విద్యుదాఘాతంతో మహిళ మృతి | woman died with electrick shok | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో మహిళ మృతి

Published Tue, Sep 27 2016 12:29 AM | Last Updated on Wed, Sep 5 2018 1:47 PM

woman died with electrick shok

కౌతాళం: విద్యుదాఘాతంతో ఓ మహిళ మృతి చెందిన సంఘటన సోమవారం మండల పరిదిలోని ఉప్పరహల్‌ గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పింజారి శేకమ్మ(35) నివసిస్తున్న గుడిసెకు ఉన్న విద్యుత్‌ సర్వీసు తీగ తెగి గుడిసెకు ఉన్న ఇనుప రేకుపై పడి విద్యుత్‌ సరఫరా అయింది.  గమనించని శేకమ్మ దుస్తులు ఆరేసుకునేందుకు ఇంటి నుంచి బయటకు వస్తుండగా గుడిసెకు ఉన్న రేకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. మూడు సంవత్సరాల కిత్రం ఆదోని సమీపంలో ఇస్వి వంతెన వద్ద శేకమ్మ భర్త నబీసాబ్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతురాలికి ముగ్గురు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement