Kozhikode district
-
వీడియో కాల్లో డబ్బులు అడుగుతున్నారా?.. ఇది తెలుసుకోండి..
తిరువనంతపురం: ఇటీవలి కాలంలో డీప్ ఫేక్ టెక్నాలజీతో కొందరు కేటుగాళ్లు వీడియో కాల్స్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. డీప్ ఫేక్ టెక్నాలజీ సాయంతో తన స్నేహితులు, కుటుంబ సభ్యులుగా ఫోన్స్ చేస్తూ మోసం చేస్తున్నారు. డీప్ ఫేక్ టెక్నాలజీ సాయంతో ఫ్రెండ్స్ ఫేసులతో వీడియో కాల్స్ చేసి డబ్బులు కాజేస్తున్న కేసులు పెరుగుతున్నాయి. ఇక తాజాగా, కేరళలో తొలి డీప్ ఫేక్ కింద కేసు నమోదు అయ్యింది. వివరాల ప్రకారం.. కేరళలోని కోజికోడ్‌కు చెందిన ప్రభుత్వోద్యోగి రాధాకృష్ణన్ డీప్ ఫేక్ మోసంలో చిక్కుకొని రూ.30 వేలు పోగొట్టుకున్నారు. ఇక, ఆయన ఫిర్యాదుతో కేరళలో తొలి డీప్‌ఫేక్ మోసం కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే, రాధాకృష్ణన్ కోల్ఇండియా సంస్థలో పని చేసి రిటైరయ్యారు. కాగా, ఆయన పనిచేస్తున్న సమయంలో వేణుకుమార్ అనే మరో వ్యక్తిగా విధులు నిర్వర్వించారు. ఈ క్రమంలో కేటుగాళ్లు వేణుకుమార్ ఫొటో సాయంలో డీప్ ఫేక్ మోసానికి పాల్పడ్డారు. అయితే, వేణుకుమార్ పేరుతో ఇటీవల రాధాకృష్ణన్‌కు వాట్సాప్‌లో వీడియో కాల్ చేసి.. తాను దుబాయి ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఇంతలోనే ఇండియాలో తన సోదరి ఆపరేషన్ కోసం రూ.40 వేలు అత్యవసరంగా కావాలని రిక్వెట్ చేశాడు. దీంతో, మరో ఆలోచన లేకుండా వీడియోలో వేణుకుమార్ ముఖం కనిపించడంతో రాధాకృష్ణన్ వెంటనే డబ్బులు పంపించారు. Kerala Police has managed to arrest a man involved in #deepfake scam from gujarat (with assistance from Gujarat Police) who defrauded a man in Kozhikode, Kerala. @VishKVarma follow up coming in English?🤭 pic.twitter.com/3qoANpASag — Sapna Singh (@AdvSapna_) November 9, 2023 ఇదిలా ఉండగా.. కొద్దిసేపటి తర్వాత రాధాకృష్ణన్‌కు వేణుకుమార్‌లాగా మళ్లీ ఫోన్ చేసి మరో రూ.30 వేలు కావాలని కోరారు. దీంతో, రాధాకృష్ణన్‌కు అనుమానం వచ్చింది. వెంటనే తేరుకున్న రాధాకృష్ణన్.. తన స్నేహితుల సాయంతో వేణుకుమార్ ఫోన్ నెంబరును తెలుసుకున్నాడు. అనంతరం, అతడికి కాల్ చేసి.. వివరాలు అడిగాడు. ఈ క్రమంలో వేణుకుమార్.. తాను ఏపీలో ఉన్నానని, ఫోన్ చేయలేదని చెప్పటంతో ఒక్కసారిగా షాకయ్యాడు. ఈ ఘటనపై రాధాకృష్ణన్.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు గుజరాత్‌కు చెందిన షేక్ మర్తుజ్‌మియాగా గుర్తించి అరెస్ట్ చేసినట్టు సీపీ రాజ్‌పాల్ మీనా తెలిపారు. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడు కుశాల్‌షా పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. -
మోడల్‌గా మారిన 60 ఏళ్ల దినసరి కూలీ!
Mammikka, 60, is a daily wage earner from Kerala Turn Model: ఇంతవరకు చాలామంది మోడల్‌గా మారి మంచి పేరు తెచుకోవాలనుకునే వాళ్ల గురించి విని ఉన్నాం. పైగా అందుకోసం ఎంతో వ్యయప్రయాసలు పడి మరీ ఆ స్థాయికి చేరుకుంటారు కూడా. అయితే కొంతమందికి మాత్రం ఎలాంటి కష్టం పడకుండా ఊహించని విధంగా మోడల్‌గా నటించే అవకాశం భలే దొరుకుతుంది. పాపం వాళ్లు కలలో కూడా అనుకుని ఉండుండరు. పైగా వాళ్లకు మోడల్‌గా చేయడమంటే ఏంటో కూడా తెలిసి ఉండపోవచ్చు. అచ్చం అలాంటి సంఘటన కేరళలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే.... కేరళలోని కోజికోడ్ జిల్లాకు చెందిన మమ్మిక్క కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. చిన్నాచితక పనులు చేసుకుంటూ బతుకుతన్న అతను ఉన్నట్టుండి మంచి సూట్, కూలింగ్ గ్లాస్ చేతిలో ఒక ఐప్యాడ్ పట్టుకుని వ్యాపారవేత్తగా ఫోజిస్తున్నట్లు ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ఫోటోగ్రాఫర్ షరీక్ వయాలీల్ తన వెడ్డింగ్ సూట్ కంపెనీకి మోడల్‌గా నటించమని మమ్మిక్కా అనే దినసరి కూలీని అడిగాడు. దీనికి మమ్మిక్కా కూడా అంగీకరించడంతో షరీక్ తన ఫోటోగ్రాఫిక్ నైపుణ్యంతో మమ్మిక్కాని మంచిగా ఫోటోలు తీశాడు. అంతేకాదు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు కూడా. దీంతో నెటిజన్లు ఒక కూలి మోడల్‌గా మారి అలా ఫోటోలకి పోజులిచ్చిన విధానాన్ని చూసి ఫిదా అవ్వడమే గాక ప్రశంసిస్తున్నారు. అంతే కాదు ఫోటోగ్రాఫర్ నైపుణ్యాన్ని కూడా తెగ మెచ్చుకుంటూ ట్వీట్ చేయడం మొదలు పెట్టారు. అయితే ఫోటోల్లో మమిక్కా మళయాళం నటుడు వినాయక్‌ను పోలీ ఉండటంతో నెటిజన్లను తెగ ఆకర్షించింది. అంతేకాదు తన కంపెనీకి మోడల్‌గా చేయడానికి మమ్మిక్కా కంటే గొప్పగా ఎవరూ ఉండరని ఫోటోగ్రాఫర్ షరీక్ చెప్పడం విశేషం. (చదవండి: వందలాది పక్షలు ఆకాశంలో విహరిస్తూ ఒకేసారి భూమిపై పడి చివరికి...) View this post on Instagram A post shared by Shareek Vayalil Shk 📸 (@shk_digital) -
చూసి నవ్వడమే ఆ టీచర్‌కు శాపమైంది.. ప్రేమ, పెళ్లి అన్నాడు.. చివరకు
తిరువనంతపురం: ఓ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలిని చూశాడు.. అతడిని ఆమె చూసింది. అయితే అతడిని చూసి నవ్వడమే ఆమెకు శాపంగా మారింది. అప్పటినుంచి ఆ యువకుడు ఆమె వెంట పడుతూ తనను పెళ్లి చేసుకోవాలని వేధించసాగాడు. తనకు పెళ్లయ్యిందని చెప్పినా వినకుండా వెంటపడ్డాడు. ప్రేమ.. పెళ్లి వద్దు స్నేహంగా ఉందామని ఆమె చెప్పగా.. మీతో ఒక్కసారి లైంగికంగా కలవాలని పట్టుపడ్డాడు. అతడిని గుడ్డిగా నమ్మి సహజీవనం కూడా చేసింది. తీరా చూస్తే అతడు వేరే యువతులతోనూ సంబంధాలు కొనసాగిస్తుండడంతో ఆమె అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. కోజికోడ్ జిల్లా ఇరవన్నూర్‌కు చెందిన రంజిత్ ఒకసారి పాతనంతిట్టకు చెందిన ఉపాధ్యాయురాలిని ఓ కార్యక్రమంలో చూశాడు. అతడిని పొరపాటున చూసిన ఆమె నవ్వడంతో అప్పటి నుంచి టీచర్ వెంట పడి వేధించసాగాడు. ఆమెతో లైంగిక జీవితం పొందాలని ఒత్తిడి చేశాడు. అయినా అతడి వైఖరిలో మార్పు రాలేదు. నీ భర్తను వదిలేసి నాతో వచ్చేయ్.. నేను పెళ్లి చేసుకుంటానని వేధింపులకు గురి చేశాడు. అయితే అప్పటికే ఆమె భర్తకు దూరంగా నివసిస్తోంది. నిన్ను ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటానని వెంటపడుతుండడంతో ఆమె కరిగిపోయింది. దీంతో అతడితో కలిసి సహజీవనం చేయసాగింది. అతడితో కలిసి ఉంటున్న సమయంలోనే వేరేవారితో సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఇది తెలిసి ఆమె రంజిత్‌కు దూరంగా ఉంటోంది. అయితే తనను వదిలేసి వెళ్లినా పర్లేదు కానీ ‘మీతో ఒక్కసారి కావాలి టీచర్ ప్లీజ్’ ఆమెతో శారీరక సంబంధం కోరాడు. అతడి వేధింపులు తీవ్రమయ్యాయి. ఆమెకు సంబంధించిన రహాస్య ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతూ ఆమెపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతున్నాడు. అతడి ఆగడాలు భరించలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
కాల్ చేస్తామని ఫోన్ కొట్టేసి బైక్‌తో ఈడ్చుకెళ్లారు, వైరల్ వీడియో
తిరువనంతపురం: కేరళలోని కోజిగోడ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఫోన్‌కాల్ చేసుకుంటామని చెప్పి మొబైల్‌ఫోన్ కొట్టేయడమే కాకుండా అడ్డు వచ్చిన సదరు వ్యక్తిని బైక్‌తో కొద్దిదూరం పాటు ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. వివరాలు.. బిహార్‌కు చెందిన అలీ అక్బర్ కోజిగోడ్‌కు పనినిమిత్తం వచ్చారు. తన పని ముగించుకొని రోడ్డుపై వెళుతుండగా.. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చారు. తమ ఫోన్ పాడైందని.. అర్జెంటుగా ఒక కాల్ చేసుకుంటామని చెప్పి అక్బర్‌ను అడిగారు. వారి మాటలు నమ్మిన అక్బర్ తన ఫోన్‌ను వారి చేతిలో పెట్టగానే యువకులిద్దరు వెంటనే బైక్‌ను స్టార్ట్ చేసి అక్కడినుంచి పారిపోయేందుకు యత్నించారు. అయితే బైకును అక్బర్ పట్టుకొని ఉండడంతో అతన్ని అలాగే రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఈ క్రమంలో అలీతో పాటు బైకుపై వెనకాల కూర్చున్న దొంగ కూడా కిందపడిపోయాడు. ఆ తర్వాత అక్బర్ బైకును వెంబడించినా ప్రయోజనం లేకపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అక్బర్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. కాగా అక్బర్ వద్ద ఫోన్ దొంగలించిన ఇద్దరు యువకులను సాను కృష్ణన్, షమ్నాస్ అబ్దురాహిమాన్‌లుగా గుర్తించారు. అయితే దుండగులకు చెందిన ఒక ఫోన్ అక్కడపడిపోగా స్థానికులు దానిని పోలీసులకు అందించారు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
యువతులపై ‘పుచ్చకాయ’ వ్యాఖ్యలు.. కేసు
సాక్షి, తిరువనంతపురం : ముస్లిం యువతులను ఉద్దేశించి అసభ్య వ్యాఖ్యలు చేసిన కేరళ ప్రొఫెసర్ చిక్కుల్లో పడ్డారు. కోజీకోడ్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి, నాన్-బెయిలబుల్ వారెంట్‌ను జారీచేశారు. కోజీకోడ్లోని ఫరూక్ ట్రైనింగ్ కాలేజ్ ప్రొఫెసర్ జౌహర్ మునవ్వీర్ ఈ మధ్య ఓ మీటింగ్ లో మాట్లాడుతూ.. కాలేజీలోని అమ్మాయిలు బుర్ఖాలు ధరించినప్పటికీ.. ఛాతి భాగాన్ని మాత్రం పూర్తిగా కప్పుకోరని .. ఆ భాగాన్ని పుచ్చకాయలా చూపిస్తూ ఆకర్షిస్తుంటారని, ఆపై లెగ్గిన్స్ అంటూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే నడిచింది. కొందరు మహిళలు నగ్న ఫోటోలను పోస్ట్ చేయగా.. మరికొందరు పుచ్చ కాయలతో వక్షోజాలను కప్పిపుచ్చుకుని వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ తమ ఫోటోలను షేర్ చేశారు. భారతీయ మహిళలకు సరిపడ బట్టలు ఎంటో చెప్పండి అంటూ జౌహర్పై విమర్శలు గుప్పించారు. కాగా, అమ్రిత అనే యువతి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు అధ్యాపకుడిపై కేసు నమోదు చేసి, వారెంట్ జారీ చేశారు. ఇదిలా ఉంటే ప్రొఫెసర్ గత నాలుగు రోజులుగా పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. -
ల్యాప్ టాప్ కొనాలని రూ.లక్ష ఎత్తుకెళ్లిన బాలుడు
తిరువనంతపురం: ఇంట్లో వాళ్లు తాను అడిగింది కొనివ్వలేదని ఓ బాలుడు ఏకంగా లక్ష రూపాయలతో ఇంటి నుంచి ఉడాయించాడు. కేరళలోని కోజీకోడ్ జిల్లా కొండాట్టికి చెందిన ఏడవ తరగతి విద్యార్థి ల్యాప్ కొనివ్వాలని తండ్రిని అడిగాడు. అయితే అందుకు ఆయన ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఫుట్‌బాల్ మ్యాచ్ చూడటానికి వెళ్తున్నానని తల్లికి చెప్పి ఇంట్లో ఎవరికి తెలియకుండా మే 30 వ తేదీన బీరువా నుంచి రూ.1 లక్ష రూపాయలు తీసుకుని ఇంటి నుంచి పారిపోయాడు. రూ.30 వేలతో ల్యాప్‌టాప్ కొని, మిగతా డబ్బుతో షికారుకు బయలుదేరాడు. కొచ్చికి వెళ్లడానికి మే 31 న కర్ణాటక బస్సు ఎక్కాడు. లేడీ కండక్టర్ కు ఆ విద్యార్థి ఇంటి నుంచి పారిపోయి వచ్చాడని గ్రహించి దగ్గరలోని కరుంగపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించింది. పోలీసులు ఆ బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందిచ్చారు. వారు అక్కడకు వచ్చి తమ కుమారుడిని ఇంటికి తీసుకెళ్లారు. తన కుమారుడిది ల్యాప్‌టాప్ వాడే వయసు కాదని, అందుకే ఇప్పడే ఎందుకని కొనివ్వలేదని పీడబ్లూడీ ఇంజినీరుగా పనిచేస్తోన్న తండ్రి తెలిపారు. కానీ కొడుకు ప్రవర్తన పట్ల తాను అసంతృప్తికి లోనయ్యానని చెప్పుకొచ్చారు.