Mammikka, 60, is a daily wage earner from Kerala Turn Model: ఇంతవరకు చాలామంది మోడల్‌గా మారి మంచి పేరు తెచుకోవాలనుకునే వాళ్ల గురించి విని ఉన్నాం. పైగా అందుకోసం ఎంతో వ్యయప్రయాసలు పడి మరీ ఆ స్థాయికి చేరుకుంటారు కూడా. అయితే కొంతమందికి మాత్రం ఎలాంటి కష్టం పడకుండా ఊహించని విధంగా మోడల్‌గా నటించే అవకాశం భలే దొరుకుతుంది. పాపం వాళ్లు కలలో కూడా అనుకుని ఉండుండరు. పైగా వాళ్లకు మోడల్‌గా చేయడమంటే ఏంటో కూడా తెలిసి ఉండపోవచ్చు. అచ్చం అలాంటి సంఘటన కేరళలో చోటు చేసుకుంది.
అసలు విషయంలోకెళ్తే.... కేరళలోని కోజికోడ్ జిల్లాకు చెందిన మమ్మిక్క కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. చిన్నాచితక పనులు చేసుకుంటూ బతుకుతన్న అతను ఉన్నట్టుండి మంచి సూట్, కూలింగ్ గ్లాస్ చేతిలో ఒక ఐప్యాడ్ పట్టుకుని వ్యాపారవేత్తగా ఫోజిస్తున్నట్లు ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ఫోటోగ్రాఫర్ షరీక్ వయాలీల్ తన వెడ్డింగ్ సూట్ కంపెనీకి మోడల్‌గా నటించమని మమ్మిక్కా అనే దినసరి కూలీని అడిగాడు.
దీనికి మమ్మిక్కా కూడా అంగీకరించడంతో షరీక్ తన ఫోటోగ్రాఫిక్ నైపుణ్యంతో మమ్మిక్కాని మంచిగా ఫోటోలు తీశాడు. అంతేకాదు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు కూడా. దీంతో నెటిజన్లు ఒక కూలి మోడల్‌గా మారి అలా ఫోటోలకి పోజులిచ్చిన విధానాన్ని చూసి ఫిదా అవ్వడమే గాక ప్రశంసిస్తున్నారు. అంతే కాదు ఫోటోగ్రాఫర్ నైపుణ్యాన్ని కూడా తెగ మెచ్చుకుంటూ ట్వీట్ చేయడం మొదలు పెట్టారు. అయితే ఫోటోల్లో మమిక్కా మళయాళం నటుడు వినాయక్‌ను పోలీ ఉండటంతో నెటిజన్లను తెగ ఆకర్షించింది. అంతేకాదు తన కంపెనీకి మోడల్‌గా చేయడానికి మమ్మిక్కా కంటే గొప్పగా ఎవరూ ఉండరని ఫోటోగ్రాఫర్ షరీక్ చెప్పడం విశేషం.
(చదవండి: వందలాది పక్షలు ఆకాశంలో విహరిస్తూ ఒకేసారి భూమిపై పడి చివరికి...)
Comments
Please login to add a commentAdd a comment