cloths
-
ఊరంతా దుస్తులే!
పామిడి: రాయలసీమ జిల్లాల్లోనే నాణ్యమైన వస్త్రాలకు ఖ్యాతి గాంచింది అనంతపురం జిల్లా పామిడి. 65 వేల మంది జనాభా ఉన్న పామిడిలో 85 శాతం మంది వస్త్ర వ్యాపారంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఏ వీధికెళ్లినా వస్త్ర దుకాణాలే కనిపిస్తాయి. కేవలం టెక్స్టైల్లోనే కాకుండా రెడీమేడ్ దుస్తుల తయారీలోనూ రెండో ముంబయిగా ఖ్యాతిగాంచింది. గ్రామం ఆవిర్భావం నుంచే... శతాబ్దాల క్రితం ఆవిర్భవించిన పామిడి గ్రామానికి పెద్ద చరిత్రనే ఉంది. పూర్వం పరుశురాముడి స్వైరవిహారం నుంచి తప్పించుకుని కుటుంబాలతో వలస వచ్చిన క్షత్రియులు పామిడి పెన్నానది ఒడ్డున సింగిరప్ప కొండపై స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు పూర్వీకులు చెబుతున్నారు. అనంతరం ప్రస్తుతమున్న గ్రామానికి తమ మకాం మార్చి జీవనోపాధి కింద దుస్తులకు రంగుల అద్దకం పనిని చేపట్టారు.దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం వరకూ పామిడిలో కుటీర పరిశ్రమగా రంగుల అద్దకం పని కొనసాగింది. ఈ నైపుణ్యం వారిని రాయల్ టైలర్స్గా, డ్రెస్ డిజైనర్లుగా ఎదగడానికి దోహదపడింది. గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతం నుంచి వలస రావడంతో వీరిని భావసార క్షత్రియులుగా పిలిచేవారు. రెడీమేడ్కు పెట్టింది పేరు దాదాపు ఐదు దశాబ్దాల క్రితం వరకూ పామిడి వాసులు ర్యాగ్స్ (ఒక సెం.మీ. వెడల్పు ఉన్న వస్త్రం)తో చిన్నారుల ఫ్యాన్సీ డ్రెస్‌లు కుట్టి అతి తక్కువ ధరకు విక్రయించేవారు. ఈ క్రమంలో పరిశ్రమల నుంచి బేళ్ల కొద్దీ సరుకును దిగుమతి చేసుకునేవారు. చేతి నిండా పని దొరకడంతో ప్రతి ఇంట్లోనూ రెండు, మూడు కుట్టుమిషన్లపై ఉదయం నుంచి రాత్రి వరకూ డ్రెస్‌లు కుట్టేవారు. ప్రస్తుతం నైటీలు, నైట్ ప్యాంట్లను కుడుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలను కరువు రక్కసి పీడించిన రోజుల్లోనూ పామిడిలో ఉపాధికి ఢోకా ఉండేది కాదు. తర్వాతి కాలంలో మిల్లుల నుంచి కట్పీస్లు తెప్పించి కిలోల లెక్కన అమ్మడం మొదలు పెట్టారు. వీటితోనే ప్రస్తుతం నైట్ ప్యాంట్లు తయారవుతున్నాయి. జైపూర్ కాటన్‌తో నైటీలను పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడి ఉత్పత్తులకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. నైటీలకు సంబంధించి 70కి పైగా, నైట్ ప్యాంట్లకు సంబంధించి 50 దాకా కుటీర పరిశ్రమలు ఇక్కడ వెలిశాయి. అన్ని కులాలకు చెందిన వారు ఈ వ్యాపారంలో రాణిస్తున్నారు. ధర తక్కువ.. నాణ్యత ఎక్కువ వస్త్ర వ్యాపారంలో పామిడి వాసుల ప్రత్యేకతే వేరు. కేవలం వస్త్ర వ్యాపారం సాగించే వీధినే ప్రత్యేకంగా ఉంది. ఈ వీధిలో 130కు పైగా వస్త్ర దుకాణాలు ఉన్నాయి. ఏ వస్త్రం నాణ్యత ఏపాటిదో కంటితో చూస్తే చెప్పే నైపుణ్యం ఇక్కడి వారి సొంతం. వస్త్ర పరిశ్రమలు విస్తారంగా ఉన్న గుజరాత్, మహారాష్ట్ర నుంచి తమకు అవసరమైన ముడిసరుకును దిగుమతి చేసుకుని వ్యాపారం సాగిస్తూ వచ్చారు. నేరుగా పరిశ్రమల నుంచి వస్త్రాలను దిగుమతి చేసుకోవడంతో వినియోగదారులకు చాలా తక్కువ ధరకే లభ్యమయ్యేవి. నాణ్యమైన వస్త్రాలను మాత్రమే విక్రయిస్తూ పామిడి ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేశారు. ఇక్కడి వస్త్రాలు కొనుగోలు చేసి ధరిస్తే ఏళ్ల తరబడి రంగు వెలిసిపోవని వినియోగదారుల నమ్మకం. దీంతో మూడు దశాబ్దాల వరకూ రాయలసీమ జిల్లాల్లో ఎవరింట శుభకార్యం జరిగినా పామిడికి చేరుకుని వస్త్రాలు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం ఎక్కడికక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ రావడంతో పామిడి వైపు ఎక్కువగా దృష్టి సారించలేకపోతున్నారు. మన్నిక భేష్ పామిడి వ్రస్తాల మన్నిక చాలా బాగుంటుంది. ధర కూడా తక్కువే. ప్రత్యేకించి ఎక్కువ మొత్తంలో వస్త్రాలు కొనుగోలు చేయాలనుకునేవారు తప్పనిసరిగా పామిడికి వస్తుంటారు. ఇక ఇళ్ల వద్ద చీరలు, ఇతర వస్త్రాలు విక్రయించాలనుకునే మహిళలు సైతం పామిడిలోనే కొనుగోలు చేస్తుండడం విశేషం. – డి.హొన్నూరుసాహెబ్, కల్లూరు నాణ్యతగా ఉంటాయిమా గ్రామం గొప్పతనం చెప్పడం కాదు కానీ, ఇక్కడ ఒక్కసారి వస్త్రాలు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరూ నాణ్యమైన సరుకు కావాలంటే పామిడికే వెళ్లాలని చెబుతుంటారు. ప్రస్తుతమున్న ధర ప్రకారం ఇతర ప్రాంతాల్లో రూ.900 చెల్లించి కొనుగోలు చేసిన ఓ ప్యాంట్ పీస్ నాణ్యతకు అదే ధరతో పామిడిలో కొనుగోలు చేసే ప్యాంట్ పీస్ నాణ్యతకు చాలా తేడా ఉంటుంది. ఇక్కడ కొనుగోలు చేసిన వస్త్రాలు చాలా కాలం పాటు మన్నిక వస్తాయి. రంగు వెలిసిపోదు. దీంతో నాణ్యత కావాలనుకునే వారు పామిడికే వచ్చి వస్త్రాలు కొనుగోలు చేస్తుంటారు. – పి.శివకుమార్, పామిడి -
మడతెట్టే రోబో!
నిత్యం చేసే పనులను మరింత సులువుగా చేసేందుకు వీలుగా టెక్నాలజీ వినియోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగప్రవేశం చేసిన తర్వాత మర మనుషులే మన పనులు చేస్తున్నారు. ఇటీవల పిజికల్ ఇంటెలిజెన్స్(పీఐ) అనే స్టార్టప్ కంపెనీ పీఐ-జిరో అనే రోబోను తయారు చేశారు. ఇది మనం వాడిన బట్టలను ఉతికి, మడతేస్తోంది. దాంతోపాటు మరెన్నో పనులు చేస్తుంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం పలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.At Physical Intelligence (π) our mission is to bring general-purpose AI into the physical world. We're excited to show the first step towards this mission - our first generalist model π₀ 🧠 🤖Paper, blog, uncut videos: https://t.co/XZ4Luk8Dci pic.twitter.com/XHCu1xZJdq— Physical Intelligence (@physical_int) October 31, 2024ఇదీ చదవండి: మెటాకు రూ.213 కోట్ల జరిమానా.. కంపెనీ రియాక్షన్ఈ ‘పీఐ-జిరో’ కేవలం బట్టలు ఉతికి, మతతెట్టడమే కాకుండా గుడ్లు ప్యాక్ చేయడం, కాఫీ బీన్స్ గ్రైండ్ చేయడం, టేబుల్ శుభ్రం చేయడం వంటి పనులు చేస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇంటికో రోబోను పెంచుకునే రోజులు త్వరలో రాబోతున్నట్లు ఈ వీడియో చేసిన కొందరు అభిప్రాయపడుతున్నారు. -
ఇదేందిది.. ప్రజర్ కుక్కర్‌ను ఇలానూ వాడొచ్చా?
కొంతమంది తమ అవసరాలకు అనుగుణంగా ఇంటిలోని వస్తువులతో వినూత్న ఆవిష్కరణలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇటువంటివాటిని చూసినప్పుడు మన కళ్లను మనమే నమ్మలేం. ఇన్నాళ్లూ ఈ సంగతి మనకు తెలియలేదే.. అని ఆశ్యర్యపోతుంటాం. తాజాగా అలాంటి వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ప్రజర్ కుక్కర్ నుంచి విజిల్ రాగానే ఓ యువతి చేసిన పని చూస్తే ఎవరైనా ఆశ్యర్యపోవాల్సిందే. హాట్ ప్రజర్ కుక్కర్‌ను ఉపయోగించి ఆ యువతి దుస్తులు ఇస్త్రీ చేయడాన్ని వీడియోలో చూడవచ్చు. ప్రజర్ కుక్కర్ నుంచి విజిల్ రాగానే ఆ యువతి ఇండక్షన్ స్టవ్ నుంచి దించి, దానిని తీసుకుని గదిలోకి పరిగెడుతుంది. తరువాత ఆ కుక్కర్ సాయంతో ఒక షర్ట్ ఇస్త్రీ చేస్తుంది. ఈ వీడియోను చూసిన యూజర్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ 17 సెకన్ల వీడియో @Babymishra_ అనే ఖాతాతో ‘ఎక్స్’లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు ఒక లక్షా 40 వేల మందికి పైగా వీక్షించగా, ఆరు వందల మందికి పైగా యూజర్లు ఈ వీడియోను లైక్ చేశారు. ఒక యూజర్ ‘ఆమె సృజనాత్మకతకు వందనం’ అని రాయగా, మరొక యూజర్ ‘ఇస్త్రీ పెట్టె నూతన ఆవిష్కరణ. వెంటనే పేటెంట్ తీసుకోవాలి’ అని రాశారు. प्रिय दीदी जी को दंडवत प्रणाम 🙏 pic.twitter.com/ux2XkGpMSX — Shubhangi Pandit (@Babymishra_) March 12, 2024 -
గ్రేట్ లాండ్రీవాలా.. నిజాయితీ చాటుకుని, రూ.2100 అందుకుని..
మీరెప్పుడైనా ప్యాంట్ జేబులో డబ్బులు పెట్టి మరచిపోయారా? అలాగే ఉతికేందుకు ఇచ్చేశారా? ఇంట్లోనైతే ఫర్వాలేదు కానీ... బయట లాండ్రీకి ఇస్తే? ఇక అంతే సంగతులు. ఆ డబ్బులను శాశ్వతంగా మరచిపోవచ్చు. ఇదీ మన అనుభవం కానీ మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి వ్యక్తి ఒకరికి దీనికి భిన్నమైన అనుభవం ఎదురైంది. జేబులో ఉంచి మరచిపోయిన డబ్బు అంతకు అంతా తిరిగి వచ్చింది. లాండ్రీవాడి నిజాయితీ పుణ్యం! వివరాలు ఏమిటంటే... మధ్యప్రదేశ్‌లోని శివపురిలోని సంతోషి మాత ఆలయానికి సమీపంలో సూపర్ లాండ్రీ దుకాణం ఉంది. ఈ షాపులో పనిచేస్తున్న డ్రై క్లీనర్ పంచమ్ రజక్‌కు కొన్ని దుస్తులు డ్రైక్లీనింగ్‌కు వచ్చాయి. వాటిని వాషింగ్ మెషీన్‌లోకి వేసేందుకు సిద్ధం చేస్తూండగా అందులో 500 రూపాయల నోట్ల కట్ట కనిపించింది. కట్టలో మొత్తం 50 వేల రూపాయలు ఉన్నట్లు స్పష్టమైంది. అంత డబ్బు చూసిన రజక్‌కు కాసేపు ఏం చేయాలో పాలుపోలేదు. నిజాయితీ పరుడు కావడంతో ఈ విషయాన్ని వెంటనే వినియోగదారుడికి తెలియజేశాడు. తరువాత పంచమ్ రజక్ ఆ కస్టమర్ ఇంటికి వెళ్లి, రూ.50 వేల మొత్తాన్ని అతనికి తిరిగి ఇచ్చాడు. అతని నిజాయితీని గుర్తించిన కస్టమర్ అతనికి బహుమానంగా రూ.2100 అందజేశాడు. కాగా ఈ సంగతి తెలుసుకున్న స్థానికులు డ్రై క్లీనర్ పంచమ్ రజక్ నిజాయితీని మెచ్చుకుంటున్నారు. -
శ్రీరాముని సేవలో ట్రిపుల్ తలాక్ బాధితులు
శ్రీరాముని సేవకు మతం అడ్డుకాదని నిరూపిస్తున్నారు ట్రిపుల్ తలాక్ బాధితులు. వీరంతా జనవరి 26 తర్వాత రామ్‌లల్లాను దర్శించుకునేందుకు అయోధ్యకు తరలివస్తున్నారు. వీరు తమ చేతులతో నేసిన దుస్తులను శ్రీరామునికి అందించనున్నారు. ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన యూపీకి చెందిన మేరా హక్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఫర్హత్ నఖ్వీ నేతృత్వంలో ముస్లిం మహిళలు రామాలయ నిర్మాణానికి సహకరించాలని ప్రచారం చేస్తూ నిధులు సేకరిస్తున్నారు. బరేలీ, బదౌన్, రాంపూర్, మొరాదాబాద్, మీరట్, ప్రయాగ్‌రాజ్ సహా 30 జిల్లాల నుంచి మహిళలు విరాళాలు సేకరిస్తున్నారు. ఈ నిధులను రామమందిరం ట్రస్టుకు అప్పగిస్తానని ఫర్హత్ తెలిపారు. ట్రస్టు నుంచి అనుమతి లభిస్తే ఏటా తమ చేతులతో శ్రీరామునికి దుస్తులు సిద్ధం చేస్తామని ఆ ముస్లిం మహిళలు చెబుతున్నారు. వీరంతా తమ స్వహస్తాలతో జరీ జర్దోసీ వర్క్ చేస్తుంటారు. కాగా ఇటీవల యూపీలోని 27 జిల్లాలకు చెందిన వేల మంది ముస్లింలు నూతన రామాలయానికి విరాళాలు అందించారు. -
Paital Gagan: బట్టల తాత వచ్చాడోచ్
ఒరిస్సాలో ఏదో ఒక ఉదయం ఏదో ఒక మారుమూల పల్లెలో వ్యాన్ ఆగుతుంది. దానిని చూసిన వెంటనే పిల్లల కళ్లల్లో వెలుగు. కటిక దారిద్య్రం వల్ల చలికాలమైనా వానాకాలమైనా ఒంటి నిండా బట్టలు లేని వారికి గగన్ బట్టలు పంచుతాడు. రిటైర్డ్ ఉద్యోగి అయిన పెయిటల్ గగన్ తన భార్యతో కలిసి ఊరూరా తిరిగి బట్టలు సేకరించి పంచుతాడు. పిల్లల పసినవ్వును ఆశీర్వాదంగా పొందుతాడు. సంఘటనలు అందరికీ ఎదురవుతుంటాయి. కొందరు స్పందిస్తారు. కొందరు స్పందించరు. కొందరు ఆ సంఘటనలతో తమ లక్ష్యాన్ని, కర్తవ్యాన్ని తెలుసుకుంటారు. అలాంటి వారు ఆదర్శంగా నిలుస్తారు. పదేళ్ల క్రితం– భువనేశ్వర్‌లో చిన్న పోస్టల్ ఉద్యోగైన గగన్ పెయిటల్ ఇంటికి వెళుతున్నాడు. అతనికి వాణి విహార్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక దిక్కులేని మహిళ కనిపించింది. ఆమె చిరిగిన చీర కట్టుకుని ఉంది. గగన్ ఆమెను చూసి జాలిపడి హోటల్ నుంచి ఫుడ్ ప్యాకెట్ తెచ్చి ఇచ్చాడు. కాని ఆమె ‘అన్నం వద్దు. ముందు ఒక చీర ఇవ్వండి’ అని ప్రాధేయపడింది. స్త్రీగా ఆమె అవస్థ గమనించిన గగన్ వెంటనే ఇంటికి వెళ్లి తన తల్లి పాత చీర తెచ్చి ఇచ్చాడు. ‘దానిని అందుకుంటూ ఆమె ముఖంలో కనిపించిన సంతోషం అంతా ఇంతా కాదు. ఒంటికి తగిన బట్ట ఉంటేనే మనిషికి మర్యాద. అది లేని వారు ఈ దేశంలో ఎందరో ఉన్నారు. వారి కోసం ఏదైనా చేయాలి అని నిశ్చయించుకున్నాను’ అంటాడు గగన్. ఉద్యోగంలో ఉండగా మొదలుపెట్టిన ఈ పనిని రిటైరయ్యాక కూడా కొనసాగిస్తున్నాడు. చిన్న ఉద్యోగి అయినా పోస్టాఫీసులో చిరుద్యోగిగా పని చేసి రిటైరైన గగన్ భువనేశ్వర్‌లో చకైసియాని ప్రాంతంలో నివసిస్తాడు. కొడుకు మృత్యుంజయ బలిగూడ అనే ఊళ్లో క్యాబ్ డ్రైవర్. కోడలు టీచర్‌గా పని చేస్తున్నది. ఇతర బాదరబందీలు లేని గగన్ తన భార్య అన్నపూర్ణకు తన ఆలోచన చెప్పాడు. ‘మనం అందరికీ కొత్త బట్టలు ఇవ్వలేం. అలాగని అన్నేసి పాత బట్టలూ ఉండవు. కాబట్టి సేకరించి పంచుదాం’ అన్నాడు. అన్నపూర్ణ అతనికి సహరించడానికి అంగీకరించింది. ఆ రోజు నుంచి గగన్ తనకు ఖాళీ ఉన్నప్పుడల్లా భువనేశ్వర్‌లోని అపార్ట్మెంట్లకూ హౌసింగ్ కాలనీలకు తిరిగి వాడిన దుస్తులను సేకరిస్తాడు. అవసరమైతే కటక్ వంటి ఇతర పట్టణాలకు కూడా వెళతాడు. ‘పేదలకు పంచుతాం. మీరు ఉపయోగించక పడేసిన దుస్తులు ఇవ్వండి’ అంటే చాలామంది ఇస్తారు. వాటిని తీసుకొస్తాడు గగన్. సరి చేసి, ఇస్త్రీ చేసి ‘మనం బట్టలు పంచినా అవి సరిగ్గా ఉండాలి. మావారు తెచ్చిన బట్టలు ఏవైనా చిరిగి ఉంటే కుట్టి, ఇస్త్రీ చేసి, స్త్రీలవి, పురుషులవి, పిల్లలవి విడివిడిగా ప్యాక్ చేసి కొత్తవిగా కనిపించేలా చేస్తాను’ అంటుంది గగన్ భార్య అన్నపూర్ణ. వాళ్లుండేది చిన్న ఇల్లే అయినా ఒక గది ఖాళీ చేసి పూర్తిగా గోడౌన్‌గా వదిలారు. భార్యాభర్తలిద్దరూ డాబా మీదకు చేరి వాటిని విభజించి మూటలుగా కడతారు. ఆ తర్వాత గగన్ తీసుకెళ్లి పంచుతాడు. బట్టలు, బూట్లు, దోమతెరలు గగన్ ముఖ్యంగా చిన్నపిల్లల కోసం బట్టలు సేకరిస్తాడు. ఒడిసాలో గిరిజన పిల్లలకు సరైన బట్టలు ఉండవు. కొండ ప్రాంతాలకు వెళ్లి వారి బాగోగులు ఎవరూ చూడరు. గగన్ అలాంటి పిల్లల కోసం బట్టలు సేకరించి పంచుతాడు. గగన్ సేవా భావం గమనించిన దాతలు అతనికో వ్యాన్ ఏర్పాటు చేశారు. గగన్‌కు ఏనుగంత బలం వచ్చింది. తాను సేకరించిన బట్టలను వ్యాన్‌లో వేసుకుని మారుమూల పల్లెలకు వెళ్లి పిల్లలకు పంచుతాడు. దోమలు కుట్టి పసికందులు రోగాల బారిన పడకుండా దోమతెరలు పంచుతాడు. బొమ్మలు ఇస్తాడు. పిల్లలు ఎంతో సంతోషంగా వాటిని స్వీకరిస్తారు. బట్టల తాత అని పిలుస్తారు. పండుగల ముందు ఒడిసాలో చేసుకునే పండగల ముందు చాలా శ్రమించి బట్టలు సేకరిస్తాడు గగన్. పేదలు పండగ సమయంలో వీలైనంత మంచి బట్టలు వేసుకోవాలని ఆ సమయాలలో ప్రత్యేకంగా తీసుకెళ్లి పంచుతాడు. అంతేకాదు పూరి జగన్నాథ రథ యాత్ర సమయంలోనూ, కటక్ దుర్గా పూజకూ ఎక్కడెక్కడి పేదవారో వస్తారు. అక్కడ ప్రత్యేకంగా స్టాల్స్ పెట్టి మరీ పాత బట్టలు పంచుతాడు. ఈ దేశంలో ప్రతి పేదవాళ్లకి ఒంటినిండా బట్ట దొరికే దాకా గగన్ లాంటి వాళ్లు వందలుగా పని చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వారుగా ఎవరైనా ఉండొచ్చు. ప్రయత్నించాలి... కొద్దిగా మనసు పెట్టాలి అంతే. -
అమెరికాకు సిరిసిల్ల వస్త్రాలు
సిరిసిల్ల: సిరిసిల్ల అపెరల్ పార్క్‌లోని గోకుల్దాస్ సంస్థలో గ్రీన్‌నీడిల్ యూ నిట్‌లో జిల్లా మహిళలు ఉత్పత్తి చేసిన రెడీమేడ్ వ్రస్తాలు సిరిసిల్ల బ్రాండ్‌తో అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. ఈ విషయాన్ని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు శుక్రవారం ట్విట్టర్లో పంచుకున్నారు. సిరిసిల్ల అపెరల్‌పార్క్‌లో రెండేళ్లుగా రెడీమేడ్ వస్త్రాలు తయారవుతున్నా సిరిసిల్ల కాకుండా.. బెంగళూర్ బ్రాండ్‌తో ఎగుమతి అయ్యేవి. ఇటీవల సిరిసిల్ల బ్రాండ్‌తో అమెరికాకు నేరుగా ముంబయి నుంచి నౌకలో వెళ్తున్నాయి. అపెరల్ పార్క్‌లో 3.25 ఎకరాల్లో 66 వేల చదరపు అడుగులతో రూ.24 కోట్లతో గోకుల్దాస్ రెడీమేడ్ వ్రస్తాల తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. ఇందులో ప్రస్తుతం 500 మంది స్థానిక మహిళలు ఉపాధి పొందుతుండగా.. మరో 500 మందికి త్వరలోనే ఉపాధి కలి్పస్తామని గ్రీన్‌నీడిల్ సంస్థ ప్రకటించింది. రెండు కంటైనర్లలో సిరిసిల్ల బ్రాండ్‌తో ముంబయికి రెడీమేడ్ వ్రస్తాలు ఎగుమతి కావడంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. -
సిల్క్ ఇండియా ప్రదర్శన ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: విభిన్న ప్రాంతాలకు చెందిన చేనేత కళాకారులు రూపొందించిన దుస్తులతో సిల్క్ ఇండియా వస్త్ర ప్రదర్శన మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో ఏర్పాటైంది. వివాహ ప్రత్యేక దుస్తుల శ్రేణిని నేపథ్యంగా తీసుకుని నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన బుధవారం ప్రారంభమైంది. ప్రదర్శనలో ఉప్పాడ, బనారస్ సిల్క్స్, గద్వాల, ధర్మవరం తదితర ప్రసిద్ధి వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. చేనేత కళాకారులు, సామాజిక కార్యకర్తలు, పర్యావరణ వేత్తలు, డిజైనర్లు తదితరుల బృందంతో ఏర్పాటైన ఒడిస్సా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఆధ్వర్యంలో ప్రదర్శన ఈ నెల 9 వరకు కొనసాగుతుందని వివరించారు. -
శభాష్ ఎస్సై నాగరాజు.. ఆకలి తీర్చి.. ఆరాతీసి
సాక్షి, చిట్యాల (నల్లగొండ): మండల పరిధిలోని గుండ్రాంపల్లి గ్రామ శివారు జాతీయ రహదారిపై సోమవారం ఓ వ్యక్తి ఒంటిపై దుస్తులు లేకుండా సంచరిస్తుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే చిట్యాల ఎస్ఐ నాగరాజు అక్కడికి చేరుకుని ఆ మతిస్థితిమితం లేని వ్యక్తిని చేరదీశాడు. అతడిని వివరాలు అడగగా ఆంగ్లంలో మాట్లాడాడు. తన పేరు డాక్టర్ రాజా అని, ఐఐటీ, పీహెచ్డీ చేశానని, తమిళనాడు అని చెప్పాడు. అతడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి దుస్తులు సమకూర్చి భోజనం పెట్టించి ఆకలి తీర్చాడు. అతడు చెబుతున్న వివరాల ఆధారంగా కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మతిస్థిమితం లేని వ్యక్తిని చేరదీసిన ఎస్ఐని పలువురు అభినందించారు. వృద్ధురాలిని ఇంటికి చేర్చి.. డిండి: నాంపల్లి మండలం సల్లోనికుంటకు చెందిన వృద్ధురాలు రాపోతు వెంకటమ్మ చిత్రియాలలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైంది. స్వగ్రామానికి తిరుగు ప్రయాణంలో దారితప్పి డిండికి చేరుకుంది. మతిస్థిమితం లేకుండా బంగారు ఆభరణాలతో డిండి గ్రామశివారులో తిరుగుతున్న సదరు వృద్ధురాలిని స్థానిక యువకుడు ఆవుట అంకాల్ గమనించి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పజెప్పాడు. వెంటనే స్పందించిన పోలీసులు వివారాలు సేకరించగా వృద్ధురాలు కూతురైన మండల పరిధిలోని వీరబోయనపల్లి గ్రామానికి చెందిన జంగా లక్ష్మమ్మగా గుర్తించారు. ఆమెను స్టేషన్‌కు పిలిపించి వెంకటమ్మను అప్పగించారు. కార్యక్రమంలో డిండి ట్రైనీ ఎస్ఐ.కళ్యాణ్ కుమార్, మహిళ సహాయకేంద్రం ఇన్చార్జ్ సైదమ్మ ఉన్నారు. చదవండి: Omicron Variant : గంటన్నరలో ఒమిక్రాన్ ఫలితం -
భార్యాభర్తల ప్రాణం తీసిన కరెంట్
సాక్షి, బయ్యారం(వరంగల్): కరెంటు భార్యాభర్తల ప్రాణం బలితీసుకుంది. ఈ విషాద ఘటన శుక్రవారం రాత్రి మండలంలోని కొత్తపేట పంచాయతీ సింగారం–2 కాలనీలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కాలనీకి చెందిన అనపర్తి ఉపేందర్(33), తిరుపతమ్మ(30) భార్యాభర్తలు. భార్య తిరుపతమ్మ స్నానం చేసిన తరువాత టవల్‌ను ఇంట్లో ఉన్న వైరు తీగ(దండం)కు ఆరేసేందేకు వెళ్లింది. దండానికి విద్యుత్ ప్రసారం కావడంతో ఆమె షాక్‌కు గురైంది. గమనించిన భర్త ఉపేందర్ ఆమెను రక్షించేందుకు పట్టుకోవడంతో అతనూ విద్యుదాఘాతానికి గురై కిందపడ్డాడు. స్థానికులు గమనించి వెంటనే ఇద్దరిని చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. మృతులకు పదేళ్లలోపు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
Nita Ambani Expensive Things: రూ.100 కోట్ల కారు, డ్రైవర్ జీతం ఎంతంటే?
-
కొత్త బట్టలు కొనివ్వాలని కోరిన కూతురు.. కాసేపటికే..
సాక్షి, ఆసిఫాబాద్(ఆదిలాబాద్): తల్లిదండ్రులు కొత్త బట్టలు కొనివ్వలేదని బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం అపμపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. నికొండే దుర్గయ్య, ఉమాదేవి దంపతులకు కూతురు శిరీష(15), కుమారుడు ఉన్నారు. శిరీష బూర్గుడ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. కొత్త బట్టలు కొనివ్వాలని బుధవారం తల్లిదండ్రులను కోరింది. ఈ రోజు వద్దు.. రెండ్రోజుల తర్వాత తీసుకుందామంటూ తల్లి మందలించింది. తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లిపోగా.. మనస్తాపం చెందిన శిరీష బుధవారం సాయంత్రం పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కాగజ్‌నగర్ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి గురువారం మృతిచెందింది. కొత్త బట్టలు కొనిస్తే తన కూతురు బతికుండేదేమోనని తల్లిదండ్రులు రోదించడం స్థానికులను కంటతడి పెట్టించింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. -
దుస్తుల్లో రూ.1.36 కోట్లు తరలింపు
సాక్షి ప్రతినిధి, చెన్నై: దుస్తుల్లో దాచి రహస్యంగా రూ. 1.36 కోట్లు తీసుకెళుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు వ్యక్తులను చెన్నై ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ సమీపంలోని వాల్టాక్స్ రోడ్లో సోమవారం ఉదయం అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురిని అధికారులు చూశారు. వారిని దగ్గర్లోని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ప్రశ్నించారు. తనిఖీ చేయగా వారు ధరించిన దుస్తుల నుంచి కట్టలు కట్టలుగా రూ. 1.36 కోట్ల నగదు బయటపడింది. వీరిని విజయవాడకు చెందిన బాషా, శ్రీనివాసులు, ఆంజనేయులు, షేక్ సలీంగా గుర్తించారు. నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలూ లేకపోవడంతో ఎన్నికల్లో పంచేందుకు తరలిస్తున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు. -
దుస్తులు పట్టుకోబోయి.. చెరువులోకి జారి
నరసన్నపేట: ఎండకు ఆరబెట్టిన దుస్తులు గాలికి ఎగిరిపోవడాన్ని గమనించి వాటిని పట్టుకునేందుకు యత్నించిన ఒక మహిళ ప్రమాదవశాత్తూ చెరువులో పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర సంఘటన నరసన్నపేట మండలం జమ్ము శివార్లులోని కోలవానిచెరువు వద్ద గురువారం జరిగింది. బొమ్మాళి అంకమ్మ(48), ఆమె భర్త సింహాచలం రజకవృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సింహాచలం ఆరోగ్యం బాగోలేకపోవడంతో అంకమ్మ ఒక్కరే గురువారం చెరువు వద్దకు వచ్చారు. వస్త్రాలను ఉతికి ఆరబెట్టారు. ఆరిన దుస్తులను భద్రపరుస్తుండగా ఒక్కసారి గాలివీచింది. మిగిలిన వస్త్రాలు గాలికి ఎగిరిపోవడంతో వాటిని పట్టుకునేందుకు ఆమె ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో చెరువు గట్టుపై నుంచి ఒక్కసారిగా లోపలికి జారిపోయారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో కాపాడలేకపోయారు. తల్లి ఎప్పటికీ ఇంటికి రాకపోవడంతో అనుమానించిన కుమారులు చెరువు వద్దకు వచ్చారు. అక్కడ ఆమె చెప్పులు ఉండటాన్ని గమనించి గాలించగా మృతదేహం లభ్యమైంది. ఈ వార్త తెలిసిన కుటుంబ సభ్యలు కన్నీరుమున్నీరయ్యారు. -
తడవవు.. ఉతకాల్సిన అవసరం లేదు!
బీజింగ్: మీరు టిప్ టాప్‌గా డ్రెస్సింగ్ చేసుకుని ఏదైనా శుభకార్యానికి వెళ్తున్నపుడు వర్షం కురిసి మీ దుస్తులు తడిస్తే మీకెలా అనిపిస్తుంది. తడిసిన దుస్తుల్లో శుభకార్యానికి ఎందుకు వెళ్లడం... దుస్తులు తడవకుంటే బాగుండేది అని అనుకునే ఉంటారు కదా! మీలాంటి వారి కోసమే వర్షంలోనూ తడవని దుస్తులను శాస్త్రవేత్తలు త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకుగాను నీటిని శోషించుకోని రోబస్ట్ పోరస్ సర్ఫేస్ (లిక్విడ్ రెపలెంట్) పదార్థాన్ని యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ పదార్థంలో తయారు చేసిన దుస్తులు తడవవని, ఉతకాల్సిన అవసరం కూడా ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటితో తయారు చేసిన దుస్తులకు చమురు, దుమ్ము ధూళీ కూడా అంటుకోవని తెలిపారు. వస్త్రాలు, లోహాలు, గాజుల తయారీలో రోబస్ట్ పోరస్ సర్ఫేస్ను ఉపయోగిం చినట్లయితే అవి నీటిని శోషించుకోలేవని వివరించారు. ఈ సాంకేతికతో తయారుచేసిన దుస్తులు వర్షంలోనూ తడవకుండా ఉంటాయని చెప్పారు. -
కంచానికీ.. కరువాయె...!
జనాభాలో అధిక శాతం కలిగిన బీసీ విద్యార్థుల సంక్షేమం అటకెక్కింది. బీసీ హాస్టళ్లలో ఉంటున్న వారికి ప్లేట్లు, గ్లాసులు, ట్రంకుపెట్టెలను కూడా పాలకులు అందించలేకపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కడప రూరల్: జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థుల హాస్టళ్లు మొత్తం 57 ఉన్నాయి. అందులో 6 వేల మంది బాల బాలికలు ఉంటున్నారు. వీరికి ప్రభుత్వం ఏడాదికి నాలుగు జతల దుస్తులు, ఒక విద్యార్థికి ఒక ప్లేటు, గ్లాసు, ట్రంకు పెట్టె ఇవ్వాలి. పౌష్టికాహరాన్ని అందించాలి. విద్యాభివృద్ధికి కృషి చేయాలి. అయితే ప్రభుత్వం నుంచి ఆ విధంగా సహకారం లభించడంలేదు. ఏడాది దాటినా ... విద్యార్థులకు అందించే ప్లేటు, గ్లాసు, ట్రంకు పెట్టె కాలపరిమితి ఐదేళ్ల వరకు ఉంటుంది.గడువు దాటగానే కొత్తవి అందించాలి. అయితే ఏడాది అవుతున్నా ఇంతవరకు ప్రభుత్వం వాటికి నిధులను కేటాయించలేదు. ప్రభుత్వం నిధులను కేటాయిస్తేనే ఆ శాఖ అధికారులు టెండర్ల ద్వారా వాటిని తీసుకొని విద్యార్ధులకు అందజేస్తారు. అయితే అలా జరగడంలేదు. కాలం చెల్లిన వాటితోనే... సాధారణంగా హాస్టళ్లకు సరఫరా చేసే వస్తువులు నాసిరకంతో ఉంటాయనే విమర్శలు ఉన్నాయి. గతంలో సరఫరా చేసిన ప్లేట్లు, గ్లాసులు, ట్రంకు పెట్టెలు కూడా దాదాపు నాసిరకానివి అనే ఆరోపణలు వస్తున్నాయి. పెట్టలకు ఉన్న చిలుకులు ఊడిపోయాయి. దీంతో చాలా మంది విద్యార్థులు తమ ఇంటి నుంచే వస్తువులు తెచ్చుకుంటున్నారు. మరికొంతమంది పాత వాటితోనే సర్దుకుపోతున్నారు. ప్రభుత్వ విధానాల కారణంగా బీసీ విద్యార్ధుల సంక్షేమం ఇలా కొనసాగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. బడ్జెట్ రాగానే చర్చలు చేపడుతాం.. నేను జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారిగా గడిచిన ఏప్రెల్‌లో బాధ్యతులు చేపట్టాను. అప్పుడే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. ఇందుకు సంబంధించి నిధులు విడుదల కాగానే చర్యలు చేపడుతా.– లక్ష్మీకాంతమ్మ,జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
కౌతాళం: విద్యుదాఘాతంతో ఓ మహిళ మృతి చెందిన సంఘటన సోమవారం మండల పరిదిలోని ఉప్పరహల్ గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పింజారి శేకమ్మ(35) నివసిస్తున్న గుడిసెకు ఉన్న విద్యుత్ సర్వీసు తీగ తెగి గుడిసెకు ఉన్న ఇనుప రేకుపై పడి విద్యుత్ సరఫరా అయింది. గమనించని శేకమ్మ దుస్తులు ఆరేసుకునేందుకు ఇంటి నుంచి బయటకు వస్తుండగా గుడిసెకు ఉన్న రేకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. మూడు సంవత్సరాల కిత్రం ఆదోని సమీపంలో ఇస్వి వంతెన వద్ద శేకమ్మ భర్త నబీసాబ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతురాలికి ముగ్గురు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
'బట్టలంటే నాకు ఎలర్జీ'
అహ్మదాబాద్: సల్మాన్ చొక్కా విప్పాడంటే చాలు.. థియేటర్లలో అభిమానులు ఆనందంతో విజిల్స్ వేస్తుంటారు. 50 ఏళ్లకు దగ్గర పడుతున్నప్పటికీ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించే ఈ బాలీవుడ్ బ్రహ్మచారిపై మహిళా ప్రేక్షకులు ఇప్పటికీ మనసు పారేసుకుంటున్నారు. అభిమానులు ముద్దుగా సల్లూబాయ్గా పిలుచుకునే స్టార్ హీరో.. తెరపై ఎక్కువగా షర్ట్ విప్పడం వెనక అసలు కథను ఎట్టకేలకు చెప్పేశాడు. ఐఐటీ అహ్మదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ కొన్ని విషయాలను వెల్లడించాడు. తనకు బట్టలు వేసుకోవడమంటే కాస్త ఎలర్జీగా ఉంటుందన్నాడు. బట్టలు వేసుకుంటే తనకు ఏదోలా ఉంటుందని, అవి అంతగా సౌకర్యంగా ఉండవని చెప్పాడు. అసలు తాను దుస్తులు వేసుకుంటుంటేనే ఏదో అయిపోతుందన్నాడు. ఫ్యాషన్ డిజైనర్స్ రూపొందించిన ఖాదీ దుస్తులను ధరించి స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హాతో కలిసి ర్యాంప్ వాక్ చేసిన తర్వాత ఈ వివరాలను సల్మాన్ మీడియాతో పంచుకున్నాడు. ''కావాలంటే ఎవరైనా మా ఇంటికి వచ్చి చూడండి. నాతో పాటు మా నాన్న సలీంఖాన్ కూడా తక్కువగా బట్టలు వేసుకుంటారు. ఎక్కువగా ప్యాంట్, బనియన్ మాత్రమే వేసుకుంటాం. అప్పుడప్పుడు షర్ట్ ధరిస్తా'' అని చెప్పుకొచ్చాడు. కాలేజీ రోజుల్లో ఖాదీ బట్టలు వేసుకుని పూర్తిగా బటన్స్ పెట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉండేదని, ప్రస్తుతం చాలా మంచి డిజైన్స్ వస్తున్నాయని చెప్పాడు. ఖాదీ భారత్‌లో మొదటగా తయారైనందుకు మనం గర్వపడాలని సల్మాన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.