సెల్ చార్జింగ్ పెడుతూ.. మహిళ మృతి
పెద్దవరం: నల్గొండ జిల్లాలో పెద్దవరం మండలంలో విషాదం నెలకొంది. ఓ మహిళ సెల్ చార్జింగ్ పెడుతూ..విద్యుదాఘాతానికి గురైంది. ఈ సంఘటన కోమటికుంట తండాలోమంగళవారం చోటుచేసుకుంది. ఉదయం బాణామతి సరోజిని(37) అనే వివాహిత సెల్ చార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది.దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.