పుచ్చకాయలమ్మా పుచ్చకాయలు...
సరుకులు కొనేందుకు సూపర్ మార్కెట్లోకి వచ్చే కస్టమర్లకు ఇలా కొత్త పిలుపు స్వాగతం పలుకుతోంది. తాజా పుచ్చకాయలు రుచిచూడండి అంటూ వీటి విశిష్టతను చక్కగా వివరిస్తున్న ఈ రోబోట్ పేరు ‘పెప్పర్’. జపాన్ టెలికం దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ అనుబంధ సంస్థ కొకొరో ఎస్‌బీ.. ఈ హ్యుమనాయిడ్ రోబోట్‌ను తయారుచేసింది. ఉత్పత్తుల వివరాలు చెప్పే ప్రపంచంలోని తొలి రోబోట్ ఇదేనని సంస్థ చెబుతోంది. గంటకు రూ.800 చొప్పున ఈ రోబోట్‌కు జీతం ఇస్తున్నారు. బుధవారం టోక్యోలో తీసిందీ ఫొటో.