watermelons
-
అమెరికాలో అసలేం జరుగుతుంది?బాంబుల్లా పేలుతున్న పుచ్చకాయలు
పుచ్చకాయలు పేలడం గురించి మీకు తెలుసా? ఇదేం విచిత్రం.. సాధారణంగా గట్టిగా నేలకేసి కొట్టినా పుచ్చకాయ పగలదు కదా అంటారా.. కానీ అమెరికాలో మాత్రం ఈమధ్య పుచ్చకాయలు బాంబుల్లా పేలిపోతున్నాయి. దీంతో అక్కడి వారు పుచ్చకాయలు కొనాలంటేనే హడలిపోతున్నారట. ఇలా ఎందుకు జరగుతుంది? అసలు పుచ్చకాయలు పేలిపోవడానికి గల కారణాలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. అమెరికాలో లీలా ఫాడెల్ అనే మహిళ.. మర్కెట్‌కు వెళ్లి పుచ్చకాయ తెచ్చుకున్నానని, ఇంటికెళ్లి కిచెన్‌లో పెట్టగానే అది పేలిపోయిందని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ఇలా లీలా ఫాడెల్ మాత్రమే కాదు.. అమెరికాలో చాలామందికి ఈ మధ్య ఇలాంటి సంఘటనలే ఎదురయ్యాయి. పుచ్చకాయలు ఇలా సడెన్‌గా పేలిపోతున్నాయని ఇదేం విచిత్రం అంటూ నివ్వెరపోతున్నారు. బాంబుల్లా పేలిపోతున్న పుచ్చకాయలు అంటూ సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. దీంతో అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అన్నదానిపై రీసెర్చ్ మొదలైంది. అమెరికాలో జరిపిన కొన్ని అధ్యయనాల ప్రకారం.. పుచ్చకాయలో ఒక నిర్ధిష్ట రకమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతోందని దానివల్ల సహజ చక్కెర, ఈస్ట్ అనే పదార్థాలు ఉత్పన్నం అవుతాయని తేలింది. పుచ్చకాయలు పేలడానికి ఫార్మెంటేషన్ మాత్రమే కారణం కాదని బ్యాక్టీరియా లేదా ఫంగల్ వ్యాధి కూడా కారణం కావచ్చని కార్నెల్‌లోని స్కూల్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ ప్లాంట్ సైన్స్ హార్టికల్చర్ ప్రొఫెసర్ డాక్టర్ స్టీవ్ రీనర్స్ అన్నారు. పంట త్వరగా చేతికి రావాలని కొందరు రసాయనాలు కలుపుతున్నారని, ఇవి పుచ్చకాయల్లో ఉండే నేచురల్ షుగర్‌తో కలిసిపోయి పేలిపోతున్నట్లు రీసెర్చ్‌లో వెల్లడైంది. అంతేకాకుండా వీటిని ఒకేసారి అధిక ఉష్ణోగ్రతలు ఉన్న చోట పెట్టడం కూడా ఈ పేలుళ్లకు కారణం కావచ్చని తెలియజేశారు. -
యువతులపై ‘పుచ్చకాయ’ వ్యాఖ్యలు.. కేసు
సాక్షి, తిరువనంతపురం : ముస్లిం యువతులను ఉద్దేశించి అసభ్య వ్యాఖ్యలు చేసిన కేరళ ప్రొఫెసర్ చిక్కుల్లో పడ్డారు. కోజీకోడ్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి, నాన్-బెయిలబుల్ వారెంట్‌ను జారీచేశారు. కోజీకోడ్లోని ఫరూక్ ట్రైనింగ్ కాలేజ్ ప్రొఫెసర్ జౌహర్ మునవ్వీర్ ఈ మధ్య ఓ మీటింగ్ లో మాట్లాడుతూ.. కాలేజీలోని అమ్మాయిలు బుర్ఖాలు ధరించినప్పటికీ.. ఛాతి భాగాన్ని మాత్రం పూర్తిగా కప్పుకోరని .. ఆ భాగాన్ని పుచ్చకాయలా చూపిస్తూ ఆకర్షిస్తుంటారని, ఆపై లెగ్గిన్స్ అంటూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే నడిచింది. కొందరు మహిళలు నగ్న ఫోటోలను పోస్ట్ చేయగా.. మరికొందరు పుచ్చ కాయలతో వక్షోజాలను కప్పిపుచ్చుకుని వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ తమ ఫోటోలను షేర్ చేశారు. భారతీయ మహిళలకు సరిపడ బట్టలు ఎంటో చెప్పండి అంటూ జౌహర్పై విమర్శలు గుప్పించారు. కాగా, అమ్రిత అనే యువతి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు అధ్యాపకుడిపై కేసు నమోదు చేసి, వారెంట్ జారీ చేశారు. ఇదిలా ఉంటే ప్రొఫెసర్ గత నాలుగు రోజులుగా పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. -
పుచ్చకాయలమ్మా పుచ్చకాయలు...
సరుకులు కొనేందుకు సూపర్ మార్కెట్లోకి వచ్చే కస్టమర్లకు ఇలా కొత్త పిలుపు స్వాగతం పలుకుతోంది. తాజా పుచ్చకాయలు రుచిచూడండి అంటూ వీటి విశిష్టతను చక్కగా వివరిస్తున్న ఈ రోబోట్ పేరు ‘పెప్పర్’. జపాన్ టెలికం దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ అనుబంధ సంస్థ కొకొరో ఎస్బీ.. ఈ హ్యుమనాయిడ్ రోబోట్‌ను తయారుచేసింది. ఉత్పత్తుల వివరాలు చెప్పే ప్రపంచంలోని తొలి రోబోట్ ఇదేనని సంస్థ చెబుతోంది. గంటకు రూ.800 చొప్పున ఈ రోబోట్‌కు జీతం ఇస్తున్నారు. బుధవారం టోక్యోలో తీసిందీ ఫొటో. -
ఎండల్లో హాయ్‌హాయ్
⇒ మండే వేసవిలో రక్షణ కవచాలు రోజురోజుకు ఎండలు ముదిరిపోతున్నాయి. బయటికి రావాలంటే భయపడుతున్నారు. వేసవి తాపం నుంచి తట్టుకునేందుకు కొందరు శీతల పానీయాలతో సేద తీరుతున్నారు. మరికొందరు ఆరోగ్యాన్నిచ్చే పుచ్చకాయలు, కొబ్బరినీళ్లను తీసుకుంటున్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారాలు వడదెబ్బ తగలకుండా ముఖానికి స్కార్ఫ్‌లు, కల్లజోళ్లు, టోపీలను వినియోగిస్తున్నారు. కళ్లజోళ్లు రూ.100 నుంచి రూ.150 వరకూ దొరుకుతున్నాయి. టోపీలు, స్కార్ఫ్‌లు కూడా ఇంచుమించు ఇదే ధరకు లభ్యమవుతున్నాయి. టోపీలు, కళ్లజోళ్లమ్మే స్టాళ్లు, పుచ్చకాయలు, కొబ్బరి బొండాలమ్మే దుకాణాలు వెలుస్తున్నాయి. సామాన్యుడి ఫ్రిజ్ కుండకు కూడా డిమాండ్ పెరిగింది. నీళ్లు ముంచుకోడానికి ఇబ్బంది లేకుండా కుండకు టాప్‌ను అమర్చి విక్రయిస్తున్నారు. ఒక్కో కుండ ధర రూ.150 నుంచి రూ.250 వరకూ ఉంటుంది. వీటిని ఎక్కువగా ఇసుక మట్టి, గట్టి మట్టితో తయారు చేస్తారు. వీటిలో ఇసుక మట్టి (ఎర్ర కుండ)తో చేసే కుండకే గిరాకీ ఎక్కువ ఉంటుంది. ఇవి ఎక్కువగా కృష్ణాజిల్లా వీరవల్లి, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి పట్టణాల్లో విక్రయిస్తున్నారు - ఏలూరు(వన్ టౌన్) -
ఉపాధి మర్రి
చెట్టు నీడనిస్తుంది. కానీ ఈ చెట్టు.. బతుకుదెరువునిస్తోంది. కాలమేదైనా సరే... అక్కడి పుచ్చకాయలు చల్లగా కడుపునింపుతాయి. నగరంలో తిరిగి అలసిన వారికి ఆ చెట్టు కింది నిమ్మ సోడా సాంత్వననిస్తుంది. మోటార్ సైకిల్‌పై మొబైల్ మెస్... ఆకలితో ఉన్నవారి కడుపు నింపుతుంది. అద్దెలు చెల్లించలేని చిరు వ్యాపారులకు బతుకు నీడనిస్తోంది మింట్ కాంపౌండ్ సమీపంలోని మర్రి చెట్టు. ఏళ్ల చరిత్ర ఉన్న ఆ చెట్టు డజనుకుపైగా వ్యాపారాలకు కేంద్రమైంది. ట్యాంక్‌బండ్‌పై షికార్లు కొట్టి అలసిన వారు, కార్యాలయాల్లో పని ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందడానికి వచ్చిన ఉద్యోగులు, ఆయా పనుల నిమిత్తం సెక్రటేరియేట్‌కు వచ్చే సామాన్యుల అవసరాలను తీర్చే కేంద్రంగా మారింది. ప్రతి కాలంలో పుచ్చకాయ... వేసవిలోనే పుచ్చకాయలు దొరుకుతాయి. ఈ మర్రిచెట్టు నీడలో కాలంతో సంబంధం లేకుండా ప్రతిరోజూ పుచ్చకాయలు అందుబాటులో ఉంటాయి. చుట్టుపక్కల కార్యాలయాల వాళ్లే కాదు... కూడలిలో ఉండటంతో వచ్చీపోయే జనం కూడా అక్కడ ఆగి మరి పుచ్చకాయలు తినేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఈ పుచ్చకాయల వ్యాపారంపై ఆధారపడి రెండు కుటుంబాలు బతుకుతున్నాయి. ‘ఫుల్’గా భోజనం... ఆకలి అవుతుంటే దగ్గర్లో ఏ హోటల్‌కు వెళ్లి భోజనం చేద్దామన్నా వందకు పైగా చెల్లించాల్సిందే. కానీ ఈ చెట్టు నీడన 40 రూపాయలకే పూర్తి భోజనం లభిస్తుంది. ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయలేని విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు... అనేక మంది ఇక్కడ భోజనం చేస్తుంటారు. ఇలా మూడు నుంచి నాలుగు కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. భోజనం వద్దనుకుంటే... అల్పాహార కేంద్రం కూడా అందుబాటులో ఉంది. ఆరోగ్య పరీక్షలు... ఇదే మర్రిచెట్టు నీడన ఆరోగ్య పరీక్షలు కూడా చేస్తున్నారు. 20 రూపాయలు ఇస్తే చాలు మీ ఎత్తుకు తగ్గ బరువున్నారా? మీ ఒంట్లో ఎంత కొవ్వు శాతం ఎంత? బీపీ తక్కువా? ఎక్కువా? తెలిపే ఓ యువకుడు కనిపిస్తాడు. ఒంటి నొప్పులకు, ఒత్తిడికి అక్యుపంక్చర్ వైద్యం ఎంతో ఉపశమనం. దీనికి సంబంధించిన పరికరాలు కూడా ఈ చెట్టు కింద లభిస్తాయి. వస్త్ర వ్యాపారం అదుర్స్.. సామాన్యులకు అందుబాటు ధరలో దుస్తుల వ్యాపారం ఓ పక్క జరుగుతుంటే... మరోపక్క కాలి బూట్లు, చెప్పులు అమ్ముతుంటాడో వ్యక్తి. ఓవైపు సోడా బండి, ఆ పక్కనే ఫ్రూట్ జ్యూస్ బండి ఉంటుంది. ఇంత మంది వచ్చే చోట వాహనాల రద్దీ ఉంటుంది కదా! వాటి పొల్యూషన్ చెకప్ చేయడానికి ఆర్టీఏ అనుమతి పొందిన ఏజెంట్ కూడా అక్కడే సిద్ధంగా ఉంటాడు. ఇలా చిరు వ్యాపారులకు ఆ మర్రి చెట్టు కల్పవృక్షంగా మారింది. ...::: వాంకె శ్రీనివాస్ -
మంటలు పుడుతున్నాయ్..!
సాక్షి, ముంబై: మే నెల రానే వచ్చేసింది. ఎండ తీవ్రత మితిమీరిపోతోంది. ప్రజలు ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావాలంటే భయపడుతున్నారు. మహిళలు ఎండ వేడిమినుంచి రక్షణ కోసం స్కార్ఫ్‌లను ఆశ్రయిస్తున్నారు. మగవాళ్లు టోపీలు, కళ్లజోళ్లనే నమ్ముకుంటున్నారు. సాయంత్రం ఆరు,ఏడు గంటల వరకు వేడి తగ్గడంలేదు. దీనికి తోడు వేడిగాలులు వీస్తుండటంతో ముంబైకర్ల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. వడదెబ్బ తగిలి రోజూ వేలాది మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. ఉపాధి కోసం రోజూ కిలోమీటర్ల మేర ప్రయాణం చేసే చిరుద్యోగుల పరిస్థితిని వివరించాల్సిన పనిలేదు. వలసజీవుల పరిస్థితి సైతం దీనికి విరుద్ధంగా లేదు. ఇదిలా ఉండగా, ఎండ తీవ్రత పెరగడంతో శీతల పానీయాల విక్రయాలు పెరిగాయి. దాంతో వాటి ధరలు సైతం అమాంతం పెరిగిపోయాయి. సీజనల్‌గా వచ్చే పుచ్చకాయలు సైతం రూ.80 నుంచి రూ.100 ధర పలుకుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ ఎండలకు తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళ్తే వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. వడదెబ్బ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణుల సూచనలు... ఎండలో తిరిగినా, పనిచేసినా శరీరంలోని ఉష్ణోగ్రతలను నియంత్రించే వ్యవస్థ దెబ్బతింటుంది. దీంతో వడదెబ్బకు గురవుతారు. శరీర ఉష్ణోగ్రత 108 డిగ్రీల నుంచి 110 డిగ్రీల ఫారన్‌హీట్ వరకు పెరుగుతుంది. వడదెబ్బకు గురైన వ్యక్తికి తల తిరగడం, తలనొప్పి, చర్మం ఎండిపోయి ఎక్కువ జ్వరం కలిగి ఉంటారు. మగతగా కలవరించడం, ఫిట్స్ రావడం, పాక్షికంగా లేదా పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్తారు. వడదెబ్బ బాధితుల్లో 40 శాతం వరకు మరణించే అవకాశం ఉంటుంది. రక్షణ పొందండిలా.. గుండె జబ్బులు, ఇతర దీర్ఘకాలిక రోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండలో తిరగరాదు. ఎండ తీవ్రత ఉన్నప్పుడు వ్యాయామం చేయడం కూడా ప్రమాదకరం. మిట్టమధ్యాహ్నం బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలి. తప్పనిసరిగా బయటికి వెళ్లాల్సి వస్తే ఉప్పు కలిపిన మజ్జిగ, పళ్ల రసాలు తాగి వెళ్లాలి. సాధ్యమైనంత ఎక్కువగా నీటిని తీసుకోవాలి. లేత రంగు, కాటన్ దుస్తులను ధరించడం మంచిది. ఇంటి గదుల్లో ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి. చల్లని వాతావరణం కోసం ఫ్యాన్లు, ఎయిర్‌కూలర్లు వాడాలి. వడదెబ్బకు గురైన వ్యక్తి శరీరాన్ని వెంటనే చల్లబర్చాలి. చల్లని నీడ ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి శరీరంపై ఉన్న దుస్తులను తొలగించి చల్లని నీటితో కడగాలి. చల్లని నీటితో ముంచిన గుడ్డతో తుడవాలి. చల్లని గాలి తగిలేలా ఉంచి చల్లని ఉప్పు కలిగిన నీటిని తాగించాలి. -
కోసిన కాయ వద్దన్నందుకు కత్తితో దాడి
విక్రేత దుశ్చర్య కొనుగోలుదారుడికి గాయాలు నూజివీడులో ఘటన స్థానికులు దేహశుద్ధి చేయడంతో అమ్మకందారుడికీ గాయాలు నూజివీడు, న్యూస్‌లైన్ : ‘కోసిన కాయలోని ముక్కలు వద్దు.. మ రో కాయ కొయ్యి’ అని అడిగిన వ్యక్తిపై పుచ్చకాయల వ్యాపారి కత్తితో దాడి చేశాడు. పట్టణంలో శుక్రవారం జరిగిన ఈ ఘటనలో కాయ కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యక్తికి గాయాల య్యా యి. దీనిపై స్థానికులు స్పందించి దేహశుద్ధి చేయడంతో అమ్మకందారుడికి కూడా గాయాల య్యా యి. బాధితుడు, పోలీసులు తెలిపిన సమా చా రం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. రెడ్డిగూడెం మండలం రుద్రవరం తండాకు చెందిన జరపుల గోపి నూజివీడులోని మార్కెట్‌యార్డు ఎదురుగా ఉన్న రోడ్డులో శుక్రవారం పుచ్చకాయలు అమ్ముతున్నాడు. పట్టణంలోని రామాయమ్మరావుపేటకు చెందిన వల్లెపు అర్జునరావు(45) సాయంత్రం ఐదు గంటల సమయం లో గోపి వద్దకు వెళ్లి పుచ్చకాయ ముక్కలు కోసి ఇవ్వమని కోరాడు. దీంతో అతడు అప్పటికే కోసి ముక్కలు ఇవ్వబోయాడు. అవి తనకు వద్దని వేరే కాయ కోసి ఇవ్వమని అర్జునరావు చెప్పాడు. దీం తో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి, తీవ్ర రూపం దాల్చింది. గోపి ఆగ్రహంతో పుచ్చకాయలు కోసే కత్తితో అర్జునరావు పొట్టలో పొడిచాడు. ఈ ఘటనలో గాయపడిన అతడు కేకలు వేయగా ఆ ప్రదేశంలో ఉన్నవారు వచ్చి గోపికి దేహశుద్ధి చేశా రు. బాధితుడిని హుటాహుటిన పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స చేసి 24 గంటలపాటు అబ్జర్వేషన్లో ఉంచారు. గాయపడిన గోపీకి కూడా ఏరియా ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.