సోరియాసిస్కు మందొచ్చింది!
న్యూయార్క్: చర్మం పొడిబారి పొట్టు రాలుతున్నట్లుగా అయి మచ్చలను కలిగించే తీవ్రమైన చర్మ వ్యాధి సోరియాసిస్కు అమెరికా శాస్త్రవేత్తలు మందు కనిపెట్టారు. ముఖ్యంగా మోచేతులు, మోకాళ్లలో ఈ వ్యాధి తరచుగా కనిపిస్తోంది. ఇప్పటివరకు తాత్కాలిక ఉపశమనం కోసం మాత్రమే గానీ ఖచ్చితమైన నిర్మూలనకు మందులేని ఈ వ్యాధికి శాస్త్రవేత్తలు సమర్థవంతమైన ఔషదాన్ని తయారు చేసినట్లు ప్రకటించారు.
'ఇజికిజుమాబ్'గా పిలువబడే ఈ నూతన ఔషధం క్లినికల్ ట్రయల్స్లో 80 శాతం మంది సోరియాసిస్ పేషంట్లకు సమర్థవంతంగా పనిచేసింది. సోరియాసిస్ తీవ్రత అధికంగా కలిగిన వారికి కూడా ఈ ఔషధం మంచి ఫలితాలను ఇచ్చినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. గతంలో ఈ వ్యాధిని సమూలంగా నిర్మూలించడం సాధ్యం కాదని భావించామని అయితే ఈ ఔషధం ఇంతకు ముందెప్పుడూ లేనంతగా సానుకూల ఫలితాలను ఇచ్చిందని నార్త్వెస్టర్న్ యూనివర్సిటీ డెర్మటాలజిస్ట్ కెన్నెత్ గోర్డాన్ తెలిపారు.