కరోనా వైరస్‌: ఆక్స్‌ఫర్డ్‌ టీకా బాగా పని చేస్తోంది | Oxford AstraZeneca vaccine is safe and highly effective In USA | Sakshi
Sakshi News home page

కరోనా వైరస్‌: ఆక్స్‌ఫర్డ్‌ టీకా బాగా పని చేస్తోంది

Published Tue, Mar 23 2021 5:43 AM | Last Updated on Tue, Mar 23 2021 9:59 AM

Oxford AstraZeneca vaccine is safe and highly effective In USA - Sakshi

లండన్‌: ఆక్స్‌ఫర్డ్‌/ఆస్ట్రాజెనెకా టీకా చాలా బాగా పని చేస్తోందని తాజాగా వెల్లడైన మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో తేలింది. అమెరికా, చిలీ, పెరూ దేశాల్లో దాదాపు 32 వేల మంది వాలంటీర్లపై ఈ పరిశోధన జరిగింది. ఇందులో కోవిడ్‌–19ను అడ్డుకోవ డంలో ఆక్స్‌ఫర్డ్‌/ఆస్ట్రాజెనెకా టీకా 79శాతం పనితీరును చూపిందని నివేదిక సోమవారం పేర్కొంది. వ్యాధి ముదరకుండా చూడటం, ఆస్పత్రిపాలు కాకుండా పని చేయడంలో ఈ వ్యాక్సిన్‌ 100 శాతం ఫలితాలను సాధించినట్లు తేలింది. ఇదే వ్యాక్సిన్‌ను భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా తయరుచేయించి ప్రస్తుతం వ్యాక్సినేషన్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. 
(చదవండి: వ్యాక్సిన్‌ పంపిణీలో ముందున్న భారత్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement