బీజింగ్: మీరు టిప్ టాప్‌గా డ్రెస్సింగ్ చేసుకుని ఏదైనా శుభకార్యానికి వెళ్తున్నపుడు వర్షం కురిసి మీ దుస్తులు తడిస్తే మీకెలా అనిపిస్తుంది. తడిసిన దుస్తుల్లో శుభకార్యానికి ఎందుకు వెళ్లడం... దుస్తులు తడవకుంటే బాగుండేది అని అనుకునే ఉంటారు కదా! మీలాంటి వారి కోసమే వర్షంలోనూ తడవని దుస్తులను శాస్త్రవేత్తలు త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకుగాను నీటిని శోషించుకోని రోబస్ట్ పోరస్ సర్ఫేస్ (లిక్విడ్ రెపలెంట్) పదార్థాన్ని యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ పదార్థంలో తయారు చేసిన దుస్తులు తడవవని, ఉతకాల్సిన అవసరం కూడా ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటితో తయారు చేసిన దుస్తులకు చమురు, దుమ్ము ధూళీ కూడా అంటుకోవని తెలిపారు. వస్త్రాలు, లోహాలు, గాజుల తయారీలో రోబస్ట్ పోరస్ సర్ఫేస్‌ను ఉపయోగిం చినట్లయితే అవి నీటిని శోషించుకోలేవని వివరించారు. ఈ సాంకేతికతో తయారుచేసిన దుస్తులు వర్షంలోనూ తడవకుండా ఉంటాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment