మహిళలకు మాతృత్వం అపురూపమైనది. చాలామంది అమ్మ నవ్వడం ఓ వరంలా భావిస్తారు. పిల్లలను కనడమే ఆడజన్మకు సార్థకత అని భావించేవాళ్లు ఉన్నారు. కానీ అమ్మగా ఓ స్త్రీ ఎప్పుడైతే మారుతుందో.. ఇక ప్రతి నిమిషం పిల్లల కోసమే వెచ్చిస్తుంది. తన గురించి ఆలోచించడమే మానేస్తుంది. అంతటి త్యాగమూర్తి స్త్రీ. అలాంటి మహిళలు మగవారికంటే తొందరగా వృద్ధాప్య ఛాయలు వచ్చి ముసిలి వాళ్లు అయిపోతుండటం జరుగుతుంది. అందుకు కారణం ఏంటో తాజా అధ్యాయనంలో వెల్లడించారు శాస్త్రవేత్తలు. దీనికి అదే కారణమంటూ షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు.
న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో మెయిల్‌మన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు మహిళల్లో వృద్ధాప్య ప్రక్రియ వేగవంతమవ్వడానికి గల కారణాలపై అధ్యయనం చేశారు. అందుకోసం సుమారు వెయ్యిమందికి పైగా మహిళలపై పరిశోధన చేశారు. వాళ్లలో పునరుత్పత్తి తర్వాత వస్తున్న డీఎన్‌ఏ మార్పులపై క్షణ్ణంగా అధ్య యనం నిర్వహించగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందుకోసం శాస్త్రవేత్తలు ఆరు విభిన్నమైన "ఎపిజెనెటిక్ క్లాక్‌లు" లేదా డీఎన్‌ఏ మిథైలేషన్ నమునా ప్రక్రియలతో మహిళల జీవసంబంధమైన వయసును లెక్కించారు.
ఆరేళ్ల సుదీర్ఘ పరిశోధనల్లో..
ఇలా అధ్యయనంలో పాల్గొన్న 825 మంది ఫలితాలు ప్రకారం..ప్రతి గర్భం స్త్రీకి రెండు నుంచి మూడు నెలలు బయోలాజికల్ వృద్ధాప్యంతో ముడి ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆరేళ్లుగా మహిళల్లో వస్తున్న మార్పులను అధ్యయనం చేయగా..గర్భవతుల జీవసంబంధమైన వృద్ధాప్యంలో ఎక్కువ పెరుగుదలను గుర్తించారు. ఈ అంశంపై కొలంబియా ఏజింగ్ సెంటర్లో అసోసియేట్ రీసెర్చ్ సైంటిస్ట్‌లు కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. గర్భధారణ జీవసంబంధమైన వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుందని.. ఈ ప్రభావాలు అధిక సంతానోత్పత్తి కలిగిన యువ స్త్రీలలో స్పష్టంగా కనిపిస్తాయని వెల్లడించారు.
అంతేగాదు ఎక్కువ గర్భాలు లేదా పిల్లలను కన్న మహిళల్లో జీవసంబంధమైన వృద్ధాప్యంలో ఎక్కువ పెరుగుదల కనిపించిదని అన్నారు. అందువల్లే గతంలో గర్భవతిగా ఉన్న స్త్రీలు బిడ్డను మోయని వారికంటే పెద్దవారిగా కనిపిస్తారని చెప్పారు. కొందరికి ధూమపానం అలవాట్లు, ఆర్థిక పరిస్థితి కారణంగా సరైన పోషాకాలతో కూడిన ఆహారం తీసుకోలేని మహిళలపై పరిశోధనలు చేయగా వారిలో జీవసంబంధమైన వృద్ధాప్యం మరింత వేగవంతంగా ఉందన్నారు. ముఖ్యంగా తండ్రులుగా ఉన్న పురుషుల్లో ఈ ప్రభావ లేదని అన్నారు. దీని ప్రభావం కేవలం గర్భం లేదా పాలిచ్చే తల్లుల్లో కనిపిస్తుందని అన్నారు.
ఇక్కడ ప్రతి స్త్రీ గర్భం సంఖ్య కూడా వారిలో జీవసంబంధమైన మార్పులు తీసుకువస్తుందని అధ్యయనంలో తేలింది. ఇవే వృద్ధాప్యంపై ప్రభావం చూపిస్తాయని తెలిపారు. అయితే కౌమారదశలోని గర్భం దాల్చినవారిపై ఈ ప్రభావాలు మరింత ఎక్కువగా ఉంటాయన్నారు. అందుకు ఆరోగ్య సంరక్షణ, సరైన వనరులు లేకపోవడం తదితరాలు కూడా ఈ ప్రభావానికి కారణమవుతాయని అన్నారు శాస్త్రవేత్తలు. అయితే ఇక్కడ మహిళల్లో వేగంగా వచ్చే ఈ వృద్ధాప్యం వారి ఆరోగ్యంపై ప్రభావం చూపి మరణానికి కారణమవుతోందా? లేదా? అన్నది తెలియాల్సి ఉందన్నారు.
ఇక్కడ తల్లుల సంరక్షణ అనేది ప్రధానమైనది అనేది ఈ అధ్యయనం పేర్కొంది. కొత్త తల్లులకు మంచి పోషకాలతో కూడిన ఆహారం, హెల్తీగా ఉండేలా తగిన వైద్యం ప్రాముఖ్యతలను తెలియజేస్తోంది ఈ పరిశోధన. అంతేగాఉ ముఖ్యంగా గర్భధారణ సమయంలో సరైన ఫుడ్, డైట్, మానసికంగా హెల్తీగా ఉంటే ఈ వృధ్యాప్య ఛాలయలను అధిగమించొచ్చని చెబుతున్నారు. ఈ పరిశోధన ఫలితాలు 'ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్'లో ప్రచురితమయ్యింది.
(చదవండి: మగవారికి మెనోపాజ్ వస్తుందా?..వైద్యులు ఏమంటున్నారంటే..!)
Comments
Please login to add a commentAdd a comment