లండన్: కోవిడ్ చికిత్స కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ క్లినకల్ ట్రయల్స్‌లో పాల్గొన్న ఓ వ్యక్తి అనారోగ్యానికి గురవ్వడంతో ట్రయల్స్‌ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా బ్రెజిల్‌లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పరీక్షల్లో పాల్గొన్న ఓ వలంటీర్ మరణించాడు. అయితే అతడు తమ వ్యాక్సిన్ డోస్ తీసుకోలేదని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. అలానే మరణించిన వ్యక్తికి సంబంధించి ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేమని ఇందుకు సంబంధించిన అధికారి ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా బ్రెజిల్ ఆరోగ్య అధికారి మాట్లాడుతూ.. ‘వలంటీర్ మరణానికి సంబంధించిన సమాచారం సోమవారం తెలిసింది. ట్రయల్ భద్రత గురించి అంచనా వేసే అంతర్జాతీయ కమిటీ నుంచి పాక్షిక నివేదిక అందింది. ట్రయల్స్ కొనసాగించవచ్చని కమిటీ సూచించింది’ అని తెలిపారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేస్తున్న ఆస్ట్రాజెనెకా ప్రైవసీ, క్లినికల్ ట్రయల్స్ నిబంధనల కారణంగా వ్యక్తిగత కేసులపై వ్యాఖ్యనించలేమని తెలిపింది. అంతేకాక వ్యాక్సిన్ భద్రత గురించి జరిపిన స్వతంత్ర, కేర్‌ఫుల్ రివ్యూ ఎలాంటి ఆందోళన లేదని తెలియజేసింది. బ్రెజిల్ రెగ్యూలేటర్స్ ప్రయోగాలు కొనసాగించవచ్చని తెలిపినట్లు యూనివర్సిటీ సమాచార విభాగం అధిపతి స్టీఫెన్ రూస్ తెలిపారు. (చదవండి: కరోనా: 10 రకాల వ్యాక్సిన్ల అప్‌డేట్)
అమెరికాలో ట్రయల్స్‌కు బ్రేక్..
అమెరికాలో ఆస్ట్రాజెనెకా క్లినికల్ ట్రయల్స్ ఒక నెలకు పైగా నిలిపివేయబడ్డాయి. సెప్టెంబరులో యూకేలో వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొన్న ఓ వలంటీర్ అనారోగ్యానికి గురవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా ట్రయల్స్ ఆగిపోయాయి. అయితే యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, భారతదేశాలలో ఇటీవలి వారాల్లో తిరిగి ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. టీకా అధ్యయనాలలో తాత్కాలిక విరామాలు సాధారణం. అయితే, యూకే ఎపిసోడ్ గురించి మరింత సమాచారాన్ని బహిర్గతం చేయ్యాలంటూ ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అమెరికాలో ట్రయల్స్ నిలిచిపోవడంతో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాల గురించి ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ఈ సంఘటనలు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేటప్పుడు పరిశోధకులు ఎదుర్కొంటున్న అవరోధాలను హైలైట్ చేశాయి. మరో టీకా తయారీదారు, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో భాగంగా ఓ వలంటీర్ అనారోగ్యానికి గురవ్వడంతో ట్రయల్స్‌ని తాత్కలికంగా నిలిపివేశారు. (చదవండి: కరోనా అంతానికిది ఆరంభం)
ఆస్ట్రాజెనెకా, జేఅండ్‌జే టీకాలు రెండూ అడెనోవైరస్లపై ఆధారపడి ఉన్నాయి. తాజా పరిణామాలతో దశాబ్దాలుగా పరిశోధకులు ప్రయోగాత్మక చికిత్సలలో ఉపయోగించిన కోల్డ్ జెర్మ్స్ గురించి ఈ రెండు ట్రయల్స్ అనేక ప్రశ్నలు సంధించాయి. ఈ ఏడాది అమెరికాలో ట్రయల్స్ ప్రారంభించవచ్చని, యూఎస్‌ఏ వెలుపల పరీక్షల ఫలితాల ద్వారా వ్యాక్సిన్ ఆమోదం పొందుతుందని అక్టోబర్ ఆస్ట్రాజెనెకా తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment