బొమ్మతో పెళ్లి: అమ్మాయిల కంటే బెటర్ అంటూ‌ | Hong Kong Man Married Sex Doll After Dating | Sakshi
Sakshi News home page

బొమ్మను పెళ్లి చేసుకున్న హాంకాంగ్‌ యువకుడు

Jan 30 2021 2:17 PM | Updated on Jan 30 2021 3:44 PM

Hong Kong Man Married Sex Doll After Dating - Sakshi

హాంకాంగ్‌: గతేడాది నవంబర్‌లో కజకిస్తాన్‌కు చెందిన ఓ బాడీ బిల్డర్‌ సెక్స్‌ డాల్‌తో డేటింగ్‌ చేసి దానినే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ బొమ్మను పెళ్లి చేసుకున్న వీడియో అతడు షేర్‌ చేయడంతో బాగా వైరల్‌ అయ్యింది. తాజాగా అతడి బాటలోనే హాంకాంగ్‌కు‌ చెందిన ఓ 36 ఏళ్ల వ్యక్తి నడిచాడు. ఎందుకంటే నిజమైన అమ్మాయి కంటే ఈ బొమ్మతోనే డేటింగ్‌ నచ్చిందని, అందుకే దానినే పెళ్లి చేసుకున్నానని చెబుతున్నాడు. అతని పేరు జీ తియాన్‌రాంగ్‌. సెక్స్‌ డాల్‌ ఇటీవల పెళ్లి చేసుకుని దానితో కొత్త జీవితం ప్రారంభించాడు. ఈ బొమ్మ పేరు మోచీ. తనే నిజమైన జీవితా బాగస్వామి అంటూ తరచూ మోచీకి గిఫ్టులు ఇస్తూ మురిసిపోతున్నాడు. అందులో యాపిల్‌ ఐఫోన్‌ 12 కూడా ఉంది. ఇప్పటి వరకు తన భార్య మోచీకి 20 జతల ఖరీదైన బట్టలు, 10 జతల షూలు కొన్నాడంట. అయితే మోచీకి ఇప్పటి కనీసం ముద్దు కూడా పెట్టలేదంట. (చదవండి: అరుదైన మంచు గుడ్లగూబ ఫొటోలు!)

ఎందుకంటే తన సెన్సీటీవ్‌ స్కీన్‌ పాడైపోతుందని అందుకే తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు చెబుతున్నాడు. ఈ బొమ్మ తనకు మంచి కంపెని ఇస్తుందని, మోచీతో తను చాలా ఆనందంగా ఉంటున్నట్లు చెబుతున్నాడు జీ. కేవలం తన కంపెని కోసమే మోచీ కొనుక్కున్నానని, అందుకే పెళ్లి చేసుకున్నట్లు అతడు‌ పేర్కొన్నాడు. కాగా పదేళ్ల కిందటే హాంకాంగ్‌లోని ఓ రిటైల్‌ స్టోర్‌లో ఈ సెక్స్‌ డాల్‌ను చూసి ప్రేమలో పడ్డాంట.. దాని ఖరీదు 9 లక్షల రూపాయలని చెప్పడంతో కొనలేకపోయాడంట. దీంతో 2019లో అలాంటి బొమ్మనే ఇంటర్నెట్‌లో చూసి లక్ష రూపాయలకు కొనుక్కున్నాడు. ఆ తర్వాత దానితో డేటింగ్‌ చేస్తున్న సమయంలో డాల్‌కు మోచీ అని పేరు పెట్టుకున్నాడు. అయితే ఇదివరకు అతడికి చాలామంది గర్ల్‌ఫ్రెండ్స్‌ ఉండేవారంట. వారితో డేటింగ్ చేస్తున్న సమయంలో ఎక్కువ సేపు వారంత మొబైళ్లతోనే గడిపేవారని, దాంతో చిరాకొచ్చిన జీ నిజమైన అమ్మాయిల కంటే ఈ సెక్స్‌ డాల్‌ చాలా బెటరని తెలిపాడు. ఎందుకంటే తను మోచీతో ఉన్నప్పుడు అది తననే చూస్తూ ఉంటుందట. (చదవండి: పెళ్లిలో భర్త పర్మిషన్‌తో లవర్‌ని..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement