honkong
-
గేమ్ పేరుతో రూ.1,100 కోట్లు నొక్కేసిన చైనా కంపెనీలు
సాక్షి, హైదరాబాద్: గేమ్ ఆఫ్ చాన్స్‌గా పరిగణించే ‘కలర్ ప్రెడిక్షన్’ను ఆన్లైన్లో నిర్వహించిన చైనా కంపెనీలు ఇక్కడివారి నుంచి కాజేసిన మొత్తంలో రూ.1,100 కోట్లు హాంకాంగ్‌కు తరలించేశాయి. ఢిల్లీలో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి, వాటి పేర్లతో ముంబైలో బ్యాంకు ఖాతాలను తెరిచిన కేటుగాళ్లు నకిలీ ఎయిర్ వే బిల్లుల సహకారంతో ఈ పని పూర్తి చేశారు. 2020లో ఈ కలర్ ప్రిడెక్షన్ గుట్టురట్టు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. కేసులు నమోదు చేసి చైనీయులు సహా ఉత్తరాదికి చెందిన పలువురిని అరెస్టు చేశారు. ఈ కేసుల ఆధారంగా ముందుకు వెళ్లిన ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేసింది. దీంతో నకిలీ ఎయిర్ వే బిల్లుల విషయం బయటపడింది. మోసానికి సంబంధించిన కేసులను దర్యాప్తు చేసే అధికారం ఈడీకి లేకపోవడంతో హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈడీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఏసీపీ బి.రవీందర్‌రెడ్డి లోతుగా దర్యాప్తు చేయడంతో రూ.1,100 కోట్లు దేశం దాటినట్లు తేలింది. ఈ–కామర్స్ కంపెనీల పేరుతో... భారత్‌లో కలర్ ప్రెడిక్షన్ (రంగు సెలక్షన్ ప్రక్రియతో కూడిన జూదం) దందా నడపాలని నిర్ణయించుకున్న చైనీయులు ఢిల్లీ, ముంబైకి చెందిన కొందరితో కలిసి పథకం ప్రకారం వ్యవహరించారు. లింక్‌యున్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, డోకీపే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, స్పాట్‌పే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థల్ని ఏర్పాటు చేశారు. ఈ–కామర్స్ వ్యాపారం పేరుతో వెబ్‌సైట్స్‌ను రిజిస్టర్ చేశారు. వీటి ముసుగులోనే ఆన్లైన్ గేమ్ కలర్ ప్రిడెక్షన్‌ను నిర్వహించారు. ఆ 3 సంస్థల పేరుతోనే పేమెంట్ గేట్వేస్ అయిన కాష్ ఫ్రీ, పేటీఎం, రేజర్ పే, ఫోన్ పే, గూగుల్ పేలతో ఒప్పందాలు చేసుకున్నారు. సోషల్‌మీడియా ద్వారా సర్క్యులేట్ అయిన ఈ గేమ్ హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా యువతను నిండా ముంచింది. పేమెంట్ గేట్‌వేల నుంచి.. ఈ గేమ్ ఆడేవాళ్లు ఆర్థిక లావాదేవీలన్నింటినీ ఈ పేమెంట్ గేట్‌వేల ద్వారానే చేపట్టారు. వీటి ద్వారా గేమ్ ఆడినవాళ్ల నుంచి దోచుకున్న సొమ్మును లింక్‌యున్, డోకీపే, స్పాట్‌పే ఖాతాల్లోకి మళ్లించారు. ఈ సంస్థల నుంచి సొమ్ము మళ్లించడానికి ఢిల్లీలో గ్రేట్ ట్రాన్స్ ఇంటర్నేషనల్, ఏషియా పసిఫిక్ కార్గో కంపెనీ, రేడియంట్ స్పార్క్ టెక్నాలజీస్, ఆర్చీవర్స్ బిజ్ ఇంటర్నేషనల్, కనెక్టింగ్ వరల్డ్ వైడ్, జెనెక్స్ షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు. వీటికి ముంబైలో బ్రాంచ్‌లు ఉన్నట్లు పత్రాలు సృష్టించి వెస్ట్ ముంబై జోగీశ్వరి ప్రాంతంలోని ఎస్బీఐ, ముంబైలోని నారీమన్ పాయింట్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్ రహేజా సెంటర్లో 6 ఖాతాలు తెరిచి సొమ్ము తరలించారు. ఈ ప్రకియంతా నకిలీ పత్రాలతోనే నడిపారు. -
పిల్లల మూడ్ ను చిటికెలో చెప్పేస్తుంది!
స్కూలుకెళ్లే పిల్లలు పేచీ పెట్టడం ఎంత సహజమో, బతిమాలో, కోప్పడో వాళ్లను బడికి పంపడానికి పేరెంట్స్ యత్నించడం అంతే సహజం. కరోనా కారణంగా తాజాగా ఆన్లైన్ క్లాసుల హంగామా పెరిగిపోయింది. అయితే ఈ క్లాసులకు హాజరవుతున్న పిల్లలు నిజంగా ఆసక్తిగా ఉన్నారా? లేక బలవంతంగా అటెండ్ అవుతున్నారా? తెలుసుకునే టెక్నికల్ ప్లాట్‌ఫామ్‌ను సైంటిస్టులు అభివృద్ధి చేశారు. అయితే ఇది ఇంకా మన దగ్గర అందుబాటులోకి రాలేదు. క్లాస్ వర్క్‌కు పిల్లలు ఎలా స్పందిస్తున్నారు, ఆన్లైన్ క్లాసులను వినేందుకు ఎంత మేర ఆసక్తి చూపుతున్నారనే అంశాలను పరిశీలించాలన్న తలంపుతో హాంకాంగ్ టీచర్లు కృత్రిమ మేథస్సును ఆశ్రయించారు. 4 లిటిల్ ట్రీస్‌గా పిలిచే ఈ సాఫ్ట్‌వేర్‌ను హాంకాంగ్‌కే చెందిన స్టార్టప్ కంపెనీ ఫైండ్ సొల్యూషన్ రూపొందించింది. దీని ద్వారా పిల్లల ముఖాల్లోని భావోద్వేగాన్ని కృత్రిమ మేథ గుర్తించి విశ్లేషిస్తుంది. పిల్లలు చదివే సమయంలో వారి ముఖాలపై కండరాల స్థానాలను కెమెరాతో క్యాప్చర్ చేసి అనంతరం భావోద్వేగాల విశ్లేషణ చేపడతుంది. అలాగే ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు స్టూడెంట్ తీసుకునే సమయం, వారి మార్కులు, వారి బలాలు బలహీనతలను ఈ కృత్రిమ మేథస్సు పర్యవేక్షిస్తుంటుంది. కేవలం పిల్లలను అధ్యయనం చేయడమే కాకుండా వారి ప్రదర్శన మెరుగుపడేందుకు అవసర చిట్కాలను అందిస్తుంది. 4 లిటిల్ ట్రీస్‌ను వాడిన తర్వాత పలు మంది పిల్లల ప్రదర్శనలో మంచి మార్పులు కనిపించాయని టీచర్లు చెబతున్నారు. స్వేచ్ఛపై సందేహాలు అలాగని ఈ టెక్నాలజీపై అంతా సంతోషంగా ఉన్నారా? అంటే లేదనే సమాధానం వస్తుంది. సాంకేతికత వాడకం పెరిగితే పిల్లల స్వేచ్ఛకు భంగకరమని పలువురు తల్లిదండ్రులు భయపడుతున్నారు. అలాగే ప్రైవసీ డేటాపై సైతం ఆందోళన చెందుతున్నారు. కానీ తమ సాఫ్ట్వేర్ కేవలం విశ్లేషణకు ముఖ కండరాల కదలికలను అధ్యయనం చేస్తుంది కానీ ఎలాంటి వీడియోలు తీయదని కంపెనీ తెలిపింది. మరోవైపు గాఢమైన నలుపు వర్ణం ఉన్న పిల్లల ముఖ కవళికలను గుర్తించడంలో ఈ సాఫ్ట్వేర్ సమస్యలు ఎదుర్కోవడం జాతి వివక్ష అంశాన్ని తెరమీదకు తెస్తోంది. అయితే సాఫ్ట్వేర్ ఉత్పత్తిలో స్థానిక పిల్లల ముఖకవళికలు వాడుకోవడంతో ఈ సమస్య వచ్చిందని, అప్‌గ్రేడ్ చేసే సమయంలో దీన్ని సరిచేయవచ్చని కంపెనీ భరోసా ఇస్తోంది. సో, మొత్తం మీద పిల్లల ముఖం చూసి మూడ్ కనిపెట్టే ఈ సాఫ్ట్వేర్ త్వరలో అన్నిదేశాలకు అందుబాటులోకి రానుంది. -
బొమ్మతో పెళ్లి: అమ్మాయిల కంటే బెటర్ అంటూ
హాంకాంగ్: గతేడాది నవంబర్‌లో కజకిస్తాన్‌కు చెందిన ఓ బాడీ బిల్డర్ సెక్స్ డాల్‌తో డేటింగ్ చేసి దానినే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ బొమ్మను పెళ్లి చేసుకున్న వీడియో అతడు షేర్ చేయడంతో బాగా వైరల్ అయ్యింది. తాజాగా అతడి బాటలోనే హాంకాంగ్‌కు చెందిన ఓ 36 ఏళ్ల వ్యక్తి నడిచాడు. ఎందుకంటే నిజమైన అమ్మాయి కంటే ఈ బొమ్మతోనే డేటింగ్ నచ్చిందని, అందుకే దానినే పెళ్లి చేసుకున్నానని చెబుతున్నాడు. అతని పేరు జీ తియాన్‌రాంగ్. సెక్స్ డాల్ ఇటీవల పెళ్లి చేసుకుని దానితో కొత్త జీవితం ప్రారంభించాడు. ఈ బొమ్మ పేరు మోచీ. తనే నిజమైన జీవితా బాగస్వామి అంటూ తరచూ మోచీకి గిఫ్టులు ఇస్తూ మురిసిపోతున్నాడు. అందులో యాపిల్ ఐఫోన్ 12 కూడా ఉంది. ఇప్పటి వరకు తన భార్య మోచీకి 20 జతల ఖరీదైన బట్టలు, 10 జతల షూలు కొన్నాడంట. అయితే మోచీకి ఇప్పటి కనీసం ముద్దు కూడా పెట్టలేదంట. (చదవండి: అరుదైన మంచు గుడ్లగూబ ఫొటోలు!) ఎందుకంటే తన సెన్సీటీవ్ స్కీన్ పాడైపోతుందని అందుకే తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు చెబుతున్నాడు. ఈ బొమ్మ తనకు మంచి కంపెని ఇస్తుందని, మోచీతో తను చాలా ఆనందంగా ఉంటున్నట్లు చెబుతున్నాడు జీ. కేవలం తన కంపెని కోసమే మోచీ కొనుక్కున్నానని, అందుకే పెళ్లి చేసుకున్నట్లు అతడు పేర్కొన్నాడు. కాగా పదేళ్ల కిందటే హాంకాంగ్‌లోని ఓ రిటైల్ స్టోర్‌లో ఈ సెక్స్ డాల్‌ను చూసి ప్రేమలో పడ్డాంట.. దాని ఖరీదు 9 లక్షల రూపాయలని చెప్పడంతో కొనలేకపోయాడంట. దీంతో 2019లో అలాంటి బొమ్మనే ఇంటర్నెట్లో చూసి లక్ష రూపాయలకు కొనుక్కున్నాడు. ఆ తర్వాత దానితో డేటింగ్ చేస్తున్న సమయంలో డాల్‌కు మోచీ అని పేరు పెట్టుకున్నాడు. అయితే ఇదివరకు అతడికి చాలామంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉండేవారంట. వారితో డేటింగ్ చేస్తున్న సమయంలో ఎక్కువ సేపు వారంత మొబైళ్లతోనే గడిపేవారని, దాంతో చిరాకొచ్చిన జీ నిజమైన అమ్మాయిల కంటే ఈ సెక్స్ డాల్ చాలా బెటరని తెలిపాడు. ఎందుకంటే తను మోచీతో ఉన్నప్పుడు అది తననే చూస్తూ ఉంటుందట. (చదవండి: పెళ్లిలో భర్త పర్మిషన్తో లవర్ని..) -
ఎయిరిండియా విమానాలపై నిషేధం
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి కాలంలో వందే భారత్ మిషన్ లో భాగంగా విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని స్వదేశాలకు చేరవేస్తున్న ఎయిరిండియా విమాన సర్వీసులకు హాంకాంగ్ లో ఎదురు దెబ్బ తగిలింది. భారతదేశం నుంచి వస్తున్నఎయిరిండియా విమాన ప్రయణీకుల ద్వారా వైరస్ సోకుతోందన్న కారణంగా నగరంలోకి ఎయిరిండియా సర్వీసులను రెండు వారాల పాటు నిషేధించింది. ఈ మేరకు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. ఆగస్టు18 నుండి ఆగస్టు 31 వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని తెలిపింది. ఆగస్టు 14న న్యూఢిల్లీనుంచి వచ్చిన వారిలో 11 మందికి కోవిడ్-19 నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రీ-ఫ్లైట్ పరీక్షలు పేలవంగా ఉన్నాయని ఆరోపించింది. ఒకే విమానంలో11 మందికి వైరస్ నిర్దారణ కావడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్న హాంకాంగ్ ప్రభుత్వ ప్రతినిధి వ్యాఖ్యలను ఉటంకిస్తూ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం హాంకాంగ్‌లో ల్యాండ్ కావాల్సిన ఎయిరిండియా చార్టర్ విమానానికి అనుమతి నిరాకరించింది. ఈ విషయాన్ని ఎయిరిండియా ట్విటర్ ద్వారా ధృవీకరించింది. ట్విటర్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆంక్షల కారణంగా 2020 ఆగస్టు 18 నాటి విమానం వాయిదా పడిందనీ, సంబంధిత విరాలను త్వరలో తెలియచేస్తామని ట్వీట్ చేసింది. కాగా జూలై 25 నుండి, తమ నగరానికి చేరే విమాన ప్రయాణీకులకు ప్రీ-బోర్డింగ్ సర్టిఫికెట్లు తప్పని సరిచేసింది. భారతదేశం, అమెరికా సహా తొమ్మిది అధిక ప్రమాదకర దేశాల నుండి వచ్చే ప్రయాణికులు కరోనా నెగిటివ్ పత్రాలను చూపించాల్సి ఉంటుంది. ప్రయాణానికి 72 గంటలలోపు ఇది తీసుకోవాలి. అలాగే వచ్చినవారు తర్వాత స్వీయ నిర్బంధం కోసం కనీసం రెండు వారాల పాటు హోటల్ బుక్ చేసుకున్న పత్రాలను కూడా సమర్పించాలనే నిబంధనను కూడా హాంకాంగ్ ప్రభుత్వం విధించింది. #FlyAI : #ImportantUpdate Due to restrictions imposed by Hong Kong Authorities, AI 310/315, Delhi - Hong Kong - Delhi of 18th August 2020 stands postponed. Next update in this regard will be intimated soon. Passengers may please contact Air India Customer Care for assistance. — Air India (@airindiain) August 17, 2020 -
చైనాపై మరిన్ని ఆంక్షలు: అమెరికా
వాషింగ్టన్: చైనాపై ఒత్తిడిని మరింత పెంచాలని అమెరికా యోచిస్తోంది. డ్రాగన్ దేశంపై మరిన్ని ఆంక్షలు విధించాలని భావిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి, అమెరికాలో ఆ వైరస్ మృత్యుహేల నేపథ్యంలో ఇప్పటికే చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్తున్న విషయం తెలిసిందే. హాంకాంగ్‌లో కొత్త జాతీయ భద్రత చట్టం, వీఘర్ ముస్లింలపై వేధింపులు, టిబెట్‌లో భద్రతాపరమైన ఆంక్షలు.. మొదలైన వాటి విషయంలో అమెరికా ఆగ్రహంగా ఉంది. ‘ప్రసిడెంట్ ట్రంప్‌ను కాదని నేను ముందే చెప్పలేను. కానీ చైనాపై అమెరికా తీసుకోనున్న చర్చల గురించి మీరు త్వరలోనే వింటారు’ అని వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ కేలీ మెక్ఎనానీ బుధవారం మీడియాతో వ్యాఖ్యానించారు. కొత్త వీసా రూల్స్‌తో కష్టాలే నూతన వీసా నిబంధనల వల్ల అమెరికాలోని భారతీయ విద్యార్థులు ఇబ్బందులను, అనిశ్చితిని ఎదుర్కొంటారని యూఎస్‌లోని భారత దౌత్యాధికారి పేర్కొన్నారు. యూఎస్‌లోని యూనివర్సిటీలు, కాలేజీలు తమ విద్యా సంవత్సర ప్రణాళికలను ఇంకా ప్రకటించని ప్రస్తుత పరిస్థితుల్లో జారీ అయిన ఈ నిబంధనలు భారతీయ విద్యార్థులను మరింత అనిశ్చితిలోకి, మరిన్ని కష్టాల్లోకి తీసుకువెళ్తాయని భారతీయ రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం సంబంధిత అమెరికా అధికారుల దృష్టికి తీసుకువెళ్లిందన్నారు. భారత్, అమెరికా ప్రజల మధ్య సంబంధాల విషయంలో ఉన్నతవిద్యలో భాగస్వామ్యం అత్యంత కీలకమైన అంశమన్నారు. పూర్తిగా ఆన్లైన్ క్లాస్‌లకు మారిన విద్యాసంస్థల్లో చదువుతున్న విదేశీ విద్యార్ధులు స్వదేశాలకు వెళ్లాల్సిందేనని అమెరికా ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిబంధనలతో ఎక్కువగా నష్టపోయేవారిలో భారతీయ విద్యార్థులే అధికం. -
జీ7 సదస్సుకు జపాన్ అధ్యక్షత, కారణం!
టోక్యో: జీ-7 సదస్సుకు జపాన్ అధ్యక్షత వహిస్తుందని ఆ దేశ ప్రధాన మంత్రి షింజోఅబే బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. చైనా నూతన భద్రత చట్టానికి వ్యతిరేకంగా హాంగ్‌కాంగ్‌లో జరుగుతున్న నిరసనల నేపథ్యంలో జీ-7 సదస్సును తమ దేశంలో జరపాలని భావిస్తున్నట్లు షింజో అబే తెలిపారు. హాంక్‌కాంగ్‌కు సంబంధించిన ఒకదేశం, రెండు విధానాలను కాపాడటానికి జీ-7కు చెందిన ఇతర దేశాలతో కలిసి పనిచేస్తామని ఆయన తెలిపారు. చైనా జాతీయ గీతాన్ని ఆ గౌరవపరిస్తే మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ హాంకాంగ్ పార్లమెంట్ బిల్లు పాస్ చేయడంతో నిరసనలు తారస్థాయిని చేరుకున్నాయి. గత ఏడాది నుంచి చైనా అధిపత్యాన్ని నిరసిస్తూ హాంకాంగ్‌లో పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒక దేశం రెండు విధానాల విషయంలో ఇతర దేశాలు జోక్యం చేసుకోవడం వల్లే ఈ అల్లర్లు జరుగుతన్నాయని చైనా వాదిస్తోంది. (చైనా వ్యతిరేక నినాదాలు.. 53 మంది అరెస్టు) -
చైనా కట్టడికి అంతర్జాతీయ కూటమి
వాషింగ్టన్: ప్రపంచ వాణిజ్యం, భద్రత, మానవహక్కులకు చైనాతో పొంచి ఉన్న ప్రమాదాన్ని కట్టడిచేసేందుకు అమెరికా సహా ఎనిమిది దేశాలు అంతర్జాతీయ కూటమిగా ఏర్పడ్డాయి. ఎనిమిది దేశాల్లోని 19 మంది పార్లమెంటు సభ్యులతో కూడిన ఈ కూటమి తమ తమ దేశాలు చైనాకు వ్యతిరేకంగా కఠినమైన సామూహిక నిర్ణయాలు తీసుకునేవైపు ప్రయత్నాలు కొనసాగించనున్నాయి. హాంకాంగ్ స్వయం ప్రతిపత్తిని నియంత్రించే నేషనల్‌సెక్యూరిటీ లెజిస్లేషన్ని అమెరికా మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. అమెరికా, జర్మనీ, బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా, స్వీడన్, నార్వే సహా యూరోపియన్ పార్లమెంటు సభ్యులతో కలిసి కూటమిగా ఏర్పడ్డారు. అమెరికా సెనేటర్ మార్కో రుబియో, డెమొక్రాట్ బాబ్ మెనెండేజ్, జపాన్ మాజీ రక్షణ మంత్రి జెన్ నకటానీ, యూరోపియన్ పార్లమెంటు విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యులు మిరియం లెక్స్మాన్, ప్రముఖ యూకే కన్సర్వేటివ్ చట్టసభ్యులు లైన్ డన్కన్ స్మిత్‌లు కూటమిలో సభ్యులుగా ఉన్నారు. కమ్యూనిస్టు పాలనలో చైనా ప్రపంచానికే పెను సవాల్‌గా మారిందంటూ తరచూ చైనాని విమర్శించే అమెరికన్ సెనేటర్ రుబియో వీడియో సందేశాన్ని ట్వీట్ చేశారు. హాంకాంగ్ విషయం తమ అంతర్గత విషయమని చైనా పదే పదే నొక్కి చెపుతోన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ నిబంధనలూ, సంబంధాలను సరిగ్గా అర్థం చేసుకోవాలనీ, తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకోసం తమ దేశీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దనీ చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ మీడియాతో వ్యాఖ్యానించారు. -
ఆ పద్ధతి ప్రమాదకరం!
లీ పెక్(ఫ్రాన్స్): ఫ్లాయిడ్ హత్యతో ప్రపంచవ్యాప్తంగా పోలీసుల దాష్టీకాలు, అనుమానితులతో వారు వ్యవహరించే తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. ఫ్లాయిడ్ విషాధ ఘటన జరిగిన మూడు రోజులకే ఫ్రాన్స్‌లోని పారిస్‌లోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఒక నిందితుడిని పోలీసులు రోడ్డుపై బోర్లా పడుకోబెట్టి, మెడపై మోకాలు ఆన్చి, చేతులకు సంకెళ్లు వేశారు. అరెస్ట్ చేయాలనుకునే వ్యక్తులను ఎటూ కదలకుండా ఉంచడం కోసం మోకాళ్లతో వారిని అణచిపెట్టడం ప్రపంచవ్యాప్తంగా పోలీసులంతా సాధారణంగా అనుసరించే విధానమే. అయితే, నిరాయుధులను, ఎలాంటి వ్యతిరేకత చూపని వారిని అలా నిర్బంధించడం, లొంగిపోయేందుకు అవకాశం ఇవ్వకుండా, ఊపిరాడకుండా చేసి, వారు చనిపోయేందుకు కారణం కావడంపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ‘పోలీసులు ఇలా వ్యవహరించడం మా వద్ద కూడా జరుగుతుంది’అని ఫ్రాన్స్ ఎంపీ ఫ్రాంకోయిస్ రుఫిన్ వ్యాఖ్యానించారు. హాంకాంగ్‌లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నవారిపై అక్కడి పోలీసులు ఇలాంటి హింసాత్మక విధానాలనే అవలంబిస్తుంటారు. మెడపై ఒత్తిడి చేసి, శ్వాస అందకుండా చేయడమనే విధానం మా వద్ద లేదని ఇజ్రాయెల్ పోలీస్ విభాగ అధికార ప్రతినిధి మికీ రోజెన్ఫీల్డ్ స్పష్టం చేశారు. -
ఆశలు రేపుతున్న ఫేజ్–2 ట్రయల్
హాంకాంగ్: కోవిడ్ ప్రారంభదశలో ఉన్న రోగులకు మూడు రకాల మందులతో చేసే ఫేజ్-2 ప్రయోగం ద్వారా ఏడు రోజుల్లో వ్యాధిలక్షణాలు తగ్గాయనీ, ఇతర కరోనా పేషెంట్లు ఈ స్థితికి రావడానికి పన్నెండు రోజులు పట్టడంతో ఈ ప్రయోగం ఆశాజనకంగా మారింది. యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్‌కు చెందిన ప్రొఫెసర్ క్వాక్–యంగ్ యుయేన్ సారథ్యంలో హాంకాంగ్‌లోని ఆరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 20 మధ్య ఈ ట్రయల్స్ నిర్వహించారు. మొత్తం 127 మందిపై ఈ ప్రయోగం చేశారు. వీరిలో 86 మందికి లోపినావిర్–రిటోనావిర్, రిబా–విరిన్, బేటా–1బి ఇంజెక్షన్లను ఇచ్చారు. మిగిలిన 41 మందికి కేవలం లోపినావిర్–రిటోనావిర్ మాత్రమే ఇస్తారు. ఈ మూడు రకాల మందులు తీసుకున్న వారిలో ఆరోగ్యం త్వరితగతిన బాగా మెరుగైనట్టు తేలింది. లాన్సెట్ పత్రికలో ఈ ప్రయోగ ఫలితాలను ప్రచురించారు. -
అమెరికాలో పులికీ కరోనా!
న్యూయార్క్: ప్రాణాంతక కరోనా వైరస్ ఇప్పుడు జంతువులకూ సోకడం మొదలైంది. పిల్లి జాతి జంతువుల్లోకి కరోనా వైరస్ ప్రవేశించే అవకాశముందని శాస్త్రవేత్తలు నిర్ధారించిన నేపథ్యంలో న్యూయార్క్‌లోని బ్రాంక్జ్ జంతు ప్రదర్శన శాలలో నాదియా అనే నాలుగేళ్ల పులి ఈ వైరస్ బారిన పడింది. గత ఏడాది డిసెంబరులో చైనాలోని వూహాన్లో ముందుగా కనిపించిన కరోనా వైరస్ జంతువుల నుంచి మనుషుల్లోకి ప్రవేశించిందని అంచనా. హాంకాంగ్‌లో ఇప్పటికే రెండు కుక్కలకు ఈ వ్యాధి సోకినట్లు సమాచారం. -
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా
-
కరోనా విశ్వరూపం
బీజింగ్: కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. చైనాలో 31 ప్రావిన్షియల్ రీజియన్లలో ఇది విశ్వరూపం చూపిస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకు 490 మంది మరణించారని, 24 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని చైనా ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. వ్యాధిగ్రస్తుల సంఖ్య అంతకంతకీ పెరిగిపోతూ ఉండడంతో వూహాన్లో జాతీయ స్టేడియం, జిమ్‌లనే తాత్కాలిక ఆసుపత్రులుగా మార్చి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు చైనాలో కరోనా ధాటికి బెంబేలెత్తిపోయి హాంగ్‌కాంగ్ వచ్చేవారి సంఖ్య పెరిగిపోతోంది. దీంతో చైనా నుంచి వచ్చిన వారిని తప్పనిసరిగా రెండు వారాల పాటు నిర్బంధంలో ఉంచుతామని హాంగ్‌కాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ ప్రకటించారు. పుట్టిన పసికందుకి సోకిన వైరస్ చైనాలోని వూహాన్లో అప్పుడే పుట్టిన పసికందుకి కరోనా వైరస్ సోకినట్టు అధికారులు గుర్తించారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే బిడ్డకు ఈ వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు. ప్రసవం కావడానికి ముందు తల్లికి జరిపిన పరీక్షల్లో ఆమెకు కరోనా వైరస్ ఉన్నట్టు తేలింది. దీంతో బిడ్డకు గర్భంలోనే ఆ వైరస్ సోకి ఉంటుందని చెబుతున్నారు. అనుమానితుడు పరారీ: గుజరాత్లో కరోనా వైరస్ లక్షణాలున్న వ్యక్తి ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. జనవరి 19న చైనా నుంచి వచ్చిన 41 ఏళ్ల వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో అతనిని వైద్య పరీక్షల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆస్పత్రికి తరలించారు. అయితే రక్త నమూనాలు ఇవ్వకుండా అతను పరారీ కావడం ఆందోళన రేపుతోంది. కాగా, కరోనా వైరస్ నిర్మూలనకు చైనాతో కలిసికట్టుగా పోరాటం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. కరోనా వైరస్ ప్రభావం గుజరాత్లో వజ్రాల వ్యాపారాన్ని చావు దెబ్బ కొట్టనుంది. వచ్చే రెండు నెలల్లో 8 వేల కోట్ల రూపాయల నష్టం వస్తుందని మార్కెట్ విశ్లేషకుల అంచనా. -
హాంకాంగ్ ఉద్యమం.. చైనా కలవరం
20 ఏళ్ల క్రితం వరకూ బ్రిటిష్ వలస దేశంగా ఉన్న హాంకాంగ్‌ని చైనా మెయిన్‌ల్యాండ్‌లో కలపవటాన్ని వ్యతిరేకిస్తూ హాంకాంగ్ విద్యార్థులు ఈ పోరు ప్రారంభించారు. ఉద్యమాన్ని అణచివేయాలని చైనా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి. అంతర్జాతీయంగా గతవారం హాంకాంగే హాట్ టాపిక్. స్వయం పరిపాలన కోసం అక్కడ జరుగుతున్న ఉద్యమం తీవ్రమవుతోంది. 20 ఏళ్ల క్రితం వరకూ బ్రిటిష్ వలస దేశంగా ఉన్న హాంకాంగ్‌ని చైనా మెయిన్‌ల్యాండ్‌లో కలపటాన్ని వ్యతిరేకిస్తూ హాంకాంగ్ విద్యార్థులు ఈ పోరు ప్రారంభించారు. ఈ ఉద్యమాన్ని అణచివేయాలని చైనా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించినా ఉద్యమం చల్లారకపోగా తిరిగిపుంజుకుంది. ఇది మరింత విస్తృతమై పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు, సాధారణ ప్రజలు వీధుల్లోకొచ్చారు. దేశం ఒక్కటే, వ్యవస్థలు రెండు.. 1997 జూలై 1న బ్రిటన్ హాంకాంగ్‌పై ఆధిపత్యాన్ని చైనాకు అప్పగించింది. హాంకాంగ్ చైనాలో భాగమైనప్పటికీ హాంకాంగ్‌కి పాలనాంశాల్లో, కొన్ని ఇతర విషయాల్లో స్వయంప్రతిపత్తి ఉంటుంది. ఆర్థిక, విదేశాంగ విధానాలు మాత్రం చైనా ప్రభుత్వ అ«ధీనంలోనే ఉంటాయి. చైనా అధ్యక్షుడి పాలనలోనే ఉన్నప్పటికీ.. పరిపాలనలోనూ, ఇతర విధానాల రూపకల్పనలోనూ హాంకాంగ్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. ఈ స్వతంత్రత ప్రధాన భూభాగమైన చైనాకన్నా అధికంగా ఉన్నదనీ, చైనా ప్రజలకన్నా హాంకాంగ్ ప్రజలు ఎక్కువ హక్కులు అనుభవిస్తున్నారనీ చైనా ఆరోపిస్తోంది. అందుకే ఇక్కడి నేరస్తులను చైనా మెయిన్‌ల్యాండ్‌కు అప్పగించేందుకు చట్టసవరణకు చైనా సిద్ధమైంది. హాంకాంగ్ ప్రజలను ఈ చర్య మరింత రెచ్చగొట్టింది. తక్షణమే చట్టసవరణ అంశాన్ని వెనక్కి తీసుకోవాలని ఆందోళనలు మొదలయ్యాయి. పార్లమెంటు ముట్టడి.. జూలైలో ఆందోళనకారులు పార్లమెంటును చుట్టుముట్టడంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. ఎట్టకేలకు చట్టసవరణ బిల్లుని చైనా ప్రభుత్వం విరమించుకుంది. ఇంకా... ఈ ఉద్యమాన్ని దొమ్మీలుగా, అల్లర్లుగా భావించొద్దని, అరెస్టు చేసిన ఉద్యమకారులను విడుదల చేయాలని, పోలీసుల హింసాకాండపై స్వతంత్ర న్యాయవిచారణ జరిపించాలని, సార్వత్రిక ఓటు హక్కు కల్పించాలనే డిమాండ్లు నెరవేరలేదు. -
ఒక రోజు నిద్రపోకపోయినా అంతే!
హాంకాంగ్ : నిద్రలేమి కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని మనందరికీ తెలుసు కానీ ఆ పరిణామాలు మనం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఒక రోజు నిద్ర పోకపోయినా సమస్యలు తీవ్రంగా ఉంటాయని చెబుతున్నారు. నిద్రలేమి కారణంగా మానవ డీఎన్ఏలో మార్పులు చోటుచేసుకుంటాయని హాంకాంగ్‌కు చెందిన ష్యు వేయ్ చాయ్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు. ఆరోగ్యవంతులైన 49మందిపై జరిపిన పరిశోధనలో రాత్రి వేళలో పనులు చేస్తున్న వారిలో శరీరం డీఎన్ఏను మరమ్మత్తు చేయటంలో విఫలమైనట్లు గుర్తించారు. కేవలం ఒక రాత్రి మేలుకోవటం కారణంగా వారి డీఎన్ఏ తీవ్రంగా దెబ్బతిన్నట్లు కనుగొన్నారు. ఒక రోజు నిద్రను కోల్పోవటం కారణంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని చాయ్ వెల్లడించారు. -
డైమండ్ కింగ్ నీరవ్ మోదీ అక్కడే ఉన్నాడా?
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకుని భారీ కుంభకోణంలో ముంచెత్తిన డైమాండ్ కింగ్ నీరవ్ మోదీ విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. తొలుత అతను స్విట్జర్లాండ్‌కు పారిపోయినట్టు వార్తలు రాగ, తర్వాత న్యూయార్క్‌లో ఉన్నట్టు రిపోర్టు పేర్కొన్నాయి. అతను ఎక్కడ ఉన్నది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. కానీ ప్రస్తుతం అతను హాంకాంగ్‌లో ఉన్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ పార్లమెంట్‌కు తెలిపింది. పీఎన్బీ కుంభకోణ కేసులో భాగంగా నీరవ్ మోదీని ప్రొవిజనల్ అరెస్ట్(తాత్కాలిక నిర్భందం) చేయాలని హాంకాంగ్ అథారిటీలను కోరినట్టు ప్రభుత్వం గురువారం పేర్కొంది. ‘హాంకాంగ్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్‌ను, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను నీరవ్ దీపక్ మోదీని అరెస్ట్ చేయాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. 2018 మార్చి 23నే ఈ అభ్యర్థనను సమర్పించాం’ అని మంత్రిత్వ శాఖ సహాయమంత్రి వీకే సింగ్ రాజ్యసభకు తెలిపారు. ఇప్పటికే మంత్రిత్వ శాఖ నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సిల పాస్‌పోర్టులను రద్దు చేసినట్టు కూడా సింగ్ చెప్పారు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేలకోట్ల రూపాయలను ముంచెత్తిన క్రమంలో రెండు నెలల క్రితం నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సిలపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్తో, వీరి పాస్‌పోర్టులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మోసం వెలుగులోకి రాకముందే వీరు దేశం విడిచి పారిపోయారు. అప్పటి నుంచి దర్యాప్తు సంస్థలు వీరిని వెనక్కి రప్పించాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి. -
తడవవు.. ఉతకాల్సిన అవసరం లేదు!
బీజింగ్: మీరు టిప్ టాప్‌గా డ్రెస్సింగ్ చేసుకుని ఏదైనా శుభకార్యానికి వెళ్తున్నపుడు వర్షం కురిసి మీ దుస్తులు తడిస్తే మీకెలా అనిపిస్తుంది. తడిసిన దుస్తుల్లో శుభకార్యానికి ఎందుకు వెళ్లడం... దుస్తులు తడవకుంటే బాగుండేది అని అనుకునే ఉంటారు కదా! మీలాంటి వారి కోసమే వర్షంలోనూ తడవని దుస్తులను శాస్త్రవేత్తలు త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకుగాను నీటిని శోషించుకోని రోబస్ట్ పోరస్ సర్ఫేస్ (లిక్విడ్ రెపలెంట్) పదార్థాన్ని యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ పదార్థంలో తయారు చేసిన దుస్తులు తడవవని, ఉతకాల్సిన అవసరం కూడా ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటితో తయారు చేసిన దుస్తులకు చమురు, దుమ్ము ధూళీ కూడా అంటుకోవని తెలిపారు. వస్త్రాలు, లోహాలు, గాజుల తయారీలో రోబస్ట్ పోరస్ సర్ఫేస్ను ఉపయోగిం చినట్లయితే అవి నీటిని శోషించుకోలేవని వివరించారు. ఈ సాంకేతికతో తయారుచేసిన దుస్తులు వర్షంలోనూ తడవకుండా ఉంటాయని చెప్పారు. -
బ్యాటింగ్ ఎంచుకున్న హాంకాంగ్
నాగ్ పూర్: వరల్డ్ టీ20లో భాగంగా గ్రూప్-బిలో అఫ్ఘానిస్తాన్-హాంకాంగ్‌ల మధ్య క్వాలిఫయింగ్ మ్యాచ్ ఆరంభమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హాంకాంగ్ బ్యాటింగ్ తీసుకుంది. ఇప్పటికే ఒక క్వాలిఫయింగ్ మ్యాచ్ లో విజయం సాధించిన అఫ్ఘానిస్తాన్ మరో గెలుపుపై దృష్టి సారించగా, ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి బోణీ చేయాలని హాంకాంగ్ భావిస్తోంది. ఇరు జట్ల బలబలాలను పరిశీలిస్తే అప్ఘానిస్తాన్ మెరుగ్గా కనబడుతోంది.