కెల్లీబ్రూక్.. మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీ!? | Internet danger Kelli brook | Sakshi
Sakshi News home page

కెల్లీబ్రూక్.. మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీ!?

Published Tue, Sep 29 2015 8:09 PM | Last Updated on Sun, Sep 3 2017 10:11 AM

కెల్లీబ్రూక్.. మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీ!?

కెల్లీబ్రూక్.. మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీ!?

లండన్ః  అంతర్జాలంలో ఇప్పుడు ఓ మాయాజాలం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. సెలబ్రిటీల రూపంలో యూజర్ల వివరాలను హాక్ చేసేస్తోంది. అవునండీ... కనిపించింది కదాని అందంగా ఉన్న సెలబ్రిటీని చూస్తూ మైమరిచిపోతే ఇక అంతే... మీ నెట్ జీవితంలో హాకర్ టెర్రర్.. ప్రవేశించినట్లే... లండన్ కు చెందిన సెలబ్రిటీ కెల్లీబ్రూక్  ఇప్పుడు మోస్ట్ డేంజరస్ గా తయారైంది. ఇంటర్నెట్ అభిమానుల మనసుదోచేస్తూ... ఫోటోపై క్లిక్ మనిపిస్తే చాలు... ఏకంగా వారి ఖాతాల్లోకి చొరబడిపోతోంది.

యునైటెడ్ కింగ్డమ్.. ఇప్పుడు  కెల్లీబ్రూక్ ఫోటో చూస్తే భయపడిపోతోంది. ప్రస్తుతం ఇంటర్నెట్ లో మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీగా ఆమె మారిపోయింది. కెల్లీ ఫొటోను హాకర్స్ డేంజరస్ సిగ్నల్ గా మార్చేశారు. కంప్యూటర్లలో వైరస్ గా వ్యాపింపజేసేస్తున్నారు. మోడల్ గా ఎంతో పేరున్న కెల్లీ బ్రూక్ ఫొటోను నెట్లో ముట్టుకుంటే చాలు... ఇన్ఫెక్షన్ లా వైరస్ వ్యాపించేస్తోంది. ఆమెతోపాటు మరి కొందరి ఫొటోలు కూడా ఇప్పుడు ఇంటర్నెట్ యూజర్లను గడగడలాడిస్తున్నాయి. ఫెర్నాండెజ్ వెర్శిని, డచ్ డ్యాన్స్ డీజే... ఆర్మిన్ వాన్ బూరెన్లు కూడ కెల్లీ సరసన చేరిపోయారు. ఇంటర్నెట్లో  వీరిలో ఎవ్వరి ఫొటోపై క్లిక్ చేసినా డేంజర్ లో పడినట్లే...

ఒకప్పుడు ప్రపంచాన్ని కైపెక్కించిన సెక్సీయస్ట్ మహిళగా కెల్లీ బ్రూక్ పేరు మారుమోగిపోయింది. ఇప్పుడు అంత కాకపోయినా.. గ్లామరస్ ప్రపంచంలో తనకంటూ ఓ గుర్తింపు నిలబెట్టుకుంది. అటువంటిది హాకర్ల బారిన పడి ప్రస్తుతం డేంజరస్ సెలబ్రిటీగా తయారైంది. యాక్టర్ గా మారిన మోడల్ కెల్లీ ఫొటోలు కనిపిస్తే కాస్త జాగ్రత్తగా ఉండమంటున్నారు నెట్ సెక్యూరిటీ నిపుణులు. ఆమె ఫొటోలను ఇప్పుడు హ్యాకర్లు ఎక్కువగా వాడుతున్నారని, తెలియక ఆమె ఫొటోలను క్లిక్ చేస్తే వారి వెబ్ సైట్లు వైరస్ తో నిండిపోతాయని హెచ్చరిస్తున్నారు.

కాలిఫోర్నియాకు చెందిన వెబ్ సెక్యూరిటీ సంస్థ మెక్ ఎఫీ మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీల లిస్టులో కెల్లీ బ్రూక్ తో పాటు ఫెర్నాండెజ్ వెర్శింట్ ను కూడ టాప్ లిస్టులో చేర్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement