హాంకాంగ్: కోవిడ్ ప్రారంభదశలో ఉన్న రోగులకు మూడు రకాల మందులతో చేసే ఫేజ్-2 ప్రయోగం ద్వారా ఏడు రోజుల్లో వ్యాధిలక్షణాలు తగ్గాయనీ, ఇతర కరోనా పేషెంట్లు ఈ స్థితికి రావడానికి పన్నెండు రోజులు పట్టడంతో ఈ ప్రయోగం ఆశాజనకంగా మారింది. యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్‌కు చెందిన ప్రొఫెసర్ క్వాక్–యంగ్ యుయేన్ సారథ్యంలో హాంకాంగ్‌లోని ఆరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 20 మధ్య ఈ ట్రయల్స్ నిర్వహించారు. మొత్తం 127 మందిపై ఈ ప్రయోగం చేశారు. వీరిలో 86 మందికి లోపినావిర్–రిటోనావిర్, రిబా–విరిన్, బేటా–1బి ఇంజెక్షన్‌లను ఇచ్చారు. మిగిలిన 41 మందికి కేవలం లోపినావిర్–రిటోనావిర్ మాత్రమే ఇస్తారు. ఈ మూడు రకాల మందులు తీసుకున్న వారిలో ఆరోగ్యం త్వరితగతిన బాగా మెరుగైనట్టు తేలింది. లాన్‌సెట్ పత్రికలో ఈ ప్రయోగ ఫలితాలను ప్రచురించారు.
Comments
Please login to add a commentAdd a comment