solved
-
మిస్టరీ వీడిన తేజస్ మర్డర్ కేసు
హైదరాబాద్: ప్రగతినగర్‌లో జరిగిన ప్రతీకార హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. 9 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరో నలుగురు మైనర్లు ఉన్నారు. ఎస్హెచ్ఓ ఉపేందర్ కథనం ప్రకారం వివరాలు.. గత ఏడాది అక్టోబర్ 24న తెల్లవారుజామున ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి దాసారం బస్తీలో తరుణ్‌రాయ్ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఏ–1గా షేక్ షరీఫ్ అలియాస్ అమీర్ షరీఫ్, ఏ–2గా అభిషేక్, అలియాస్ అభి, ఏ–3గా పిల్లి తేజస్ అలియాస్ తేజు, అలియాస్ డీల్, ఏ–4గా బండ నాగరాజు, ఏ–5గా రాహుల్, ఏ–6గా రాబిన్ బెన్నీలు నిందితులు. వీరిని ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. షేక్ షరీఫ్, తేజస్‌లు రెండు నెలల క్రితం బెయిల్‌పై విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన వీరిని ఎలాగైనా హత్య చేయాలని తరుణ్‌రాయ్ అనుచరులు పథకం రచించారు. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన తేజస్ బోరబండ నుంచి ప్రగతినగర్‌కు వచ్చి తన తల్లితో కలిసి అద్దె ఇంటిలో ఉండేవాడు. పక్కా ప్రణాళికతో.. తరుణ్‌రాయ్ బంధువులైన రోహిత్‌తో పాటు అతని అనుచరులు దినేష్ తదితరులు తేజస్‌ను హత్య చేయాలని పథకం వేసుకున్నారు. ఈ క్రమంలో ఎవరికీ అనుమానం రాకుండా శివప్పను ప్రగతినగర్‌లో ఉంటున్న తేజస్ దగ్గరకు మద్యం తాగడానికి పంపించారు. దీంతో శివప్పతో పాటు కౌశిక్, మహేశ్ ముగ్గురూ ఈ నెల 7న ప్రగతినగర్‌లోని తేజస్ ఇంటికి చేరుకుని రాత్రి 11 గంటల వేళ మద్యం తాగుతున్నారు. ఇదే సమయంలో మోతీనగర్‌లోని అల్సఫా హోటల్లో రోహిత్‌తో పాటు మరో 13 మంది తేజస్ హత్యపై చర్చించారు. శివప్ప ప్రగతినగర్‌లోని ఇంటి లొకేషన్‌ను షేర్ చేశాడు. తెల్లవారుజాము 2 గంటల సమయంలో సమీర్, సిద్ధేశ్వర్ నాయక్, జయంత్‌లు బైక్‌పై వచ్చారు. రోహిత్, దినే‹Ù, ప్రతీక్, రాహుల్, సునీల్, గానప్ప, సంతోష్, శ్రీకర్లు బైక్‌లపై లొకేషన్‌కు చేరుకుని చుట్టు పక్కల ప్రాంతాలను పరిశీలించారు. ఇదే సమయంలో శివప్ప సిగరెట్ తాగేందుకు కిందికి వెళదామనడంతో అందరూ కలిసి వచ్చారు. మద్యం మత్తులో ఉన్న తేజస్‌ను శివప్ప తన స్కూటీపై ఎక్కించుకుని సమీర్, జయంత్, సిద్ధేశ్వర్ల ఎదుట నిలిపాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన తేజస్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించే లోపే జయంత్, సిద్ధేశ్వర్ కత్తులతో తేజస్‌పై దాడి చేశారు. వెంటనే సమీర్ సిమెంట్ రాయితో తలపై బలంగా కొట్టాడు. అప్పటికే తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయిన తేజస్ రోడ్డుపై పడిపోయాడు. దాడి చేసే క్రమంలో సిద్ధేశ్వర్ చేతికి గాయమైంది. దీంతో వెంటనే శివప్ప.. సిద్ధేశ్వర్ నుంచి కత్తి తీసుకుని తేజస్ గొంతు కోశాడు. మర్మాంగాలపై రాళ్లతో దాడి చేశాడు. తేజస్ చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం అందరూ అక్కడి నుంచి డాన్సులు చేసుకుంటూ బైక్‌పై రీల్స్ చేసుకుంటూ వెళ్లిపోయారు. తేజస్ ఇంటిని అదీనంలోకి తీసుకుని.. ప్రగతినగర్‌లో నివాసం ఉంటున్న తేజస్ నివాసానికి తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో చేరుకున్న సుమారు 10 మందికి పైగా అతని ఇంటి పరిసరాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. దాడి అనంతరం 10 నిమిషాల్లోనే తేజస్‌ను హత్య చేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. రోహిత్, సమీర్, సిద్ధేశ్వర్, శివప్ప, గణేశ్, సునీల్, రాహుల్, తిరుమల్, మహేశ్‌లను రిమాండ్‌కు తరలించారు. దినేష్‌ను అరెస్ట్ చేయాల్సి ఉందని, ఈ కేసులో నలుగురు మైనర్లు సైతం ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితులు వినియోగించిన ఆరు సెల్ ఫోన్లు, నాలుగు బైక్‌లు స్వా«దీనం చేసుకున్నారు. బాలానగర్ జోన్ డీసీపీ ఆదేశాలతో కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాస్‌రావు నేతృత్వంలో కేసును ఛేదించిన ఎఎస్ఎహ్ఓ ఉపేందర్, ఎస్ఐలు మహేశ్, సత్యనారాయణ, కానిస్టేబుళ్లు రాజేశ్, యాదగిరి, బాల్‌రాజ్‌లను ఉన్నతాధికారులు అభినందించారు. నాడు తేజస్.. నేడు శివప్ప.. తరుణ్‌రాయ్ హత్య కేసులో ఏ–3గా ఉన్న తేజస్.. తరుణ్రాయ్కి నమ్మకంగా ఉండేవాడు. దీంతో అప్పట్లో ప్రత్యర్థులు తేజస్‌ను నమ్మకంగా వాడుకుని తరుణ్‌కు సంబంధించిన కదలికలను తెలుసుకుని అనువైన సమయం కోసం వేచి చూసి హత్య చేశారు. ఇదే క్రమంలో తరుణ్‌రాయ్ అనుచరులు సైతం తేజస్‌కు నమ్మకంగా ఉండే శివప్పను ప్రలోభపెట్టి తేజస్‌ను హత్య చేయడం గమనార్హం. అందరూ నేర చరిత్ర కలిగిన వారే.. తేజస్ హత్యకేసు నిందితుల్లో అందరూ నేర చరిత్ర కలిగిన వారే ఉన్నారు. తిరుమల్ రౌడీ షీటర్ కాగా..సిద్ధేశ్వర్ మర్డర్ కేసులో నిందితుడు. మిగతా వారిపై సైతం పలు రకాల కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. కాగా అందరూ 25 సంవత్సరాల వయసు లోపు వారే కావడం గమనార్హం. -
నిలోఫర్ ఆస్పత్రిలో మిస్సైన బాలుడి ఆచూకీ లభ్యం
-
5,58,883 కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన వచ్చింది. ఒక్క రోజే రికార్డు స్థాయిలో 5,58,883 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో కోర్టులో పెండింగ్ కేసులు 5,45,704 కాగా, ప్రీ లిటిగేషన్ కేసులు 13,179 ఉన్నాయి. మొత్తం రూ.180.10 కోట్ల పరిహారాన్ని అందించినట్లు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి.శ్యామ్ కోషి, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ టి.వినోద్ కుమార్ సూచనలతో ఈ కార్యక్రమం విజయవంతమైందని చెప్పారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో జస్టిస్ శ్యామ్ కోషితో చెక్కులను కూడా అందజేసినట్లు తెలిపారు. హైకోర్టులో 404 కేసులు.. హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ వినోద్ కుమార్ సూచనలతో నిర్వహించిన లోక్ అదాలత్‌లో హైకోర్టులోని 404 కేసులు పరిష్కారమయ్యాయి. అత్యదికంగా 204 మోటారు వాహనాల కేసులు, 71 కార్మికుల పరిహార వివాదానికి చెందినవి ఉన్నాయి. రూ.15 కోట్ల పరిహారాన్ని ప్రకటించారని, 1,100 మంది లబ్ధి పొందారని హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఎం.శాంతివర్ధని తెలిపారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ జి.వి.సీతాపతి, జస్టిస్ చల్లా కోదండరాం ఈ కేసులను పరిష్కరించారని వెల్లడించారు. -
విశాఖ కిడ్నాప్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు
-
‘దున్నపోతు’ సమస్యకు పరిష్కారం.. ఏంటా కథ.. అసలేం జరిగింది?
కణేకల్లు(అనంతపురం జిల్లా): తీవ్ర ఉత్కంఠకు తెరలేపిన అమ్మవారి దున్నపోతు సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. అందుబాటులో ఉన్న ఒకేఒక దున్నపోతుతో అంబాపురం, రచ్చుమర్రి గ్రామస్తులు ఊరి దేవర జరుపుకునేందుకు సిద్ధమైన నేపథ్యం తెలిసిందే. ఈ క్రమంలో దున్నపోతు తమదంటే తమదంటూ ఇరు గ్రామాల ప్రజలు వాగ్వాదానికి దిగి 20 రోజులుగా ఉత్కంఠకు తెరలేపారు. అసలేం జరిగిందంటే... ఈ నెల 17న అంబాపురంలో దేవర నిర్వహించాలని గ్రామస్తులు నిశ్చయించిన నేపథ్యంలో అమ్మవారి పేరుతో వదిలిన దున్నపోతు కోసం దాదాపు 30 రోజులకు పైగా వివిధ ప్రాంతాల్లో గాలించి చివరకు బొమ్మనహాళ్ మండలంలో కనిపించిన దేవరపోతును తీసుకెళ్లి బంధించారు. ఈ విషయం తెలుసుకున్న రచ్చుమర్రి గ్రామస్తులు అంబాపురానికి వెళ్లి తమ గ్రామ దేవత పేరున వదిలిన దున్నపోతును ఎలా బంధిస్తారంటూ వాదనకు దిగారు. అప్పటి నుంచి ఈ రెండు గ్రామాల మధ్య దున్నపోతు పంచాయితీ నలుగుతూ వస్తోంది ఎటూ తేల్చని పంచాయితీ.. ఇరు గ్రామాల ప్రజలను బుధవారం కణేకల్లు పోలీస్ స్టేషన్‌కు సీఐ యుగంధర్ పిలిపించుకుని మాట్లాడారు. ఒక్కొ గ్రామం నుంచి 80 నుంచి 90 మంది ప్రజలు తరలిరావడంతో పోలీస్ స్టేషన్ కిటకిటలాడింది. దున్నపోతును వదులుకునేది లేదంటూ అంబాపురం వాసులు వివరించారు. అయితే తమ గ్రామ దేవతకు సంబంధించిన దున్నపోతును తామూ వదులుకోబోమని రచ్చుమర్రి వాసులు తేల్చి చెప్పారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పంచాయితీ... మధ్యాహ్నం 1 గంట వరకూ సాగింది. సమస్యకు పరిష్కారం దక్కకపోవడంతో ఇరువైపులా ఐదుగురు చొప్పున గ్రామ పెద్దలను స్టేషన్ లోపలకు పిలుచుకెళ్లి సీఐ చర్చించారు. అయినా ఏకాభిప్రాయం కుదరలేదు. అనంతరం ఎవరికి వారు ఆ దున్నపోతు తమదంటే తమదంటూ దేవుడిపై ప్రమాణాలు చేశారు. చివరకు టాస్ వేసి తుది నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. అయితే టాస్ వేస్తే తమకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన ఇరు గ్రామాల ప్రజల్లో తలెత్తి చివరకు ఈ అంశాన్ని కూడా విరమించుకున్నారు. సెంటిమెంట్‌తో రాజీ కుదిర్చిన సీఐ.. చివరగా సీఐ యుగంధర్ ఇరు గ్రామాల పెద్దలను కూర్చొబెట్టి చర్చలు జరిపారు. ఈ నెల 17న అంబాపురంలో దేవర ఉందని, రచ్చుమర్రిలో దేవరకు ఇంకా ఏడాది గడువు ఉండడంతో దున్నపోతు కొనుగోలుకు అంబాపురం వాసులతో డబ్బిప్పిస్తానన్నారు. ఇది దైవ కార్యం కావడంతో అందరికీ మంచి జరుగుతుందని, మరో ఏడు రోజుల్లో ఊరి దేవర ఉండడంతో మంచి మనసుతో ఆలోచించి అంబాపురం వాసులకు సహకరించాలని, దీంతో అమ్మవారు కూడా శాంతిస్తారని సీఐ నచ్చచెప్పారు. చదవండి: వీడిన మిస్టరీ.. కూతురు వల్లే ఇలా జరిగిందా? సీఐ ప్రయోగించిన సెంటిమెంట్ అస్త్రం రచ్చుమర్రి వాసులను ఆలోచనలో పడేసింది. చివరకు అంబాపురంలో దేవర ముగిసిన తర్వాత ఓ దున్నపోతును కొనిస్తామంటూ ఆ గ్రామస్తులు భరోసానివ్వడంతో ఇరు గ్రామాల మధ్య రాజీ కుదిరింది. ఎట్టకేలకు దున్నపోతు సమస్యకు పరిష్కారం దక్కడంతో అంబాపురం వాసులు హర్షం వ్యక్తం చేశారు. -
వికారాబాద్: వింత పరికరంపై వీడిన మిస్టరీ
సాక్షి, వికారాబాద్: జిల్లాలోని మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో వింత పరికరం మిస్టరీ వీడింది. అదేంటో చూసేందుకు జనం ఎగబడి పోయారు. అయితే.. ఆ పరికరం స్పెయిన్ దేశానికి చెందిందిగా ధృవీకరించారు సైంటిస్టులు. భారత ప్రభుత్వ సహకారంతోనే ఈ ప్రయోగం నిర్వహించినట్లు తెలుస్తోంది. స్పెయిన్ టూరిజంలో జనాలను తరలించే పరికరంగా దీనిని గుర్తించారు. టాటా కన్సల్టెన్సీ వాళ్ళు రూపొందించిన ప్రయోగం దినివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది పూర్తిగా భారత ప్రభుత్వం సహాకారంతో నిర్వహించిన ప్రయోగం. ఇక్కడ ఈ ప్రయోగం విజయవంతం కావడంతో స్పేస్ దేశంలో టూరిజం లో భాగంగా జనాలను తరలించేందుకు ఉపయోగపడుతుంది. బెలున్ సహాయంతో ప్రయోగించాం. దీనిని పూర్తిగా ట్రాకింగ్ ద్వారా మానిటరింగ్ చేయడంతో జనాలు లేనివద్దనే దీగేలా చూశాం అని సైంటిస్టులు ప్రకటించారు. -
సాగునీటి సమస్య పరిష్కారం.. మాట నిలబెట్టుకున్న మంత్రి కాకాణి
సాక్షి, నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలంలోని రామదాసుకండ్రిగ, ఇడిమేపల్లి, గురివిందపూడి గ్రామ పంచాయతీల రైతులు వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. సుమారు వంద సంవత్సరాలుగా ఇక్కడి సాగునీటి సమస్యకు పరిష్కారం లభించలేదు. సమీపంలో కనుపూరు కాలువ ఉపకాలువ అయిన గురివిందపూడి బ్రాంచ్ కెనాల్ ఉంది. ఇందులో సాగునీరున్నా ఆయకట్టు స్థిరీకరణ సాధ్యపడలేదు. ఎట్టకేలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి రైతుల నిరీక్షణకు తెరదించారు. ఆయన తీసుకున్న చర్యలతో సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. కనుపూరు కాలువ నుంచి అందుబాటులోని చెరువులకు సాగునీరు సరఫరా సాధ్యమైంది. దీంతో అధికారికంగా మూడువేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. అనధికారికంగా మరో రెండువేల ఎకరాలకు నీరందుతుంది. ఈ నేపథ్యంలో ఆయా పంచాయతీల రైతులు ఆనందం వ్యక్తం చేశారు. పట్టించుకోని టీడీపీ సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అనేక పర్యాయాలు పాలకుల దృష్టికి ఆ మూడు పంచాయతీల రైతులు తీసుకెళ్లారు. చెరువులున్నాయి, జలాశయాల నుంచి నీరు వచ్చే మార్గాలను పునరిద్ధరించాలని ఆభ్యర్థించారు. 22 సంవత్సరాలు పాలించిన టీడీపీ నేతలకు అక్కడి రైతుల విన్నపాలు చెవిక్కెలేదు. వర్షం లేకపోతే భూగర్భ జలాలు అడుగంటిపోయి, తాగునీటికి సైతం ఇబ్బందులు పడేవారు. టీడీపీ హయాంలో తాగునీటి ఇక్కట్లను ప్రజలు చవిచూశారు. ఇలాంటి పరిస్థితుల్లో 2019 ఎన్నికలు సమీపించాయి. మూకుమ్మడిగా తాగు, సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ముక్తకంఠంతో కోరారు. హామీని నిలబెట్టుకున్న మంత్రి 2019 ఎన్నికలకు ముందు వాస్తవ పరిస్థితిని అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి దృష్టికి ఆయా పంచాయతీల ప్రజలు తీసుకెళ్లారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే సొంత నిధులు వెచ్చించి కాలువలను పునరిద్ధరిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో వైఎస్సార్సీపీ అధికార పగ్గాలు అందుకుంది. మంత్రి కాకాణి రూ.40 లక్షల సొంత నిధులు వెచ్చించి వెంకటాచలంలోని కాకెద్దులగుంటచెరువు నుంచి రామదాసుకండ్రిగ, గురివిండపూడి, ఇడిమేపల్లి చెరువులకు సాగునీరు వెళ్లేలా కాలువల పునరుద్ధరణ పనులు చేయించారు. సుమారు 11 కిలోమీటర్లు పొడవున్న కాలువ పనులను 16 రోజులపాటు రేయింబవళ్లు 12 మెషీన్లతో చేశారు. నేడు కాలువల్లో నీళ్లు రావడంతో రైతుల ఆనందం హద్దులు దాటింది. అక్కడి నుంచి చెరువులకు నీరు విడుదల చేశారు. రామదాసుకండ్రిగ చెరువు పరిశీలనకు వెళ్లిన మంత్రి గోవర్ధన్‌రెడ్డికి రైతాంగం బ్రహ్మరథం పట్టారు. గుర్రపు బండిపై తీసుకెళ్లి తమ సంతోషాన్ని బాహాటంగా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణిని ఘనంగా సన్మానించారు. జీవింతాం గుర్తించుకుంటాం రామదాసుకండ్రిగ రైతుల ఎన్నో ఏళ్ల నాటి కలను మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సాకారం చేశారు. ఎంతోమంది మా గ్రామానికి వచ్చి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. కానీ అందరిలా కాకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చిన మంత్రిని ఎప్పటికీ మర్చిపోలేం. జీవితాంతం గుర్తించుకుంటాం. – షేక్ షాజహాన్, మాజీ సర్పంచ్, రామదాసుకండ్రిగ బిడ్డల భవిష్యత్ బాగుంటుంది చెరువు ఆయుకట్టు భూమి ఉన్నా.. నీరు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఏళ్ల తరబడి భూములు బీడుగా మారాయి. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చొరవతో మా బిడ్డల భవిష్యత్ బాగుంటుంది. సాగునీటి కాలువను తవ్వించి, చెరువులకు నీటిని విడుదల చేయడం సంతోషాన్ని ఇచ్చింది. ఈ ఏడాది ఎలాంటి కష్టాలు లేకుండా పంటలు పండించుకుంటాం. – వెడిచర్ల సుబ్రహ్మణ్యం, రైతు శాశ్వత పరిష్కారం లభించింది చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి సంవత్సరం సాగునీటి సమస్యలతో పంటలు పండేవి కావు. మూడేళ్ల నుంచి గోవర్ధన్‌రెడ్డి ప్రత్యేకశ్రద్ధతో కొంతమేరకు పంటలు పండించుకున్నాం. ఇప్పుడు సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు. చెరువులకు నీరు విడుదల చేయడంతో ఇక మాకు నీటి కష్టాలుండవు. సాగునీటి సమస్యను పరిష్కరించిన మంత్రికి జీవితాంతం రుణపడి ఉంటాం. – వాకా సుబ్బారావు, రైతు -
మొబైల్ ఫోన్స్ ఛార్జింగ్ కష్టాలకు చెక్..
-
అడ్వకేట్ మల్లారెడ్డి కేసును చేధించిన పోలీసులు
-
ఒకరితో పెళ్లి.. ఇద్దరితో వివాహేతర సంబంధం.. వీడిన హత్యకేసు మిస్టరీ
తెనాలి రూరల్(గుంటూరు జిల్లా): నూతక్కి రవికిరణ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి సోమవారం అర్ధరాత్రి కోర్టులో హాజరుపరిచారు. చుండూరు సీఐ బత్తుల కల్యాణ్‌రాజు అందించిన వివరాలు.. మూల్పూరుకు చెందిన రవికిరణ్ గత నెల 20వ తేదీ నుంచి కనబడకుండా పోవడంతో కుటుంబసభ్యులు అమృతలూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హత్యకు గురై ఉంటాడన్న అనుమానం రావడంతో విచారణాధికారి సీఐ కల్యాణ్‌రాజు కేసుపై మరింత శ్రద్ధ పెట్టారు. తెనాలికి చెందిన రౌడీ షీటర్ సముద్రాల పవన్‌కుమార్ అలియాస్ లడ్డూ, మరి కొందరు హత్య చేసి ఉంటారని కొన్ని ఆధారాల ద్వా రా గుర్తించారు. చదవండి: మగతనం లేదని హేళన.. కాస్త శ్రుతిమించడంతో చివరికి ఏం జరిగిందంటే? దర్యాప్తు కొనసాగుతూ ఉండగా రవికిరణ్ ప్రియురాలే అతడి హత్యకు కారకురాలైందని గుర్తించారు. వేమూరు మండలం చదలవాడకు చెందిన అత్తోట దీప్తి, పవన్‌కుమార్ సుమారు 12 ఏళ్ల పాటు ప్రేమించుకున్నారు. వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఆమె వేరే వివాహం చేసుకుంది. అయినా లడ్డూతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే ఉంది. మూడేళ్ల క్రితం ఆమెకు మూల్పూరుకు చెందిన రవికిరణ్ పరిచయమయ్యాడు. అతడితోనూ వివాహేతర బంధం ఏర్పడింది. ఈ విషయం లడ్డూకు తెలిస్తే తనను చంపుతాడని భయపడిన ఆమె, కొన్నాళ్లుగా రవికిరణ్‌ను దూరం పెడుతూ వచ్చింది. రవికిరణ్ ఆమెకు తరచూ ఫోన్లు చేస్తూ ఉండడంతో తనను అతను వేధిస్తున్నాడని మొదటి ప్రియుడు లడ్డూకు చెప్పింది. అతడు రవికిరణ్‌కు ఫోన్ చేసి పిలిపించాడు. లడ్డూ మరి కొందరు కలసి కర్రలతో దాడి చేయడంతో రవికిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని సంగం జాగర్లమూడి కాలువలో పడేశామని నిందితులు అంగీకరించారు. హత్య జరిగిన ప్రదేశంలో కర్రలు, రక్తం మరకలను గుర్తించారు. దీప్తి, లడ్డు, మక్కెన వంశీ, నన్నపనేని కృష్ణ, పిల్లి రవికుమార్, తూమాటి ప్రశాంత్ హత్యకు కారకులని గుర్తించారు. వీరిలో ప్రశాంత్ పరారీలో ఉండగా, మిగిలిన ఐదుగురు నిందితులను సోమవారం రాత్రి పొద్దుపోయాక కోర్టు లో హాజరుపరిచినట్లు సీఐ కల్యాణ్‌రాజు తెలిపారు. -
భర్తకు దూరం.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం.. చివరికి..
పెనమలూరు(కృష్ణా జిల్లా): మండలంలోని పెదపులిపాక గ్రామంలో జరిగిన మహిళ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి పథకం ప్రకారమే హత్య చేశాడని సీఐ ఎం.సత్యనారాయణ తెలిపారు. ఆయన ఈ కేసు వివరాలను సోమవారం వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. గ్రామంలోని దళితవాడకు చెందిన వణుకూరు రజనీకి కొద్ది సంవత్సరాల క్రితం నాగభూషణంతో వివాహమైంది. ఆ తరువాత భర్తను వదిలి పుట్టింట్లో తల్లి పుష్పావతితో జీవిస్తోంది. చదవండి: ప్రేమపేరుతో నాటకం.. రెండు రోజుల్లో పెళ్లి అనగా.. దళితవాడలో బడ్డీ కొట్టుతో చిరు వ్యాపారం చేస్తూ జీవిస్తోంది. గ్రామానికి చెందిన రాడ్‌బెండింగ్ కార్మికుడు కురగంటి మోషేతో ఆమెకు పరిచయమైంది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. రజని వ్యవహారశైలి నేపథ్యంలో వారిద్దరి మధ్య కొద్దికాలంగా వివాదాలు జరుగుతున్నాయి. ఈ నెల ఐదో తేదీ రాత్రి రజనీని మోషే నమ్మించి గ్రామ శివారులో ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్లోకి తీసుకెళ్లాడు. అక్కడ రాడ్‌తో ఆమెపై దాడి చేసి హత్య చేశాడు. ఈ కేసును ఛేదించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ హత్యలో ఇంకా ఎవరి పాత్ర అయినా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సీఐ సత్యనారాయణ తెలిపారు. -
సులభంగా శ్రీవారి దర్శనం
-
Karimnagar: ‘ఖాకీ’ దిద్దిన కాపురం
‘కరీంనగర్‌కు చెందిన యువకుడికి పక్కజిల్లాకు చెందిన యువతితో రెండేళ్లక్రితం వివాహమైంది. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండడంతో ఒకరిపై ఒకరి ఆధిపత్యం ఎక్కువైంది. చిన్న విషయాలకే పెద్దగొడవలు జరిగాయి. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు సైతం జరిగాయి. అయినా సమస్య సద్దుమణగకపోవడంతో మహిళా పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. అక్కడి అధికారులు ఆ జంటకు కౌన్సెలింగ్ ఇచ్చి కాపురాన్ని నిలబెట్టారు.’ సాక్షి, కరీంనగర్: మూడుముళ్ల బంధం మూణ్నాళ్ల ముచ్చటగా మారుతోంది. జీవితాంతం కలిసి ఉంటామని అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచిన ఆ జంటలు విడిపోతామంటూ ఠాణామెట్లు ఎక్కుతున్నారు. చిన్నగొడవలకే పంచాయితీల వరకు వెళ్తున్నారు. కలిసి ఉండమంటూ.. పచ్చటికాపురాన్ని కూల్చుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో ఠాణా మెట్లు ఎక్కుతున్న పలు జంటలకు పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇద్దరిమధ్య సయోధ్య కుదిరించి కాపురాలను నిలబెడుతున్నారు జిల్లా మహిళా పోలీసుస్టేషన్ అధికారులు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు స్టేషన్‌కు 794 ఫిర్యాదులు రాగా.. 609 పరిష్కరించి వారికి కొత్తజీవితాలను అందించారు. వేరు కాపురాల్లోనే ఎక్కువ.. ► ప్రస్తుతం ట్రెండు మారింది. గతంలో పెద్దలతో కలిసి ఉన్నప్పుడు దంపతుల మధ్య చిన్న సమస్య వచ్చినా.. ఇంట్లోనే పరిష్కరించేవారు. ఇద్దరికీ సర్దిచెప్పేవారు. ఇప్పుడు అలా కాదు. పెళ్లయ్యాక చాలామందికి పెద్దలతో కలిసి ఉండడం రుచించడం లేదు. పెళ్లికి ముందే ఉద్యోగ, వ్యాపారరీత్యా వేరుకాపురం పెట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. పెళ్లయిన నాలుగు రోజులకే ఇంటివారికి దూరంగా వెళ్తున్నారు. ► అలా వెళ్లినవారు కొన్నాళ్లపాటు బాగానే ఉంటున్నా.. తరువాత దంపతుల మధ్య ఆధిపత్యం పెరుగుతోంది. అభిప్రాయభేదాలతో చిన్నగొడవలకే విడాకుల వరకు వెళ్తున్నారు. చాలాకేసుల్లో రెండు, మూడు నెలల్లోనే విడాకుల వరకు రావడం బాధాకరమని, ఇలాంటివి వేరుకాపురంలోనే ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని పోలీసులు చెబుతున్నారు. ► తల్లిదండ్రులు సైతం పిల్లలకు పెళ్లికి ముందు కొన్ని నైతిక విలువలు నేర్పించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. దాంపత్యబంధం గురించి, అత్తవారింట్లో మెదలాల్సిన పద్ధతుల గురించిచెప్పాలని అంటున్నారు. చిన్న సమస్య రాగానే పెద్దలు కూడా ఆలోచన లేకుండా వ్యవహరించడం సరికాదని సూచిస్తున్నారు. ఇద్దరికి ప్రశాంతంగా సర్దిచెప్పాలని చెబుతున్నారు. ► దంపతులు పరస్పరం అర్థం చేసుకోవాల్సింది పోయి, అనుమానం పెంచుకోవడం, పట్టించుకోకపోవడం కాపురాల్లో చిచ్చుపెడుతుందని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. మద్యానికి బానిసకావడం, వివాహేతర సంబంధాలు సరికాదని అంటున్నారు. కౌన్సెలింగ్‌కు వచ్చేవారు చాలామంది ప్రేమ వివాహాలు చేసుకున్నవారే ఉంటున్నారని ఎస్సై సురేందర్ తెలిపారు. ► దంపతులు గొడవలతో కరీంనగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌కు రాగానే.. వారికి వేర్వేరుగా కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తారు. భార్యాభర్తల బంధం గురించి వివరిస్తుంటారు.స్టేషన్‌లోని కౌన్సిలింగ్ సెంటర్ సైకాలజిస్టులు, న్యాయనిపుణులు, పోలీసులు కలిసి వారికి సర్దిచెబుతుంటారు. సమస్యను బట్టి అనుకూలమైన పరిష్కారాన్ని మార్గం చూపుతుంటారు. ఆవేశంగా వచ్చిన దంపతులు ఏకమై వెళ్లడం సంతోషంగా ఉందని పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమస్య చిన్నగా ఉన్నప్పుడే పరిష్కరించుకోవాలి దంపతుల మధ్య ఏర్పడిన సమస్యను చిన్నదిగా ఉన్నప్పుడే పరిష్కరించుకోవాలి. ప్రతీ విషయంలో గొడవపడడం మానుకోవాలి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని పరస్పరం గౌరవం ఇచ్చుకోవడంతో పాటు అత్తింటివారు, పుట్టింటి విలువలకు గౌరవం ఇవ్వాలి. ఇలా ముందకుసాగితే వివాహబంధం సంతోషంగా ఉంటుంది. గొడవలు పెట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన కేసుల్లో కౌన్సెలింగ్ ఇస్తూ.. దంపతులను కలుపుతున్నాం. – శ్రీనివాస్, సీఐ, కరీంనగర్ మహిళా పోలీస్‌స్టేషన్ చదవండి: చలానా పెండింగ్ ఉంటే బండి సీజ్ -
కిడ్నాప్ : రూ. 60 లక్షలతో ప్రారంభించి.. రూ.10 వేలకు
సాక్షి, గుంటూరు/సత్తెనపల్లి: సత్తెనపల్లి పట్టణంలో ఆరో తరగతి చదువుతున్న బాలుడి కిడ్నాప్ ఘటన మంగళవారం కలకలం సృష్టించింది. నిర్మాలా నగర్ రైల్వే గేట్ వద్ద నివాసం ఉంటున్న తుమ్మా వెంకటేశ్వర్లు, లీలావతి దంపతులకు వినయ్‌కుమార్, దేవిప్రియ సంతానం. వెంకటేశ్వర్లు వస్త్ర వ్యాపారం చేస్తుంటారు. సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో వినయ్ ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. 10 గంటల ప్రాంతంలో “మేము మీ కుమారుడిని కిడ్నాప్ చేశాం’ అంటూ వినయ్ తాత సాంబశివరావు సెల్ నంబర్ నుంచి వెంకటేశ్వర్లుకు ఫోన్ వచ్చింది. “మేము నీ కుమారున్ని కిడ్నాప్ చేశాం. పోలీసులకు సమాచారం ఇస్తే వాడిని ముక్కలుగా నరికి అవయవాలు ఇంటికి పంపుతాం. మేం చెప్పినట్టు నువ్వు చెయ్. రూ.60 లక్షలు ఇస్తే నీ కుమారుడిని వదిలేస్తాం. లేదంటే ముక్కలుగా నరికి అవయవాలు ఒక్కొక్కటిగా మీ ఇంటికి పంపుతాం’ అంటూ విజయవాడ పటమటకు చెందిన మున్నా గ్యాంగ్ పేరుతో బెదిరించారు. దీంతో భయాందోళనకు గురైన వెంకటేశ్వర్లు అర్ధరాత్రి 12 గంటల సమయంలో సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమ కుమారుడు కనిపించడంలేదని, కిడ్నాప్ చేశామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని పోలీసులకు చెప్పారు. తన తండ్రి సాంబశివరావు ఫోన్లోని సిమ్‌ను సోమవారం వినయ్ అడిగి తీసుకున్నాడని, ఆ సిమ్‌కు చెందిన నంబరు నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని వివరించారు. ఇది కిడ్నాపా? లేక బెదిరించడం కోసం ఎవరైనా ఈ పనిచేస్తున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సెల్ టవర్ లొకేషన్ పరిశీలించగా సత్తెనపల్లి పట్టణంలోని సంగం బజార్ ప్రాంతంలో చూపించింది. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు రెక్కీ చేపట్టారు. మంగళవారం ఉదయం సత్తెనపల్లి పట్టణంలోకి వచ్చి, పోయే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రూ.60 లక్షలతో ప్రారంభించి.. రూ.10 వేలకు తొలుత బాలున్ని వదిలిపెట్టడానికి రూ.60 లక్షలు డిమాండ్ చేసిన అవతలి వ్యక్తులు, వెంకటేశ్వర్లు తన వద్ద అంత సొమ్ము లేదని చెప్పడంతో రూ.10 లక్షలు, రూ.2 లక్షలు, రూ.50 వేలు ఇస్తే వదిలేస్తామని బేరమాడుతూ వచ్చారు. చివరికి రూ.10 వేలు తీసుకొచ్చి సత్తెనపల్లి పట్టణంలోని నరసరావుపేట రోడ్డులోని వెంకటపతి కాలనీ దగ్గరకు వచ్చి అక్కడున్న ఓ కారు వద్ద డబ్బు పెడితే బాలుడిని వదిలేస్తామని ఒప్పందం చేసుకున్నారు. దీంతో వెంకటేశ్వర్లు మంగళవారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు చెప్పిన చోటకు వచ్చి కారుపై డబ్బు ఉంచి దూరంగా వేచి ఉన్నారు. సుమారు ఐదు గంటల సమయంలో పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రదేశంలోని చెట్ల పొదల్లోంచి బాలుడిని తీసుకు వచ్చి రోడ్డుపై వదిలేసి పక్కనున్న వ్యక్తి పారిపోయాడు. బాలుడిని పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం డీఎస్పీ విజయభాస్కర్‌రెడ్డి, సీఐ విజయచంద్ర ఆ బాలుడి నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. బాలుడి మాటలు ఇలా.. తన స్నేహితుడితో కలిసి నడిచి వెళ్తుంటే గుర్తు తెలియని వ్యక్తులు తనను బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారని బాలుడు తుమ్మా వినయ్ పోలీసులు విచారణలో తొలుత తెలిపాడు. ఈ నేపథ్యంలో వినయ్ చెప్పిన బాలుడిని విచారణలో భాగంగా పిలిపించగా అతను సోమవారం సత్తెనపల్లి పట్టణంలోనే లేడని తేలింది. దీంతో బాలుడు వినయ్, తల్లిదండ్రులను విడివిడిగా పోలీసులు విచారిస్తున్నారు. సైకిల్, టీవీఎస్ మోపెడ్ కొనిపెట్టాలని తరచూ ఇంటిలో మారం చేస్తుండేవాడని పోలీస్ విచారణలో తెలిసిందని సమాచారం. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తన కోర్కెలు తీర్చడం లేదని తన స్నేహితులతో కలిసి బాలుడే కిడ్నాప్ డ్రామా ఆడాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ కెమెరా ఫుటేజ్‌లు, వినయ్ తాత సిమ్ కాల్ డేటా సేకరించి వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాలుడి ఆచూకీ కోసం సోమవారం అర్ధరాత్రి నుంచి ఏడు బృందాలు నిర్విరామంగా కృషి చేశాయని సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. ఐదుగురు పాత నేరస్తులను అదుపులోకి విచారించామన్నారు. గంటల వ్యవధిలోనే బాలుడి కేసును ఛేదించామన్నారు. ఏం జరిగింది? ఎవరు బాలున్ని కిడ్నాప్ చేశారు? అనే వివరాలు ఇంకా తెలియలేదు, విచారణ కొనసాగుతోందన్నారు. -
దీపిక కిడ్నాప్ కథ సుఖాంతం
-
భర్తే హంతకుడు
ఏలూరు టౌన్: ఏలూరు రూరల్ పోలీసు స్టేషన్లో ఏలూరు డీఎస్పీ డాక్టర్ ఓ.దిలీప్‌కిరణ్ శుక్రవారం విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఆయనతోపాటు రూరల్ సీఐ ఏ.శ్రీనివాసరావు ఉన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పెదపాడు మండలం వడ్డిగూడెం గ్రామానికి చెందిన ఘంటసాల ఉదయకుమార్ రాజుకు, కృష్ణాజిల్లా మండవల్లి మండలం పెనుమాకలంక గ్రామానికి చెందిన ఘంటసాల చంటితో 2013లో వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం ఉన్నారు. భర్త ఉదయకుమార్ రాజు వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఇరువురికీ తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 2018 మార్చి 30న అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరగటంతో ఉదయకుమార్ రాజు తన భార్య చంటిని రాడ్డుతో తలపై బలంగా కొట్టటంతో ఆమె చనిపోయింది. అప్పట్లో మృతురాలి తండ్రి మోరు రామకృష్ణ పెదపాడు పోలీసులకు తన కుమార్తె ప్రమాదవశాత్తు చనిపోలేదనీ, అనుమానం ఉందని ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కానీ దర్యాప్తు చేయకుండా ఫైలు పక్కనబెట్టేశారు. మిస్టరీ వెలుగులోకి.. పెదపాడు పోలీసు స్టేషన్లో పాత కేసులను పరిశీలిస్తున్న ఏలూరు రూరల్ సీఐ శ్రీనివాసరావుకు ఈ అనుమానాస్పద మృతికేసు ఫైలు కనిపించింది. దీంతో మృతురాలు చంటి హత్య వెనుక అసలు మిస్టరీ బయటపడింది. ఆమె మరణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఆమె రాసినట్లు ఒక ఉత్తరాన్ని భర్త ఉదయకుమార్ రాజు రాశాడు. మెడకు తాడు బిగించి ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు చూపించాలని ప్రయత్నించాడు. కానీ ఆమె చెవిలో నుంచి రక్తం కారుతూ ఉండడంతో మళ్లీ మృతదేహాన్ని కిందికి దింపి బాత్రూమ్లో కాలుజారి ప్రయాదవశాత్తు పడిపోయి తలకు బలమైన గాయం తగిలి మరణించినట్లు చిత్రీకరించాడు. పోస్టుమార్టం రిపోర్ట్‌ను పరిశీలించిన పోలీసు అధికారులు కేసు మిస్టరీపై దృష్టి సారించారు. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లెటర్, మృతురాలి మెడకు ఉరివేసినట్లు గాయం, తలలో బలమైన గాయం, లివర్ సైతం దెబ్బతిన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు హత్య కేసుగా నిర్ధారణకు వచ్చారు. కాగా హత్య చేసిన భయంతో గత మూడు నెలలుగా గ్రామంలో లేకుండా తిరుగుతున్న నిందితుడు ఉదయకుమార్ రాజును మాటువేసిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు చెప్పిన నిజాలు పోలీసులను విస్తుగొలిపేలా చేశాయి. హత్య తానే చేశానని ఒప్పుకోవడంతో అతడ్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు. కేసు ఛేదించటంలో ప్రతిభ చూపిన హెచ్‌సీ హమీద్, పీసీలు సతీష్, కిషోర్, నరేష్‌లను జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ అభినందించారు. -
కిడ్నాప్.. ఆపై పెళ్లి
శాంతినగర్ (అలంపూర్): బాలికను కిడ్నాప్ చేసి.. పెళ్లి చేసుకొని మూడున్నరేళ్లుగా సికింద్రాబాద్‌లో మకాం పెట్టాడు. ఈ క్రమంలో వారికి పాప జన్మించింది. ఆధార్ కార్డు ఆధారంగా చిరునామా తెలుసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్‌కు చెందిన షఫీ ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్. ఆ సమయంలో బాలికకు (14) మాయ మాటలు చెప్పి 2016 ఏప్రిల్ 26న హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. దీనిపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆధార్ కార్డు ఆధారంగా మూడున్నరేళ్ల తర్వాత కేసు ఛేదించారు. -
నిండు ప్రాణం ఖరీదు.. రూ.40 వేలు!
సబ్బవరం(పెందుర్తి): మండలంలోని అమృతపురం శివారులో ఇటీవల లభ్యమైన కాలిన గుర్తు తెలియని యువకుని మృతదేహం కేసును సబ్బవరం పోలీసులు 7 రోజుల్లో ఛేదించారు. దొంగిలించిన సొమ్ము రూ.40 వేలు తిరిగి ఇవ్వలేదని ఓ ఆటో డ్రైవర్ ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు తేల్చారు. సీఐ చంద్రశేఖరరావు, ఎస్ఐ దీనబంధు శుక్రవారం ఈ కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఈ నెల 19 అర్ధరాత్రి సమయంలో అమృతపురం శివారు అమ్మరపిండివానిపాలెం సమీపంలో విధులు నిర్వహిస్తున్న గెయిల్ పైప్‌లైన్ సెక్యూరిటీ సిబ్బంది.. కాలిన మృతదేహాన్ని గుర్తించి 20న సబ్బవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన విషయం పత్రికల్లో రావడంతో 23న అనంతగిరి మండలం కోరపర్తి గ్రామానికి చెందిన మృతుడి తండ్రి దారపర్తి పోతురాజు తన కుమారుడు కనిపించడం లేదంటూ సబ్బవరం పోలీసులను ఆశ్రయించారు. ఘటనా స్థలంలో మృతదేహం వద్ద లభ్యమైన ఆధారాలు చూసి తన కుమారుడు దేముడబ్బాయి(19)గా గుర్తించారు. నిందితుడ్ని పట్టించిన ఫోన్ నంబర్ మృతుని వివరాలు తెలియడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దేముడు తండ్రిని ప్రశ్నించగా.. తనకు ఓ వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చిందని, మీ అబ్బాయి మా దగ్గర డబ్బులు తీసుకున్నాడని, చెల్లించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, అవసరమైతే చంపేస్తానని బెదిరించినట్టు చెప్పాడు. ఆ ఫోన్ నంబర్ ఆధారంగా గురువారం ఉదయం 11.15 గంటలకు ఆటో డ్రైవర్ జొన్నాడ నర్సింహమూర్తి(30)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారించడంతో హత్య చేసినట్టు అంగీకరించాడు. చీడికాడ మండలం తంగుడుబిల్లికి చెందిన నర్సింహమూర్తి గాజువాక సమీప శ్రీనగర్‌లోని సుందరయ్య కాలనీలో నివాసం ఉంటున్నాడు. నవంబర్ చివరిలో తన రూమ్‌లో రూ.40 వేలు పోయింది. ఆ పక్క గదిలో రామకృష్ణ, దేముడబ్బాయి అద్దెకు ఉంటున్నారు. దేవరాపల్లికి చెందిన రామకృష్ణకు మెకానిక్ షెడ్ ఉంది. అందులో పని చేస్తున్న జగదీష్ అనే వ్యక్తికి దేముడబ్బాయి స్నేహితుడు కావడంతో పరిచయంతో కలిసి ఇద్దరూ ఒకే రూమ్‌లో ఉంటున్నారు. దొంగతనానికి నాలుగు రోజుల కిందటే ఆ గదిని అద్దెకు తీసుకున్నారు. అయితే దొంగతనం జరిగిన నాటి నుంచి దేముడబ్బాయి కనిపించడం లేదు. నర్సింహమూర్తి డబ్బులు పోవడంతో గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అనంతరం పక్క గదిలో ఉంటున్న రామకృష్ణను ఆరా తీశాడు. ఈ నెల 16న కొత్తవలసలో కనిపించిన దేముడబ్బాయిని 17న తీసుకెళ్లి నర్సింహమూర్తికి అప్పగించాడు. దేముడును గాజువాక పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తానని చెప్పి, నర్సింహమూర్తి తన గదికి తీసుకెళ్లి బంధించి, దేహశుద్ధి చేశాడు. దీంతో తన వద్ద ఉన్న రూ.10 వేలు మాత్రమే ఇచ్చి మిగతా రూ.30 వేలు ఇవ్వలేకపోయాడు. డబ్బులు విషయాన్ని దేముడు తల్లిదండ్రులకు నర్సింహమూర్తి ఫోన్ చేసి చెప్పినా వారు కుమారుడు తీరు తెలిసి పట్టించుకోలేదు. 19న మళ్లీ చిదకబాదడంతో కేకలు వినిపించి చుట్టు పక్కల వారు రావడంతో డబ్బులు విషయం మాట్లాడుతున్నానని చెప్పి పంపేశాడు. ఆ దెబ్బలకు తాళలేక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన దేముడును అదే రోజు సాయంత్రం గోనె సంచిలో కట్టి ఆటోలో వెనక సీటులో వేసుకుని నర్సింహమూర్తి బయలుదేరాదు. ఆటోను నరవ మీదుగా జనసంచారం లేని అమృతపురానికి తీసుకొచ్చి దేముడుపై డీజిల్ పోసి నిప్పుపెట్టాడు. పినగాడి మీదుగా గాజువాక చేరుకున్న నిందితుడు నర్సింహమూర్తి.. మృతుని తల్లిదండ్రులకు అనుమానం రాకుండా ‘మీ కుమారుడిని వదిలేశాను డబ్బుల ఇచ్చేయండి’ అని చెప్పి ఫోన్ పెట్టేశా డని సీఐ తెలిపారు. కేసును ఛేదించడంలో ప్రతిభకనబరిచిన ఎస్ఐ దీనబంద్, ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, కానిస్టేబుళ్లు నాగేంద్ర, సాయి, నరసింగరావును అభినందించారు. నిందితుడిపై ఐపీసీ 302, 201 కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని సీఐ తెలిపారు. -
చిన్నారి వర్షిత హత్యకేసులో నిందితుడి అరెస్ట్
సాక్షి, చిత్తూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిన్నారి వర్షిత హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు పఠాన్ మహ్మద్ రఫీ (25) అలియాస్ గిడ్డును పోలీసులు అరెస్టు చేశారు. హత్యానంతరం గుండు లాంటి కటింగ్ చేయించుకుని తప్పించు తిరుగుతున్న రఫీని శనివారం చాకచక్యంగా పట్టుకున్నట్లు చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్ మీడియాకు వివరించారు. ఈ నెల 7వ తేదీ చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన సిద్ధారెడ్డి, ఉషారాణి దంపతులు తమ మూడో కుమార్తె వర్షిత (5)ను తీసుకుని అంగళ్లు ప్రాంతంలోని ఓ వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు. అక్కడ తప్పిపోయిన బాలిక మరుసటి రోజు ఉదయం కల్యాణ మండపం వెనుక శవమై తేలిన విషయం తెలిసిందే. హత్య జరిగిన రోజు రాత్రి వర్షిత ఓ ఉన్మాది వెంట వెళుతుండటాన్ని సీసీ ఫుటేజీల ద్వారా గుర్తించిన పోలీసులు అనుమానితుడి ఊహా చిత్రాన్ని అన్ని స్టేషన్లకు పంపించారు. తీరా ఈ దురాగతానికి పాల్పడింది చిన్నప్పటి నుంచే పిల్లలపై లైంగిక దురాగతాలకు పాల్పడుతున్న మదనపల్లె ప్రాంతంలోని బసినికొండకు చెందిన రఫీగా పోలీసులు గుర్తించారు. కురబలకోట మండలం అంగళ్లు ప్రాంతంలోని మొలకవారిపల్లెలో ఉంటున్న తన భార్య ఇంటికి వచ్చిన రఫీ పాపకు చాక్లెట్లు ఆశ చూపించి తీసుకెళ్లి అత్యాచారంచేసి ఆపై హత్య చేసినట్లు తేలడంతో నిందితుడ్ని అరెస్టు చేశారు. చిన్నతనంలోనే వక్రబుద్ధి.. జైలు పోలీసుల విచారణలో రఫీ దుర్మార్గపు వాంఛలు వెలుగుచూశాయి. బసినికొండలో 15 ఏళ్ల వయస్సున్నప్పుడే ఆరో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అప్పట్లో పోలీసులు జువైనల్‌హోమ్‌కు తరలించారు. ఏడాదిన్న క్రితం అంగళ్లులో 12 ఏళ్ల వయస్సున్న బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. పాప తల్లిదండ్రులు, గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనుకంజవేశారు. తాజాగా వర్షితను పొట్టనపెట్టుకున్నాడు. -
కిడ్నాప్ కథ సుఖాంతం..
సాక్షి, విజయవాడ: సాంకేతిక పరిజ్ఞానం,పోలీసుల చాకచాక్యంతో కిడ్నాప్ కేసును 48 గంటల్లోనే ఛేదించామని డీసీపీ హర్షవర్ధన్ రాజు మీడియా సమావేశంలో వెల్లడించారు. అప్పు తీర్చలేదనే కారణంతో 8 నెలల బాలుడు అకీస్‌ని చాంద్, షహనాజ్ అపహరించారని తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన పూలుభాయ్ ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తారని.. అప్పు విషయంలో చాంద్, పూలుభాయ్‌ల మధ్య వాగ్వాదం జరిగిందన్నారు. ఈ క్రమంలో పూలుభాయ్ కుమారుడిని.. చాంద్ కిడ్నాప్ చేశాడని తెలిపారు. పోలీసులకు సమాచారం వచ్చే సమయానికి నిందితులు రైలులో పారిపోతున్నారని.. తమ బృందం వేగంగా స్పందించి ముందుగానే జైపూర్‌కు చేరుకుని, స్థానిక పోలీసుల సాయంతో నిందితులను పట్టుకున్నామన్నారు. కేసును ఛేదించిన గన్నవరం పోలీసులను డీసీపీ అభినందించారు. -
సవతే హంతకురాలు
సాక్షి, అరకులోయ: అరకులోయలో సమీపంలో శనివారం జరిగిన కిల్లో పుష్ప హత్యకేసును పోలీసులు ఛేదించారు. మహేష్ మొదటి భార్యే ఈ హత్య చేసినట్టు పాడేరు డీఎస్పీ రాజ్‌కమల్ మంగళవారం రాత్రి విలేకరులకు తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మహేష్‌కు కిల్లో పుష్ప రెండో భార్య. మహేష్, రాజేశ్వరి ప్రేమించుకుని 2014లో వివాహం చేసుకున్నారు. అయితే చినలబుడు గ్రామానికి చెందిన గిరిజన యువతి కిల్లో పుష్పను మహేష్ రెండో పెళ్లి చేసుకుని, ఈనెల 1న అరకులోయ ‘సి’ కాలనీలో వేరే కాపురం పెట్టాడు. మొదటి భార్య రాజేశ్వరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహేష్ రెండో పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక రాజేశ్వరి, రెండో భార్యగా వచ్చిన కిల్లో పుష్పపై కక్ష పెంచుకుంది. ఈనెల 23వతేదీ రాత్రి 9గంటల సమయంలో భర్త మహేష్‌కు ఆరోగ్యం బాగోలేదని నమ్మించి, సి కాలనీలో ఉన్న పుష్పను శరభగుడలో ఉన్న తన ఇంటి వైపునకు రాజేశ్వరి తీసుకెళ్లింది. ఆ మార్గంలోని నీలగిరి తోటల వద్ద పుష్పపై దాడి చేసి,ఆమె చున్నీతో గొంతు నులిమి హత్య చేసినట్టు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని డీఎస్పీ చెప్పారు.పుష్పను హత్య చేసిన రాజేశ్వరి...లైంగికదాడిగా నమ్మించే ప్రయత్నంలో ఆమె శరీరంపై దుస్తులు తొలగించిందని తెలిపారు. పుష్పపై లైంగికదాడి జరగలేదని,రెండవ భార్యగా వచ్చిందనే కోపంతోనే పుష్పను, మహేష్ మొదటి భార్య రాజేశ్వరి హత్య చేసిందని డీఎస్పీ తెలిపారు. గిరిజన మహిళ అయిన కిల్లో పుష్పను హత్యచేసిన రాజేశ్వరి గిరిజనేతర మహిళ కావడంతో ఆమెపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి,అరెస్ట్ చేశామని తెలిపారు. కేసు విచారణ కొనసాగుతుందని, ప్రాథమిక దర్యాప్తులో రాజేశ్వరి మొదటి నిందితురాలిగా గుర్తించామని, విచారణ పూర్తయిన వెంటనే ఈకేసులో మరిన్ని వివరాలు తెలియజేస్తామన్నారు.ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు కావడంతో హత్యకు గురైన గిరిజన మహిళ కిల్లో పుష్ప కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు.ఈ సమావేశంలో అరకు సీఐ,ఎస్ఐలు పైడయ్య,అరుణ్‌కుమార్‌లు పాల్గొన్నారు. -
ఆయనతోనే..బంగారు తెలంగాణ సాధ్యం
చింతపల్లి (దేవరకొండ) : బంగారు తెలంగాణ కేసీఆర్‌తోనే సాధ్యమని తెలంగాణరాష్ట్ర హోంశాఖమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధిదిశగా తీసుకెళ్లేందుకు కృషిచేస్తున్నారన్నారు.రైతులకు 24 గంటల విద్యుత్, పేద ప్రజల సంక్షేమానికి షాదిముబారక్, కల్యాణ లక్ష్మి, విద్యార్థులకు సన్న బియ్యం భోజనం తదితర సంక్షేమ పథకాలుప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని అన్నారు. తెలంగాణరాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం ఏ రాజకీయపార్టీ తరం కాదన్నారు. రాష్ట్రంలో రైతులకు విద్యుత్ సమస్య లేకుండాతీర్చిన ఘనతతో పాటు అనేక సంక్షేమ పథకాలుప్రవేశ పెట్టిన ఘనత ఈ ప్రభుత్వానిదేనన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణప్రజలు టీఆర్ఎస్ పార్టీకి అధికారం కట్టబెట్టడం ఖాయమని అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రైతు సమస్యల పరిష్కారానికి ఈ ప్రభత్వం కృషి చేస్తుందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, దేవరకొండ జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ్మ, ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, మాజీ ఎంపీపీ సర్వయ్య, సుధీర్‌రెడ్డి, నట్వ గిరిధర్, ఎల్లంకి అశోక్, ఎండి. ఖాలెక్, చంద్రశేఖర్, నరేందర్‌రావు, బిజె.యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చందంపేట (దేవరకొండ) : సీఎం కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని రాష్ట్రహోంశాఖ, కార్మిక శాఖమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. డిండి నుంచి నేరెడుగొమ్ము మండల కేంద్రానికి కాలువల ద్వారా చెరువులు నింపేందుకు వారం రోజుల క్రితం నీటిపారుదల శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. కాగా శనివారం హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే రమావత్ రమావత్ రవీంద్రకుమార్‌తో కలిసి జల పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్, నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కృషితో 70 ఏళ్లుగా పూడుకుపోయిన కాలువలకు పుర్వ వైభవం వచ్చిందన్నారు. చందంపేట, నేరెడుగొమ్ము మండలంలోని సుమారు 40 చెరువులు, కుంటలు డిండి ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయడంతో జలకళను సంతరించుకున్నాయని, గ్రామాల్లో ప్రజ లు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ దేశంలో ఏరాష్ట్రం అందించని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ముక్కమల పరుశురాములు, ఎంపీటీసీ గిరియాదగిరి, గడ్డం వెంకటయ్య, టీఆర్ఎస్ నాయకులు నాయిని సుధీర్‌రెడ్డి, రాంరెడ్డి, ఆలంపల్లి నర్సింహ, మేకల శ్రీను, ముత్యాల సర్వయ్య, బోయపల్లి శ్రీను, ఆరెకంటి రాములు, బాలు తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ అవకాశం కల్పిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా
మోటకొండూరు : పార్టీ అవకాశమిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని టీపీసీసీ నాయకుడు చామల ఉదయ్‌చందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మోటకొండూరు మండలం చాడ మదిర గ్రామం పిట్టలగూడెంలో పర్యటించా రు. ఇల్లిల్లు కలియతిరుగుతూ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిగా పని చేయడమే కాకుండా గత పది సంవత్సరాలుగా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పాటుపడ్డాని తెలిపారు. దేశ రాజకీయాల్లో రాహుల్‌గాంధీ యువతకు ఎక్కవగా ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన ఏఐసీపీ ప్లీనరీలోనూ ప్రకటించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కూరెళ్ల నరేష్ గౌడ్, యాదగిరి గౌడ్, సిద్దులు, విజయ్, లక్ష్మయ్య, కరుణాకర్ యాదవ్, రాములు గౌడ్, పురుషోత్తం రెడ్డి, తులసయ్య తదితరులు పాల్గొన్నారు. -
పక్కా పథకం ప్రకారం కుక్క హత్యతో ..
సాక్షి, గుడివాడ : కలకలం రేపిన గుడివాడ వృద్ధ దంపతుల హత్యకేసు మిస్టరీ వీడింది. ఈ కేసులో పాత నేరస్తుడు జిల్లేల సురేశ్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సురేష్‌తో సహా మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య కేసులో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పోలీసులు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులతో దొంగతనాలు చేయాలనుకున్న సురేశ్‌కు సెల్వదొరై సహకరించాడు. ఈ నెల 17న గుడివాడ నాలుగోలైన్‌లోని బొప్పన సాయి చౌదరి(72), నాగమణి(67) దంపతుల ఇంట్లో దొంగతనం చేయాలనుకున్నారు. పథకం ప్రకారం ఆ కాలనీలో సీసీ కెమెరాలు ఉన్నాయో లేవో తెలుసుకున్నారు. దొంగతనం చేయడానికి ఇంట్లోని పెంపుడు కుక్క అడ్డుగా ఉంటుందని భావించారు. హత్యలకు పదిరోజుల ముందు కుక్కను అతి దారుణంగా చంపేశారు. ఇంటి వెనకాల ఉన్న ఇనుప కంచెను తొలగించి లోపలికి ప్రవేశించారు. అడ్డువచ్చిన వృద్ధ దంపతులను తీవ్రంగా కొట్టి చంపారు. ఆ తర్వాత ఇంట్లోని నగలు, డబ్బులు దోచుకుని ఇంటి బయట ఉంచిన కారుతో సహా పరారయ్యారు. -
80 ఏళ్ల మిస్టరీ వీడింది
వాషింగ్టన్ : దాదాపు 8 దశాబ్దాలకు పైగా నెలకొన్న మిస్టరీకి ఎట్టకేలకు తెర పడింది. అదృశ్యమైన అమెరికన్ వైమానికురాలు అమెలియా ఇయర్హార్ట్ మృతదేహం తాలూకు అవశేషాలను శాస్త్రవేత్తలు కనిపెట్టారు. పశ్చిమ పసిఫిక్ ఐలాండ్‌లో పరిశోధకులు వీటిని గుర్తించగా.. వాటిని పరిశోధించిన టెన్నెస్సె యూనివర్సిటీ ఆంథ్రోపాలజిస్ట్ రిచర్డ్ జాన్ట్జ్ ఇది అమెలియా అవశేషాలనే అని పేర్కొన్నారు. యాత్రికురాలు, రచయిత అయిన అమెలియా 1937లో విమానం ద్వారా ప్రపంచ యాత్రకు బయలుదేరారు. విమానంలో ఆమెతోపాటు నేవిగేటర్ ఫ్రెడ్ నూనన్ కూడా ఉన్నారు. విమానం ఫసిఫిక్ సముద్రం మీదుగా వెళ్తుండగా నికూమరోరో ప్రాంతంలో అదృశ్యమైంది. ఆ తర్వాత రెండేళ్లకు ఆమె జాడ తెలియకపోయేసరికి చనిపోయినట్లుగా అధికారులు ప్రకటించారు. అప్పటి నుంచి ఆమె అదృశ్యం గురించి రకరకాల కథనాలు వెలువడ్డాయి. ఈమె జీవిత చరిత్రపై పలు భాషల్లో చిత్రాలు కూడా వచ్చాయి. చివరకు 1940లో ఎముకల గూడు గార్డనర్ ఐలాండ్‌కు కొట్టుకొచ్చాయి. అప్పటి నుంచి వాటిపై అంథ్రోపాలజిస్టులు పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. మృత దేహ నిర్ధారణ కోసం చేసిన అధ్యయనాల్లో చాలా వరకు గందరగోళ ప్రకటనలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. చివరకు శాస్త్రీయంగా మూడు సిద్ధాంతాలను అన్వయించిన రిచర్డ్ .. చివరకు అది అమెలియాదే అని తేల్చారు. ఇంధనం అయిపోవటంతోనే విమానం కూలిపోయి ఉంటుందని.. ఆమె అస్థిపంజరం ద్వీపానికి కొట్టుకొచ్చిందని ఆయన అంచనా వేస్తున్నారు. ఫ్రెడ్ నూనన్ అవశేషాలు మాత్రం ఇప్పటిదాకా లభ్యం కాలేదు. అమెలియా ఇయర్హార్ట్ చివరి చిత్రం