్ పీరియడ్ స మయాన్ని వృథా చేయడం వల్ల బాధితులకు న్యాయం జర గడం లేదని పేర్కొన్నారు. నిందితులు స్వేచ్ఛగా తిరుగు తున్న పరిస్థితి పోలీసుల వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. హోంశాఖను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనా వైఫల్యం వల్ల తెలంగాణ పోలీసులకు ఉన్న మంచి నైపుణ్యాన్ని, శక్తిని కోల్పోతున్నారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించడానికి సీఎం రేవంత్‌రెడ్డే కారణమని హరీశ్‌రావు అన్నారు.
కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు బతికితే చాలనుకుంటున్నారు: మాజీ మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో పిల్లలు ప్రాణాలతో బతికుంటే చాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో అన్నారు. గురుకులాలు, కేజీబీవీలు, హాస్టళ్లలో పెడుతున్న బువ్వ తమ కొద్దని, ఇక్కడ తాము ఉండలేమంటూ విద్యార్థులు తల్లిదండ్రులను వేడుకుంటున్నారని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గురుకులాల దీనస్థితి చూస్తే బాసర సరస్వతి తల్లి మనసు తల్లడిల్లుతోందన్నారు.
అనంతపేట్ కేజీబీవీలో విషాహారం తిని పదిమంది విద్యార్థులు ఆస్పత్రి పాలైన దుస్థితి బాధాకరమని, విషాహారం తిని వాంకిడి గురుకుల విద్యారి్థని మరణించిన ఘటన మరువకముందే ఇలాంటివి పునరావృతం కావడం సిగ్గుచేటని హరీశ్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న పోలీసుల ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ములుగు జిల్లాలో ఎస్సై, సిద్దిపేటలో కానిస్టేబుల్ కుటుంబం, కామారెడ్డిలో ఎస్సై, కానిస్టేబుల్, సిరిసిల్లలో కానిస్టేబుల్ కుటుంబం, మెదక్ కుల్చారంలో హెడ్ కానిస్టేబుల్.. ఇలా స్వల్ప కాలంలో ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. పని ఒత్తిడి, పెండింగ్ హామీలను తీర్చడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే పోలీసులపై తీవ్ర ప్రభావం పడుతోందని హరీశ్‌రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment