సైబర్ వేధింపుల అధ్యయనం..ఎన్నారైకు ఫేస్‌బుక్ గ్రాంటు | Study cyber abuse | Sakshi
Sakshi News home page

సైబర్ వేధింపుల అధ్యయనం..ఎన్నారైకు ఫేస్‌బుక్ గ్రాంటు

Published Fri, Sep 11 2015 2:16 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

సైబర్ వేధింపుల అధ్యయనం..ఎన్నారైకు ఫేస్‌బుక్ గ్రాంటు - Sakshi

సైబర్ వేధింపుల అధ్యయనం..ఎన్నారైకు ఫేస్‌బుక్ గ్రాంటు

వాషింగ్టన్: అమెరికాలోని టీనేజర్లలో సైబర్ వేధింపుల ధోరణులపై అధ్యయనం చేసేందుకు ప్రవాస భారతీయ నిపుణుడు సమీర్ హిందుజాకు సోషల్ నెట్‌వర్కింగ్ సైటు ఫేస్‌బుక్ నుంచి1,88,000 డాలర్ల గ్రాంటు లభించింది. ప్రస్తుతం సైబర్‌బులీయింగ్ రీసెర్చ్ సెంటర్‌కి హిందుజా కో-డెరైక్టరుగా ఉన్నారు. అమెరికాలోని చాలా మంది టీనేజర్లు డేటింగ్‌లో హింస బారిన పడటం, ఆన్‌లైన్‌లో బెదిరింపులు, అవమానాలు, వేధింపులు మొదలైనవాటికి గురికావడం జరుగుతోందని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో ఇటువంటి ధోరణులపై అధ్యయనం చేసేందుకు ఫేస్‌బుక్ ఆధ్వర్యంలోని డిజిటల్ ట్రస్ట్ ఫౌండేషన్ నుంచి హిందుజాకు 1,88,776 డాలర్ల మేర గ్రాంటు లభించింది. 12-17 సంవత్సరాల టీనేజర్లపై అధ్యయనం జరపనున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement