సిరిసిల్ల: సిరిసిల్ల అపెరల్ పార్క్‌లోని గోకుల్‌దాస్ సంస్థలో గ్రీన్‌నీడిల్ యూ నిట్‌లో జిల్లా మహిళలు ఉత్పత్తి చేసిన రెడీమేడ్ వ్రస్తాలు సిరిసిల్ల బ్రాండ్‌తో అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. ఈ విషయాన్ని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు శుక్రవారం ట్విట్టర్‌లో పంచుకున్నారు. సిరిసిల్ల అపెరల్‌పార్క్‌లో రెండేళ్లుగా రెడీమేడ్ వస్త్రాలు తయారవుతున్నా సిరిసిల్ల కాకుండా.. బెంగళూర్ బ్రాండ్‌తో ఎగుమతి అయ్యేవి.
ఇటీవల సిరిసిల్ల బ్రాండ్‌తో అమెరికాకు నేరుగా ముంబయి నుంచి నౌకలో వెళ్తున్నాయి. అపెరల్ పార్క్‌లో 3.25 ఎకరాల్లో 66 వేల చదరపు అడుగులతో రూ.24 కోట్లతో గోకుల్‌దాస్ రెడీమేడ్ వ్రస్తాల తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. ఇందులో ప్రస్తుతం 500 మంది స్థానిక మహిళలు ఉపాధి పొందుతుండగా.. మరో 500 మందికి త్వరలోనే ఉపాధి కలి్పస్తామని గ్రీన్‌నీడిల్ సంస్థ ప్రకటించింది. రెండు కంటైనర్లలో సిరిసిల్ల బ్రాండ్‌తో ముంబయికి రెడీమేడ్ వ్రస్తాలు ఎగుమతి కావడంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment