
ప్రభుత్వాలు, నియంత్రణ అధికారుల నిర్లక్ష్యం, అవి నీతి వల్ల విదేశీ కంపెనీలు పరిశీలన పేరుతో జనం మీద ప్రాణాంతక ప్రయో గాలు చేయడానికి అనుమ తులు సాధిస్తున్నారు. ఈ పరీక్షల వల్ల ఏపీ, గుజ రాత్‌లో కొందరు పిల్లలు చనిపోతున్నా దిక్కు లేదు. పార్లమెంటరీ స్థాయీ సంఘం 2011లో ఈ మరణాలపై దర్యాప్తు జరి పింది. ఓ అమెరికన్ కంపెనీ ఏవిధంగా అవినీతిప రులైన అధికారుల అండదండలతో మన అమాయక ప్రజలను ఎలా తన అవసరాలకు వాడుకుందో వివ రించింది. కాని ఎంతమంది మరణించారు, వారికి పరిహారం ఎవరిస్తారో మాత్రం ఎవరూ తేల్చలేదు. హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) వాక్సిన్ లను ఖమ్మం జిల్లాలోని పిల్లల మీద ప్రయోగించడం వల్ల 2010 మార్చిలో కొందరు మరణించారు. ఈ ప్రయోగాల పేరు ‘ప్రోగ్రాం ఫర్ అప్రాప్రియేట్ టెక్నా లజీ ఫర్ హెల్త్’ (పీఏటీహెచ్–పాత్). అంటే ‘ఆరో గ్యానికి తగిన సాంకేతికతా కార్యక్రమం’. ప్రయోగాలు చేసినవారికి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ విరా ళాలు ఇచ్చిందట. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీ ఎంఆర్), డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారులు వారికి సహకరించారు.
నియమాలకు నీళ్లొదిలి, అంతర్జాతీయ నైతిక సూత్రాలను వీరు అటకెక్కించారు. ప్రభుత్వ నిధు లను, మన మానవ వనరులను, మన జాతీయ గ్రామీణ ఆరోగ్యపథకం (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) చిహ్నా లను వారు దుర్వినియోగం చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం అనే పేరుతో ఈ ప్రయోగాలను సాగని చ్చారు. ఖమ్మం, వడోదరాలో పిల్లల మరణాలకు కారణమైన కంపెనీ అమెరికాలో, ఇక్కడా అనేక నియమాలు, నియంత్రణలను పట్టించుకోలేదని 2011లో బ్రజేష్ పాఠక్ నాయకత్వంలోని పార్లమెం టరీ కమిటీ కనిపెట్టింది. మహిళల్లో సర్వికల్ కేన్సర్ నిరోధించే వాక్సిన్‌ను మన డ్రగ్స్ కంట్రోలర్ అను మతించారు. మార్కెట్‌లో ఈ మందులు వాడేందుకు ఒప్పుకున్నారు. మార్కెటింగ్ తరువాత పరిశీలనా ప్రయోగాలు అని దీన్ని పిలిచారు. కానీ ఇవి మార్కెటింగ్ కన్నా రెండేళ్ల ముందు జరిపించిన ప్రయోగాలని తరువాత తేలింది. ఈ మందు ఏవి ధంగా ఇముడుతుందో తెలుసుకోవడానికి భారతీ యులను ప్రయోగ వస్తువులుగా వాడుకున్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయి నైతిక సంఘాలు (ఎథికల్ కమి టీలు) కూడా ఈ క్లినికల్ ప్రయోగాలను అనుమ తించాయి.
డ్రగ్స్ కంట్రోల్ నియమాల ప్రకారం పెద్దలపై ఇలాంటి క్లినికల్ ప్రయోగాలు జరిపి విజయవంతం అయినాయనుకుంటేనే పిల్లలపైన ప్రయోగించాలి. ఈ మందుల విషయంలో ఆ నియమాలు పాటించ లేదు. లైంగిక కార్యక్రమాలు జరగకముందే ఈ వాక్సి న్‌ను వాడాలంటూ 10–14 ఏళ్ల వయసు పిల్లల మీద ఈ ప్రయోగాలు జరిపారు. కమిటీ విచారణ జరుపు తున్న సందర్భంలో ఈ విషయం తెలియగానే, ఇంకా ప్రయోగాలు జరుగుతూంటే వెంటనే ఆపాలని ఆదే శించారు. పీఎస్సీ 41వ నివేదికలో ఈ దుర్మార్గంపై తీవ్ర ఆగ్రహం ప్రకటించింది. సరైన పరిశోధనా సంస్థతో దర్యాప్తు జరిపించాలని, ఈ దుర్మార్గం వెనుక ఉన్న వ్యక్తులెవరో తేల్చి తగిన చర్యలు తీసు కోవాలని కూడా ఆదేశించింది. ఆ నివేదికను తమ కమిటీ విచారణ ముగిసేలోగా ఇవ్వాలని కూడా కోరింది. మున్ముందు ఇటువంటి ప్రయోగాలను అనుమతించే ముందు అన్ని నియమాలు, నియం త్రణలను విధిగా పాటించాలని కూడా ఆదేశించింది.
ఖమ్మం పట్టణంలో మెర్క్ కంపెనీ గర్డాసిల్ అనే మందును, వడోదరలో జీఎస్కే కంపెనీ సెర్వారిక్స్ అనే మందును పిల్లల మీద ప్రయోగించాయి. వాటి దుష్పరిణామాలమీద ఫిర్యాదులు అనేకం వచ్చాయి. వెంటనే వాక్సిన్ వాడకం ఆపేయాలని ఆదేశించారు. కానీ ఇదివరకు ఇచ్చిన సూచనలు, ఆదేశాలను పాటించలేదని కమిటీ గమనించింది. 2006 జూన్1న అమెరికన్ డ్రగ్ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) గర్డసిల్ పేరుతో మెర్క్ కంపెనీ తయారు చేసిన వాక్సిన్‌కు అనుమతించింది. అదే సంవత్సరంలో పాథ్ అనే మరొక అమెరికన్ సంస్థ ఈ మందులను పెద్ద ఎత్తున అయిదేళ్ల పాటు ప్రజల్లో ప్రవేశ పెట్టాలని అయిదేళ్ల పథకం వేసింది. అందుకు వారు ఎంచుకున్న అమా యక జనం–భారతదేశంలో ఇండోఆర్యన్లు, ద్రావి డులు, గిరిజనులు, ఉగాండాలో నీగ్రాయిడ్లు, పెరూలో హిస్పానిక్స్, వియత్నాంలో మంగోలో యిడ్లు. వాక్సిన్‌లను విభిన్న ఆదిమజాతుల మీద ప్రయోగించడం వీరి లక్ష్యమట. ఒక పెద్ద అమెరికన్ కంపెనీ గుత్తాధిపత్యం కోసం, దాని వాణిజ్య ప్రయో జనాల కోసం మన దేశ ప్రజలను బక్రాలుగా ఎంచు కున్న తీరును ఎవ్వరూ ఏమాత్రం పరిశీలించలేదు. నేరుగా క్లినికల్ ట్రయల్స్ జరపకుండా కావాలని పరి శీలన, అధ్యయనాలపేరు మీద పరీక్షలకు అనుమతిం చారని కమిటీ విమర్శించింది.
మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment