సెల్‌ చార్జర్‌ విద్యుత్‌ షాక్‌కు గురై మహిళ మృతి | The woman died of cell charger electric shock | Sakshi
Sakshi News home page

సెల్‌ చార్జర్‌ విద్యుత్‌ షాక్‌కు గురై మహిళ మృతి

Mar 19 2018 11:20 AM | Updated on Sep 28 2018 3:39 PM

The woman died of cell charger electric shock - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

చండ్రుపట్ల (విస్సన్నపేట) : సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ పెట్టే సమయంలో చార్జర్‌ పిన్‌కు విద్యుత్‌ సరఫరా అయ్యి షాక్‌కు గురై మహిళ మృతి చెందిన ఘటన శనివారం రాత్రి మండలంలోని బాణావతు తండాలో జరిగింది. గ్రామానికి చెందిన బాణావతు ఏసు తన భార్య బాణావతు మాణిక్యం (32) కు రాత్రి 9 గంటల సమయంలో ఫోన్‌కు చార్జింగ్‌ పెట్టమన్నాడు. దీంతో ఆమె ఫోన్‌కు చార్జర్‌ వైరు గుచ్చే సమయంలో విద్యుత్‌ ప్రసరించి ఒక్కసారిగా కింద పడిపోయింది. వెంటనే ఆమెను విస్సన్నపేట ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, మృతురాలికి భర్త, ఒక కుమారుడు ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement