
సాక్షి, హైదరాబాద్ : రక్తదానంలో అందరూ పాల్గొనాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ కోరారు. రక్తదానం చేయాలనుకునే వారు పోలీసులను సంప్రదిస్తే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి ద్వారా రక్తదానం సేకరణ కార్యక్రమం జరిగింది. సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోని పోలీసులు సోమవారం 117 యూనిట్ల రక్తదానం చేశారు.
లాక్‌డౌన్ నేపథ్యంలో మెడికల్ ఎమర్జెన్సీ, తలసేమియా, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు రక్తం అవసరం ఉందని సజ్జనార్ తెలిపారు. ఒక్కరుచేసిన రక్తదానం ముగ్గురికి ఉపయోగ పడుతుంది. ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు రక్తదానం చెయ్యాలని పిలుపునిచ్చారు. కోవిడ్ కంట్రోల్ రూం నెంబర్స్ 9490617440, 9490617431కు సంప్రదిస్తే పోలీసుల సహకారం అందిస్తామని చెప్పారు. 13 అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచామని, ఇప్పటి వరకు 250 మందికి మెడికల్ ఎమర్జెన్సీ సేవలు అందించామన్నారు. 5వందల పైచిలుకు డయాలసిస్ రోగులకు సేవలు అందిస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment