జెరూసలెం: కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి తమ వద్ద అద్భుతమైన వ్యాక్సిన్ తయారుగా ఉందని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఈ వాక్సిన్‌ని మానవ ప్రయోగం చేయాల్సి ఉందని, దీన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి బెన్నీ గాంట్జ్ కోవిడ్ వ్యాక్సిన్ తయారీ ప్రయత్నాలను పరిశీలించేందుకు ఇజ్రాయెల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయలాజికల్ రీసెర్చ్(ఐఐబీఆర్)ని సందర్శించారు.
కరోనా వైరస్‌ని ఎదుర్కోవడానికి యాంటీ బాడీస్‌ని ఉత్పత్తి చేసే వ్యాక్సిన్ తయారీ ముందంజలో ఉందని, ఐఐబీఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ షపీరా వివరించారు. ఈ వ్యాక్సిన్ ఎప్పటికి వస్తుందో ఐఐబీర్ ప్రకటించలేదు. భారీ స్థాయిలో ఈ వ్యాక్సిన్‌ని తయారుచేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఐఐబీఆర్ రక్షణ శాఖతో కలిసి ఈ ప్రయోగాలను నిర్వహిస్తోంది. ఈ ప్రయోగ కార్యక్రమాన్ని ప్రధాని కార్యాలయం పర్యవేక్షిస్తోంది. (చైనాను వణికిస్తున్న మరో మాయదారి వైరస్)
Comments
Please login to add a commentAdd a comment