clinical Trails
-
మానవుల నుంచి సేకరించిన బ్యాక్టీరియాతో టీబీ కొత్త వ్యాక్సిన్!
క్షయ వ్యాధి ఒక అంటువ్యాధి. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి అయినా..చర్మం నుంచి మెదడు వరకు శరీరంలో ఏ భాగానికైనా వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలోని దీర్ఘకాలిక రోగాలలో ప్రధానమైనది ఈ క్షయవ్యాధి. ఇది మైకోబాక్టీరియా లేదా మైకో బ్యాక్టీరియం ట్యూబర్ క్యులోసిస్ అనే సూక్ష్మక్రిమి వలన వస్తుంది. క్షయ ఈ వ్యాధి సోకని శరీరావయవాలు క్లోమము, థైరాయిడ్ గ్రంథి, జుట్టు. మిగిలిన అవయవాలన్నింటికి క్షయవ్యాధి కలిగే అవకాశం ఉంది. ఈ వ్యాధి ప్రధానంగా శ్వాసకోశాన్ని దెబ్బ తీస్తుంది. అలాంటి ఈ వ్యాధికి ఇప్పటి వరకు బీసీజీ (బాసిల్లస్ కాల్మెట్ మరియు గురిన్), బోవిన్ టీబీ పాథోజెన్ అటెన్యూయేటెడ్ వేరియంట్ అనే ఏళ్ల నాటి పాత వ్యాక్సిన్లే ఉన్నాయి. ఈ వ్యాక్సిన్ పరిమిత ప్రభావమే ఉంది. అందువల్లే ప్రభావవంతంగా పనిచేసేది, ముఖ్యంగా చిన్నారులు, పెద్దలకు మెరుగైన ఫలితాలనిచ్చే వ్యాక్సిన్‌పై ఎన్నే ఏళ్లుగానో ప్రయోగాలు చేస్తున్నారు. ఆ పరిశోధనల ఫలితమే ఎంటీబీ వ్యాక్సిన్(ఎంటీబీవీఏసీ). ఇది మానవుల నుంచి సేకరించిన బ్యాక్టీరియా నుంచే క్షయ వ్యాధికి వ్యతిరేకంగా పనిచేసేలా వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేశారు. అయితే ఇది ఎంత ప్రభావవంతంగా ఉందనే దానిపై పూర్తిస్థాయిలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ క్లినికల్ ట్రయల్స్‌ని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ Biofabri సహకారంతో 2025లో భారత్‌లో పెద్ద ఎత్తున నిర్వహించనుంది. ఆదివారం ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని(మార్చి 24) పురస్కరించుకుని ఈ విషయాన్ని బయోఫాబ్రి ప్రకటించింది. ఆ ట్రయల్స్ ద్వారా ఎంటీబీవీఏసీ వ్యాక్సిన్ భద్రత, సమర్థతను అంచనా వేస్తారు. ఈ ఎంటీబీ వ్యాక్సిన్ బీజీజీ కంటే ప్రభావవంతమైనది, ఎక్కువకాలం పనిచేసే వ్యాక్సిన్‌గా పేర్కొన్నారు పరిశోధకులు. ఇది పెద్దలు, యుక్త వయసులు వారికి మంచి సమర్థవంతమైన వ్యాక్సిన్‌గా అని చెప్పొచ్చన్నారు. ఈ మేరకు బయోఫ్యాబ్రి సీఈవో ఎస్టేబాన్ రోడ్రిగ్జ్ మాట్లాడు.. ఈ క్షయ వ్యాధి కారణంగా ఏటా 1.6 మిలియన్లకు పైగా ప్రజలు చనిపోతున్నారు. అంంతేగాక ప్రపంచవ్యాప్తంగా క్షయకు సంబంధించిన కేసులు దాదాపు 28% ఉన్నాయని అన్నారు. ఈ కొత్త వ్యాక్సిన్ కొత్త ఆశను రేకెత్తించేలా భారత్‌లోనే పెద్దలు,కౌమర దశలో ఉన్నవారిపై ట్రయల్స్ నిర్వహించడం అనేది గొప్ప మైలురాయి అని అన్నారు. ఇక బయోఫ్యాబ్రి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ..ప్రభావవంతమైన వ్యాక్సిన్ కోసం పడ్డ అన్వేషణ ఇన్నేళ్లకు ఫలించింది. దీనికి తోడు భారతదేశంలో క్లినికల్ ట్రయల్స్‌తో పెద్ద ప్రొత్సాహం అందినట్లయ్యిందన్నారు. ఈ కొత్త టీబీ వ్యాక్సిన్‌ని ఆవిష్కరించడంలో డాక్టర్ ఎస్టేబాన్ రోడ్రిగ్జ్, డాక్టర్ కార్లోస్ మార్టిన్ల భాగస్వామ్యం ఎంతగానో ఉందన్నారు. ఈ ట్రయల్స్‌కి ముందే ఈ వ్యాక్సిన్ అనేక మైలు రాళ్లను సాధించింది. వాటిలో ఫేజ్2 డోస్ ఫైండింగ్ ట్రయల్ ఇటీవలే పూర్తైయ్యింది. ఇక నవజాత శిశువులలో డబుల్ బ్లైండ్, కంట్రోల్డ్ ఫేజ్3 క్లినికల్ ట్రయల్ 2023లో ప్రారంభమైంది. కాగా, ఇప్పటి వరకు సుమారు వెయ్యి మంది చిన్నారులకు వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఇక దక్షిణాఫ్రికా నుంచి ఏడు వేల మంది, మడగాస్కర్ నుంచి 60 మంది, సెనెగల్ నుంచి 60 మంది నవజాత శిశువులకు టీకాలు వేయనున్నారు. ప్రధానంగా శిశువుల్లో ఈ ఎంటీబీ వ్యాక్సిన్ రోగనిరోధక శక్తిని, సామర్థాన్ని అంచనావేయడమే లక్ష్యం. అంతేగాదు హెచ్ఐవీ-నెగిటివ్, హెచ్ఐవీ-పాజిటివ్ పెద్దలు ,కౌమారదశలో ఉన్నవారిపై కూడా ఈ వ్యాక్సిన్ ప్రభావంపై అంచనా వేయనుండటం గమనార్హం. ఈ ట్రయల్స్‌ని 2024 ద్వితీయార్ధంలో సబ్-సహారా ఆఫ్రికాలో ప్రారంబించనున్నారు. (చదవండి: డౌన్ సిండ్రోమ్‌తో డౌన్ అయిపోలే..! ఏకంగా మోడల్‌గా..!) -
Neuralink మనిషి మెదడులో చిప్ ప్రయోగాలు: మేము సైతం అంటున్న ట్వీపుల్
మనిషి మెదడులో చిప్‌ను ప్రవేశపెట్టే కీలక ప్రాజెక్టులో ఎలాన్‌మస్క్‌కు చెందిన న్యూరాలింక్‌కు అమెరికా రెగ్యులేటరీ కీలక అనుమతి లభించింది. ఈ విషయాన్ని న్యూరాలింక్ స్వయంగా ట్విటర్ ద్వారా ప్రకటించింది. దీనిపై ట్విటర్లో అభినందనలువ వెల్లువెత్తుతున్నాయి. ఇదీ చదవండి: మరో సంచలనం: బ్రెయిన్ చిప్, మస్క్‌కు గ్రీన్ సిగ్నల్ తొలి హ్యూమన్ క్లినికల్ స్టడీకి ఎఫ్‌డీఏ మోదం లభించిందని తెలిపేందుకు సంతోషిస్తున్నామని న్యూరాలింక్ ట్వీట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. చాట్‌జీపీటి కంటే మనుషులకు ఎక్కువ అవసర మైందంటూ ట్వీపుల్ వ్యాఖ్యానించారు. ఒక కొడుకుకు తండ్రిగా చాలా సంతోషిస్తున్నాను. అభినందనలు అని ఒకరు, నా కొడుకు ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. ఈ ఏడాదిలో ఉన్న అత్యుత్తమ వార్త అంటూ మరో వినియోగదారుడు న్యూరాలింక్‌ను అభినందించారు. అయితే మానవ మెదడు లోపల చిప్‌లను అమరిక, ప్రయోగాలపై వ్యతిరేక వ్యాఖ్యలున్నప్పటికీ ఈ ట్రయల్స్‌కు నన్ను ఎంచుకోండి అంటూ ఒక యూజర్ మస్క్‌కు విజ్ఞప్తి చేయడం విశేషం. I would like to be the first few people to get it I know all the risks and would sign anything needed 🙏 in 1999 I had a dream of a man that said he used neuralink to be in my dream he also told me about Starship it took 24 years to wait for this they are connected somehow… — Bradley P.R Gannon (@statehood101) May 25, 2023 @neuralink Congratulations on getting the FDA's approval! Hope the first-in-human clinical study goes better than the last time humans were used as test subjects for a first-in-human experiment. — Shing ha (@ReplyGPT) May 26, 2023 ఈ అద్భుత ప్రయోగంలో పాల్గొన్న ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను! అని ఒక యూజర్ ట్వీట్ చేశారు. దాదాపు ఇదే ఆసక్తిని మరొకరు ప్రదర్శించగా హ్యూమన్ క్లినికల్ ట్రయల్ కోసం రిక్రూట్మెంట్ ఇంకా మొదలు పెట్టలేదనీ, దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని త్వరలో ప్రకటిస్తామని న్యూరాలింక్ సమాధాన మిచ్చింది. మరిన్ని ఇంట్రస్టింగ్వార్తలకోసం చదవండి సాక్షి బిజినెస్ -
vaccine: పిల్లలపై ఎయిమ్స్ ట్రయల్స్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపనుందన్న అంచనాల మధ్య ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కీలక నిర్ణయం తీసుకుంది. 12 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సున్న పిల్లలకు టీకాను అందించే ప్రక్రియను వేగవంతం చేసింది. పిల్లలపై కరోనా టీకా కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. ఈమేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతితోపాటు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ ఆమోదం కూడా పొందింది. సోమవారం (జూన్ 7) నుండి స్క్రీనింగ్ ప్రారంభించనుంది. ఢిల్లీలోని ఎయిమ్స్ సహా దేశంలోని నాలుగు ప్రాంతాల్లో ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.12 నుంచి18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలపై ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. రివర్స్ ఆర్డర్లో ఎంపిక చేసిన చిన్నారులను మొదటి టీకా డోస్ ఇవ్వనున్నామని ఢిల్లీ ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. ఆ తరువాత 6-12 ఏళ్ల మధ్య చిన్నారులకు, అనంతరం 2-6 సంవత్సరాల పిల్లలకు పరీక్షలకు నిర్వహించనున్నామని తెలిపారు. అలాగే 2 నుండి 18 సంవత్సరాల పిల్లలకు టీకా పరీక్షలు జూన్ 3 నుంచి బిహార్‌లోని పాట్నా ఎయిమ్స్‌లో ప్రారంభమయ్యాయని ఎయిమ్స్ పాట్నా సూపరింటెండెంట్ , ప్రిన్సిపల్ ట్రయల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ సింగ్తె తెలిపారు. కోవిడ్-19 వ్యాక్సిన్‌పై పరీక్షలు నిర్వహించడం భారతదేశంలో ఇదే తొలిసారి. హైదరాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థ భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన స్వదేశీ వ్యాక్సిన్ కోవాగ్జిన్ టీకా మొదటి డోసును ఇప్పటివరకు 10 మంది పిల్లలు స్వీకరించారు. మరో 28 రోజుల్లో రెండవ మోతాదు పొందనున్నారు. కోవాక్సిన్ ట్రయల్ టీకాను కనీసం 100 మంది పిల్లలకు ఇవ్వాలనేది లక్ష్యం. ఢిల్లీ ,పాట్నా ఎయిమ్స్‌తోపాటు, మెడిట్రినా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నాగ్‌పూర్ కేంద్రాలు ఈ పరీక్షల కోసం షార్ట్ లిస్ట్ చేసిన జాబితాలోఉన్నాయి. చదవండి : వారి కోసం స్టెప్పులేసిన డాక్టర్లు: వీడియో వైరల్ Petrol, diesel price today: కొనసాగుతున్న పెట్రో సెగ -
ఈ ట్రయల్స్ విజయవంతమైతే తక్కువ ఖర్చుతో కరోనా చికిత్స
సాక్షి, న్యూఢిల్లీ: నులిపురుగులను నియంత్రించే నిక్లోసమైడ్ ఔషధాన్ని కరోనా చికిత్స నిమిత్తం లక్సాయ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో సీఎస్ఐఆర్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది. ఆసుపత్రుల్లో చికిత్స పొందు తున్న కరోనా రోగులపై నిక్లోసమైడ్ ఎంతమేర సమర్థంగా పనిచేస్తుంది, భద్రత తదితరాలు అంచనా వేయడానికి పలు అధ్యయనాలు చేపట్టారు. గతంలో పెద్దలు సహా పిల్లలకు కూడా నులిపురుగు (టేప్–వార్మ్) నివారణకు నిక్లోసమైడ్ విస్తృతంగా వినియోగించేవారు. ఈ ఔషధం భద్రతా ప్రమాణాలు ఎప్పటికప్పుడు పరీక్షించినట్లు శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వశాఖ పేర్కొంది. నిక్లోసమైడ్ రెండోదశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే తక్కువ ఖర్చుతో కూడిన చికిత్స అందుబాటులోకి వస్తుందని సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ శేఖర్ సి మాండే తెలిపారు. సీఎస్ఐఆర్ డీజీ సలహాదారు రామ్ విశ్వకర్మ మాట్లాడుతూ... సిన్సిటియా (ఒక కణంలో ప్రవేశించిన వైరస్ సమీపంలోని మరిన్ని సెల్స్‌ను కలుపుకొని సమూహంగా ఏర్పాటై వైరస్ వ్యాప్తి చేసే క్రమం) ఏర్పడటాన్ని నిరోధించే ఔషధాలను గుర్తించే క్రమంలో నిక్లోసమైడ్ సురక్షితమైన ఔషధంగా లండన్‌కు చెందిన కింగ్స్ కళాశాల పరిశోధకుల అధ్యయనంలో తేలిందన్నారు. కరోనా రోగుల్లోని ఊపిరితిత్తుల్లో సిన్సిటియా ఏర్పాటును నిక్లోసమైడ్ నియంత్రిస్తుందన్నారు. ఎండోసైటిక్ పాత్వే (పీహెచ్ డిపెండెంట్) ద్వారా వైరస్ ప్రవేశాన్ని నిరోధించడంతోపాటు సార్స్–కోవ్ 2 ప్రవేశాన్ని కూడా సమర్థంగా నిరోధించగల ఔషధంగా నిక్లోసమైడ్ పనిచేస్తుందని జమ్మూలోని సీఎస్ఐఆర్–ఐఐఐఎం, బెంగళూరులోని ఎన్‌సీబీఎస్‌ల సంయుక్త పరిశోధనలో తేలిందన్నారు. -
కోవిడ్ చికిత్సలో మరో ముందడుగు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 చికిత్సలో ఉపయోగించే యాంటీవైరల్ డ్రగ్ మోల్నుపిరావిర్ విషయంలో భారత్‌లో మరో ముందడుగు పడింది. మూడవ దశ ఔషధ పరీక్షలకై అయిదు కంపెనీలకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ జాబితాలో తాము కూడా ఉన్నట్టు హైదరాబాద్‌కు చెందిన ఆప్టిమస్ ఫార్మా బుధవారం ప్రకటించింది. స్వల్ప, మోస్తరు కోవిడ్–19 లక్షణాలున్న 2,500 మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్టు ఆప్టిమస్ సీఎండీ డి.శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మోల్నుపిరావిర్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్ (ఏపీఐ), ఫార్ములేషన్స్‌ను తాము సొంతంగా అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. ఔషధ పరీక్షల్లో భాగంగా రోగులకు గరిష్టంగా అయిదు రోజుల చికిత్స ఉంటుందని, 29 రోజులపాటు అధ్యయనం కొనసాగుతుందని చెప్పారు. క్లినికల్ ట్రయల్స్ ద్వారా ఔషధ సామర్థ్యం తెలుస్తుందని వివరించారు. అయిదు రోజుల్లోనే..: యూఎస్‌లో జరిగిన ఔషధ పరీక్షల్లో మోల్నుపిరావిర్ తీసుకున్న స్వల్ప, మోస్తరు కోవిడ్–19 లక్షణాలున్న రోగులు అయిదు రోజుల్లోనే కోలుకున్నారని ఆప్టిమస్ ఫార్మా డైరెక్టర్ పి.ప్రశాంత్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘చికిత్సలో భాగంగా 800 ఎంజీ మోతాదులో ఉదయం, రాత్రి 5 రోజులపాటు మోల్నుపిరావిర్ క్యాప్సూల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో రోగి శరీరం నుంచి వైరస్ పూర్తిగా తొలగిపోతుంది. ఔషధాన్ని తీసుకున్న రోజు నుంచే రోగి ద్వారా వేరొకరికి వైరస్ వ్యాపించకపోవడం దీని ప్రత్యేకత. మోల్నుపిరావిర్ ఏపీఐ, ఫార్ములేషన్స్ అభివృద్ధి, క్లినికల్ ట్రయల్స్‌కు భారీగా ఖర్చు ఉంటుంది. ఇతర ఔషధాల మాదిరిగానే మార్కెట్లోకి వచ్చిన నెల తర్వాత ధర తగ్గుతుంది. జూలై ప్రారంభంలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో)కు ఔషధ పరీక్షల ఫలితాల నివేదిక సమర్పించే అవకాశం ఉంది’ అని చెప్పారు. ఆప్టిమస్ ఫార్మా మోల్నుపిరావిర్ ఫేజ్–3 క్లినికల్ ట్రయల్స్‌కై సీడీఎస్‌సీవోకు ఏప్రిల్ 26న దరఖాస్తు చేసుకుంది. -
కరోనా వైరస్: ఆక్స్ఫర్డ్ టీకా బాగా పని చేస్తోంది
లండన్: ఆక్స్ఫర్డ్/ఆస్ట్రాజెనెకా టీకా చాలా బాగా పని చేస్తోందని తాజాగా వెల్లడైన మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. అమెరికా, చిలీ, పెరూ దేశాల్లో దాదాపు 32 వేల మంది వాలంటీర్లపై ఈ పరిశోధన జరిగింది. ఇందులో కోవిడ్–19ను అడ్డుకోవ డంలో ఆక్స్ఫర్డ్/ఆస్ట్రాజెనెకా టీకా 79శాతం పనితీరును చూపిందని నివేదిక సోమవారం పేర్కొంది. వ్యాధి ముదరకుండా చూడటం, ఆస్పత్రిపాలు కాకుండా పని చేయడంలో ఈ వ్యాక్సిన్ 100 శాతం ఫలితాలను సాధించినట్లు తేలింది. ఇదే వ్యాక్సిన్‌ను భారత్‌లో సీరం ఇన్స్టిట్యూట్ ద్వారా తయరుచేయించి ప్రస్తుతం వ్యాక్సినేషన్ చేస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: వ్యాక్సిన్ పంపిణీలో ముందున్న భారత్) -
శుభవార్త: ఈ వ్యాక్సిన్ సక్సెస్ రేటు 94%
న్యూఢిల్లీ, సాక్షి: కొత్త ఏడాదిలో మరో శుభవార్త. కరోనా వైరస్ కట్టడికి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ 94.1 శాతం సత్ఫలితాలను ఇస్తున్నట్లు తాజాగా యూఎస్ ఫార్మా దిగ్గజం మోడర్నా ఇంక్ పేర్కొంది. మూడో దశ క్లినికల్ పరీక్షల ప్రాథమిక డేటా ప్రకారం కోవిడ్-19 సోకి క్లిష్ట పరిస్థతుల్లో ఉన్న రోగులపైనా వ్యాక్సిన్ ప్రభావంవంతంగా పనిచేస్తున్నట్లు తెలియజేసింది. ఈ వివరాలను ఇంగ్లండ్ మెడిసిన్ జర్నల్ తాజాగా ప్రచురించింది. కోవిడ్-19ను నివారించడంలో మోడర్నా వ్యాక్సిన్ 94.1 శాతం విజయవంతమైనట్లు యూఎస్‌లో క్లినికల్ పరీక్షలను నిర్వహిస్తున్న బ్రిగమ్ అండ్ వుమన్స్ ఆసుపత్రికి చెందిన స్పెషలిస్ట్ లిండ్సే బాడెన్ పేర్కొన్నారు. వచ్చెనెలలో మోడర్నా వ్యాక్సిన్ పనితీరుకు సంబంధించి మరింత సవివరమైన విశ్లేషణను అందించగలమని తెలియజేశారు. ప్రస్తుత ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నట్లు చెప్పారు. ప్రధానంగా కరోనా వైరస్ సోకి క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్న వారిలో మరింత సమర్ధవంతంగా వ్యాక్సిన్ పనిచేస్తున్నట్లు వివరించారు. దీంతో కోవిడ్-19 బారినుంచి పలువురిని రక్షించే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. చదవండి: (కోవిడ్-19కు చెక్: మరో వ్యాక్సిన్ రెడీ) 99 ప్రాంతాలలో జర్నల్ నివేదిక ప్రకారం యూఎస్‌లో మోడర్నా ఇంక్ 99 ప్రాంతాలలో వివిధ వర్గాలకు చెందిన 30,420 మందిపై వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలను నిర్వహించింది. వీటిలో భాగంగా బ్రిగమ్ ఆసుపత్రిలో 600 మందిపై ప్రయోగాలు చేపట్టారు. జులై 27- అక్టోబర్ 23 మధ్య వీరికి తొలి డోసేజీను అందించారు. తదుపరి 28 రోజులు దాటాక రెండో ఇంజక్షన్‌ను ఇచ్చారు. క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నవారిలో రెండో డోసేజీ ఇచ్చాక స్వల్పంగా రియాక్షన్స్ కనిపించినట్లు జర్నల్ వెల్లడించింది. మొత్తంగా ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నట్లు తెలియజేసింది. చదవండి: (కొత్త ఏడాదిలో కరోనాకు కోవీషీల్డ్) -
మా వ్యాక్సిన్ సురక్షితం: భారత్ బయోటెక్
ముంబై, సాక్షి: కోవిడ్-19 కట్టడికి దేశీయంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ తొలి దశలో అత్యుత్తమ ఫలితాలు ఇచ్చినట్లు భారత్ బయోటెక్ తాజాగా వెల్లడించింది. కోవాగ్జిన్ పేరుతో హైదరాబాద్ కంపెనీ రూపొందించిన వ్యాక్సిన్‌పై ప్రస్తుతం మూడో దశ క్లినికల్ పరీక్షలు జరుగుతున్నాయి. తొలి దశ క్లినికల్ పరీక్షలలో కోవాగ్జిన్ ఎలాంటి ఇతర సమస్యలకూ తావివ్వలేదని కంపెనీ స్పష్టం చేసింది. వెరసి తొలి, రెండు దశల క్లినికల్ పరీక్షల డేటా ఆధారంగా కంపెనీ మార్కెటింగ్ హక్కుల కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే ఇది మధ్యంతర నివేదిక మాత్రమేనని భారత్ బయోటెక్ పేర్కొంది. వ్యాక్సిన్ భద్రత, ప్రభావం వంటి అంశాలపై మరింత విస్తృతంగా నిర్వహించనున్న మూడో దశ పరీక్షల ద్వారా మాత్రమే తగిన డేటా లభించగలదని వివరించింది. (వారాంతానికల్లా మరో వ్యాక్సిన్ రెడీ!) 22,000 మందితో ప్రస్తుతం భారత్ బయోటెక్ 22,000 మందితో మూడో దశ క్లినికల్ పరీక్షలను నిర్వహిస్తోంది. ఇందుకు వీలుగా ఇప్పటికే 8,000 మందిని ఎంపిక చేసుకున్నట్లు కంపెనీ సీఎండీ కృష్ణ ఎల్లా తెలియజేశారు. కంపెనీ నవంబర్ 17న మూడో దశ పరీక్షలను ప్రారంభించింది. కాగా.. ఆగస్ట్‌లో ఒకేఒక తీవ్ర సమస్య ఎదురైనట్లు భారత్ బయోటెక్ తెలియజేసింది. అయితే ఇది వ్యాక్సిన్ వల్లకాదని తేలినట్లు వివరించింది. 11 ఆసుపత్రులలో 375 మంది వొలంటీర్లపై తొలి దశ ప్రయోగాలు చేపట్టినట్లు తెలియజేసింది. మూడు విభిన్న డోసేజీలను ఇవ్వడం ద్వారా రోగ నిరోధక శక్తి అత్యుత్తమంగా స్పందించినట్లు పేర్కొంది. -
వ్యాక్సిన్: ఊరటినిస్తోన్న మోడర్నా
వాషింగ్టన్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నివారణకు సంబంధించిన వ్యాక్సిన్ ప్రయోగాల్లో వరుస శుభవార్తలు భారీ ఊరటనిస్తున్నాయి. ఇప్పటికే తమ కోవిడ్-19 వ్యాక్సిన్ 90 శాతానికి పైగా ప్రభావ వంతంగా ఉందని అమెరికా దిగ్గజం ఫైజర్ ప్రకటించింది. తాజాగా మరో అమెరికన్ సంస్థ మోడర్నా కీలక అడుగు ముందుకేసింది. తమ కరోనా వ్యాక్సిన్ 94 శాతం కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉందని వెల్లడించింది. కోవ్ అని పిలుస్తున్న మూడవ దశ ట్రయల్స్ ప్రాథమిక దశ డేటా గేమ్ ఛేంజర్‌గా నిలవనుందని వ్యాఖ్యానించింది. 95 మంది కరోనా బాధితులతోపాటు 30వేల మంది పాల్గొన్న వ్యాక్సిన్ ప్రయోగాల ఫలితాల ఆధారంగా మోడర్నా ఈ అంచనాను వెల్లడించింది.తమ మూడవ దశ ప్రాథమిక ఫలితాల్లో తమ టీకా సామర్థ్యం 94.5 శాతంగా అంచనా వేసింది. ఈ క్రమంలో అత్యవసర వినియోగం కోసం రానున్న వారాల్లో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపింది. దీంతో అమెరికా మార్కెట్లో కంపెనీ షేర్లు భారీ లాభాలను నమోదు చేస్తున్నాయి. నేషనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సహకారంతో రెండు మోతాదుల వ్యాక్సిన్‌ను మోడర్నా రూపొందిస్తోంది. కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధిలో ఇది కీలకమైన క్షణమని మోడర్నా సీఈఓ స్టీఫేన్ బాన్సెల్ ఒక ప్రకటనలో తెలిపారు. 3వ దశ ట్రయల్స్‌లో తీవ్రమైన వ్యాధితో సహా, వ్యాధి నివారణకు సంబంధించి తొలి క్లినికల్ ఈ సానుకూల మధ్యంతర ధ్రువీకరణ అని పేర్కొన్నారు. కరోనా టీకా అందుబాటులోకి వచ్చిందనే అంశం అద్భుతమైన అనుభూతి అని చెప్పారు. ప్రతి రోజు ముఖ్యమైనదని తెలుసు.. జనవరి ఆరంభం నుండి, ప్రపంచ వ్యాప్తంగా వీలైనంత ఎక్కువమందిని రక్షించాలనే ఉద్దేశ్యంతో వ్యాక్సిన్ అభివృద్ధికి తీవ్రంగా కృషి చేశామన్నారు. మరోవైపు “నిజంగా ముఖ్యమైన మైలురాయి” అంటూ ఈ పరిణామాన్ని మోడర్నా అధ్యక్షుడు డాక్టర్ స్టీఫెన్ హోగ్ స్వాగతించారు. అలాగే రెండు వేర్వేరు సంస్థలనుంచి ఊరటనిచ్చే సానుకూల ఫలితాలు పొందడం భరోసా కలిగించేదన్నారు. -
వ్యాక్సిన్ అభివృద్ధిలో తొందర పనికిరాదు
సాక్షి, న్యూఢిల్లీ: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా కరోనావైరస్ వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేతపై బయోకాన్ చైర్పర్సన్, ఎండీ కిరణ్ మజుందార్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ తయారీలో తొందర పనికి రాదని, త్వరితంగా అభివృద్ధి చేయడం సాధ్యం కాదని ఆస్ట్రాజెనెకా ప్రయోగాల ఆటంకం ద్వారా తేలిందని పేర్కొన్నారు. సురక్షితమైన వ్యాక్సిన్‌ను వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో మాత్రమే ఆమోదం లభించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. క్లినికల్ పరీక్షల్లో సమస్యల కారణంగా బ్రిటన్, భారతదేశంతో పాటు ఇతర దేశాలలో అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. (ఆస్ట్రాజెనెకా ట్రయల్స్‌కు డీసీజీఐ బ్రేక్) టీకా పరీక్షలను జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఉందని వైద్య, శాస్త్రీయ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్న అంశం ఇదేనని మజుందార్ షా పేర్కొన్నారు. పరీక్షల సందర్భంగా ప్రతి తీవ్రమైన ప్రతికూలతను పరిశోధించాల్సి ఉంటుందనీ, చాలా అప్రమత్తంగా పరీక్షలు నిర్వహించాల్సి ఉందని తెలిపారు. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలన్నారు. కాగా ఆస్ట్రాజెనెకా కరోనావైరస్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను కొన్ని సమస్యల కారణంగా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆస్ట్రాజెనెకా బుధవారం ప్రకటించింది. దీంతో దేశంలో పరీక్షలకు అనుమతి పొందిన సీరం సంస్థ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) తాజా ఆదేశాల మేరకు పరీక్షలను నిలిపివేసింది. ఇది ఇలా ఉంటే కరోనా వైరస్ రోగుల్లో మోడరేట్ నుండి తీవ్రంగా ఏర్పడే సైటోకిన్ రిలీజ్ సిండ్రోమ్, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ చికిత్సకు బయోకాన్ ఐటోలిజుమాబ్ ఇంజెక్షన్‌ను మార్కెట్ చేసుకునేందుకు జులైలో డీసీజీఐ అనుమతిని సాధించిన సంగతి తెలిసిందే. (ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేతపై సీరం స్పందన) -
ఆస్ట్రాజెనెకా ట్రయల్స్‌కు డీసీజీఐ బ్రేక్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న కోవిడ్-19 వ్యాక్సిన్ పై తాజా పరిణామాలు నీళ్లు చల్లాయి.ఇప్పటికే ఈ వ్యాక్సిన్ పరీక్షల్లో సమస్యల కారణంగా కొన్ని దేశాల్లో తుది దశ క్లినికల్ ట్రయల్స్ నిలిచిపోయాయి. దీంతో మన దేశంలో కూడా క్లినికల్ పరీక్షలకు బ్రేక్ పడింది. తాజా పరిణామాల నేపథ్యంలో భద్రతా సమస్యల దృష్ట్యా తదుపరి ఉత్తర్వులకు వరకు పరీక్షలను నిలిపి వేయాల్సిందిగా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా సీరంను ఆదేశించింది. (ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేతపై సీరం స్పందన) ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ ప్రయోగాలకు డ్రగ్ రెగ్యులేటర్ డీసీజీఐ తాత్కాలిక బ్రేక్ వేసింది. తదుపరి ఆదేశాలవరకు నిలిపివేయాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు షోకాజ్ నోటీసులిచ్చింది. ఇతర దేశాలలో ఆస్ట్రాజెనెకా క్లినికల్ ట్రయల్స్ సమస్యలు, నిలిపివేతపై కేంద్ర లైసెన్సింగ్ అథారిటీకి తెలియజేయలేదని వ్యాఖ్యానించింది. ఎందుకు సమాచారం ఇవ్వలేదో వివరణ ఇవ్వాలని కోరింది. దీంతో దేశంలోని 17 సైట్లలో నిర్వహిస్తున్న దశ 2/3 ట్రయల్స్ నిలిచిపోయాయి. తాజా షో-కాజ్ నోటీసుపై స్పందించిన సీరం ఇప్పటివరకు ట్రయల్స్ పాజ్ చేయమని తమకు చెప్పలేదని పేర్కొంది. అయితే డీసీజీఐ జారీ చేసిన ఆదేశాలను అనుసరిస్తామని తెలిపింది. వారి సూచనలు, ప్రామాణిక ప్రోటోకాల్‌కు కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. కాగా తుది దశ పరీక్షలలో భాగంగా బ్రిటన్‌లో ఒక వ్యక్తిపై ప్రయోగం సందర్భంగా సమస్యలు తలెత్తడంతో తాత్కాలికంగా నిలిపి వేసినట్టు బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా నిన్న(బధవారం) వెల్లడించింది. ప్రస్తుతం ఈ అంశంపై దృష్టిసారించామని, డేటాను విశ్లేషించాక తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు వివరించింది. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. -
'వైరస్ మారినా వ్యాక్సిన్ పనిచేస్తుంది'
సాక్షి, హైదరాబాద్: ‘మన దేశంలో కరోనా ముమ్మరమయ్యే నాటికి వైరస్ గురించి మనకు తెలిసిన విషయాలకంటే ఇప్పుడు మరింత సమాచారం తెలిసి వచ్చింది. ఈ కొత్త పరిజ్ఞానంతో వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో, చికిత్స ప్రక్రియల్లో ఎన్నో మార్పులొచ్చాయి’ అంటున్నారు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అధినేత, ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుడు డాక్టర్ నాగేశ్వరరెడ్డి. ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా వచ్చే కోవిడ్–19 వ్యాధి ఏమాత్రం ఆందోళనపడదగినది కాదని చెబుతున్నారాయన. ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇంకా ఏమన్నారంటే.. వైరస్ మారినా వ్యాక్సిన్ పనిచేస్తుంది దేశంలో కరోనా ప్రవేశించిన జనవరి నాటికీ, ఇప్పటికీ వైరస్‌లో చాలా మార్పులొచ్చాయి. దాదాపు 200కుపైగా మ్యుటేషన్స్ జరిగాయి. ఇప్పుడు డీ614జీ అనే మ్యుటేషన్‌తో ‘ఏ2ఏ టైప్’ వైరస్ దేశంలో విస్తరిస్తోంది. దీని వైరల్ ఇన్ఫెక్షన్ తీవ్రత గతంలో కంటే తక్కువనే భావిస్తున్నారు. ఇప్పటివరకు వైరస్‌లో ఎన్ని మార్పులొచ్చినా.. ‘రిసెప్టార్ బైండింగ్ ఏరియా’లో మ్యుటేషన్లేవీ రాలేదు. కాబట్టి ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్న వ్యాక్సిన్లన్నీ ప్రభావవంతంగానే పనిచేస్తాయి. కాబట్టి వ్యాక్సిన్‌పై ఆశలు పెట్టుకోవచ్చు. అయితే, వ్యాక్సిన్ పనిచేసినా, దాని ప్రభావం శరీరంలో ఎంతకాలం ఉంటుందనే దానిపై స్పష్టత లేదు. ఇప్పటికి 3 నెలలు మాత్రం ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు గమనించారు. అయితే, ఏడాది పాటు ఉండొచ్చనీ, వ్యాక్సిన్ ప్రతి ఏడాదీ తీసుకోవాల్సి రావచ్చన్నది ప్రాథమిక అంచనా. డిసెంబర్ లేదా జనవరి నాటికి టీకా.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 25 వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నాయి. వీటిలోనూ ఆరు వ్యాక్సిన్లు మూడో దశ పరీక్షల్లోనూ, 19 వ్యాక్సిన్లు ఒకటీ/రెండో దశల్లో ఉన్నాయి. మన దేశంలో మూడు వ్యాక్సిన్లు ప్రస్తుతం రెండోదశ పరీక్షల్లో ఉన్నాయి. ఇక మోడెర్నా, ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్లు మూడో దశలో విజయవంతంగా తమ ప్రభావాన్ని నిరూపించుకుంటున్నాయి. డిసెంబరు లేదా జనవరి తొలివారం నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చు. ఇక రష్యా వ్యాక్సిన్ విషయానికొస్తే.. సాధారణంగా వ్యాక్సిన్ తయారీ తర్వాత దాన్ని మూడు దశల్లో పరీక్షించాలి. రష్యన్ వ్యాక్సిన్‌ను రెండోదశ పరీక్షల తర్వాత, వెంటనే కమర్షియల్ తయారీకి ఉపక్రమించారు. ఒక వ్యాక్సిన్ రోగులకు ఎంత సురక్షితమో నిర్ణయించేందుకు రెండు దశల పరీక్షలు సరిపోవు. కాబట్టి మళ్లీ వాళ్లు మూడో దశ ప్రయోగాలకు దిగారు. రీ–ఇన్ఫెక్షన్తో ప్రమాదం లేదు హాంగ్‌కాంగ్‌లో రెండోసారి ఇలా రీ–ఇన్ఫెక్షన్ వస్తోందంటున్నారు. తెలంగాణలోనూ ఒకటి రెండు కేసులొచ్చాయి. ఇక్కడ గమనించాల్సింది.. మొదటిసారి కరోనా వైరస్ సోకడం వల్ల కోవిడ్–19 అనే వ్యాధి వస్తుంది. కానీ రెండోసారి వైరస్ సోకినప్పటికీ కోవిడ్‌గానీ లేదా ఇతరత్రా ఎలాంటి వ్యాధీ రాదు. రెండోసారి వైరస్ సోకడం వల్ల కోవిడ్ వస్తుందన్నది అపోహే. వైరస్ వ్యాప్తి: నాడు – నేడు గతంలో నోటి నుంచి వచ్చే తుంపర్లు వస్తువులపై పడటం, వాటిని ముట్టుకున్న చేతులతో ముక్కు, నోరు, కళ్లకు తాకితే వైరస్ సోకుతుందని అనుకునేవాళ్లం. దీన్నే ‘డ్రాప్లెట్ ట్రాన్స్మిషన్’ అంటారు. అయితే, దీనికంటే ‘ఏరోసాల్ ట్రాన్స్మిషన్’ వల్లే వైరస్ వ్యాప్తి ఎక్కువని తాజాగా తేలింది. అంటే తుంపర్ల కంటే మనుషులు మాట్లాడుతున్నప్పుడు నోటి నుంచి వెలువడే గాలికి ఎక్కువగా ఎక్స్పోజ్ కావడం వల్లనే వైరస్ వ్యాప్తి ఎక్కువన్న మాట. గతంలో శానిటైజర్‌తో తరచూ చేతులు కడుక్కోవడానికి ప్రాధాన్యమిచ్చాం. కానీ, ఇప్పుడు మాస్క్ పెట్టుకోవడమే కరోనా కట్టడికి మేలైన మార్గం. మాట్లాడుతున్నప్పుడు నోటి నుంచి వెలువడే గాలి తుంపర్లు సోకకుండా ఉండటానికి భౌతికదూరం తప్పక పాటించాలి. భౌతికదూరం అనేది లాక్డౌన్ అంతటి ప్రభావం చూపుతుంది. మాస్క్ పెట్టుకుని అవతలి వ్యక్తికి కనీసం 6 నుంచి 9 అడుగుల దూరంలో ఉండాలి. ఇప్పుడు ఇన్‌డోర్స్ కంటే ఔట్‌డోర్స్‌లోనే ఏరోసాల్ ట్రాన్స్మిషన్కు అవకాశం తక్కువ. కాబట్టి బయటకు వెళ్తే భౌతికదూరం పాటిస్తూ సురక్షితంగా పనిచేసుకోవచ్చు. ఇక, ఏరోసాల్ ట్రాన్స్మిషన్ వల్లే వైరస్ వ్యాప్తి ఎక్కువంటున్నారు కాబట్టి గాలి ద్వారా వ్యాపిస్తుందా అంటే ‘లేద’నే చెప్పాలి. అంటే ఓ వ్యక్తి సమీపంలో ఉండి మాట్లాడుతుంటేనే ఆ గాలి ద్వారా వ్యాపించే అవకాశమెక్కువ. అంతేకానీ, ఎవరూ లేనిచోట వైరస్ గాలిలో ఉండటం, మనం అక్కడికి వెళ్లినప్పుడు సోకడం జరగదు. ఇక, ఏసీ ఇన్‌డోర్స్ విషయానికొస్తే.. లామినార్ ఫ్లో ఉండే ఎయిర్ కండిషనింగ్ సౌకర్యం ఉన్నచోట వైరస్ వ్యాప్తి జరగదు. ఈ ఏసీలో తాజా గాలి పై నుంచి వస్తూ, కలుషిత గాలులు కిందికి వెళ్తుంటాయి. అందుకే ఇప్పుడు హాస్పిటల్స్ యాజమాన్యాలు లామినార్ ఫ్లో ఏసీ సౌకర్యాలను కల్పించుకుంటున్నాయి. శరీరంలో వైరస్ ప్రభావం..పరీక్షలు గతంలో వైరస్ గొంతు ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరుతుందని అనుకునేవాళ్లం. ఇప్పుడది నోరు, ముక్కు ద్వారా ప్రవేశించాక నేరుగా రక్తప్రవాహంలోకి వెళ్లి.. అక్కడ రక్తనాళాల గోడలకు అంటుకుని వాటిని దెబ్బతీస్తుంది. వైరస్ ప్రవేశించిన మొదటి వారం అది రక్తంలోకి ప్రవేశించడాన్ని ‘వైరీమియా’ అంటారు. ఈ దశలోనే రెమ్డిస్విర్, ఫావీపిరావిర్ (ఫాబి ఫ్లూ) వంటి యాంటీవైరల్ మందులివ్వాలి. ఇక రెండోవారం అది ఊపిరితిత్తులపై దాడిచేస్తుంది. ఆ సమయంలో దేహంలో సైటోకైన్స్ విరివిగా తయారై.. వైరస్‌ను ఎదుర్కొనే క్రమంలో ఇవి మన దేహభాగాలనే దెబ్బతీస్తాయి. ఈ ప్రమాదాన్ని నివారించడానికి రెండో వారంలో డెక్సామిథోజోన్ వంటి స్టెరాయిడ్స్ ఇవ్వాలి. గతంలో దీనికి భిన్నంగా రివర్స్‌లో ఇచ్చేవారు. ఇప్పుడు కొత్త ప్రొటోకాల్ ప్రకారం తగిన మందులిస్తూ మరణాలను చాలా వరకు తగ్గించగలిగాం. ఇక, ‘ఐఎన్6’, ఫెరిటిన్, ఎల్డీహెచ్, సీఆర్పీ, డీడైమర్ అనే పరీక్షల ద్వారా సైటోకైన్ కణాల విజృంభణ, సైటోకైన్ స్టార్మ్ తీవ్రతను అంచనా వేయవచ్చు. డీడైమర్ అనే పరీక్ష ద్వారా రక్తంలో గడ్డలు (బ్లడ్‌క్లాటింగ్) ఎక్కువగా ఉందా అనేది తెలుస్తుంది. గతంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలకు ముక్కు నుంచి శాంపుల్స్ (నేసల్ శ్వాబ్) తీసుకునేవారు. ఇప్పుడు ఉమ్ము టెస్ట్ చేసినా తెలిసిపోతుంది. కరోనా.. కొత్త చికిత్సలు కరోనా చికిత్సలో వెంటిలేటర్ కంటే ‘హై ఫ్లో నేజల్ ఆక్సిజన్’ చికిత్స మంచి ఫలితాలనిస్తోంది. ముక్కు ద్వారా చాలా ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ పంపడమనే ఈ చికిత్సలో సత్ఫలితాలు రాబడుతున్నాం. ఇక, ప్లాస్మా థెరపీ విషయానికొస్తే.. కన్వలసెంట్ ప్లాస్మాథెరపీలో న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ ఎక్కువుంటేనే ఈ చికిత్స ప్రభావం చూపుతుందని తేలింది. ఈ చికిత్సను సైతం వ్యాధి సోకిన తొలివారంలో అందించాలి. తాజాగా ‘మోనోక్లోనల్ యాంటీబాడీస్’ చికిత్స అందుబాటులోకి వచ్చింది. మనకు రోగనిరోధకతనిచ్చే యాంటీబాడీన్ మన దేహంలో ‘బీ సెల్స్’ అనే కణాల్లో తయారవుతాయి. వీటిని తీసుకుని, వాటి నుంచి పెద్దసంఖ్యలో యాంటీబాడీస్ తయారుచేసి, ఎక్కించడమే ఈ చికిత్స విధానం. ఇది కూడా మంచి ప్రభావమే చూపుతోందని తేలింది. యాంటీబాడీస్ పెరిగితే వ్యాక్సిన్‌తో పనిలేదు.. మనం చేస్తున్న పరీక్షల్లో 10 శాతం మందికే పాజిటివ్ వస్తోంది. మరణాలు ఒక శాతం కంటే కూడా తక్కువే. అయితే స్థూలకాయం ఉన్నవారికి ప్రమాదకరమే. కాబట్టి ఫిట్నెస్ కాపాడుకోవాలి. పరీక్షల సందర్భంలో మన సమాజంలో 25% మందిలో యాంటీబాడీస్ ఉన్నట్టు తేలింది. కొద్దిరోజుల్లో ఇది 60శాతానికి చేరితే, అప్పుడిక వ్యాక్సిన్ అవసరం కూడా ఉండకపోవచ్చు. అప్పటివరకు అందరూ మంచి పోషకాలతో ప్రోటీన్లు ఎక్కువుండే ఆహారం తీసుకోవాలి. రోజూ విటమిన్–సీ 500 మి.గ్రా.; విటమిన్ బీతో పాటు 60 మి.గ్రా. జింక్ ఉండే మాత్రలు తీసుకోవాలి. ఒకసారి 60,000 యూనిట్లు అందేలా వారానికోసారి విటమిన్–డీ టాబ్లెట్స్ తీసుకుంటూ రోజూ ఉదయం, సాయంత్రం ఆవిరి పడుతుండాలి. పల్స్ ఆక్సిమీటర్‌తో చెక్ చేసుకుంటూ, దాని విలువ 95కంటే తక్కువుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. చివరిగా అందరికీ చెప్పేదొక్కటే.. ‘ఆందోళన పడకండి.. అప్రమత్తంగా ఉండండి’. రీ–ఇన్ఫెక్షన్తో ప్రమాదం లేదు హాంకాంగ్‌లో రెండోసారి రీ–ఇన్ఫెక్షన్ వస్తోందంటున్నారు. తెలంగాణలోనూ ఒకటి రెండు కేసులువచ్చాయి. ఇక్కడ గమనించాల్సింది.. మొదటిసారి కరోనా వైరస్ సోకడం వల్ల కోవిడ్–19 అనే వ్యాధి వస్తుంది. కానీ రెండోసారి వైరస్ సోకినప్పటికీ కోవిడ్‌గానీ లేదా ఇతరత్రా ఎలాంటి వ్యాధీ రాదు. రెండోసారి వైరస్ సోకడం వల్ల కోవిడ్ వస్తుందన్నది అపోహే. -
వ్యాక్సిన్ బాటలో భారత్ బయో- బయెలాజికల్-ఇ
న్యూఢిల్లీ: ఐసీఎంఆర్‌తో కలసి భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ తొలి దశ ప్రాథమిక పరీక్షలలో సత్ఫలితాలు వచ్చినట్లు ఎయిమ్స్ ఢిల్లీ ప్రిన్సిపల్ సంజయ్ రాయ్ వెల్లడించారు. కోవాగ్జిన్ పేరుతో రూపొందిస్తున్న వ్యాక్సిన్ తొలి దశ క్లినికల్ పరీక్షలలో 12 ప్రాంతాలలో 375 మందిపై పరిశీలించినట్లు రోహ్తక్లోని పీజీఐలో పరీక్షలు నిర్వహిస్తున్న సవితా వర్మ పేర్కొన్నారు. తొలి దశలో ఎలాంటి సమస్యలూ ఎదురుకాలేదని తెలియజేశారు. దీంతో రెండోసారి వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా రోగనిరోధక శక్తి ఎలా ప్రభావితమవుతున్నదీ గమనించనున్నట్లు వెల్లడించారు. ఇందుకు వీలుగా ప్రస్తుతం రెండో డోసేజీ ఇవ్వడం ద్వారా రక్త నమూనాలను సేకరిస్తున్నట్లు సంజయ్ రాయ్ వెల్లడించారు. ఈ పరీక్షలు కూడా విజయవంతమైతే.. తదుపరి రెండో దశ క్లినికల్ పరీక్షలకు అనుమతించవలసిందిగా డీసీజీఏను అభ్యర్థించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెలాఖరుకల్లా తొలి దశ పరీక్షలు పూర్తికానున్నట్లు భావిస్తున్నారు. బయొలాజికల్-ఇ హైదరాబాద్: యూఎస్ దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్‌తో కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు హైదరాబాద్ కంపెనీ బయొలాజికల్-ఇ వెల్లడించింది. తద్వారా భారీ స్థాయిలో వ్యాక్సిన్ ఉత్పత్తిని చేపట్టనున్నట్లు తెలియజేసింది. ఇదేవిధంగా బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌తో లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు కంపెనీ ఎండీ దాట్ల మహిమ పేర్కొన్నారు. తద్వారా చౌక ధరల్లో కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అందించే ప్రణాళికల్లో ఉన్నట్లు వివరించారు. -
కరోనా; అద్భుతమైన వ్యాక్సిన్ తయారు
జెరూసలెం: కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి తమ వద్ద అద్భుతమైన వ్యాక్సిన్ తయారుగా ఉందని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఈ వాక్సిన్ని మానవ ప్రయోగం చేయాల్సి ఉందని, దీన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి బెన్నీ గాంట్జ్ కోవిడ్ వ్యాక్సిన్ తయారీ ప్రయత్నాలను పరిశీలించేందుకు ఇజ్రాయెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయలాజికల్ రీసెర్చ్(ఐఐబీఆర్)ని సందర్శించారు. కరోనా వైరస్‌ని ఎదుర్కోవడానికి యాంటీ బాడీస్‌ని ఉత్పత్తి చేసే వ్యాక్సిన్ తయారీ ముందంజలో ఉందని, ఐఐబీఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ షపీరా వివరించారు. ఈ వ్యాక్సిన్ ఎప్పటికి వస్తుందో ఐఐబీర్ ప్రకటించలేదు. భారీ స్థాయిలో ఈ వ్యాక్సిన్‌ని తయారుచేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఐఐబీఆర్ రక్షణ శాఖతో కలిసి ఈ ప్రయోగాలను నిర్వహిస్తోంది. ఈ ప్రయోగ కార్యక్రమాన్ని ప్రధాని కార్యాలయం పర్యవేక్షిస్తోంది. (చైనాను వణికిస్తున్న మరో మాయదారి వైరస్) -
18 లక్షల పైమాటే
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి ఉధృతి పెరుగుతూనే ఉంది. వరుసగా ఐదో రోజు 50 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసుల సంఖ్య చూస్తుండగానే 18 లక్షలు దాటేసింది. కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 11.86 లక్షలకు చేరింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 52,972 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఒక్కరోజులో 771 మంది బాధితులు కన్నుమూశారు. దేశంలో ఇప్పటిదాకా మొత్తం కేసులు 18,03,695కు, మరణాలు 38,135కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం తెలియజేసింది. ప్రస్తుతం 5,79,357 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. 11,86,203 మంది చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. కరోనా రికవరీ రేటు 65.77 శాతం, మరణాల రేటు 2.11 శాతంగా నమోదైంది. ఇలా ఉండగా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌పై రెండు, మూడో దశల హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్వహించేందుకు డీసీజీఐ అనుమతించింది. యడ్యూరప్ప కుమార్తెకు కరోనా: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప కుమార్తెల్లో ఒకరు కరోనా వైరస్ బారినపడ్డారు. యడ్యూరప్పకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ముందు జాగ్రత్త చర్యగా వారంపాటు హోం క్వారంటైన్లో ఉంటానని యడ్యూరప్ప తనయుడు విజయేంద్ర ట్వీట్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తనయుడు, ఎంపీ కార్తీ చిదంబరానికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. కేంద్ర ఐటీ శాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ హోం క్వారంటైన్లో ఉంటున్నట్లు ప్రకటించారు. -
దేశంలో వ్యాక్సిన్ పరీక్షల జోరు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో అతలాకుతలమవుతున్న భారత్ స్వదేశీ వ్యాక్సిన్ ప్రయోగాలను వేగవంతం చేసింది. భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా సంస్థలకు చెందిన వ్యాక్సిన్లను దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో మనుషులపై ప్రయోగించి చూస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను ఢిల్లీలో ఎయిమ్స్ ఆస్పత్రిలో 30 ఏళ్ల వ్యక్తికి తొలి డోసు ఇచ్చారు. ఈ రెండు కంపెనీలకు చెందిన వ్యాక్సిన్లు మొదటి, రెండో దశ ప్రయోగాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక బ్రిటన్‌కు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన వ్యాక్సిన్‌ను పుణేకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ రెండు/మూడో దశ ప్రయోగాల అనుమతుల కోసం వేచిచూస్తోంది. స్వల్పంగా సైడ్ ఎఫెక్ట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) భాగస్వామ్యంతో భారత్ బయోటెక్ తయారు చేసిన వ్యాక్సిన్‌ను మొత్తం 12 ఆస్పత్రుల్లో 500 మంది వాలంటీర్లపై ప్రయోగించి చూశారు. 18–55 మధ్య వయసున్న వీరికి వ్యాక్సిన్ డోసు ఇచ్చాక స్వల్పంగా సైడ్ ఎఫెక్ట్లు వచ్చినట్టుగా ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. కొద్దిగా జ్వరం తప్ప ఇతరత్రా అనారోగ్య సమస్యలేవీ రాలేదని ఢిల్లీలో ఎయిమ్స్ డైరెక్టర్ వెల్లడించారు. జూలై 29 నుంచి రెండో దశ ప్రయోగాలు మొదటి దశలో చేసిన ప్రయోగాలు విజయవంతంగా ముగిస్తే ఈ నెల 29 నుంచి రెండో దశ వ్యాక్సిన్ ప్రయోగాలు చేపడతారు. మొదటి దశలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేవని నిర్ధారించుకోవడం, యాంటీ బాడీలు ఏ స్థాయిలో ఉత్పన్నమయ్యాయో తెలుసుకోవడానికి వాలంటీర్లకు మరికొన్ని టెస్టులు చేయాల్సి ఉందని ఎయిమ్స్ పట్నా డైరెక్టర్ సింగ్ చెప్పారు. కొవాగ్జిన్ ట్రయల్స్ హైదరాబాద్, పట్నా, కాంచీపురం, రోహ్తక్, ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. నాగపూర్, భువనేశ్వర్, బెల్గామ్, గోరక్‌పూర్, కాన్పూర్, గోవా, విశాఖపట్నంలలో ప్రయోగించాల్సి ఉంది. రెండో దశ ప్రయోగాలు పట్నా, రోహ్తక్లలో 26 నుంచి ప్రారంభం కానున్నాయి. జైడస్‌కి చెందిన జైకోవిడ్ టీకాని అహ్మదాబాద్‌లో ప్రయోగించి చూస్తున్నారు. -
అక్టోబర్–నవంబర్‌లో టీకా
భువనేశ్వర్: కరోనా మహమ్మారిని నియంత్రించే వ్యాక్సిన్ ఈ ఏడాది అక్టోబర్ – నవంబర్‌కల్లా సిద్ధం కావచ్చని ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనావాలా బుధవారం తెలిపారు. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ, ఫార్మా కంపెనీ అస్ట్రాజెనెకాలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న టీకాను పెద్ద మొత్తంలో తయారు చేసేందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఒక ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. కరోనా టీకా మూడవ దశ మానవ ప్రయోగాలు ఆగస్టులో మొదలవుతాయని, అన్నీ సవ్యంగా సాగితే ఆ తరువాత రెండు మూడు నెలల్లో టీకా అందరికీ అందుబాటులోకి వస్తుందని ఆదార్ బుధవారం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలిపారు. భారత్ బయోటెక్ సిద్ధం చేస్తున్న కరోనా వ్యాక్సీన్ మానవ ప్రయోగాలకు సంబంధించి ఒడిశా రాజధాని భవనేశ్వర్‌లో ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో ఈ ప్రయోగాలు జరగనున్నాయి. ప్రస్తుతం టీకా ప్రయోగాల కోసం కార్యకర్తలను ఎంపిక చేస్తున్నామని ఈ ప్రయోగాలకు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ ఇ.వెంకట్ రావు తెలిపారు. -
కోవ్యాక్సిన్ : మానవ పరీక్షలు షురూ
పట్నా : కరోనా వైరస్ కట్టడికి స్వదేశీ వ్యాక్సిన్‌ను సత్వరం అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. ఐసీఎంఆర్‌తో కలిసి హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవ్యాక్సిన్ మానవులపై పరీక్షలు పట్నాలోని ఎయిమ్స్‌లో ప్రారంభమయ్యాయి. ఎయిమ్స్- పట్నాలో ఆస్పత్రి అధికారులు ఎంపిక చేసిన పది మంది వాలంటీర్లపై వ్యాక్సిన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. వీరికి వాక్సిన్ తొలి డోసు ఇచ్చిన అనంతరం 14 రోజుల విరామం తర్వాత వీరిపై రెండవ డోస్‌ను పరీక్షిస్తారు. నిర్ణీత వ్యవధి పూర్తయిన అనంతరం వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా ఏమైనా సైడ్ఎఫెక్ట్స్ కనిపించాయా అనేది పరిశీలిస్తారు. కోవ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలకు ఐసీఎంఆర్ ఎంపిక చేసిన 12 కేంద్రాల్లో ఈ ఆస్పత్రి ఒకటి. కాగా, 22 నుంచి 50 సంవత్సరాల లోపున్న ఆరోగ్యవంతులపై వ్యాక్సిన్ పరీక్ష చేపడతామని ఎయిమ్స్-పట్నా సూపరింటెండెంట్ డాక్టర్ సీఎం సింగ్ పరీక్షలకు ముందు వెల్లడించారు. మరోవైపు సార్స్-కోవ్-2 వైరస్‌పై తమ ప్రయోగ్మాతక వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని ఆశిస్తున్నామని భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా అంతకుముందు ఓ జాతీయ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ పేర్కొన్నారు. కాగా తమ వ్యాక్సిన్‌పై తొలి రెండు దశల మానవ పరీక్షలకు భారత్ బయోటెక్‌కు భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) ఆమోదం లభించింది. చదవండి : కరోనా: ఆ దశకు భారత్ ఇంకా చేరుకోలేదు -
కరోనా అంతానికిది ఆరంభం
న్యూఢిల్లీ: భారత్‌లో తయారవనున్న రెండు కరోనా టీకాలు ‘కొవాక్సిన్’, ‘జైకొవ్– డీ’లకు హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతించడంతో కరోనా అంతం ప్రారంభమైనట్లయిందని కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా కరోనా టీకాలు ప్రయోగదశలో ఉన్నాయని, అందులో 11 మాత్రమే హ్యూమన్ ట్రయల్స్ దశకు చేరుకున్నాయని పేర్కొంది. భారత్‌లో కరోనా టీకాను రూపొందించేందుకు ఆరు సంస్థలు కృషి చేస్తున్నాయని తెలిపింది. వాటిలో కొవాక్సిన్, జైకొవ్–డీలకు మాత్రం హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌కు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీఓ) అనుమతించిందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ వెల్లడించింది. ప్రముఖ ఆస్ట్రాజెనెకా(బ్రిటన్), మోడెర్నా(అమెరికా) ఫార్మా కంపెనీలతోనూ భారత కంపెనీలు ఉత్పత్తి ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, అయితే, అవి రూపొందించిన టీకాలు సురక్షితం, సమర్ధవంతమని రుజువు కావాల్సి ఉందని వివరించింది. కరోనా వైరస్‌కు టీకా ఆగస్ట్ 15 నాటికి సిద్ధమవుతుందని ఐసీఎంఆర్ చేసిన ప్రకటనపై వివాదం తలెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం విశేషం. రానున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రకటన చేశారని విపక్షాలు ఆరోపించాయి. ఆగస్ట్ 15 నాటికి వ్యాక్సిన్‌ను సిద్ధం చేయడం సాధ్యం కాదని నిపుణులు వాదిస్తున్నారు. ఐసీఎంఆర్ సహకారంతో హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ ‘కొవాక్సిన్’ను రూపొందించే పనిలో ఉంది. అలాగే, ‘జైకొవ్–డీ’ని రూపొందించేందుకు జైడస్ క్యాడిలా కృషి చేస్తోంది. ప్రస్తుతం ఈ రెండింటికి ఫేజ్ 1, ఫేజ్ 2 ప్రయోగాలకు అనుమతి లభించింది. కొవాక్సిన్ ఫేజ్ 1 ట్రయల్స్ ముగిసేందుకే కనీసం 28 రోజులు పడుతుంది. ఆ తరువాత ఫేజ్ 2, ఫేజ్ 3 ట్రయల్స్ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 15 నాటికి వ్యాక్సిన్ ఎలా సిద్ధమవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
ప్రజారోగ్యానికే ప్రాధాన్యం
న్యూఢిల్లీ: కరోనాని కట్టడి చేయడానికి వ్యాక్సిన్ రూపకల్పనలో భారత్ పురోగతి సాధించడంతో ప్రపంచ దేశాల దృష్టి భారత్‌పై పడింది. ఈ వ్యాక్సిన్‌ను ఆగస్టు 15నాటికి అందుబాటులోకి తెస్తామన్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) చేసిన ప్రకటనపై సందేహాలు వెల్లువెత్తాయి. హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ని ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో నిర్వహించాలని ఆగస్టు 15 వరకు గడువు ఇస్తూ ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ్ రాసిన లేఖ బయటకి వచ్చి వివాదాస్పదమైంది. అంత త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ఆచరణ సాధ్యం కాదని చాలా మంది వైరాలజిస్టులు తేల్చేయడంతో ఐసీఎంఆర్ వివరణనిచ్చింది. అంతర్జాతీయ నిబంధనలకు లోబడే ఫాస్ట్ ట్రాక్ ప్రయోగాలు చేస్తున్నామని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అధికారికంగా అనుమతుల మంజూరులో జాప్యాన్ని నివారించడానికే ఫాస్ట్ ట్రాక్ పద్ధతి అవలంబిస్తున్నామని స్పష్టం చేసింది. ప్రజారోగ్య ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకునే ప్రక్రియని వేగవంతం చేశామని తెలిపింది. ఈ ఏడాది వ్యాక్సిన్ రాదు: సీసీఎంబీ కోవిడ్ వ్యాక్సిన్ ఈ ఏడాది వచ్చే అవకాశాల్లేవని సీఎస్ఐఆర్–సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మొలెక్యులర్ బయోలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ రాకేశ్ కె మిశ్రా చెప్పారు. వ్యాక్సిన్ అభివృద్ధిలో జరిగే ప్రక్రియలో పెద్ద సంఖ్యలో క్లినికల్ ట్రయల్స్ జరగాల్సి ఉంటుందని వచ్చే ఏడాది లోపు అది పూర్తి చెయ్యడం సాధ్యం కాదని అన్నారు. వ్యాక్సిన్ ప్రయోగాలను పక్కా ప్రణాళికతో ముందుకు తీసుకువెళ్లినప్పటికీ ఆరు నుంచి ఎనిమిది నెలలు పడుతుందని అన్నారు. ఎందుకంటే వ్యాక్సిన్‌ను అత్యంత ఎక్కువ మందిపై ప్రయోగాలు చేయాల్సి ఉంటుందని అన్నారు. వ్యాక్సిన్ అంటే అదేదో మందు కాదని, అది వేశాక తగ్గిపోతుందో లేదో చూడడానికని మిశ్రా అన్నారు. మానవ ప్రయోగాలకి 12–18 నెలలు మొత్తం మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయి. మొదటి దశలో వ్యాక్సిన్ మనుషులకి సురక్షితమా కాదా అని తెలుసుకోవడానికి చాలా తక్కువ మందిపై ప్రయోగించి చూస్తారు. రెండో దశలో అన్ని వయసుల వారికి వ్యాక్సిన్ ఎలా పని చేస్తుందో చూస్తారు. ఇక మూడో దశలో కొన్ని నెలల పాటు ఈ వ్యాక్సిన్ సమర్థతను పరీక్షించి చూస్తారు. ఈ దశలో వేలాది మంది పాల్గొనాల్సి ఉంటుంది. అన్ని రకాలుగా వ్యాక్సిన్ పనిచేస్తోందని నిర్ధారణయ్యాకే ప్రజలకి టీకాని అందుబాటులోకి తెస్తారు. ఒక వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటు రావాలంటే కనీసం 12–18 నెలల కాలం పడుతుందని కోల్‌కతాకు చెందిన వైరాలజిస్టు ఉపాసన రే అన్నారు. -
మూడవ దశలో క్లినికల్ ట్రయిల్స్: గ్లెన్‌మార్క్
సాక్షి, ముంబై: కరోనా వైరస్ నిరోధానికి ఔషధ తయారీలో దేశీయ ఫార్మా సంస్థ గ్లెన్‌మార్క్ ఫార్మా మరో అడుగు ముందుకేసింది. ముంబైకి చెందిన గ్లెన్‌మార్క్ ఫార్మా స్యూటికల్స్ కరోనా వైరస్ సోకిన రోగులపై ఇప్పటికే మూడు దశల ట్రయల్స్ ను నిర్వహించింది. తాజాగా యాంటీవైరల్ ఫావిపిరావిర్, ఉమిఫెనోవిర్ మందులపై మూడవ దశలో కీలకమైన మరో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతి పొందింది. భారతదేశంలో కోవిడ్-19 రోగులలో ఈ రెండు యాంటీవైరల్ మందుల కలయికలో 'ఫెయిత్ ట్రయల్' గా పిలిచే ట్రయిల్స్ కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ నుండి అనుమతి లభించిందని గ్లెన్‌మార్క్ తాజాగా ప్రకటించింది. (కరోనా వైరస్ : గ్లెన్‌మార్క్ ఔషధం!) ఫావిపిరవిర్, ఉమిఫెనోవిర్ యాంటీవైరల్ డ్రగ్స్ రెండూ వేర్వేరు చర్యలను కలిగి ఉంటాయి. వాటి కలయికతో వ్యాధి ప్రారంభ దశలో రోగులలో అధిక వైరల్ లోడ్లను సమర్థవంతంగా పరిష్కరించవచ్చని, తద్వారా మెరుగైన చికిత్స సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావచ్చని కంపెనీ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. అత్యంత ప్రభావవంతమైన, సురక్షితమైన చికిత్సలను గుర్తించడంలో ఈ అధ్యయనం కీలకమైందిగా భావిస్తున్నామని గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మోనికా టాండన్ వ్యాఖ్యానించారు. (కోవిడ్-19 : పరిశీలనలో అతి చవకైన మందు) ఈ అధ్యయనంలో కరోనావైరస్ మోడరేట్ లక్షణాలు ఉన్న 158 మంది పాల్గొంటారని తెలిపింది. వీరిని రెండు గ్రూపులుగా విడదీసి పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రముఖ ప్రభుత్వ , ప్రైవేట్ ఆసుపత్రులలో ఈ ట్రయల్స్ నిర్వహించనున్నామనీ, ఇప్పటివరకు, 30 మంది రోగులను ఎంపిక చేసినట్టు వెల్లడించింది. ఈ చికిత్స వ్యవధి గరిష్టంగా 14 రోజులు వుంటుందనీ, మొత్తం అధ్యయనం వ్యవధి గరిష్టంగా 28 రోజులు ఉంటుందని కంపెనీ తెలిపింది. క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు జూలై, లేదా ఆగస్టులో వెలువడే అవకాశం వుందని అంచనా వేసింది. (ఇదీ ముంబై కేఈఎం హాస్పిటల్ : షాకింగ్ ట్వీట్) కరోనా రోగులకు చికిత్సను ప్రారంభించాలన్న తమ ప్రయత్నంలో ఇది మరొక దశ అనీ, ప్రతి అవకాశాన్ని పరిశీలిస్తున్నామని కంపెనీ తెలిపింది. క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే దేశవ్యాప్తంగా ఉత్పత్తి ప్రాప్యతను నిర్ధారించడానికి తాము చేయగిలిందంతా చేస్తామని గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఇండియా మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా బిజినెస్ అధ్యక్షుడు సుజేష్ వాసుదేవన్ అన్నారు. కరోనా సోకిన రోగులపై మూడవ దశలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించడానికి రెగ్యులేటరీ అనుమతి పొందిన మొట్టమొదటి ఔషధ సంస్థ గ్లెన్‌మార్క్ కావడం విశేషం. -
కీలక దశలో కరోనా వ్యాక్సిన్లు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో అభివృద్ధి చేస్తున్న 14 కరోనా వ్యాక్సిన్లలో 4 వ్యాక్సిన్లు అతిత్వరలో క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకుంటాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వెల్లడించారు. బీజేపీ నేత జీవీఎల్ నరసింహరావుతో ఆయన చేపట్టిన సోషల్ మీడియా ఇంటరాక్షన్‌లో ఈ వివరాలు తెలిపారు. ఐదు నెలల్లో భారత్‌లో నాలుగు కరోనా వ్యాక్సిన్లు కీలక దశకు చేరుకుంటాయని చెప్పారు. కోవిడ్-19కు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఊపందుకున్నాయని, దాదాపు 100కు పైగా వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సిన్ రూపకల్పన ప్రయత్నాలను సమన్వయపరుస్తోందని అన్నారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే దేశంలో 6767 తాజా కేసులు వెలుగుచూడగా 147 మంది మరణించారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గడిచిన 24 గంటల్లో 1,31,920కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చదవండి : వ్యాక్సిన్ వచ్చాకే టోర్నమెంట్లు -
సెప్టెంబర్ నాటికి మూడుకోట్ల డోస్‌లు!
లండన్: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధనలు ఫలించి, కరోనా వైరస్‌కు టీకా అందుబాటులోకి వస్తే.. ఈ సెప్టెంబర్ నాటికి 3 కోట్ల డోసుల వ్యాక్సీన్‌ను సిద్ధం చేయాలని బ్రిటన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆక్స్ఫర్డ్ వర్సిటీలో, ఇంపీరియల్ కాలేజ్‌లో ఈ టీకాకు సంబంధించిన పరిశోధనలు విజయవంతంగా సాగుతున్నాయని ఆ దేశ వాణిజ్య మంత్రి అలోక్ శర్మ తెలిపారు. ఆక్స్‌ఫర్డ్‌లో హ్యూమన్ ట్రయల్స్ స్థాయికి పరిశోధనలు చేరుకున్నాయన్నారు. అయితే, పూర్తి స్థాయిలో విజయవంతమయ్యే టీకాను రూపొందించడం సాధ్యంకాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. టీకా రూపకల్పనకు కృషి చేసేందుకు ప్రభుత్వం, సంస్థలు, పరిశోధకులతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ను ఇప్పటికే ఏర్పాటుచేశామన్నారు. వం ఉన్నా లేకున్నా ప్రపం చవ్యాప్తంగా ఏ కంపెనీ అయినా బొగ్గు, ఇతర ఖనిజాల వేలంలో పాల్గొనవచ్చన్నది ప్యాకేజీలో ప్రతిపాదన. నిజానికిది తాజాగా ఆమోదించిన ఖనిజ చట్టాల సవరణ బిల్లులో ఉంది. -
ఆశలు రేపుతున్న ఫేజ్–2 ట్రయల్
హాంకాంగ్: కోవిడ్ ప్రారంభదశలో ఉన్న రోగులకు మూడు రకాల మందులతో చేసే ఫేజ్-2 ప్రయోగం ద్వారా ఏడు రోజుల్లో వ్యాధిలక్షణాలు తగ్గాయనీ, ఇతర కరోనా పేషెంట్లు ఈ స్థితికి రావడానికి పన్నెండు రోజులు పట్టడంతో ఈ ప్రయోగం ఆశాజనకంగా మారింది. యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్‌కు చెందిన ప్రొఫెసర్ క్వాక్–యంగ్ యుయేన్ సారథ్యంలో హాంకాంగ్‌లోని ఆరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 20 మధ్య ఈ ట్రయల్స్ నిర్వహించారు. మొత్తం 127 మందిపై ఈ ప్రయోగం చేశారు. వీరిలో 86 మందికి లోపినావిర్–రిటోనావిర్, రిబా–విరిన్, బేటా–1బి ఇంజెక్షన్లను ఇచ్చారు. మిగిలిన 41 మందికి కేవలం లోపినావిర్–రిటోనావిర్ మాత్రమే ఇస్తారు. ఈ మూడు రకాల మందులు తీసుకున్న వారిలో ఆరోగ్యం త్వరితగతిన బాగా మెరుగైనట్టు తేలింది. లాన్సెట్ పత్రికలో ఈ ప్రయోగ ఫలితాలను ప్రచురించారు. -
గుడ్‌న్యూస్ : వ్యాక్సిన్ దిశగా కీలక ముందడుగు
బీజింగ్ : కరోనా మహమ్మారి చికిత్సలో కీలక ముందడుగు వేశామని చైనా శాస్త్రవేత్తలు వెల్లడించారు. కోవిడ్-19కు దేశంలో తొలి వ్యాక్సిన్‌ను కోతులపై విజయవంతంగా పరీక్షించామని డ్రాగన్ సైంటిస్టులు తెలిపారు. బీజింగ్‌కు చెందిన షినోవాక్ బయోటెక్ రూపొందించిన ఈ వ్యాక్సిన్ వైరస్ నుంచి కోతిని కాపాడటంలో విజయవంతమైందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ ప్రయోగం కోసం కోతులకు టీకాను ఇచ్చిన శాస్త్రవేత్తలు మూడు వారాల తర్వాత కోవిడ్-19 వైరస్‌కు దారితీసే సార్స్-కోవ్-2ను వాటిలో ప్రవేశపెట్టారు. అయితే ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు కోతుల్లో వ్యాధినిరోధక శక్తిని ఈ వ్యాక్సిన్ ప్రేరేపించి యాంటీబాడీలను విడుదల చేసిందని ఈ యాంటీబాడీలు సాధారణ వైరస్‌లపైనా దాడిచేస్తాయని తేలిందని సైన్స్ మ్యాగజైన్ నివేదిక స్పష్టం చేసింది. పికోవాక్ పేరిట రూపొందిన ఈ వ్యాక్సిన్ అధిక డోస్‌ను ఇచ్చిన కోతుల ఊపరితిత్తుల్లో వైరస్ లేదని, వ్యాక్సిన్ తీసుకోని కోతులు వైరస్‌తో పోరాడలేక తీవ్ర న్యుమోనియోకు గురయ్యాయని వెల్లడైందని పరిశోధకులు గుర్తించారు. కాగా ఏప్రిల్ ద్వితీయార్ధం నుంచే చైనా ఈ వ్యాక్సిన్‌ను మనుషులపై ప్రయోగిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇటలీ, ఇజ్రాయిల్‌లు ఇప్పటికే కోవిడ్-19 టీకాలను అభివృద్ధి చేయడంలో విజయం సాధించామని ప్రకటించాయి. చదవండి : కరోనాపై నిర్లక్ష్యం తగదు: జిన్‌పింగ్