
మృతులు తిరుపతమ్మ, ఉపేందర్(ఫైల్)
సాక్షి, బయ్యారం(వరంగల్): కరెంటు భార్యాభర్తల ప్రాణం బలితీసుకుంది. ఈ విషాద ఘటన శుక్రవారం రాత్రి మండలంలోని కొత్తపేట పంచాయతీ సింగారం–2 కాలనీలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కాలనీకి చెందిన అనపర్తి ఉపేందర్(33), తిరుపతమ్మ(30) భార్యాభర్తలు. భార్య తిరుపతమ్మ స్నానం చేసిన తరువాత టవల్‌ను ఇంట్లో ఉన్న వైరు తీగ(దండం)కు ఆరేసేందేకు వెళ్లింది.
దండానికి విద్యుత్ ప్రసారం కావడంతో ఆమె షాక్‌కు గురైంది. గమనించిన భర్త ఉపేందర్ ఆమెను రక్షించేందుకు పట్టుకోవడంతో అతనూ విద్యుదాఘాతానికి గురై కిందపడ్డాడు. స్థానికులు గమనించి వెంటనే ఇద్దరిని చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. మృతులకు పదేళ్లలోపు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.