సాక్షి, అమరావతి: మహిళలు, చిన్నారుల భద్రతపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల యావత్ మహిళా లోకం హర్షిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా శాసనసభ్యులు అన్నారు. శాసనసభ సమావేశాలు వాయిదా అనంతరం ఎమ్మెల్యే కళావతి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ...‘రాష్ట్రంలో మహిళలపై అకృత్యాలకు త‍్వరలోనే తెరపడనుంది. సీఎం వైఎస్ జగన్ నిర్ణయంతో మహిళల్లో ధైర్యం వచ్చింది’ అని అన్నారు.
ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ.. ‘సీఎం జగన్ మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల యావత్ మహిళా లోకం సంతోషం వ్యక్తం చేస్తోంది. ఎక్కడా లేని విధంగా జీరో ఎఫ్‌ఐఆర్ ప్రవేశపెట్టారు’ అని తెలిపారు.
మహిళల భద్రతపై ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారని ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు మహిళల భద్రత గురించి చర్చిచండం రాష్ట్రంలో ప్రతి మహిళ గర్వపడేలా ఉందన్నారు. కాగా అత్యాచార బాధిత మహిళలకు సత్వర న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని ప్రవేశపెట‍్టనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సభలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. బుధవారం ఈ కీలక బిల్లును అసెంబ్లీ ప్రవేశపెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment