Phase-3
-
మూడో దశ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
న్యూఢిల్లీ, సాక్షి: లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల మూడో దశకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. 12 రాష్ట్రాల్లోని 94 నియోజకవర్గాల్లో మే 7న జరగనున్న మూడో దశ లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రపతి తరపున ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దశలో నామినేషన్ల దాఖలుకు ఏప్రిల్ 19 చివరి తేదీ. అలాగే మధ్యప్రదేశ్‌లోని బేతుల్ నియోజకవర్గంలో వాయిదా పడిన ఎన్నికల కోసం విడిగా మరొక నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. బేతుల్ నియోజకవర్గంలో రెండో దశలో ఏప్రిల్ 26న పోలింగ్ జరగాల్సి ఉండగా ఇక్కడ బీఎస్పీ అభ్యర్థి మరణంతో ఎన్నికలు వాయిదా వేశారు. గుర్తింపు పొందిన జాతీయ లేదా రాష్ట్ర పార్టీ అభ్యర్థి ఎన్నికలకు ముందు మరణిస్తే ఆ పార్టీ తాజా అభ్యర్థిని గుర్తించి రంగంలోకి దింపేందు కోసం ఎన్నికలను వాయిదా వేస్తారు. మూడవ దశలో అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, గోవా, గుజరాత్, జమ్మూ కశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగుస్తాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
కోవిడ్ పోరులో కొత్త ఆశలు
వసుధైక కుటుంబానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనాను సమూలంగా నియంత్రించే కొత్త అస్త్రం తయారవుతోంది. టీకాల కన్నా మెరుగ్గా ఈ మహమ్మారిని అడ్డుకోవడంలో, ప్రాణ రక్షణ చేయడంలో కొత్త ఔషధం కీలకపాత్ర పోషించనుందని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. ఇప్పటివరకు కరోనా సోకిన వారికి వాడుతున్న ఔషధాల కన్నా ఎన్నో రెట్లు మెరుగ్గా ఈ ఔషధం కరోనాను కట్టడి చేయనుంది. అలాంటి ఒక ఆశలు కలిగించే నూతనౌషధం తుదిదశ పరీక్షల్లో ఉంది. అనుమతులన్నీ లభించి బయటకు వస్తే కరోనాను ఒక్క మాత్రతో అంతం చేసే అవకాశం లభించనుంది. కల్లోల కరోనాను శాంతింపజేయడానికి ఆధునిక వైద్యం అత్యంత సత్వరంగా స్పందించి టీకాలను రూపొందించింది. అయితే అవి కరోనా వ్యాప్తిని ఆశించినంత మేర అడ్డుకోవడం లేదని గణాంకాలు ఎత్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు కరోనాను సంపూర్ణంగా సమర్ధవంతంగా ఎదుర్కొనే ఔషధాన్ని రూపొందించేందుకు శాస్త్రవేత్తలు శతధా ప్రయతి్నస్తూనే ఉన్నారు. వీరి ప్రయ త్నాలు ఫలించే సూచనలు తాజాగా కనిపిస్తున్నాయి. ఒకే ఒక ఓరల్ డ్రగ్(నోటి ద్వారా తీసుకునే ఔషధం)తో కరోనాకు చెక్ పెట్టే యత్నాల్లో ముందడుగు పడింది. మోల్న్యుపిరవిర్‌గా పిలిచే ఈ యాంటీ వైరల్ ఔషధం రూపకల్పన తుదిదశకు చేరింది. దీన్ని మానవులపై పెద్దస్థాయిలో పరీక్షించేందుకు, ఫేజ్3 ట్రయల్స్ కోసం అనుమతులు లభించాయి. ఈ మందుతో కరోనాను అడ్డుకోవడం, కరోనా సోకినవారికి నయం చేయడం సాధ్య మని నిపుణులు నమ్ముతున్నారు. పైగా దీన్ని తీసుకోవడం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. మాత్రల రూపంలో వాడితే సరిపోతుంది. ఇలా పనిచేస్తుంది కరోనా వైరస్ ప్రమాదకరంగా మారడానికి ముఖ్యకారణం దానిలో ఉండే రిప్లికేషన్ పవర్(ఉత్పాదక సామర్థ్యం). తాజా ఔషధం నేరుగా ఈ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. వైరస్ జెనిటిక్ పదార్థంలోని బిల్డింగ్‌బ్లాక్స్‌ను పోలిఉండే ఈ మందు వైరస్ ఉత్పాదన జరగకుండా ఆపుతుంది. ఇందుకోసం వైరస్ రిప్లికేట్ చెందినప్పుడు ఏర్పడే నూతన ఆర్ఎన్ఏలో సహజంగా ఉండాల్సిన బిల్డింగ్‌బ్లాక్స్ స్థానంలో ఇది చేరుతుంది. అలా ఏర్పడిన కొత్త వైరస్‌లో ఈ మందు అతిగా మ్యుటేషన్ల(ఉత్పరివర్తనాలు)ను ప్రేరేపిస్తుంది. వైరస్ మ్యుటేషన్ చెందినప్పుడల్లా అందులోని ఆర్‌ఎన్‌లో ఉండే ఈ ఔషధం కూడా భారీగా పెరుగుతుంది. ఇది వైరస్ జెనిటిక్ పదార్ధంలో ఎర్రర్‌కు దారితీస్తుంది, మరోపక్క అతి మ్యు టేషన్లు వైరస్ రిప్లికేషన్‌ను దెబ్బతీస్తాయి. దీంతో వైరస్ ఉత్పత్తి కావడం ఆగి చివరకు నశిస్తుంది. ఇంతవరకు దీన్ని చాలా స్వల్ప స్థాయి(800 ఎంజీ) లో మనుషుల్లో (202మంది కరోనా లక్షణాలున్న పేషెంట్లు)ప్రయోగించారు. మూడు రోజుల అనంతరం పేషెంట్లలో వైరస్ మొత్తం చాలా స్వ ల్పానికి చేరినట్లు, ఐదు రోజుల తర్వాత పూర్తిగా కనిపించకుండా పోయినట్లు గణాంకాలు వెల్లడించాయి. ఈ గణాంకాలను మరింతగా విశ్లేíÙంచాల్సిఉంది. తర్వాతేంటి? నిజానికి ఈ ఔషధాన్ని కొన్నిచోట్ల కరోనా చికిత్సలో వాడుతూనే ఉన్నారు. కానీ పెద్ద ఎత్తున పరిశోధనలు జరగలేదు. త్వరలో 1850మంది పేషెంట్లపై ఈ ఔషధ ట్రయల్స్ ప్రస్తుతం జరుపుతున్నారు. దీని ఫలితాలను బట్టి ఫేజ్ 3 ట్రయల్స్ జరపనున్నారు. ఇందుకోసం 17 దేశాల నుంచి పేషెంట్ల నమోదు కార్యక్రమం ఆరంభమైంది. మోల్న్యుపిరవిర్‌ను ఇచి్చన పేషెంట్ల నుంచి ఇతరులకు కరోనా సోకకుండా నివారించవచ్చా? అనే అంశాన్ని ఈ ట్రయిల్స్‌లో పరిశోధిస్తారు. విజయవంతమైన ఫలితాలు వస్తే కరోనాపై పోరు కొత్త మలుపు తీసుకుంటుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఔషధ ఉత్పత్తి, నిల్వ, సరఫరా కూడా చౌకేనని అందువల్ల టీకాల కన్నా సులభంగా అందరికీ అందించవచ్చని చెప్పారు. నిజానికి ఈ ఔషధాన్ని బ్రాడ్‌స్పెక్ట్రమ్ యాంటీవైరల్‌గా(అనేక జాతుల వైరస్‌లపై పనిచేసేది) 2013లో రూపొందించారు. అనంతరం ఎన్సెఫలైటిస్, ఇన్‌ఫ్లూయెంజా, ఆర్ఎస్వీ తదితర వైరస్‌లను సమర్ధవంతంగా నియంత్రిస్తుందని కనుగొన్నారు. ఇప్పటికే ఇన్‌ఫ్లూయెంజాపై దీన్ని వాడేందుకు యూఎస్ ఎఫ్‌డీఏకు అనుమతులకు దరఖాస్తు చేశారు. కరోనా వచి్చన అనంతరం దీనిపై పోరాటానికి కూడా అనుమతుల కోసం దరఖాస్తు చేశారు. త్వరలో సదరు అనుమతులు వస్తాయని ఆశిస్తున్నారు. ఇదే నిజమై ప్రయోగాలు విజయవంతమైతే కరోనా కథ ముగిసినట్లే! – నేషనల్ డెస్క్, సాక్షి -
కరోనా వైరస్: ఆక్స్ఫర్డ్ టీకా బాగా పని చేస్తోంది
లండన్: ఆక్స్ఫర్డ్/ఆస్ట్రాజెనెకా టీకా చాలా బాగా పని చేస్తోందని తాజాగా వెల్లడైన మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. అమెరికా, చిలీ, పెరూ దేశాల్లో దాదాపు 32 వేల మంది వాలంటీర్లపై ఈ పరిశోధన జరిగింది. ఇందులో కోవిడ్–19ను అడ్డుకోవ డంలో ఆక్స్ఫర్డ్/ఆస్ట్రాజెనెకా టీకా 79శాతం పనితీరును చూపిందని నివేదిక సోమవారం పేర్కొంది. వ్యాధి ముదరకుండా చూడటం, ఆస్పత్రిపాలు కాకుండా పని చేయడంలో ఈ వ్యాక్సిన్ 100 శాతం ఫలితాలను సాధించినట్లు తేలింది. ఇదే వ్యాక్సిన్‌ను భారత్‌లో సీరం ఇన్స్టిట్యూట్ ద్వారా తయరుచేయించి ప్రస్తుతం వ్యాక్సినేషన్ చేస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: వ్యాక్సిన్ పంపిణీలో ముందున్న భారత్) -
కరోనా వ్యాక్సిన్ : సినోవాక్ కీలక ప్రకటన
బీజింగ్: చైనానుంచే కరోనా పుట్టిందన్న ఆందోళన మధ్య చైనా సంస్థ సినోవాక్ కీలక ప్రకటన చేసింది. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ పై ఫేజ్3 దశ ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్లు సినోవాక్ తాజాగా వెల్లడించింది. ఫేజ్ 1, ఫేజ్ 2 దశలను విజయవంతంగా పూర్తి చేసుకొని మానవులపై జరుపుతున్న పరీక్షలకు సంబంధించి చివరి దశను త్వరలోనే ప్రారంభించబోతున్నట్టు తెలిపింది. (కరోనా : శుభవార్త చెప్పిన మైలాన్) బ్రెజిల్ వ్యాక్సిన్ తయారీదారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బుటాంటన్‌తో కలిసి చేయబోయే ఈ అధ్యయనంలో, కోవిడ్-19 ప్రత్యేక ఆసుపత్రులలో పనిచేస్తున్న దాదాపు 9,000 మంది ఆరోగ్య నిపుణులను నియమించు కుంటామని వెల్లడించింది. బ్రెజిల్ లో నిర్వహించే ట్రయల్స్ కు వాలంటీర్ల ఎంపిక ఈ నెలలోనే ఉంటుందని వెల్లడించింది. ఈ ట్రయల్స్ కు సంబంధించి గత వారమే చైనా కంపెనీకి బ్రెజిల్ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి చివరిలో టీకా తయారీ పనులను సినోవాక్ ప్రారంభించింది. సంవత్సరానికి 100 మిలియన్ డోస్‌ల ఉత్పత్తి సామర్ధ్యంతో కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీ ప్లాంట్‌ను సిద్ధం చేస్తోంది. ఇది ఈ సంవత్సరం చివరి నాటికి సిద్ధంగా ఉంటుందని, సినోవాక్ భావిస్తోంది. వాక్సిన్ తయారీలో చివరి దశకు చేరుకున్నమూడు కంపెనీలలో ఒకటిగా సినోవాక్ నిలిచింది. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెన్‌కా సంయుక్తంగా తీసుకొస్తున్న వాక్సిన్ ప్రస్తుతం ఫేజ్ 3 లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పాటు సినోఫాం (చైనా నేషనల్ ఫార్మాస్యూటికల్ గ్రూప్) కు చెందిన వ్యాక్సిన్ కూడా ఫేజ్ 3 పరీక్షల దశలో ఉంది. గాలినుండి కూడా వైరస్ వ్యాపిస్తుందన్న అంచనాలు మరింత ఆందోళన రేపుతున్నాయి. ముఖ్యంగా రద్దీ ప్రదేశాలలో గాలిద్వారా మహమ్మారి విస్తరిసుందన్న అంచనాలతో వీలైనంత త్వరగా టీకా తీసుకురావాలని ఔషధ కంపెనీలు, శాస్త్రవేత్తలపై ప్రపంచ దేశాలు ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రస్తుతం భారతదేశం, బ్రిటన్, చైనా, అమెరికా, రష్యా, ఇజ్రాయెల్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా వ్యాక్సిన్లు వివిధ దశలలో ఉన్నాయి. కాగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 11 మిలియన్లను దాటగా, మరణాల సంఖ్య 540,000 దాటింది. -
66 ఎఫ్ఎం చానళ్లు @రూ. 200 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్ఎం రేడియో చానళ్ల ఫేజ్–3 రెండో రౌండ్ వేలంలో మొత్తం 66 చానళ్లు రూ. 200 కోట్లకు అమ్ముడుపోయాయి. 48 పట్టణాలు, నగరాల్లో ఈ కొత్త ఎఫ్ఎం చానళ్లను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహించిన వేలం వివరాల్ని సోమవారం వెల్లడించారు. హైదరాబాద్‌లో ఎఫ్ఎం చానల్ ఏర్పాటుకు అత్యధికంగా రూ. 23.4 కోట్లకు సన్ గ్రూపునకు చెందిన కల్ రేడియో బిడ్ చేసింది. డెహ్రాడూన్‌లో ఎఫ్ఎం కోసం రూ. 15.61 కోట్లతో సౌత్ ఆసియా ఎఫ్ఎం బిడ్ వేసింది. ఇది కూడా కళానిధి మారన్ నేతృత్వంలోని సన్ గ్రూప్‌దే కావడం విశేషం. అయితే లేహ్, భాదేర్వా, పూంచ్, కతువా, కార్గిల్‌లో ఎఫ్ఎంల ఏర్పాటు కోసం కేవలం రూ. 5 లక్షలకే బిడ్లు దాఖలయ్యాయి. ఫేజ్–3 రెండో దశలో 92 నగరాల్లో 266 ఎఫ్ఎం చానళ్ల ఏర్పాటు కేంద్రం లక్ష్యం. అయితే 200 చానళ్ల ఏర్పాటుకు ఎలాంటి స్పందన రాలేదు.