సాక్షి, హైదరాబాద్ : కరోనా సమయంలో సైబర్ వేధింపులు ఎక్కువయ్యాయని సీపీ సజ్జనార్ తెలిపారు. ఉద్యోగాల్లో కొత్తగా చేరిన మహిళల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సదస్సు కార్యక్రమంలో సీపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా ఉద్యోగులు కోసం కంపెనీలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబరాబాద్ పోలీస్ ఎస్‌సీఎస్‌సీ ద్వారా మహిళా ఉద్యోగుల కోసం రక్షణ ఏర్పాట్లు చేశామని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ లెర్నిగ్ మాడ్యూల్ ద్వారా మహిళ ఉద్యోగుల రక్షణ కోసం ఇది పనిచేస్తుందన్నారు. (జీతం కోసం జీవితం అంతం చేసుకున్నాడు)
కోవిడ్ కారణంగా సోషల్ మీడియా ద్వారా వేధింపులు ఎక్కువయ్యయని వీటి కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సుమారు 65వేల మంది మహిళా ఉద్యోగులు ఐటీ సంస్థలో పనిచేస్తున్నారని, వీరి భద్రతకు ఆయా సంస్థలు విమెన్ సేఫ్టీ వింగ్స్‌ను ఏర్పాటు చేశాయని అన్నారు. వర్క్ ఫ్రం హోం చేసే ఉద్యోగులకు సైతం తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఉమెన్ ఫోరమ్ సభ్యుల కృషితో ఐటీ కారిడార్‌లో నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. (శ్రీశైలం ఘటనపై ఫోరెన్సిక్ నివేదిక సిద్ధం!)
Comments
Please login to add a commentAdd a comment