
ప్రమాదకరమైన హెచ్‌ఐవీ వ్యాధిని నిరోధించేందుకు, చికిత్స చేసేందుకూ యూనివిర్శటీ ఆఫ్ నార్త్ కారొలీనా శాస్త్రవేత్తలు సరికొత్త పద్ధతిని సిద్ధం చేశారు. ఇంజెక్షన్ల ద్వారా శరీరంలోకి ఓ గాడ్జెట్‌లాంటిది ప్రవేశపెట్టి దాని ద్వారా మందు నిత్యం అందుబాటులో ఉండేలా చేయడం ఇందులోని విశేషం. రోజుకో మాత్ర వేసుకోవడం ద్వారా హెచ్‌ఐవీ రాకుండా ఉండేందుకు ఇప్పటికే అవకాశముంది. అలాగే యాంటీ రెట్రోవైరల్ మందులను క్రమం తప్పకుండా వాడటం వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తుందనీ మనకు తెలుసు.
అయితే ప్రతిరోజూ మందులేసుకోవడంలో ఉన్న ఇబ్బందులను దష్టిలో ఉంచుకుని మార్టినా కొవరోవా అనే శాస్త్రవేత్త ఈ కొత్త పద్ధతి కోసం పరిశోధనలు చేసి విజయం సాధించారు. ఈ పద్ధతిలో హెచ్‌ఐవీ మందు, ఓ సాల్వెంట్, ప్లాస్టిక్‌లను కలిపి ఓ గడ్డలా తయారు చేసి. గొట్టంలాంటి గాడ్జెట్‌లోకి ఎక్కిస్తారు. ఈ గొట్టాన్ని చర్మం అడుగుభాగంలోకి జొప్పించినప్పుడు ప్లాస్టిక్ క్రమేపీ కరిగిపోతూ వస్తుంది. ఈ క్రమంలో సాల్వెంట్‌తో కూడిన మందు నెమ్మదిగా అందడం మొదలవుతుంది. జంతువులపై జరిపిన ప్రయోగాల్లో ఒక్కో గాడ్జెట్ దాదాపు ఐదు నెలలపాటు మందు అందించినట్లు తెలిసిందని, ఎలాంటి ఇతర దుష్ఫలితాలూ లేవని మార్టినా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment