ఏడీజీపీ రవి
సాక్షి, చెన్నై : అశ్లీల వీడియోలను అదే పనిగా వీక్షించే వారిలో మహిళలు కూడా ఉన్నట్టుగా వెలువడ్డ సమాచారం సర్వత్రా విస్మయానికి గురిచేస్తున్నాయి. చెన్నైలో 30 మందిని గుర్తించి ఉన్నట్టు ఏకంగా ఏడీజీపీ రవి ప్రకటించారు. ఇలాంటి వీడియోలను వీక్షించ వద్దు అని యువతులు, మహిళలకు పిలుపునిచ్చారు.
పోర్న్ వీడియోలను వీక్షించే వారి సంఖ్య భారత్‌లో అత్యధికంగా ఉన్నట్టు ఓ సర్వేలో తేలి ఉన్న విషయం తెలిసిందే. ఈ వీడియోలకు తగ్గట్టుగానే, ఇటీవల కాలంగా మహిళలు, యువతులు, పిల్లలపై లైంగిక దాడులు, ఉన్మాద చర్యలు పెరిగి ఉన్నాయి. దీంతో మహిళలకు, పిల్లలకు భద్రత కల్పించే రీతిలో దూకుడు పెంచి ఉన్న పోలీసుల యంత్రాంగం అశ్లీల వీడియోలను అదే పనిగా గంటల కొద్ది వీక్షించే వారి భరతం పట్టే రీతిలో చర్యలు చేపట్టారు. చిన్న పిల్లల్ని, మైనర్లను అశ్లీలంగా చిత్రీకరించి తీసిన వీడియోలే కాదు. అశ్లీల సైట్స్‌ల్లో గంటల కొద్ది గడిపే వారిని గురి పెట్టి భరతం పట్టే విధంగా పోలీసులు దూకుడు పెంచే పనిలో పడ్డారు. రాష్ట్రంలో మూడు వేల మంది అదే పనిగా పోర్న్ వీడియోల్ని వీక్షిస్తూ, గంటల కొద్ది ఆన్‌లైన్‌లో గడుపుతున్నట్టుగా తేలింది. ఇందులో మహిళలు కూడా ఉన్నట్టు ప్రస్తుతం సంకేతాలు వెలువడ్డాయి. వీరు చెన్నైలో ఉండడం గమనార్హం. ఈ విషయాన్ని స్వయంగా ఏడీజీపీ రవి పేర్కొనడం సర్వత్రా విస్మయానికి గురి చేసింది.
అశ్లీల చిత్రాలను వీక్షించ వద్దు..
కోడంబాక్కంలోని ఓ మహిళా కళాశాలలో గురువారం పోలీస్ యాప్ అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో ఏడీజీపీ రవి మాట్లాడుతూ, మహిళలు, పిల్లల మీద దాడుల్ని అరి కట్టడం లక్ష్యంగా తాము చర్యల్ని వేగవంతం చేశామన్నారు. 7.30 కోట్ల మంది జనాభా కల్గిన ఈ తమిళనాడులో ఇప్పటి వరకు పోలీసు యాప్‌ను పది లక్షల మంది మాత్రమే డౌన్‌లోడ్ చేసుకుని ఉన్నారని, వీరిలోనూ కేవలం నాలుగు లక్షల మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు పేర్కొన్నారు. మిగిలిన వారు ఎందుకు ఈ యాప్ మీద దృష్టి పెట్టడం లేదని విచారం వ్యక్తం చేశారు. మహిళలు, పిల్లలకు భద్రత కల్పించే విధంగా రూపకల్పన చేసిన ఈ యాప్‌లో స్వల్ప మార్పులు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఇటీవల కాలంగా అశ్లీల చిత్రాల్ని వీక్షించే వారి సంఖ్య పెరిగి ఉండడం విచారకరంగా పేర్కొన్నారు. ఇందులో మహిళలు కూడా ఉండడం, చెన్నైలో 30 మందిని గుర్తించామని పేర్కొంటూ, ఇకపై దయ చేసి అశ్లీల వీడియోలను వీక్షించ వద్దు అని పిలుపు నిచ్చారు. పిల్లలకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ వ్యవహారాల్ని అడ్డుకుందామని విద్యార్థినులకు పిలుపు నిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment