
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్ పోలీస్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పెళ్లికాని యువతిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి గర్భందాల్చేలా చేసిందో ఔషద సంస్థ. ప్రయోగం వికటించడంతో యువతి పరిస్థితి విషమంగా మారింది. నగరానికి చెందిన ఓ ఐవీఎఫ్ సెంటర్ నిర్వాహకులు కామారెడ్డికి చెందిన ఓ యువతిపై గర్భందాల్చే ప్రయోగాలు నిర్వహించారు. సెంటర్ వైద్యులు ఇచ్చిన మందులు వికటించడంతో యువతి పరిస్థితి విషమంగా మారింది.దీంతో ఆమెను అమీర్‌పేటలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి పరారయ్యారు. యువతి తల్లిదండ్రులు రోడెక్కడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment