రోబో చిత్రానికి రూ.9 కోట్లు | Ai Da The Humanoid Robot Whose Painting Sold For Rs 9 Crore | Sakshi
Sakshi News home page

రోబో చిత్రానికి రూ.9 కోట్లు

Published Sun, Nov 24 2024 12:28 PM | Last Updated on Sun, Nov 24 2024 1:27 PM

Ai Da The Humanoid Robot Whose Painting Sold For Rs 9 Crore

ఫొటోలో కనిపిస్తున్న ఈ రోబో పేరు ఐ–డా. ఈ రోబో కృత్రిమ మేధతో పనిచేస్తుంది. ఇది ప్రపంచంలోనే తొలి ఏఐ ఆర్టిస్ట్‌. పైగా ఈ ఏఐ రోబో గీసిన చిత్రం ఇటీవల జరిగిన వేలంలో భారీ మొత్తానికి అమ్ముడైంది. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్, బర్మింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయాలకు చెందిన ఏఐ పరిశోధకులు తయారు చేసిన ఈ హ్యూమనాయిడ్‌ రోబో చూడటానికి అందమైన అమ్మాయిలా ఉంటుంది. 

దీని కళ్లలో కెమెరాలను అమర్చారు. ఇది ఏఐ అల్గారిథమ్స్, రోబోటిక్‌ చేతులను ఉపయోగించి చిత్రాలను గీస్తుంది. ఈ రోబో ఇటీవల కృత్రిమ మేధా పితామహులలో ఒకరిగా పేరొందిన బ్రిటిష్‌ గణిత శాస్త్రవేత్త అలాన్‌ ట్యూరింగ్‌ చిత్రాన్ని గీసింది. ఈ చిత్రం ఇటీవలే జరిగిన సోత్‌బీస్‌ డిజిటల్‌ ఆర్ట్‌ సేల్‌ వేలంలో 10,84,800 డాలర్లు ధర పలికింది. (సుమారు రూ. 9.15 కోట్లు). హ్యూమనాయిడ్‌ రోబో ఆర్టిస్ట్‌ ఐ–డా గీసిన ఈ చిత్రాన్ని, పేరు గోప్యంగా ఉంచిన ఒక అమెరికన్‌ వ్యక్తి కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు.  

(చదవండి: అవయవ దానకర్ణులమవుదాం...!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement