Cyber harassment
-
బోనాల జాతరలో పరిచయం.. జోగిని శ్యామలపై పాతబస్తీ మౌనిక వేధింపులు
సాక్షి, సిటీబ్యూరో: జోగిని శ్యామలగా ప్రాచుర్యం పొందిన శ్యామలా దేవికి సైబర్ వేధింపులు ఎదురయ్యాయి. తనకు భక్తురాలిగా పరిచయమైన పాతబస్తీకి చెందిన మౌనిక యాదవ్ ఎస్సెమ్మెస్‌లు, వాట్సాప్ సందేశాలతో వేధింపులకు గురి చేస్తున్నట్లు సోమవారం శ్యామల సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ కథనం ప్రకారం... బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన శ్యామల నగరంలో బోనాల సందర్భంలో ఎక్కువగా వార్తల్లో కనిపిస్తుంటారు. బోనాలు సమర్పించే సమయంలో అనేక మంది భక్తులు ఆమె వెంట ఉంటారు. పాతబస్తీకి చెందిన మౌనిక యాదవ్ సైతం ఇలానే శ్యామలకు పరిచయమయ్యింది. కొన్నాళ్ల క్రితం ఓ అంశానికి సంబంధించి ఇద్దరి మధ్యా స్పర్థలు వచ్చాయి. తనను వేధించిన వ్యక్తికి శ్యామల మద్దతు ఇస్తున్నారనేది మౌనిక ఆరోపణ. దీంతో కక్షకట్టిన ఆమె ఓ సందర్భంలో శ్యామల ఇంటికి వెళ్లి వాగ్వాదానికి దిగింది. అయితే కొన్నాళ్లుగా శ్యామల ఫోన్‌కు ఎస్సెమ్మెస్‌లు, వాట్సాప్ సందేశాలను మౌనిక పంపిస్తున్నారు. వాటిలో శ్యామలతో పాటు ఆమె కుటుంబాన్నీ కించపరిచే, అవమానించేలా అభ్యంతరకరమైన అంశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శ్యామల సైబర్ క్రైమ్ పోలీసులకు ఆశ్రయించింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఇన్స్పెక్టర్ ఎస్.శ్రీనివాసరావు సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు. (చదవండి: ఎంతటి విషాదం.. భార్య మరణవార్త తెలియకుండానే భర్త కూడా..) -
సైబర్ వేధింపులు ఎక్కువయ్యాయి : సీపీ
సాక్షి, హైదరాబాద్ : కరోనా సమయంలో సైబర్ వేధింపులు ఎక్కువయ్యాయని సీపీ సజ్జనార్ తెలిపారు. ఉద్యోగాల్లో కొత్తగా చేరిన మహిళల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సదస్సు కార్యక్రమంలో సీపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా ఉద్యోగులు కోసం కంపెనీలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబరాబాద్ పోలీస్ ఎస్సీఎస్సీ ద్వారా మహిళా ఉద్యోగుల కోసం రక్షణ ఏర్పాట్లు చేశామని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ లెర్నిగ్ మాడ్యూల్ ద్వారా మహిళ ఉద్యోగుల రక్షణ కోసం ఇది పనిచేస్తుందన్నారు. (జీతం కోసం జీవితం అంతం చేసుకున్నాడు) కోవిడ్ కారణంగా సోషల్ మీడియా ద్వారా వేధింపులు ఎక్కువయ్యయని వీటి కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సుమారు 65వేల మంది మహిళా ఉద్యోగులు ఐటీ సంస్థలో పనిచేస్తున్నారని, వీరి భద్రతకు ఆయా సంస్థలు విమెన్ సేఫ్టీ వింగ్స్‌ను ఏర్పాటు చేశాయని అన్నారు. వర్క్ ఫ్రం హోం చేసే ఉద్యోగులకు సైతం తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఉమెన్ ఫోరమ్ సభ్యుల కృషితో ఐటీ కారిడార్‌లో నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. (శ్రీశైలం ఘటనపై ఫోరెన్సిక్ నివేదిక సిద్ధం!) -
సైబర్ వేధింపుల అధ్యయనం..ఎన్నారైకు ఫేస్బుక్ గ్రాంటు
వాషింగ్టన్: అమెరికాలోని టీనేజర్లలో సైబర్ వేధింపుల ధోరణులపై అధ్యయనం చేసేందుకు ప్రవాస భారతీయ నిపుణుడు సమీర్ హిందుజాకు సోషల్ నెట్వర్కింగ్ సైటు ఫేస్బుక్ నుంచి1,88,000 డాలర్ల గ్రాంటు లభించింది. ప్రస్తుతం సైబర్బులీయింగ్ రీసెర్చ్ సెంటర్‌కి హిందుజా కో-డెరైక్టరుగా ఉన్నారు. అమెరికాలోని చాలా మంది టీనేజర్లు డేటింగ్లో హింస బారిన పడటం, ఆన్లైన్లో బెదిరింపులు, అవమానాలు, వేధింపులు మొదలైనవాటికి గురికావడం జరుగుతోందని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో ఇటువంటి ధోరణులపై అధ్యయనం చేసేందుకు ఫేస్బుక్ ఆధ్వర్యంలోని డిజిటల్ ట్రస్ట్ ఫౌండేషన్ నుంచి హిందుజాకు 1,88,776 డాలర్ల మేర గ్రాంటు లభించింది. 12-17 సంవత్సరాల టీనేజర్లపై అధ్యయనం జరపనున్నారు.