యువతులపై ‘పుచ్చకాయ’ వ్యాఖ్యలు.. కేసు | Kerala Professor Sexist Remarks FIR Lodged | Sakshi
Sakshi News home page

అసభ్య వ్యాఖ్యలు.. కేరళ ప్రొఫెసర్‌పై కేసు

Published Fri, Mar 23 2018 6:15 PM | Last Updated on Fri, Mar 23 2018 6:15 PM

Kerala Professor Sexist Remarks FIR Lodged - Sakshi

సాక్షి, తిరువనంతపురం : ముస్లిం యువతులను ఉద్దేశించి అసభ్య వ్యాఖ్యలు చేసిన కేరళ ప్రొఫెసర్‌ చిక్కుల్లో పడ్డారు. కోజీకోడ్‌ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి, నాన్‌-బెయిలబుల్‌ వారెంట్‌ను జారీచేశారు.

కోజీకోడ్‌లోని ఫరూక్ ట్రైనింగ్ కాలేజ్  ప్రొఫెసర్‌ జౌహర్‌ మునవ్వీర్‌ ఈ మధ్య ఓ మీటింగ్‌ లో మాట్లాడుతూ.. కాలేజీలోని అమ్మాయిలు బుర్ఖాలు ధరించినప్పటికీ.. ఛాతి భాగాన్ని మాత్రం పూర్తిగా కప్పుకోరని .. ఆ భాగాన్ని పుచ్చకాయలా చూపిస్తూ ఆకర్షిస్తుంటారని, ఆపై లెగ్గిన్స్‌ అంటూ  అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పెద్ద ఉద్యమమే నడిచింది.

కొందరు మహిళలు నగ్న ఫోటోలను పోస్ట్‌ చేయగా.. మరికొందరు పుచ్చ కాయలతో వక్షోజాలను కప్పిపుచ్చుకుని వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ తమ ఫోటోలను షేర్‌ చేశారు. భారతీయ మహిళలకు సరిపడ బట్టలు ఎంటో చెప్పండి అంటూ జౌహర్‌పై విమర్శలు గుప్పించారు. కాగా, అమ్రిత అనే యువతి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు అధ్యాపకుడిపై కేసు నమోదు చేసి, వారెంట్‌ జారీ చేశారు. ఇదిలా ఉంటే ప్రొఫెసర్‌ గత నాలుగు రోజులుగా పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement