new drug
-
క్యాన్సర్‌కు కొత్త మందు.. డాక్టర్ రెడ్డీస్ ఇమ్యునో–ఆంకాలజీ ఔషధం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా రంగ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్.. తిరగబెట్టే లేదా మెటాస్టాటిక్ నాసోఫారింజియల్ కార్సినోమా చికిత్స కోసం భారత్‌లో తొలిసారిగా టోరిపాలిమాబ్ అనే ఇమ్యునో–ఆంకాలజీ ఔషధాన్ని విడుదల చేసింది. నాసోఫారింజియల్ కార్సినోమా అనేది తల, మెడ క్యాన్సర్‌కు సంబంధించింది. ఇది గొంతు పైభాగంపై చోటుచేసుకుంటుంది. పీడీ–1 ఔషధం అయిన టోరిపాలిమాబ్ సంప్రదాయ చికిత్సతో పోలిస్తే అత్యుత్తమ ఫలితాలను ప్రదర్శించిందని రెడ్డీస్ వెల్లడించింది. భారత్‌లో జైటోర్వి బ్రాండ్ పేరుతో ఈ ఔషధాన్ని మార్కెట్ చేయనున్నట్లు తెలిపింది. ఇమ్యునో–ఆంకాలజీ అనేది ఒక క్యాన్సర్ చికిత్స విధానం. ఇది క్యాన్సర్‌ను నిరోధించడానికి, నియంత్రించడానికి, తొలగించడానికి రోగనిరోధక వ్యవస్థ శక్తిని ఉపయోగిస్తుంది. చైనా, యూఎస్ తర్వాత ఈ ఔషధం అందుబాటులోకి వచ్చిన మూడవ దేశం భారత్ కావడం విశేషం.ఏకైక ఇమ్యునో–ఆంకాలజీ.. పునరావృతమయ్యే లేదా మెటాస్టాటిక్ నాసోఫారింజియల్ కార్సినోమా చికిత్సకై యూఎస్ ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ), యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ), మెడిసిన్స్, హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ) వంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ నియంత్రణ సంస్థలు ఆమోదించిన ఏకైక ఇమ్యునో–ఆంకాలజీ ఔషధం ఇదేనని డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. టోరిపాలిమాబ్ కోసం 2023లో కంపెనీ షాంఘై జున్షి బయోసైన్సెస్‌తో లైసెన్స్, వాణిజ్యీకరణ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం భారత్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, లాటిన్ అమెరికాతో సహా 21 దేశాల్లో టోరిపాలిమాబ్‌ను అభివృద్ధి చేయడానికి, అలాగే వాణిజ్యీకరించడానికి డాక్టర్ రెడ్డీస్ ప్రత్యేక హక్కులను పొందింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇతర తొమ్మిది దేశాల్లో అందుబాటులోకి తేవడానికి లైసెన్స్ పరిధి విస్తరణకు సైతం ఈ ఒప్పందం అనుమతిస్తుందని కంపెనీ వివరించింది. -
ఆయుష్షు పెంచే డ్రగ్ ట్రయల్!..ఏకంగా వెయ్యి కుక్కలపై..
ఆయుర్దాయం పెంచడం ఎలా అనేదాని గురించి శాస్త్రవేత్తలు ఎన్నేళ్లుగానో పరిశోధనలు చేస్తున్నారు. అందులో భాగంగానే పెంపుడు జంతువుల ఆయువుని పెంచే సరికొత్త పిల్‌ని ఆవిష్కరించారు యూఎస్ శాస్త్రవేత్తలు. ఈ డ్రగ్ విజయవంతంగా పనిచేస్తుందా? లేదా? అనే దాని గురించి యూఎస్‌లోని సుమారు వెయ్యి కుక్కలపై ట్రయల్స్ నిర్వహించనున్నారు. అయితే పెద్ద జాతి కుక్కలపై డ్రగ్ సత్ఫలితాలు ఇవ్వడంతో చిన్న జాతి కుక్కలపై ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఇది విజయవంతమైతే పెంపుడు జంతువుల దీర్ఘాయువుని పెంచడమే గాక మానువుల ఆయుర్దాయన్ని పెంచగలిగే సరికొత్త ఆశను రేకెత్తిస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. వివరాల్లోకెళ్తే..యూఎస్‌కి చెందిన మాట్ కేబర్లీన్ శాస్త్రవేత్తల బృందం ఈ ప్రతిష్టాత్మకమైన పరిశోధనకు నాయకత్వం వహిస్తుంది.'ది డాగ్ ఏజింగ్ ప్రాజెక్ట్' పేరుతో ఈ పరిశోదన చేస్తున్నారు. అందుకోసం ముందుగా యూఎస్ అంతటా ఉన్న పెద్ద జాతి పెంపుడు కుక్కల యజమానులు ఈ పరిశోధనలో నమోదు చేయించుకున్నారు. ఈ పరిశోధనలో పాల్గొనే కుక్కుల వైద్య చరిత్రను వివరణాత్మకంగా విశ్లేషించింది పరిశోధక బృందం. ఆ తర్వాత ఆ కుక్కల నుంచి వెంట్రుకలు, బ్లండ్ శాంపుల్స్, మూత్ర నమునాల వంటి వాటన్నింటిని సేకరంచారు. ఇక యాంటీ ఏజింగ్ పిల్‌ని ఇస్తూ..ఆయా కుక్కల వృధాప్య లక్షణాలను ట్రాక్ చేయడం ప్రారంభించారు. తొలుత శాస్త్రవేత్తలు పెద్ద జాతి కుక్కలపై అధ్యయనం నిర్వహించేలా లాయ్-001-పిల్(LOY-001)ని తీసుకొచ్చారు. ఇది ఐజీఎఫ్-1(IGF-1) స్థాయిలను ప్రేరేపిస్తుంది. అంటే ఆయవును పెంచే దిశగా కణాల పెరుగుదలను ప్రేరిపించే హార్మోన్ ఇది. ఈ పిల్ ఐజీఎఫ్-1 ఓవర్ ఎక్స్‌ప్రెషన్‌కి నిరోధించి కుక్క జీవిత కాలాన్ని పొడిగిస్తుంది. ఈ పిల్కి సెంటర్ ఫర్ వెటర్నరీ మెడిసిన్‌కి సంబంధించిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) ఆమోదం కూడా లభించడం విశేషం. ఇక ఈ పిల్‌ని జంతు ఆరోగ్య బయోటెక్ కంపెనీ లాయల్ అభివృద్ధి చేసింది. ఈ ఔషధం కుక్కలలోని వృధాప్య సంబంధ రుగ్మతలను తగ్గించి జీవితకాలాన్ని పొడిగిస్తుంది. దీన్ని చాలామంది కుక్కల యజమానులు స్వాగతించారు. ఇక డాగ్ ప్రేమికురాలు, బీఫ్ సిరీస్ సృష్టికర్త లీ సంగ్ జిన్ కూడా ఇలా ఎఫ్‌డీఏ తొలిసారిగా యాంటీ ఏజింగ్‌కి సంబంధించిన ఔషధాన్ని ఆమోదించడాన్ని స్వాగతించారు. ఇది చాలా మంచి విషయం, తొందరగా ఫాస్ట్ ట్రాక్ చేసి కుక్కల ఆయువును పెంచేయండి అని పిలుపునిచ్చారు. మరి పెద్దకుక్కల కోసం పిల్‌ని తెచ్చారు మరీ చిన్న జాతి కుక్కలు సంగతేంటీ అన్ని ప్రశ్నించారు లీ. అందుకు ప్రతిస్పందనగా లాయల్ కంపెనీ లాయ్-002 అనే పిల్‌ని పరీక్షించనున్నట్లు ఫిబ్రవరిని 1న ప్రకటించింది. ఇది చిన్నవి మినహ సీనియర్ కుక్కల జీవితకాలం పొడిగించేందుకు రూపొందించబడిన జీవితకాల మాత్ర. దీన్ని స్టడీ(study) అనే పేరుతో చిన్న జాతిలోని పెద్ద వయసు కుక్కలపై ట్రయల్స్ నిర్వహిస్తున్నారు పరిశోధకులు. అందులో భాగంగా తొలి మోతాదు బూ అనే 11 ఏళ్ల విప్పేట్ తీసుకున్నట్లు యజమాని డెబ్ హన్నా పేర్కొన్నారు. ఇది పెద్ద వయసుగల శక్తిమంతమైన కుక్క కావడంతో పరిశోధనలో చేర్చుకోవడమేగాక మొదటి డోసు దీనికే ఇచ్చారని వెల్లడించారు యజమాని హన్నా. ఈ పరిశోధన యూఎస్ అంతటా ఉన్న 55 వెటర్నరీ క్లినిక్‌లో నిర్వహిచనున్నట్లు తెలిపారు శాస్త్రవేత్తలు. వివిధ జాతులు, వయస్సులు, ఆరోగ్యం డేటా వారిగా సుమారు వెయ్యి కుక్కలపై ఈ ట్రయల్స్‌ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అందుకోసం ఆయా యజమానులు తప్పనసరిగా ముందుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ పరిశోధనలో తమ కుక్కలు భాగం కావాలంటే ..నమోదు సమయంలో వాటి వయసు పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ, బరువు 6.4 కేజీలు ఉండాలి. అలాగే ఆయాయజమానులు తమ కుక్కలు నాలుగేళ్ల వరకు ఈ పరిశోధనలో పాల్గొనాలి అనే నిబంధనకు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. ఈ పరిశోధన విజయవంతమైతే కుక్కల ఆయుష్షు పెరగడమే గాక మనుషుల దీర్ఘాయువుకు మార్గం సుగమం చేస్తుంది. కుక్కలు మానవులుకు అద్భుత నమునాలుగా పనిచేస్తాయి.కాబట్టి కుక్కల కోసం రూపొందించిన యాంటీ ఏజింగ్ డ్రగ్ పురోగతి మానవులకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. (చదవండి: పూనం పాండే కన్నుమూత: సర్వైకల్ కేన్సర్.. మహిళలకు ఓ శాపం!) -
మతిమరుపు బాధితులకు ‘లెసానెమాబ్’
లండన్: మనుషుల్లో వయసు పెరుగుతున్నకొద్దీ మతిమరుపు (అల్జీమర్స్) తలెత్తడం సహజం. ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మందికి పైగా దీనితో బాధపడుతున్నారని అంచనా. బ్రిటన్‌లోని అల్జీమర్స్ రీసెర్చ్ సంస్థ లెసానెమాబ్ పేరుతో నూతన ఔషధాన్ని అభివృద్ధి చేసింది. దీనితో మతిమరుపు పెరుగుదల నెమ్మదిస్తుందని సైంటిస్టులు చెప్పారు. అల్జీమర్స్ చికిత్సలో ఇదొక కీలక మలుపన్నారు. క్లినికల్ ట్రయల్స్‌లో 1,795 మందిపై సంతృప్తికరమైన ఫలితాలు వచ్చినట్లు వెల్లడించారు. వారికి 18 నెలలపాటు చికిత్స అందిస్తే మతిమరుపు పెరుగుదల నాలుగింట మూడొంతులు తగ్గిపోతుందని చెప్పారు. అల్జీమర్స్‌కు ప్రధాన కారణమైన బీటా–అమైలాయిడ్ అనే ప్రొటీన్‌ను ఈ ఔషధం కరిగించేస్తుందని పేర్కొన్నారు. మెరుగైన అల్జీమర్స్ చికిత్సల కోసం ప్రపంచం ఎదురు చూస్తోందని, ఈ దిశగా లెసానెమాబ్ డ్రగ్ ఒక ఉత్తమమైన పరిష్కారం అవుతుందని పరిశోధకుడు ప్రొఫెసర్ జాన్ హర్డీ తెలియజేశారు. -
కొత్త డ్రగ్ రూల్ తో నకిలీ మందులకు చెక్
-
మరో రెండు కోవిడ్ ఔషధాలకు డబ్ల్యూహెచ్ ఆమోదం
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ రోగులకు చికిత్స అందించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు ఔషధాలకు ఆమోద ముద్ర వేసింది. రుమటైడ్ కీళ్ల నొప్పుల నివారణకు ఎలి లిల్లీ కంపెనీ తయారు చేసిన మెడిసిన్, గ్లాక్సోస్మిత్‌క్లేన్ కంపెనీ మోనో క్లోనల్ యాంటీబాడీ థెరపీలను కోవిడ్ రోగులకు ఇవ్వడానికి డబ్ల్యూహెచ్ఓ నిపుణులు అంగీకరించారు. లిల్లీ కంపెనీకి చెందిన బారిక్టినిబ్ ఔషధం కరోనా తీవ్రంగా సోకిన వారి ప్రాణాలు కాపాడుతుందని, వారికి వెంటిలేటర్ అవసరం లేకుండా చేస్తుందని డబ్ల్యూహెచ్ఓ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. స్టెరాయిడ్స్‌తో పాటు కీళ్ల నొప్పులకు వాడే ఈ ఔషధాన్ని ఇస్తే మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపింది. ఇప్పటికే బారిక్టినిబ్‌ను అమెరికా, యూరప్‌లలో గత ఏడాది మే నుంచి అత్యవసర సమయాల్లో వినియోగిస్తున్నారు. కరోనాతో ఇబ్బంది పడుతూ ఆస్పత్రిలో చేరే అవసరం ఉన్న వారికి గ్లాక్సో కంపెనీకి చెందిన మోనోకల్నల్ యాంటీబాడీ ట్రీట్మెంట్ ఇవ్వొచ్చునని స్పష్టం చేసింది. -
కోవిడ్ పోరులో కొత్త ఆశలు
వసుధైక కుటుంబానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనాను సమూలంగా నియంత్రించే కొత్త అస్త్రం తయారవుతోంది. టీకాల కన్నా మెరుగ్గా ఈ మహమ్మారిని అడ్డుకోవడంలో, ప్రాణ రక్షణ చేయడంలో కొత్త ఔషధం కీలకపాత్ర పోషించనుందని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. ఇప్పటివరకు కరోనా సోకిన వారికి వాడుతున్న ఔషధాల కన్నా ఎన్నో రెట్లు మెరుగ్గా ఈ ఔషధం కరోనాను కట్టడి చేయనుంది. అలాంటి ఒక ఆశలు కలిగించే నూతనౌషధం తుదిదశ పరీక్షల్లో ఉంది. అనుమతులన్నీ లభించి బయటకు వస్తే కరోనాను ఒక్క మాత్రతో అంతం చేసే అవకాశం లభించనుంది. కల్లోల కరోనాను శాంతింపజేయడానికి ఆధునిక వైద్యం అత్యంత సత్వరంగా స్పందించి టీకాలను రూపొందించింది. అయితే అవి కరోనా వ్యాప్తిని ఆశించినంత మేర అడ్డుకోవడం లేదని గణాంకాలు ఎత్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు కరోనాను సంపూర్ణంగా సమర్ధవంతంగా ఎదుర్కొనే ఔషధాన్ని రూపొందించేందుకు శాస్త్రవేత్తలు శతధా ప్రయతి్నస్తూనే ఉన్నారు. వీరి ప్రయ త్నాలు ఫలించే సూచనలు తాజాగా కనిపిస్తున్నాయి. ఒకే ఒక ఓరల్ డ్రగ్(నోటి ద్వారా తీసుకునే ఔషధం)తో కరోనాకు చెక్ పెట్టే యత్నాల్లో ముందడుగు పడింది. మోల్న్యుపిరవిర్‌గా పిలిచే ఈ యాంటీ వైరల్ ఔషధం రూపకల్పన తుదిదశకు చేరింది. దీన్ని మానవులపై పెద్దస్థాయిలో పరీక్షించేందుకు, ఫేజ్3 ట్రయల్స్ కోసం అనుమతులు లభించాయి. ఈ మందుతో కరోనాను అడ్డుకోవడం, కరోనా సోకినవారికి నయం చేయడం సాధ్య మని నిపుణులు నమ్ముతున్నారు. పైగా దీన్ని తీసుకోవడం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. మాత్రల రూపంలో వాడితే సరిపోతుంది. ఇలా పనిచేస్తుంది కరోనా వైరస్ ప్రమాదకరంగా మారడానికి ముఖ్యకారణం దానిలో ఉండే రిప్లికేషన్ పవర్(ఉత్పాదక సామర్థ్యం). తాజా ఔషధం నేరుగా ఈ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. వైరస్ జెనిటిక్ పదార్థంలోని బిల్డింగ్‌బ్లాక్స్‌ను పోలిఉండే ఈ మందు వైరస్ ఉత్పాదన జరగకుండా ఆపుతుంది. ఇందుకోసం వైరస్ రిప్లికేట్ చెందినప్పుడు ఏర్పడే నూతన ఆర్ఎన్ఏలో సహజంగా ఉండాల్సిన బిల్డింగ్‌బ్లాక్స్ స్థానంలో ఇది చేరుతుంది. అలా ఏర్పడిన కొత్త వైరస్‌లో ఈ మందు అతిగా మ్యుటేషన్ల(ఉత్పరివర్తనాలు)ను ప్రేరేపిస్తుంది. వైరస్ మ్యుటేషన్ చెందినప్పుడల్లా అందులోని ఆర్‌ఎన్‌లో ఉండే ఈ ఔషధం కూడా భారీగా పెరుగుతుంది. ఇది వైరస్ జెనిటిక్ పదార్ధంలో ఎర్రర్‌కు దారితీస్తుంది, మరోపక్క అతి మ్యు టేషన్లు వైరస్ రిప్లికేషన్‌ను దెబ్బతీస్తాయి. దీంతో వైరస్ ఉత్పత్తి కావడం ఆగి చివరకు నశిస్తుంది. ఇంతవరకు దీన్ని చాలా స్వల్ప స్థాయి(800 ఎంజీ) లో మనుషుల్లో (202మంది కరోనా లక్షణాలున్న పేషెంట్లు)ప్రయోగించారు. మూడు రోజుల అనంతరం పేషెంట్లలో వైరస్ మొత్తం చాలా స్వ ల్పానికి చేరినట్లు, ఐదు రోజుల తర్వాత పూర్తిగా కనిపించకుండా పోయినట్లు గణాంకాలు వెల్లడించాయి. ఈ గణాంకాలను మరింతగా విశ్లేíÙంచాల్సిఉంది. తర్వాతేంటి? నిజానికి ఈ ఔషధాన్ని కొన్నిచోట్ల కరోనా చికిత్సలో వాడుతూనే ఉన్నారు. కానీ పెద్ద ఎత్తున పరిశోధనలు జరగలేదు. త్వరలో 1850మంది పేషెంట్లపై ఈ ఔషధ ట్రయల్స్ ప్రస్తుతం జరుపుతున్నారు. దీని ఫలితాలను బట్టి ఫేజ్ 3 ట్రయల్స్ జరపనున్నారు. ఇందుకోసం 17 దేశాల నుంచి పేషెంట్ల నమోదు కార్యక్రమం ఆరంభమైంది. మోల్న్యుపిరవిర్‌ను ఇచి్చన పేషెంట్ల నుంచి ఇతరులకు కరోనా సోకకుండా నివారించవచ్చా? అనే అంశాన్ని ఈ ట్రయిల్స్‌లో పరిశోధిస్తారు. విజయవంతమైన ఫలితాలు వస్తే కరోనాపై పోరు కొత్త మలుపు తీసుకుంటుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఔషధ ఉత్పత్తి, నిల్వ, సరఫరా కూడా చౌకేనని అందువల్ల టీకాల కన్నా సులభంగా అందరికీ అందించవచ్చని చెప్పారు. నిజానికి ఈ ఔషధాన్ని బ్రాడ్‌స్పెక్ట్రమ్ యాంటీవైరల్‌గా(అనేక జాతుల వైరస్‌లపై పనిచేసేది) 2013లో రూపొందించారు. అనంతరం ఎన్సెఫలైటిస్, ఇన్‌ఫ్లూయెంజా, ఆర్ఎస్వీ తదితర వైరస్‌లను సమర్ధవంతంగా నియంత్రిస్తుందని కనుగొన్నారు. ఇప్పటికే ఇన్‌ఫ్లూయెంజాపై దీన్ని వాడేందుకు యూఎస్ ఎఫ్‌డీఏకు అనుమతులకు దరఖాస్తు చేశారు. కరోనా వచి్చన అనంతరం దీనిపై పోరాటానికి కూడా అనుమతుల కోసం దరఖాస్తు చేశారు. త్వరలో సదరు అనుమతులు వస్తాయని ఆశిస్తున్నారు. ఇదే నిజమై ప్రయోగాలు విజయవంతమైతే కరోనా కథ ముగిసినట్లే! – నేషనల్ డెస్క్, సాక్షి -
కరోనా పోరులో భారత్‌లోకి మరో డ్రగ్
-
గుడ్‌న్యూస్: నెలాఖరుకు కోవిడ్-19 డ్రగ్
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తుందని చెబుతున్న యాంటీ వైరల్ డ్రగ్ రెమిడిసివిర్ నెలాఖరు కల్లా భారత మార్కెట్లో అందుబాటులో ఉంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కరోనా మహమ్మారితో తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో వెంటిలేటర్లపై ఉండే రోగులకు అత్యవసరంగా రెమిడిసివిర్‌ను వాడేందుకు డ్రగ్ కంటోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఇటీవల ఆమోదించింది. దేశీయంగా పలు ఫార్మా కంపెనీలు రెమిడిసివిర్ ఉత్పత్తిని చేపట్టడంతో ఈ డ్రగ్ విస్తృతంగా అందుబాటులో ఉంది. ఆక్సిజన్ సపోర్ట్ అవసరమైన కేసుల్లోనే తక్కువ డోస్‌లో రెమిడిసివిర్ వాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గిలెడ్ సైన్సెస్ అభివృద్ధి చేసిన ఈ డ్రగ్ కోవిడ్-19 రోగులపై వాడగా మెరుగ్గా పనిచేసిందని వెల్లడైంది. అమెరికాలోనూ రెమిడిసివిర్‌ను ఎమర్జెన్సీ కేసుల్లోనే వైద్యల పర్యవేక్షణలో పరిమిత డోసేజ్‌లో వాడుతున్నారు. కరోనా వైరస్‌చికిత్సలో ఈ మందు భద్రత, సామర్ధ్యంపై మరింత సమాచారం కోసం అదనపు క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న క్రమంలో అత్యవసర కేసుల్లోనే ఈ డ్రగ్‌ను వాడేందుకు అనుమతించారు. ఈ డ్రగ్ పేటెంట్ కలిగిన గిలెడ్ సైన్సెస్ మే 29న రెమిడిసివిర్ దిగుమతులు, మార్కెటింగ్ కోసం భారత ఔషధ నియంత్రణ మండలికి దరఖాస్తు చేసుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చదవండి : కోవిడ్-19 : అమిత్ షా కీలక భేటీ -
అల్జీమర్స్‌కు అద్భుత ఔషధం
న్యూఢిల్లీ : అల్జీమర్స్ వ్యాధి గురించి నేడు అందరికి తెల్సిందే. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకు మాత్రమే పరిమితమైన ఈ వ్యాధి ఇప్పుడు భారతీయుల్లో కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఈ జబ్బు ప్రధాన లక్షణం. అతి మతి మరుపు. తన ఇంటివారు, ఇరుగు పొరుగు, పరిసరాలను ఎప్పటికప్పుడు మరచిపోవడమే కాకుండా తన గురించి తాను మరచిపోవడాన్ని ‘అల్జీమర్స్’ లక్షణాలుగా వైద్యులు చెబుతారు. ఈ వ్యాధి సోకిన వారు బయటకు వెళితే మళ్లీ వారంతట వారు ఇంటికి వచ్చే అవకాశం లేదన్న కారణంగా చాలా మంది వ్యాధిగ్రస్థులను ఇంటికో, ఇంట్లోని ఓ గదికో పరిమితం చేస్తారు. డిమెన్షియా వ్యాధి ముదురితే అల్జీమర్స్ వస్తుంది. డిమెన్షియా వ్యాధి వచ్చినవారు ఇతరులు, పరిసరాల గురించి మరచి పోతారు గానీ, తన గురించి జ్ఞాపకం ఉంటుంది. తన గురించి కూడా మరచిపోవడాన్ని అల్జీమర్స్‌గా పేర్కొంటారు. డిమెన్షియా వ్యాధికి తాము ఔషధాన్ని కనిపెట్టామని, తద్వారా అల్జీమర్స్ వ్యాధిగా అది ముదరకుండా నిరోధించగలమని అమెరికాకు చెందిన ఆలోపతి మందుల దిగ్గజ సంస్థ ‘బయోజెన్ ఇన్కార్పొరేషన్’ సోమవారం రాత్రి వెల్లడించింది. ఈ ఔషధ మాత్రల కోసం వచ్చే ఏడాది మొదట్లో అమెరికా, యూరప్, జపాన్ దేశాల్లో లైసెన్స్‌కు దరఖాస్తు చేస్తామని, అల్జీమర్స్‌కు సంబంధించి అదే ఓ గొప్ప విప్లవం అవుతుందని, తాము ఈ పరిశోధనల కోసం కొన్ని వేల కోట్ల రూపాయలను వెచ్చించామని, మరే సంస్థ ఇంతగా ఖర్చుపెట్టలేదని, లైసెన్స్ దరఖాస్తు కోసం కనీసం ముందుకు వచ్చే అవకాశం లేదని కంపెనీ సీఈవో మైఖేల్ వోనత్సోస్ వ్యాఖ్యానించారు. అల్జీమర్స్‌కు ఇదో అద్భుత ఔషధమని చెప్పవచ్చని ఆయన అన్నారు. -
హెచ్ఐవీ నివారణకు సరికొత్త మందు..
ప్రమాదకరమైన హెచ్ఐవీ వ్యాధిని నిరోధించేందుకు, చికిత్స చేసేందుకూ యూనివిర్శటీ ఆఫ్ నార్త్ కారొలీనా శాస్త్రవేత్తలు సరికొత్త పద్ధతిని సిద్ధం చేశారు. ఇంజెక్షన్ల ద్వారా శరీరంలోకి ఓ గాడ్జెట్లాంటిది ప్రవేశపెట్టి దాని ద్వారా మందు నిత్యం అందుబాటులో ఉండేలా చేయడం ఇందులోని విశేషం. రోజుకో మాత్ర వేసుకోవడం ద్వారా హెచ్ఐవీ రాకుండా ఉండేందుకు ఇప్పటికే అవకాశముంది. అలాగే యాంటీ రెట్రోవైరల్ మందులను క్రమం తప్పకుండా వాడటం వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తుందనీ మనకు తెలుసు. అయితే ప్రతిరోజూ మందులేసుకోవడంలో ఉన్న ఇబ్బందులను దష్టిలో ఉంచుకుని మార్టినా కొవరోవా అనే శాస్త్రవేత్త ఈ కొత్త పద్ధతి కోసం పరిశోధనలు చేసి విజయం సాధించారు. ఈ పద్ధతిలో హెచ్ఐవీ మందు, ఓ సాల్వెంట్, ప్లాస్టిక్‌లను కలిపి ఓ గడ్డలా తయారు చేసి. గొట్టంలాంటి గాడ్జెట్‌లోకి ఎక్కిస్తారు. ఈ గొట్టాన్ని చర్మం అడుగుభాగంలోకి జొప్పించినప్పుడు ప్లాస్టిక్ క్రమేపీ కరిగిపోతూ వస్తుంది. ఈ క్రమంలో సాల్వెంట్‌తో కూడిన మందు నెమ్మదిగా అందడం మొదలవుతుంది. జంతువులపై జరిపిన ప్రయోగాల్లో ఒక్కో గాడ్జెట్ దాదాపు ఐదు నెలలపాటు మందు అందించినట్లు తెలిసిందని, ఎలాంటి ఇతర దుష్ఫలితాలూ లేవని మార్టినా వివరించారు. -
చైనా ఆధిపత్యానికి ‘మందు’
న్యూఢిల్లీ: ప్రపంచంలో రెండో అతిపెద్ద ఫార్మా మార్కెట్ అయిన చైనాను మన కంపెనీలు ఇప్పటిదాకా పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. కాకపోతే స్వీయ రక్షణలతో అమెరికా మార్కెట్లో అమ్మకాలు తగ్గటం... కొత్త మార్కెట్లు, కొత్త అవకాశాల కోసం అన్వేషించాల్సి రావటంతో వీటి దృష్టి డ్రాగన్ దేశంపై పడింది. ఫలితం... 100 బిలియన్ డాలర్ల విలువైన చైనా మార్కెట్లో వాటా పెంచుకునేందుకు, బలోపేతం అయ్యేందుకు ఇవి ప్రయత్నాల్ని తీవ్రం చేశాయి. ఇప్పటికే సిప్లా, లుపిన్ సంస్థలు చైనా మార్కెట్లో నూతన అవకాశాల అన్వేషణలో ఉండగా, ఈ జాబితాలో డాక్టర్ రెడ్డీస్ కూడా చేరిపోయింది. ప్రపంచంలో అతిపెద్ద ఫార్మా మార్కెట్ అమెరికాలో భారత కంపెనీల హవా కొనసాగుతుండగా... రెండో అతిపెద్ద చైనా మార్కెట్లో మాత్రం స్థానిక కంపెనీలు, బహుళజాతి కంపెనీల ఆధిపత్యమే కొనసాగుతోంది. 100 బిలియన్ డాలర్ల విలువైన చైనా మార్కెట్లో (సుమారు రూ.6.4 లక్షల కోట్లు) భారత ఫార్మా కంపెనీల ఎగుమతుల వాటా 160 మిలియన్ డాలర్లు (రూ.1,024 కోట్లు) మాత్రమే. ఇటీవల నియంత్రణల పరంగా చేసిన మార్పులతో ఉత్పత్తులకు అనుమతులు వేగవంతం కావడం మొదలైంది. దీంతో చైనా మార్కెట్ భారత ఔషధ కంపెనీలను భారీ అవకాశాలతో ఊరిస్తోంది. విదేశీ ట్రయల్ డేటాను (ఔషధ పరీక్షల సమాచారం) గుర్తించడంతోపాటు, ఔషధ అనుమతులను వేగవంతం చేసేందుకు మరింత మందిని నియమించుకోవాలని చైనా ఆహార, ఔషధ నియంత్రణ మండలి ఇటీవలే నిర్ణయించింది. ఇది భారత ఔషధ కంపెనీలకు మేలు చేసేదేనని నిపుణులు చెబుతున్నారు. భారత కంపెనీలు ఇప్పటి వరకు ప్రధానంగా అమెరికా, యూరోప్ మార్కెట్లపైనే ఎక్కువగా ఆధారపడ్డాయి. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ మండలి ఆమోదించిన ఔషధాలను చైనాలోనూ వేగంగా అనుమతిలిచ్చేందుకు వీలుగా కొత్త నియంత్రణలు రావడం భారత కంపెనీలు డ్రాగన్ మార్కెట్లో పాతుకుపోవడానికి వీలు కల్పిస్తాయని ఎర్నెస్ట్ అండ్ యంగ్‌కు చెందిన శ్రీరామ్ శ్రీనివాసన్ పేర్కొన్నారు. భారత కంపెనీల ప్రయత్నాలు కొత్త అవకాశాల నేపథ్యంలో చైనా మార్కెట్లో యాంటీ కేన్సర్ ఔషధాలను ప్రవేశపెట్టేందుకు డాక్టర్ రెడ్డీస్ ప్రయత్నిస్తోంది. సిప్లా, వోకార్డ్ యాంటీ బయోటిక్స్, రెస్పిరేటరీ ఔషధాలను విడుదల చేయాలనుకుంటున్నాయి. ‘‘అంకాలజీ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన విభాగం. చైనాలో మా స్థానం మరింత బలోపేతం అయ్యేందుకు వీలుగా భాగస్వామ్య ఒప్పందాల కోసం చూస్తున్నాం’’ అని డాక్టర్ రెడ్డీస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎంవీ రమణ తెలిపారు. వాస్తవానికి డాక్టర్ రెడ్డీస్ 20 ఏళ్ల నుంచి చైనా మార్కెట్లో ఉంది. 2 కోట్ల డాలర్ల (రూ.130 కోట్లు) విలువైన ఔషధాలను మార్కెట్ చేస్తోంది. ఇందులో యాక్టివ్ ఫార్మాస్యూటిక్ ఇంగ్రేడియెంట్స్ అమ్మకాలు కలిపిలేవు. రోటమ్ గ్రూపుతో కలసి జాయింట్ వెంచర్ కింద ఉత్పత్తులను మార్కెట్ చేస్తోంది. చైనాలోని 5,000 ఆస్పత్రులను కవర్ చేసే మార్కెటింగ్ బృందం కూడా ఉంది. ఇతర భారతీయ కంపెనీల పాత్ర డాక్టర్ రెడ్డీస్‌తో పోలిస్తే నామమాత్రమే. ర్యాన్‌బ్యాక్సీ (2014లో సన్ ఫార్మా సొంతమైంది) చైనా మార్కెట్లోకి ప్రవేశించినప్పటికీ 2009లో జాయింట్ వెంచర్ నుంచి తప్పుకుని, తన వాటాను భాగస్వామ్య కంపెనీకే అమ్మేసింది. కఠిన నియంత్రణల వల్ల చైనా మార్కెట్లో ఔషధాల విడుదల ప్రణాళికలను టోరెంట్ అటకెక్కించేసింది. 2013లో ఓ చైనా కంపెనీతో చర్చలు ప్రారంభించగా, తర్వాత అర్ధంతంగా ఆగిపోయాయి. ఇక సిప్లా సైతం చైనాలో రెండు పెట్టుబడుల నుంచి పక్కకు తప్పుకుంది. అయినప్పటికీ ఈ సంస్థ కోర్ థెరపీ ఔషధాల విడుదలతో మరోసారి పోటీపడే ప్రయత్నాలు చేస్తోంది. కొనుగోలు లేదా భాగస్వామ్యం ద్వారా రెస్పిరేటరీ ఔషధాలను విడుదల చేయాలనుకుంటోంది. వోకార్డ్ యాంటీ బయోటిక్ ఔషధాలను ఎగుమతి చేసే ఆలోచనతో ఉంది. ఇందుకోసం స్థానిక కంపెనీలతో క్లినికల్ ట్రయల్స్ కోసం చర్చలు జరుపుతోంది. ఐదు యాంటీ బయోటిక్ ఔషధాలను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికీ సవాలే? చైనాలో నిర్వహణ వాతావరణం ఇప్పటికీ సవాళ్లతో కూడినదేనని అంతర్జాతీయ వైద్య సేవల సంస్థ ఐక్యూవీఐఏ పేర్కొంది. అయితే, బలమైన డిమాండ్, ఇన్నోవేటివ్ ఉత్పత్తులకు సత్వర అనుమతులు అన్నవి ఔషధ కంపెనీలను ఆకర్షిస్తున్నాయని తెలిపింది. సంస్కృతికి సంబంధించిన సవాళ్లు, మార్కెట్ ఏకీకృతంగా లేకపోవడం అవరోధమన్న అభిప్రాయాలున్నాయి. యూరోప్, జపాన్ మార్కెట్లో అధిక అవకాశాలు ఉండటం, చైనా మార్కెట్లో ఇబ్బందుల వల్ల ఆదేశ మార్కెట్‌పై భారత కంపెనీలు ఇప్పటి వరకు పెద్దగా దృష్టి పెట్టలేదని భారత ఫార్మాస్యూటికల్ అలియన్స్ జనరల్ సెక్రటరీ డీజీషా చెప్పారు. దీనిపై వోకార్డ్ ఛైర్మన్ హబిల్ ఖొరాకివాలా స్పందిస్తూ... ‘‘చైనాలో అవకాశాలు వెదుకుతున్నాం. ఎందుకంటే యాంటీ బయోటిక్స్‌కు ఇది భారీ మార్కెట్’’ అని చెప్పారు. విలువ పరంగా అమెరికాతో పోలిస్తే చైనా యాంటీ బయోటిక్స్ ఔషధ మార్కెట్ విలువ రెట్టింపు స్థాయిలో ఉంది. -
ఎయిడ్స్ నివారణకు 'మ్యాజిక్' డ్రగ్!
న్యూయార్క్: ఎయిడ్స్ వ్యాధి నివారణకు అమెరికా పరిశోధకులు 'మ్యాజిక్' డ్రగ్‌ను అభివృద్ధి చేశారు. వ్యాధి కారక హ్యూమన్ ఇమ్యునో వైరస్(హెచ్ఐవీ).. నోరు, యోని ద్వారా వ్యాపించకుండా ఈ కొత్త మందు సమర్థవంతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు జంతువులపై జరిపిన ప్రీ క్లినికల్ పరిశోధనల్లో గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 1.5 మిలియన్ల మంది హెచ్ఐవీ కలిగిన మహిళలు ప్రెగ్నెంట్ అవుతున్నారు. సరైన చికిత్స లేని కారణంగా వీరిలో 45 శాతం మంది తమ పిల్లలకు తల్లిపాల ద్వారా వైరస్‌ను సంక్రమింపజేస్తున్నారు. కొత్త ఔషధం.. 4-ఇథినిల్-2-ఫ్లోరో-2'డిఆక్సియాడినోసైన్(ఈఎఫ్‌డీఏ) ద్వారా ఈ రకమైన సంక్రమణను సమర్థవంతంగా అరికట్టొచ్చని భావిస్తున్నారు. ఇక మహిళల్లో లైంగిక చర్య ద్వారా జరిగే సంక్రమణను కూడా ఇది అరికడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ముందుగా ఎలుకల్లో నిర్వహించిన పరిశోధనల్లో ఈ ఔషధం మంచి ఫలితాలు ఇచ్చిందని పరిశోధకులు వెల్లడించారు. పరిశోధన ఫలితాలను 'యాంటీమైక్రోబయల్ కీమోథెరపి' జర్నల్‌లో ప్రచురించారు. హెచ్ఐవీ వ్యాప్తి నివారణలో ఈఎఫ్‌డీఏ కీలకంగా పనిచేస్తుందని నార్త్ కరోలినా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎంజిలా వహెల్ తెలిపారు. -
సోరియాసిస్‌కు మందొచ్చింది!
న్యూయార్క్: చర్మం పొడిబారి పొట్టు రాలుతున్నట్లుగా అయి మచ్చలను కలిగించే తీవ్రమైన చర్మ వ్యాధి సోరియాసిస్‌కు అమెరికా శాస్త్రవేత్తలు మందు కనిపెట్టారు. ముఖ్యంగా మోచేతులు, మోకాళ్లలో ఈ వ్యాధి తరచుగా కనిపిస్తోంది. ఇప్పటివరకు తాత్కాలిక ఉపశమనం కోసం మాత్రమే గానీ ఖచ్చితమైన నిర్మూలనకు మందులేని ఈ వ్యాధికి శాస్త్రవేత్తలు సమర్థవంతమైన ఔషదాన్ని తయారు చేసినట్లు ప్రకటించారు. 'ఇజికిజుమాబ్'గా పిలువబడే ఈ నూతన ఔషధం క్లినికల్ ట్రయల్స్‌లో 80 శాతం మంది సోరియాసిస్ పేషంట్లకు సమర్థవంతంగా పనిచేసింది. సోరియాసిస్ తీవ్రత అధికంగా కలిగిన వారికి కూడా ఈ ఔషధం మంచి ఫలితాలను ఇచ్చినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. గతంలో ఈ వ్యాధిని సమూలంగా నిర్మూలించడం సాధ్యం కాదని భావించామని అయితే ఈ ఔషధం ఇంతకు ముందెప్పుడూ లేనంతగా సానుకూల ఫలితాలను ఇచ్చిందని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ డెర్మటాలజిస్ట్ కెన్నెత్ గోర్డాన్ తెలిపారు.