కోవిడ్‌ పోరులో కొత్త ఆశలు | A new oral antiviral drug for COVID is being tested in humans | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ పోరులో కొత్త ఆశలు

Sep 26 2021 3:47 AM | Updated on Sep 26 2021 5:12 AM

 A new oral antiviral drug for COVID is being tested in humans - Sakshi

వసుధైక కుటుంబానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనాను సమూలంగా నియంత్రించే కొత్త అస్త్రం తయారవుతోంది. టీకాల కన్నా మెరుగ్గా ఈ మహమ్మారిని అడ్డుకోవడంలో, ప్రాణ రక్షణ చేయడంలో కొత్త ఔషధం కీలకపాత్ర పోషించనుందని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. ఇప్పటివరకు కరోనా సోకిన వారికి వాడుతున్న ఔషధాల కన్నా ఎన్నో రెట్లు మెరుగ్గా ఈ ఔషధం కరోనాను కట్టడి చేయనుంది. అలాంటి ఒక ఆశలు కలిగించే నూతనౌషధం తుదిదశ పరీక్షల్లో ఉంది.

అనుమతులన్నీ లభించి బయటకు వస్తే కరోనాను ఒక్క మాత్రతో అంతం చేసే అవకాశం లభించనుంది.  కల్లోల కరోనాను శాంతింపజేయడానికి ఆధునిక వైద్యం అత్యంత సత్వరంగా స్పందించి టీకాలను రూపొందించింది. అయితే అవి కరోనా వ్యాప్తిని ఆశించినంత మేర అడ్డుకోవడం లేదని గణాంకాలు ఎత్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు కరోనాను సంపూర్ణంగా సమర్ధవంతంగా ఎదుర్కొనే ఔషధాన్ని రూపొందించేందుకు శాస్త్రవేత్తలు శతధా ప్రయతి్నస్తూనే ఉన్నారు.

వీరి ప్రయ త్నాలు ఫలించే సూచనలు తాజాగా కనిపిస్తున్నాయి. ఒకే ఒక ఓరల్‌ డ్రగ్‌(నోటి ద్వారా తీసుకునే ఔషధం)తో కరోనాకు చెక్‌ పెట్టే యత్నాల్లో ముందడుగు పడింది. మోల్న్యుపిరవిర్‌గా పిలిచే ఈ యాంటీ వైరల్‌ ఔషధం రూపకల్పన తుదిదశకు చేరింది. దీన్ని మానవులపై పెద్దస్థాయిలో పరీక్షించేందుకు, ఫేజ్‌3 ట్రయల్స్‌ కోసం అనుమతులు లభించాయి. ఈ మందుతో కరోనాను అడ్డుకోవడం, కరోనా సోకినవారికి నయం చేయడం సాధ్య మని నిపుణులు నమ్ముతున్నారు. పైగా దీన్ని తీసుకోవడం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. మాత్రల రూపంలో వాడితే సరిపోతుంది.

ఇలా పనిచేస్తుంది
కరోనా వైరస్‌ ప్రమాదకరంగా మారడానికి ముఖ్యకారణం దానిలో ఉండే రిప్లికేషన్‌ పవర్‌(ఉత్పాదక సామర్థ్యం). తాజా ఔషధం నేరుగా ఈ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. వైరస్‌ జెనిటిక్‌ పదార్థంలోని బిల్డింగ్‌బ్లాక్స్‌ను పోలిఉండే ఈ మందు వైరస్‌ ఉత్పాదన జరగకుండా ఆపుతుంది. ఇందుకోసం వైరస్‌ రిప్లికేట్‌ చెందినప్పుడు ఏర్పడే నూతన ఆర్‌ఎన్‌ఏలో సహజంగా ఉండాల్సిన బిల్డింగ్‌బ్లాక్స్‌ స్థానంలో ఇది చేరుతుంది. అలా ఏర్పడిన కొత్త వైరస్‌లో ఈ మందు అతిగా మ్యుటేషన్ల(ఉత్పరివర్తనాలు)ను ప్రేరేపిస్తుంది. వైరస్‌ మ్యుటేషన్‌ చెందినప్పుడల్లా అందులోని ఆర్‌ఎన్‌లో ఉండే  ఈ ఔషధం కూడా భారీగా పెరుగుతుంది.

ఇది వైరస్‌ జెనిటిక్‌ పదార్ధంలో ఎర్రర్‌కు దారితీస్తుంది, మరోపక్క అతి మ్యు టేషన్లు వైరస్‌ రిప్లికేషన్‌ను దెబ్బతీస్తాయి. దీంతో వైరస్‌ ఉత్పత్తి కావడం ఆగి చివరకు నశిస్తుంది. ఇంతవరకు దీన్ని చాలా స్వల్ప స్థాయి(800 ఎంజీ) లో మనుషుల్లో (202మంది కరోనా లక్షణాలున్న పేషెంట్లు)ప్రయోగించారు. మూడు రోజుల అనంతరం పేషెంట్లలో వైరస్‌ మొత్తం చాలా స్వ ల్పానికి చేరినట్లు, ఐదు రోజుల తర్వాత పూర్తిగా కనిపించకుండా పోయినట్లు గణాంకాలు వెల్లడించాయి. ఈ గణాంకాలను మరింతగా విశ్లేíÙంచాల్సిఉంది.

తర్వాతేంటి?
నిజానికి ఈ ఔషధాన్ని కొన్నిచోట్ల కరోనా చికిత్సలో వాడుతూనే ఉన్నారు. కానీ పెద్ద ఎత్తున పరిశోధనలు జరగలేదు. త్వరలో 1850మంది పేషెంట్లపై ఈ ఔషధ ట్రయల్స్‌ ప్రస్తుతం జరుపుతున్నారు. దీని ఫలితాలను బట్టి ఫేజ్‌ 3 ట్రయల్స్‌ జరపనున్నారు. ఇందుకోసం 17 దేశాల నుంచి పేషెంట్ల నమోదు కార్యక్రమం ఆరంభమైంది. మోల్న్యుపిరవిర్‌ను ఇచి్చన పేషెంట్ల నుంచి ఇతరులకు కరోనా సోకకుండా నివారించవచ్చా? అనే అంశాన్ని ఈ ట్రయిల్స్‌లో పరిశోధిస్తారు. విజయవంతమైన ఫలితాలు వస్తే కరోనాపై పోరు కొత్త మలుపు తీసుకుంటుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఔషధ ఉత్పత్తి, నిల్వ, సరఫరా కూడా చౌకేనని అందువల్ల టీకాల కన్నా సులభంగా అందరికీ అందించవచ్చని చెప్పారు. నిజానికి ఈ ఔషధాన్ని బ్రాడ్‌స్పెక్ట్రమ్‌ యాంటీవైరల్‌గా(అనేక జాతుల వైరస్‌లపై పనిచేసేది) 2013లో రూపొందించారు. అనంతరం ఎన్‌సెఫలైటిస్, ఇన్‌ఫ్లూయెంజా, ఆర్‌ఎస్‌వీ తదితర వైరస్‌లను సమర్ధవంతంగా నియంత్రిస్తుందని కనుగొన్నారు. ఇప్పటికే ఇన్‌ఫ్లూయెంజాపై దీన్ని వాడేందుకు యూఎస్‌ ఎఫ్‌డీఏకు అనుమతులకు దరఖాస్తు చేశారు. కరోనా వచి్చన అనంతరం దీనిపై పోరాటానికి కూడా అనుమతుల కోసం దరఖాస్తు చేశారు. త్వరలో సదరు అనుమతులు వస్తాయని ఆశిస్తున్నారు. ఇదే నిజమై ప్రయోగాలు విజయవంతమైతే కరోనా కథ ముగిసినట్లే!

– నేషనల్‌ డెస్క్, సాక్షి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement