
శాంతినగర్ (అలంపూర్): బాలికను కిడ్నాప్ చేసి.. పెళ్లి చేసుకొని మూడున్నరేళ్లుగా సికింద్రాబాద్‌లో మకాం పెట్టాడు. ఈ క్రమంలో వారికి పాప జన్మించింది. ఆధార్ కార్డు ఆధారంగా చిరునామా తెలుసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్‌కు చెందిన షఫీ ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్. ఆ సమయంలో బాలికకు (14) మాయ మాటలు చెప్పి 2016 ఏప్రిల్ 26న హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. దీనిపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆధార్ కార్డు ఆధారంగా మూడున్నరేళ్ల తర్వాత కేసు ఛేదించారు.
Comments
Please login to add a commentAdd a comment