భర్తకు దూరం.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం.. చివరికి.. | Police Solved Woman Murder Case In Krishna District | Sakshi
Sakshi News home page

భర్తకు దూరం.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం.. చివరికి..

Published Tue, Mar 8 2022 4:32 PM | Last Updated on Tue, Mar 8 2022 4:32 PM

Police Solved Woman Murder Case In Krishna District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

పెనమలూరు(కృష్ణా జిల్లా): మండలంలోని పెదపులిపాక గ్రామంలో జరిగిన మహిళ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి పథకం ప్రకారమే హత్య చేశాడని సీఐ ఎం.సత్యనారాయణ తెలిపారు. ఆయన ఈ కేసు వివరాలను సోమవారం వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. గ్రామంలోని దళితవాడకు చెందిన వణుకూరు రజనీకి కొద్ది సంవత్సరాల క్రితం నాగభూషణంతో వివాహమైంది. ఆ తరువాత భర్తను వదిలి పుట్టింట్లో తల్లి పుష్పావతితో జీవిస్తోంది.

చదవండి:  ప్రేమపేరుతో నాటకం.. రెండు రోజుల్లో పెళ్లి అనగా..

దళితవాడలో బడ్డీ కొట్టుతో చిరు వ్యాపారం చేస్తూ జీవిస్తోంది. గ్రామానికి చెందిన రాడ్‌బెండింగ్‌ కార్మికుడు కురగంటి మోషేతో ఆమెకు పరిచయమైంది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. రజని వ్యవహారశైలి నేపథ్యంలో వారిద్దరి మధ్య కొద్దికాలంగా వివాదాలు జరుగుతున్నాయి. ఈ నెల ఐదో తేదీ రాత్రి రజనీని మోషే నమ్మించి గ్రామ శివారులో ఉన్న రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లోకి తీసుకెళ్లాడు. అక్కడ రాడ్‌తో ఆమెపై దాడి చేసి హత్య చేశాడు. ఈ కేసును ఛేదించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ హత్యలో ఇంకా ఎవరి పాత్ర అయినా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సీఐ సత్యనారాయణ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement