మడతెట్టే రోబో! | San Francisco startup Physical Intelligence recently unveiled its AI model called Pi-zero | Sakshi
Sakshi News home page

బట్టలు మడతెట్టే రోబో!

Published Tue, Nov 19 2024 11:57 AM | Last Updated on Tue, Nov 19 2024 12:49 PM

San Francisco startup Physical Intelligence recently unveiled its AI model called Pi-zero

నిత్యం చేసే పనులను మరింత సులువుగా చేసేందుకు వీలుగా టెక్నాలజీ వినియోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగప్రవేశం చేసిన తర్వాత మర మనుషులే మన పనులు చేస్తున్నారు. ఇటీవల పిజికల్‌ ఇంటెలిజెన్స్‌(పీఐ) అనే స్టార్టప్‌ కంపెనీ పీఐ-జిరో అనే రోబోను తయారు చేశారు. ఇది మనం వాడిన బట్టలను ఉతికి, మడతేస్తోంది. దాంతోపాటు మరెన్నో పనులు చేస్తుంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం పలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇదీ చదవండి: మెటాకు రూ.213 కోట్ల జరిమానా.. కంపెనీ రియాక్షన్‌

ఈ ‘పీఐ-జిరో’ కేవలం బట్టలు ఉతికి, మతతెట్టడమే కాకుండా గుడ్లు ప్యాక్‌ చేయడం, కాఫీ బీన్స్‌ గ్రైండ్‌ చేయడం, టేబుల్‌ శుభ్రం చేయడం వంటి పనులు చేస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇంటికో రోబోను పెంచుకునే రోజులు త్వరలో రాబోతున్నట్లు ఈ వీడియో చేసిన కొందరు అభిప్రాయపడుతున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement