Gadwal District
-
కొడుకు, కోడలు కలిసి తండ్రిపై దాడి
-
గద్వాల జిల్లాలో అర్ధరాత్రి ప్రమాదానికి గురైన ప్రైవేట్ బస్
-
సంక్రాంతి ప్రయాణం..మధ్యలోనే ఊహించని దారుణం
-
Gadwal Bus Fire Accident: బస్సులో చెలరేగిన మంటలు.. మహిళ సజీవ దహనం
సాక్షి, గద్వాల జిల్లా: బీచుపల్లి వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 10వ బెటాలియన్ సమీపంలో వాల్వో బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. మంటల్లో చిక్కుకుని మహిళ సజీవదహనం అయ్యింది.. 10 మందికి గాయపడ్డగా, వారిని ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి కడప వెళ్తుండగా ఆ ఘటన చోటుచేసుకుంది. బస్సులో 34 మంది ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులు అద్దాలగొట్టి బయటపడ్డారు. -
గద్వాల్ జిల్లా బీచుపల్లి వద్ద ఘోర బస్సు ప్రమాదం
-
కాంగ్రెస్‌లో చేరిన అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం..
సాక్షి, జోగులాంబ గద్వాల జిల్లా: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుతుండటంతో.. గెలుపే లక్ష్యంగా అన్నీ పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఎన్నికల పోరుకు మరో ఆరు రోజులే సమయమున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. అలంపూర్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం బీఆర్ఎస్ను వీడి. కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాగా అలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అబ్రహంను మరోసారి బీఆర్ఎస్ తరపున అభ్యర్థిగా ప్రకటించిన కేసీఆర్.. అనూహ్యంగా అభ్యర్థిని మార్చారు. అబ్రహం స్థానంలో చల్లా వెంకట్రామిరెడ్డి వర్గానికి చెందిన విజేయుడికి టికెట్ ఖాయం చేసింది పార్టీ అధిష్టానం. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనను కాదని వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వడంతో అబ్రహం బీర్ఎస్ పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారు. -
తెలంగాణ అనేక రంగాల్లో అగ్రగామిగా ఉంది: కేసీఆర్
-
కుట్లుకు బదులు ఫెవిక్విక్ తో వైద్యం చేసిన డాక్టర్ నాగార్జున
-
సీఎం కేసీఆర్‌కు కుర్చీనే దొరకలేదా..?: ప్రవీణ్‌కుమార్
అయిజ: ఎన్నికల్లో గెలిచిన అనంతరం కుర్చీ వేసుకొని కూర్చొని ఆలంపూర్ ఆయకట్టుకు నీరు పారిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్‌కు ఇంత వరకు కుర్చీనే దొర కలేదా? జాగా దొరకడం లేదా? అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఎద్దేవా చేశారు. బహుజన రాజ్యాధికార యా త్ర మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలో కొనసాగింది. ఉత్తనూ రు సమీపంలో ప్రవీణ్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం సిద్ధించినా ఆలంపూర్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. -
ఫొటో చూడు.. క్యాష్ ఎంత ఇస్తావో చెప్పేయ్.. అమ్మాయిలు మస్త్ మస్త్‌గా ఉన్నారు!
ఫొటో చూడు.. క్యాష్ ఎంత ఇస్తావో చెప్పేయ్.. సమయాన్ని బట్టి ధర..నాకు ఎంత.. పోలీసోళ్లను కూడా చూసుకోవాలి.. మా వాళ్లే అన్ని చూసుకుంటారు.. ఇబ్బంది లేకుండా.. కొంత ఎక్కువే చెప్పండి.. ఇదే కాదు, ఇంకా చాలా ఫొటోలు ఉన్నాయి.. అమ్మాయిలు మస్త్ మస్త్‌గా ఉన్నారు.. లెక్క కుదిరితే తీసుకెళ్తా.. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఓ బ్రోకర్ అదే జిల్లాకు చెందిన యువకుడితో ఇటీవల సంభాషించిన మాటలు ఇవి. జిల్లాలో వ్యభిచార దందా ఏ విధంగా సాగుతుందో దానితోపాటు ఖాకీల చెడు సావాసానికి ఇది అద్దం పడుతోంది. న్యూడ్‌కాల్స్ వ్యవహారానికి సంబంధించి ‘డర్టీ పిక్చర్’ సంఘటనను జోగుళాంబ గద్వాల జిల్లా ప్రజలు ఇంకా మరిపోనేలేదు. జిల్లా ప్రతిష్ట మసక బార్చేలా వ్యవహరింన తీరుపై అప్పట్లో ప్రభుత్వ పెద్దలు, పోలీస్ ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగంపై సీరియస్ అయ్యారు. అయినా ఆ శాఖలోని పలువురు అవినీతి ఖాకీలు తమ పంథాను మార్చుకోలేదు. జిల్లాలో వ్యభిచార దందా మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్లు కొనసాగడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. దీనికంతటికీ ఆమ్యామ్యాల కక్కుర్తే కారణం. అనుమానం వచ్చి ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే తప్ప ఎలాంటిచర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అసాంఫిక కార్యకలాపాలపై పకడ్బందీగా నిఘా పెట్టి ఉక్కు పాదం మోపాల్సిన వారే.. అక్రమార్కులకు ప్రత్యక్షంగా, లేకుంటే పరోక్షంగా సహకారం అందిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సృజన ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. వ్యభిచార దందాకు సహకరిస్తున్న కీలక పోలీసులు ఎవరు..రాజకీయ నేతల పాత్ర ఏమిటి.. ఎవరి ఒత్తిళ్లు ఏఅధికారిపై ఉన్నాయి.. అనే కోణంలో గుట్టుచప్పుడు కాకుండా ఆరా తీస్తున్నారు. ఈనేపథ్యంలో సాక్షి ప్రత్యేక కథనం. అరోపణలు ఇలా ► ఫిబ్రవరి 19న గద్వాల పట్టణం భీం నగర్ కాలనీలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేశారు. వ్యభిచారకేంద్రం నిర్వాహకురాలితో పాటు ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపైనే కేసు పెట్టారు. కానీ.. ఈ సంఘటనలో కొందరిని తప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ► 2022 ఆగస్టు 7న గద్వాల బీరోలు రోడ్డు (తాయమ్మ గుడి) సమీపంలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా సభ్యురాలు, ఇద్దరు మహిళలు, ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరు పరారీలో ఉన్నారని.. వారిని అదుపులోకి తీసుకుంటామని చెప్పినప్పటికీ ఎవరి పైనా చర్యలు లేకుండాపోయాయి. ►2021 మే 6న గద్వాల పట్టణంలోని సాయిహోంకాలనీలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుపోలీసులకు సమాచారం అందింది. తెల్లవారుజామునే సోదాలు చేసి ముగ్గురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. రెండురోజుల పాటు విచారణ చేశారు. ఓ అధికారప్రజాప్రతినిధికి చెందిన ముఖ్య అనుచరుడితో పాటు పలువురు చోటామోటా నాయకులు వ్యభిచారం చేస్తూ పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినప్పటికీ కేసు నమోదుచేయలేదు. పెద్ద మొత్తంలో డబ్బులు చేతులుమారినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఇతర రాష్ట్రాల నుంచి యువతులు విజయవాడకు చెందిన ముఠాసభ్యులు గద్వాల కేరాఫ్ అడ్రాస్గాఎంచుకుని గుట్టుగా శివారు కాలనీలో ఇళ్లను అద్దెకు తీసుకుంటున్నారు. ఎవరికి అనుమానం కలుగకుండా ఒక్కో యువతిని దిగుమతి చేసుకుంటూ.. ఇళ్లు మారుస్తూ వ్యభిచార దందా నడిపిస్తున్నారు. ప్రధానంగా గద్వాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలు, విజయవాడ, కర్నూలు, గుంటూరు జిల్లాలతోపాటు తెలంగాణలోని హైదరాబాద్, కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరునుంచి అమ్మాయిలను తీసుకొచ్చి పడుపువృత్తి చేయిస్తున్నారు. -
ప్రసవం మధ్యలో వెళ్లిపోయిన వైద్యురాలు.. పసికందు మృతి
సాక్షి, గద్వాల: ప్రసవం కోసం వచ్చిన గర్భిణికి సకాలంలో వైద్యం అందించడంలో వైద్యురాలు నిర్లక్ష్యం కనబరచడంతో పురిటిలోనే శిశువు మృతిచెందింది. ఈ సంఘటన ఆదివారం జోగుళాంబ గద్వాల జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. జిల్లాలోని రాజోళి మండలం పచ్చర్ల గ్రామానికి చెందిన ఖలీఫా తొలి ప్రసవం కోసం ఈ నెల 16న జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. సాధారణ కాన్పు అయ్యేలా చూస్తామని వైద్యులు చెప్పారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో వైద్యురాలు నర్మద, సిబ్బంది ప్రసవం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో వైద్యురాలు నిర్లక్ష్యంగా వ్యవహరించి.. కాన్పు కాకముందే వెళ్లిపోవడం వల్లే పసికందు మృతిచెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ విషయమై వైద్యురాలు నర్మద స్పందిస్తూ పాప ఉమ్మనీరు తాగి పరిస్థితి విషమంగా మారడంతో ఆపరేషన్ చేయాలని చెప్పినా కుటుంబ సభ్యులు వినిపించుకోలేదన్నారు. కాన్పు కాకముందే వెళ్లిపోయానన్న ఆరోపణలు అవాస్తవం అన్నారు. తన డ్యూటీ సమయం అయిపోయినప్పటికీ విధులు నిర్వహించానని పేర్కొన్నారు. పసికందు మృతిపై విచారణకు ఆదేశించామని కలెక్టర్ వల్లూరి క్రాంతి ‘సాక్షి’కి తెలిపారు. విచారణలో వైద్యుల తప్పిదం ఉందని తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. గతంలోనూ సస్పెండ్ డాక్టర్ నర్మద గతంలో ఓసారి ఇలాంటి సంఘటనలో సస్పెండ్ అయినట్లు తెలిసింది. ధరూర్ మండలం జాంపల్లికి చెందిన దీపిక అనే గర్భిణి కాన్పు సమయంలో ఆమె నిర్లక్ష్యం వల్ల శిశువు మృతి చెందాడు. దీంతో అప్పటి కలెక్టర్ ఆమెను సస్పెండ్ చేసినట్లు సమాచారం. -
గద్వాలలో ‘డర్టీ పిక్చర్’!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలో కొందరు మహిళలు, యువతులను లోబర్చుకుని, న్యూడ్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేసిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ బాగో తంలో ఇప్పటివరకు అరెస్టైన ముగ్గురు ఓ ప్రధాన పార్టీకి చెందిన యువ నాయకులే. వారితోపాటు ఓ ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడు, ఇద్దరు కౌన్సిలర్లు, ఓ కౌన్సిలర్ భర్త, పలువురు పోలీసులకు కూడా ఇందులో పాత్ర ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఓ కీలకనేత రంగంలోకి దిగారని, తమకూ మరకలు అంటుతుండటంతో ఈ వ్యవహారాన్ని నీరుగార్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గొడవపడి.. బయటపెట్టుకుని.. గద్వాలకు చెందిన కొందరు కొన్నాళ్లుగా మహిళలను, అమ్మాయిలను ట్రాప్ చేసి లోబర్చుకున్నారు. వారి నగ్న వీడియోలు, కాల్స్ రికార్డు చేసి బ్లాక్మెయిల్ చేస్తూ.. మరింతగా వేధించడం మొదలుపెట్టారు. ఇటీవల పలువురు మహిళల అర్ధ నగ్న వీడి యోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమ వడంతో ఈ ట్రాప్ అంశం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు చేసేందుకు బాధితులెవ రూ రాకపోవడంతో.. ‘సాక్షి’తోపాటు పలు పత్రికల్లో వచ్చిన కథనాలను పోలీసులు సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టారు. గద్వాలకు చెందిన తిరుమలేష్ అలియాస్ మహేశ్వర్‌రెడ్డి ఫోన్ నుంచి సదరు ఫొటోలు, వీడియోలు బయటికి వచ్చినట్టు గుర్తించారు. అతడిని విచారించగా.. గద్వాలకే చెందిన నిఖిల్, వినోద్‌ల పాత్ర వెలుగులోకి వచ్చింది. వారి మధ్య విభేదాలు తలెత్తడంతోనే ఒకరికి సంబంధించిన రహస్యాలను మరొకరు బయటపెట్టినట్టు తేలింది. తారుమారు చేశారా? ఈ వ్యవహారానికి సంబంధించి సోమవారం పోలీసులు వెల్లడించిన వివరాలు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశాయి. ‘‘తిరుమలేష్ (మహేశ్వర్‌రెడ్డి) ఓ పార్టీలో మద్యంతాగి స్పృహలేకుండా పడిపోయినప్పడు కాశపోగు నిఖిల్ అతడి ఫోన్లోని మహిళల సెమీ న్యూడ్ ఫొటోలు, వీడియోలను చూసి తన మిత్రుడు వినోద్‌కు పంపాడు. వినోద్ తన స్నేహితుడైన క్రాంతికి పంపాడు. తిరుమ లేష్, క్రాంతి ఇద్దరు కలిసే తిరుగుతుంటారు. దీనితో తిరుమలేష్ గురించి చెప్పేందుకు క్రాంతితోపాటు ఓ కౌన్సిలర్ భర్త రంజిత్‌కు పంపాడు’’ అని ఎస్పీ రంజన్ రతన్ కుమార్ వెల్లడించారు. అయితే ఈ కేసును తారుమారు చేశారంటూ వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నుంచి విమర్శలు వస్తున్నా యి. కేసులో ఒకరిని తప్పించేందుకు రూ.30లక్షల బేరం కుదిరిందని ముందు నుంచే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ స్టడీ సర్కిల్ వేదికగా ట్రాప్ ప్రభుత్వం కొన్నినెలల క్రితం ఉద్యోగ ప్రక టనలు విడుదల చేసిన క్రమంలో జిల్లాలో ఓ స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేశారు. దాన్ని వేదికగా చేసుకుని ఓ ముఠా అమాయక యువతులు, మహిళలకు గాలమేసి ఫొటో లు, న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిల్‌కు పాల్పడినట్టు సమాచారం. గత నాలుగైదు నెలల్లో 50మంది వరకు వారిబారిన పడ్డారని.. కానీ పరువు పోతుందనే భయంతో బయటికి చెప్పడం లేదని తెలిసింది. గద్వాలలో మూడు ముఠాలు ఇలా మహిళలను ట్రాప్ చేసి, బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కాగా గద్వాల వ్యవహారంలో ప్రధాన నిందితులను తప్పించే ప్రయత్నాలు జరుగు తున్నాయని.. కొందరు పోలీసుల çసహకా రం ఉందని వినిపిస్తోందని పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ ఎక్బాల్‌పాషా ఆరోపించారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఐని ఎందుకు బదిలీ చేశారో! ఈ వ్యవహారంలో గద్వాలకు చెందిన ఓ ఎస్సై పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ నిందితుడితో సదరు ఎస్సైకి ‘ఖరీదైన’ స్నేహంతోపాటు భాగస్వామ్యం ఉన్నట్టు చెప్తున్నారు. ఈ కోణాల్లో విచారణ చేపట్టామని, ఇప్పటివరకు పోలీసుల పాత్ర ఏమీ తేలలేదని ఎస్పీ మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో చెప్పారు. కానీ సాయంత్రమే సదరు ఎస్సైని బదిలీ చేయడంపై జిల్లాలో చర్చ జోరుగా సాగుతోంది. -
ఆది దేవత... లజ్జాగౌరి
హిందువులు ‘లజ్జాగౌరి’ని ఆదిదేవతగా పూజిస్తారు. క్రీస్తుకు పూర్వం నుంచే ఈమెను కొలుస్తున్నట్టు చరిత్ర చెపుతోంది. హరప్పా, మొహంజొ దారో నాగరికతల్లోనూ లభ్యమయిన ఆధారాల బట్టి అప్పటికే లజ్జాగౌరి ఆరాధన ఉన్నట్లు చెప్పవచ్చు. సంతాన దేవతగా ఈమెను ఇప్పటికీ దేశంలోని పలు ప్రాంతాల్లో ఆరాధిస్తూనే ఉన్నారు. తెలంగాణలో జోగు లాంబ గద్వాల్ జిల్లా, అలంపూర్‌లో ఈ అమ్మవారు దర్శనమిస్తోంది. శక్తి పీఠంగా అలంపూర్ గురించి తెలిసిన వాళ్లు, అక్కడే ఉన్న లజ్జాగౌరీదేవి గురించి మాత్రం తెలియదే అని తెల్ల మొహం వేస్తుంటారు. సంతానం కోసమే కాక తమను బాధిస్తున్న వివిధ గుప్త వ్యాధుల నుండి బయట పడేయమనీ స్త్రీలు లజ్జాగౌరిని పూజిస్తారని అంటారు. నిజానికి ప్రస్తుతం భారతదేశంలో పూజించే గ్రామ దేవతలు అందరూ లజ్జా గౌరి ప్రతిరూపాలే అనాలి. చాలా చోట్ల చర్మవ్యాధులు, ఇతర గుప్తరోగాలు ఉన్న మహిళలు గ్రామదేవతల జాతర్ల సందర్భంలో వివస్త్రలై లేదా వేప మండలతో శరీరాన్ని కప్పుకుని పూజించడం ఇప్పటికీ ఆచారంగా కొనసాగుతోంది. రేణుక ఎల్లమ్మ వంటి గ్రామదేవతను లజ్జా గౌరిగా పేర్కొనే కథ ఒకటి ప్రచారంలో ఉంది. ఈ కథ ప్రకారం... నిమ్న కులానికి చెందిన రేణుక తలను అగ్రకులస్థుడొకడు నరికివేశాడు. అయితే రేణుక చనిపోలేదు. తల స్థానంలో కమలాన్ని మొలిపించుకొని జీవించింది. పద్మం, యోని అనేవి సంతానానికి సంకేతాలు. ఈ దేవత విగ్రహాలను గమనించినప్పుడు... పద్మ ముఖం, గుడ్రంగా కుండ మాదిరిగా ఉన్న ఉదరం, చెవులకు అందమైన కమ్మలు, మెడలో హారాలు కనిపిస్తాయి. ఆలంపూర్‌లోనే కాక చేర్యాల, హుజురాబాద్, కొలనుపాక, కోహెడ, బెజ్జంకి, తంగళ్లపల్లి వంటి చోట్ల లజ్జాగౌరి విగ్రహాలు ఉన్నాయి. హన్మకొండలోని రాజరాజ నరేంద్ర భాషా నిలయం మలుపులో కూడా ఒక లజ్జాగౌరి విగ్రహం 2010 వరకూ ఉండేది. – కన్నెకంటి వెంకట రమణ జాయింట్ డైరెక్టర్, సమాచార శాఖ, హైదరాబాద్ -
గద్వాల జిల్లా ఇర్కిచేడులో 144 సెక్షన్
గద్వాల రూరల్/ కేటీదొడ్డి: బీఆర్ అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుపై రాజుకున్న వివాదం.. చివరికి విగ్రహానికి నిప్పుపెట్టడంతో పాటు ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకునే వరకు వెళ్లింది. దీంతో గ్రామంలో ఏప్రిల్ 6 వరకు 144 సెక్షన్‌ను విధించారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం ఇర్కిచేడులో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు ఒక వర్గం వారు నిర్ణయించి తహసీల్దార్ వద్ద అనుమతి పొందారు. సదరు స్థలం అప్పటికే నీలమ్మ అనే మహిళ కబ్జాలో ఉంది. గురువారం ఆ స్థలంలో విగ్రహాన్ని పెట్టేందుకు యత్నించగా నీలమ్మ, ఆమె కుటుంబీకులు ఆత్మహత్య చేసుకుంటామని అడ్డుకున్నారు. దీంతో విగ్రహాన్ని రోడ్డు మధ్యలో పెట్టేందుకు యత్నించగా గ్రామానికి చెందిన మరోవర్గం వారు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పటికే ఆత్మహత్య చేసుకుంటానని వెంట తెచ్చుకున్న పెట్రోల్ సీసాలను విగ్రహం పరిసర ప్రాంతంలో పడేశారు. పోలీసులు అక్కడి నుంచి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయగా గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసిన చోట నిప్పు అంటించారు. దీంతో మంటలు చెలరేగి పక్కనే ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి, ఎస్సై కురుమయ్య కాలికి అంటుకున్నాయి. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి విగ్రహాన్ని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. విషయం తెలుసుకొని కర్ణాటకలోని రాయచూరు, ఇర్కిచేడు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అంబేడ్కర్‌వాదులు భారీ సంఖ్యలో గ్రామానికి చేరుకోవడంతో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. స్పెషల్ పార్టీ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎస్పీ రంజన్ రతన్‌కుమార్ ఇర్కిచేడును సందర్శించి ఏప్రిల్ 6 వరకు గ్రామంలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. -
రైతుల పాలిట శాపంగా మారిన మిర్చి పంట
-
మొదటిరోజే.. చివరి రోజైంది..
మానవపాడు: పలకా, బలపంతో పాఠశాలకు వెళ్లిన బాలుడికి మొదటి రోజే స్కూల్ బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. మూడేళ్ల ప్రాయంలోనే నూరేళ్లు నిండిపోయాయి. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలో సోమవారం ఈ హృదయవిదారకర ఘటన చోటుచేసుకుంది. చంద్రశేఖర్‌నగర్ గ్రామం శ్రీనగర్ కాలనీకి చెందిన మహేశ్, సూర్యబాయి దంపతులకు ఇద్దరు కుమారులు. మహేశ్ ఏపీలోని కర్నూలులో కార్పెంటర్‌గా పనిచేస్తున్నారు. తమ ఇద్దరు కొడుకులు అభి, అజయ్‌కుమార్ (3)లను పాఠశాలలో చేర్పించేందుకు రెండు రోజుల క్రితం వడ్డేపల్లి మండలం శాంతినగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో రూ.4 వేలు ఫీజు కట్టి వచ్చారు. సోమవారం ఇద్దరు పిల్లలను పాఠశాలకు పంపారు. తరగతులు పూర్తయ్యాక బస్సులో అజయ్ ఇంటి వద్దకు వచ్చాడు. బస్సు దిగి రోడ్డుకు ఆవలివైపు ఉన్న ఇంట్లోకి వెళ్లేందుకు వస్తుండగా తల్లి గమనించి ‘బస్సు ముందు బాబు ఉన్నాడు’ ఆపమని కేకలు వేస్తున్నా.. గమనించని డ్రైవర్ బస్సును ముందుకు కదిలించాడు. దీంతో అజయ్ బస్సు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారీ కాగా.. న్యాయం చేయాలని ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మృతదేహాన్ని తరలించకుండా రాత్రి 8 గంటల వరకు సంఘటనాస్థలంలోనే ఉంచారు. పోలీసులు శాంతింపజేయడంతో మృతదేహాన్ని అలంపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
జూరాల కాల్వపై కూలిన వంతెన
ధరూరు (గద్వాల): వాహనం బరువును తట్టుకోలేక ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన కుడికాల్వపై నిర్మించిన వంతెన కూలింది. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం భీంపురం సమీపంలో జూరాల–ఆత్మకూరు, మక్తల్ ప్రధాన రోడ్డు మార్గం నుంచి భీంపురం, పెద్దచింతరేవులకు రాకపోకలు సాగించేందుకు సుమారు 30 ఏళ్ల క్రితం రోడ్–కం–బ్రిడ్జిని నిర్మించారు. అప్పటినుంచి ఇదే మార్గం గుండా ఈ రెండు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. మంగళవారం ఉదయం భీంపురానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి నిర్మాణంకోసం స్లాబ్ వేసేందుకు కాంక్రీటు మిశ్రమంతో కూడిన భారీ వాహనం (30 టన్నుల ట్రాంక్ మిక్చర్) వచ్చింది. వంతెన మధ్యలోకి రాగానే బ్రిడ్జి కూలింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని అలాగే ఆపి కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. -
ఒక ఇంట్లో ఇద్దరు చిన్నారులకు పాము కాటు
గద్వాల (గట్టు): వ్యవసాయ పనులు చేసి అలసిపోయారు. పూరిగుడిసెలో నిద్రకుపక్రమించారు. అప్పటికే దుప్పట్లో దూరిన విష సర్పాన్ని గమనించలేకపోయారు. ఇద్దరు బిడ్డల్ని పాము కాటేసిన విషయం తెలిసి గుండెలు బాదుకుంటూ ఆస్పత్రికి పరుగులు తీశారు. కానీ ఇద్దరిలో బాబు కన్నుమూయగా.. పాప ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికలపాడుకు చెందిన నర్సమ్మ అలియాస్ సరోజమ్మ, నాగరాజు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. ఎప్పటిలాగే శనివారం రాత్రి తమ పూరిగుడిసెలో అందరూ నిద్రకు ఉపక్రమించారు. అప్పటికే దుప్ప ట్లో పాము దూరిఉంది. ఆదివారం తెల్లవారుజాము న వారి కుమారుడు సూర్యప్రకాష్ (4), కూతురు సురక్షిత (5) పాటుకాటుకు గురయ్యారు. వెంటనే తల్లిదండ్రులు ఇద్దరినీ గట్టు పీహెచ్‌సీకి తరలించారు. అనంతరం పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ ఉదయం బాలుడు మృతి చెందగా, బాలిక ప్రాణాపాయస్థితిలో ఉంది. -
దారుణం: ముగ్గురూ అమ్మాయిలే పుట్టారని..
గద్వాల క్రైం: వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టడమే ఆమెకు శాపంగా మారింది. కోపం పెంచుకున్న భర్త ఆమె ఉసురుతీశాడు. చిన్నారులకు తల్లి ప్రేమానురాగాలను దూరం చేశా డు. ఈ ఘటన గద్వాలలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... వనపర్తి జిల్లా మదనాపురానికి చెందిన అన్నపూర్ణ అలియాస్ పల్లవి(26)కి గద్వాలకు చెందిన వెంకటేశ్‌తో రెండేళ్ల క్రితం వివాహమైంది. ఏడాది క్రితం మొదటి సంతానం పాప జన్మించింది. ఈ నెల 24న ఇద్దరు ఆడపిల్లలు(కవలలు) పుట్టారు. దీంతో భార్యపై వెంకటేశ్ ద్వేషం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆదివారం ఇంట్లో నిద్రిస్తున్న భార్య గొంతు నులిపేస్తుండగా కేకలు వేసింది. ఇరుగుపొరుగువారు వచ్చి నిలదీయగా ఫిట్స్ వచ్చాయని నమ్మించేందుకు ప్రయత్నించాడు. స్థానికులు ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. అతని మాటల్లో పొంతన లేకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు సోమవారం పోలీసులకు సమాచారమిచ్చారు. గద్వాల సీఐ షేక్ సయ్యద్‌బాషా, తహసీల్దార్ లక్ష్మి, వైద్యుల సమక్షంలో పల్లవి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా ఆమెను పథకం ప్రకారమే హత్య చేసినట్టు తేలింది. మృతురాలి తండ్రి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు అల్లుడు వెంకటేశ్, అతని తల్లి జయమ్మ, బావ జనార్దన్, చెల్లెలు లీలావతిలపై కేసు నమోదు చేశారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. నిందితుడు మల్దకల్ ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. (చదవండి: AP: ఇద్దరు యువతులను కాపాడిన ‘దిశ’) -
బియ్యం అక్రమార్కులకు పెద్దల అండ!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలోని రేఖ రైస్ మిల్లు అక్రమాల్లో భాగస్వాములైన అధికారులకు రాష్ట్రస్థాయిలో ఓ ఉన్నతాధికారి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాపతినిధి అండగా ఉన్నట్టు చర్చ జరుగుతోంది. అందువల్లే గత ఏడాది డిసెంబర్లో విచారణ నివేదిక అందినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలుస్తోంది. అయితే గద్వాల టీఆర్ఎస్ పార్టీలో మూడు వర్గాలు ఉండగా.. ఓ వర్గం నేతలు జిల్లాస్థాయి అధికారికి మద్దతు ఇస్తున్నారని, మరో వర్గం తటస్థంగా ఉందని తెలిసింది. వారికి పోటీగా ఉండే ఇంకో వర్గం నేతలు రేషన్ అక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ యంత్రాంగంపై ఇటీవల తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినట్టు సమాచారం. దీని కారణంగానే ఒకరిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు తెలిసింది. ఈ వ్యవహారానికి సంబంధించి అధికారులు చెప్తున్న వివరాలు కూడా ఈ ప్రచారాన్ని బలపరుస్తున్నాయి. ఒకరిపై కేసు నమోదుకు ఆదేశాలు ‘‘రేఖ రైస్‌మిల్లులో పట్టుబడిన 170.05 క్వింటాళ్ల రేషన్ బియ్యం విషయంలో రాష్ట్రస్థాయి అధికారుల ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. అధికారులను తప్పుదోవ పట్టించిన ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ గణపతిరావుపై కేసు నమోదు చేయాలని చెప్పారు. ఈ మేరకు గద్వాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం’’అని ఇన్చార్జి డీఎస్ఓ రేవతి తెలిపారు. ఈ ఘటనతో సంబంధమున్న ఇతర అధికారులపై చర్యలకు సంబంధించి పైనుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని వివరించారు. ఈ లెక్కన రాష్ట్ర విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నివేదిక బుట్టదాఖలైనట్టేనా? అందులో పేర్కొన్న అదనపు కలెక్టర్ (రెవెన్యూ), మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఇన్చార్జి తహసీల్దార్, సీఐ, ఎస్సైలపై చర్యలుంటాయా.. లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘రేషన్’ బియ్యం వ్యవహారం ఇదీ.. 2020 అక్టోబర్ 2న గద్వాల శివారులోని రేఖ రైస్ మిల్లులో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసినట్టు స్థానిక పోలీసులకు పక్కా సమాచారం అందింది. రెవెన్యూ అధికారులతో కలిసి పోలీసులు ఆ మిల్లులో సోదాలు నిర్వహించారు. 341 సంచుల్లో (170.05 క్వింటాళ్లు) రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించి సీజ్ చేశారు. కానీ మిల్లు యాజమాన్యంతో కొందరు అధికారులు కుమ్మక్కయ్యారు. పట్టుబడినది రేషన్ బియ్యం కాదంటూ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ ఎల్.గణపతిరావు తప్పుడు నివేదిక రూపొందించి బురిడీ కొట్టించాడు. దీనిపై అప్పట్లో పోలీస్, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య అంతర్గతంగా వివాదం చెలరేగింది. ఈ విషయం బయటికి రావడంతో రాష్ట్రస్థాయి విజిలెన్స్ బృందం రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. మిల్లులో సీజ్ చేసిన బియ్యాన్ని ల్యాబ్‌కు పంపగా రేషన్ బియ్యమేనని తేలింది. దీంతో పూర్తిస్థాయిలో ఆరా తీశారు. రేఖ మిల్లులో బియ్యం పట్టుబడ్డ రోజు గణపతిరావు విధుల్లోనే లేరని, తప్పుడు అనుమతి పత్రాలను రూపొందించి అధికారులకు ఇచ్చారని గుర్తించారు. ఈ వ్యవహారంలో అప్పటి గద్వాల అదనపు కలెక్టర్ (రెవెన్యూ)తోపాటు మరో ఐదుగురి హస్తం ఉన్నట్టు తేల్చి గత ఏడాది డిసెంబర్లోనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇన్నాళ్లూ ఆ నివేదిక మూలనపడగా.. తాజాగా గత నెల 21న గద్వాల పట్టణ పోలీసు స్టేషన్లో డీటీ గణపతిరావుపై కేసు నమోదు చేశారు. ఈ దందాపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. -
కోటి రూపాయలతో అమ్మవారికి అలంకరణ
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. తొమ్మిది రోజులు వివిధ రూపాల్లో సందరంగా అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్నికల్పించారు. ఈ నేపథ్యంలో దసరా ఉత్సవాల్లో భాగంగా జోగులాంబ గద్వాల్‌లోని వాసవి కన్యక పరమేశ్వరి దేవి ఆలయంలో దుర్గమాతను కరెన్సీ నోట్లతో అలంకరించారు. వీటి విలువ అక్షరాలా కోటీ రుపాయలు. భారతీయ కరెన్సీ నోట్లను కాగితపు పువ్వులలాగా తయారు చేసి వాటిని దుర్గమాతకు సమర్పించారు. 10,20, 100,200,500 వంటి వివిధ రకాల నోట్లతో దండలు, పుష్పగుచ్ఛాలుగా తయారు చేసి మొత్తం 1,11,11,111 రూపాయలను ధనలక్ష్మీ అవతారంలో అమ్మవారికి అలంకరించారు. చదవండి: రానా, మిహికల మొదటి దసరా వేడుకలు దీనికి సంబంధించిన వీడియోను ఉమ సుధీర్ అనే మహిళ జర్నలిస్టు ట్విటర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా కోటి రుపాయల మొత్తాన్ని ఇలా అమ్మవారికి సమర్పించడం భక్తులు ఆశ్చార్యానికి లోనవుతున్నారు. అయితే మూడేళ్ల క్రితం అదే ఆలయంలో అమ్మవారికి 3,33,33,333 కోట్ల రూపాయల విలవైన కరెన్సీని ఉపయోగించి అలంకరించారు. రెండేళ్ల క్రితం కిలో బంగారుకిరీటం కూడా సమర్పించారు. కానీ ఈ ఏడాది కోవిడ్ కారణంగా కొంచెం తక్కువ మొత్తంలో అమ్మవారిని అంకరించినట్లు తెలుస్తోంది. చదవండి: శక్తికి యుక్తిని జోడించి ముందుకు.. -
మినీ ఆక్సిజన్ సిలిండర్ లీక్
గద్వాల అర్బన్: జిల్లా ఆస్పత్రిలో మినీ ఆక్సిజన్ సిలిండర్ లీకైంది. దీంతో రోగులు భయంతో బయటకు పరుగులు తీస్తుండగా.. ఒకరు మృత్యువాత పడ్డారు. సోమవారం ఉదయం జోగుళాంబ గద్వాల జిల్లా ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని ఎన్బీహెచ్యూ వార్డులో అప్పుడే పుట్టిన శిశువుకు ఆక్సిజన్ పెట్టేందుకు ఓ నర్సు యత్నించగా.. మినీ సిలిండర్ స్ట్రక్ కావడంతో ఫ్లోమీటర్ కింద పడి పగిలింది. ఆ సమయంలో శబ్దంతో పాటు గ్యాస్ లీకైంది. దీంతో ఎన్బీహెచ్యూ, ఐసీయూ, జనరల్ వార్డుల్లోని రోగులు, వారి బంధువులు భయంతో పరుగులు తీశారు. ఆ సమయంలో శబ్దం పెద్దగా రావ డంతో రోగులు ఆందోళనకు గురయ్యారని అధికారులు తెలిపారు. భయంతో రోగి మృతి కాగా, గద్వాల మండలం శెట్టిఆత్మకూర్కు చెందిన లక్ష్మన్న (46) డయాలసిస్ పేషెంట్. బ్లడ్ షుగర్ లెవల్ తగ్గిందని సోమవారం ఉదయం జిల్లా ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. అతడికి వైద్యసిబ్బంది క్యాజువాలిటీ వార్డులో ఉంచి చికిత్స నిర్వహించారు. అయితే గ్యాస్ లీకేజీ అయిందని తెలుసుకున్న అతను భయంతో బయటకు పరుగులు తీస్తూ ఊపిరి ఆడక మృతి చెందాడు. -
కిడ్నాప్.. ఆపై పెళ్లి
శాంతినగర్ (అలంపూర్): బాలికను కిడ్నాప్ చేసి.. పెళ్లి చేసుకొని మూడున్నరేళ్లుగా సికింద్రాబాద్‌లో మకాం పెట్టాడు. ఈ క్రమంలో వారికి పాప జన్మించింది. ఆధార్ కార్డు ఆధారంగా చిరునామా తెలుసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్‌కు చెందిన షఫీ ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్. ఆ సమయంలో బాలికకు (14) మాయ మాటలు చెప్పి 2016 ఏప్రిల్ 26న హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. దీనిపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆధార్ కార్డు ఆధారంగా మూడున్నరేళ్ల తర్వాత కేసు ఛేదించారు. -
వేరు కాపురం పెట్టి.. భార్య హత్య
గద్వాల క్రైం: వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో కట్టుకున్న భార్యను భర్త గొంతునులిమి హత్య చేసిన సంఘటన సోమవారం సాయంత్రం గద్వాలలో చోటు చేసుకుంది. స్థానికులు, పట్టణ ఎస్ఐ సత్యనారాయణ కథనం ప్రకారం.. గద్వాలలోని తెలుగు రంగన్న, అంజనమ్మల దంపతుల కుమారుడు రామాంజనేయులుకు మల్దకల్ మండలం వామనపల్లికి చెందిన తెలుగు రేణుక(22)తో మూడేళ్ల క్రితం వివాహం చేశారు. అనోన్యంగా ఉంటున్న క్రమంలో రేణుక మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని రామాంజనేయులు అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో భార్యను ఎలాగైనా అంతం చేయాలని పథకం వేశాడు. ఉమ్మడి కుటుంబంలో ఉంటున్న నేపథ్యంలో భార్యను ఏం చేయలేక గత 20 రోజుల క్రితం రామాంజనేయులు తల్లిదండ్రులతో ఘర్షణ పడి నాయిబ్రాహ్మణకాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం ఇంట్లో భార్యను గొంతునులిమి హత్య చేసి పారిపోయాడు. వీరికి ఒక సంవత్సరం బాబు ఉన్నాడు. సంఘటన జరిగిన విషయాన్ని అదే కాలనీలో గొర్రెలు కాస్తున్న వ్యక్తి ఇంట్లో నుంచి కేకలు రావడంతో అక్కడకి వెళ్లి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రామాంజనేయులుకు ఇదివరకే ఓ మహిళతో వివాహం కాగా విడాకులు ఇచ్చాడు. రేణుక బంధువుల అమ్మాయి కావడంతో గత మూడేళ్ల క్రితం కుటుంబ సభ్యులు మళ్లీ వివాహం జరిపించారు. రామాంజనేయులు ఓ ప్రైవేట్ సెల్‌ఫోన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. -
ముందుకు సాగని ‘ముచ్చోనిపల్లె’ పనులు
గట్టు (గద్వాల): ముచ్చోనిపల్లె రిజర్వాయర్ నీటి తరలింపు పనులు ముందుకుసాగలేదు. ఈ వ్యవహారంపై రెండోరోజు సోమవారం కూడా రిజర్వాయర్ దగ్గర కాలువ పనులను ఆయా గ్రామాల రైతులు అడ్డుకున్నారు. సాగు నీటి శాఖ అధికారులు, పోలీసులు రైతులకు ఎంతగా నచ్చ చెప్పినా రైతులు మాత్రం నీటి తరలింపునకు అంగీకరించే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పారు. ఉదయం నెట్టెంపాడు డీఈ కిరణ్, గట్టు ఎస్ఐ మంజునాథ్‌రెడ్డి ముచ్చోనిపల్లె రిజర్వాయర్ దగ్గరకు వెళ్లారు. ముచ్చోనిపల్లె, మిట్టదొడ్డి, చాగదొన, తుమ్మలపల్లి గ్రామాలకు చెందిన రైతులు కూడా రిజర్వాయర్ కట్ట దగ్గరకు చేరుకున్నారు. అయిజ మండలలోని శేషమ్మ చెరువు, ఎక్లాస్పూర్ చెరువుతో పాటుగా చిన్న కుంటలకు నీటిని వదిలేందుకు ఇంజనీరింగ్ అధికారులు ముచ్చోనిపల్లె గ్రామం వైపు ఉన్న తూం దగ్గర నుంచి రిజర్వాయర్ కట్ట పొడవునా వాగు వరకు కాల్వను తవ్వే పనులను చేపట్టారు. నీటి వృథాను ఒప్పుకునే ప్రసక్తే లేదు.. అయితే కాల్వ తవ్వకంలో రాళ్లను పగుల కొట్టేందుకు బ్లాస్టింగ్ చేయడానికి లారీని రిజర్వాయర్ కట్ట దగ్గరకు తీసుకు రావడంతో రైతులు అడ్డుకున్నారు. రిజర్వాయర్‌ను పూర్తి స్థాయిలో నింపకుండా ఉన్న కొద్ది పాటు నీటిని వృథాగా వాగుల వెంట వదలడానికి తాము అంగీకరించే ప్రసక్తే లేదని రైతులు తెలిపారు. రిజర్వాయర్ నీటిని కిందకు వదిలితే మా పంటల పరిస్థితి ఎంటని రైతులు ప్రశ్నించారు. డీఈ కిరణ్ ఆయా గ్రామాల రైతులకు నీటి తరలింపు విషయంపై ఎంతగా నచ్చ చెప్పినా, రైతులు వినలేదు. పనులు జరుగనిచ్చే సమస్యే లేదంటూ ఆయా గ్రామాల రైతులు తేల్చి చెప్పడంతో చేసేదేమి లేక అధికారులు వెనుతిరిగారు. విషయాన్ని ఎస్ఈ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు డీఈ కిరణ్ తెలిపారు. అయిజ మండలంలోని చెరువులను నింపేందుకు రెండు అవకాశాలు ఉన్నట్లు డీఈ కిరణ్ తెలిపారు. ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి వచ్చే కాల్వ డీ6 నుంచి 7ఎల్ ఆఫ్ 3ఎల్ నుంచి కేవలం కిలోమిటర్ మేర కాల్వ తవ్వితే చెరువులోకి నీరు వస్తాయని, ముచ్చోనిపల్లె రిజర్వాయర్ ద్వారా అయిజ వాగు నుంచి కూడా నీటిని తరలించేందుకు అవకాశం ఉందని తెలిపారు. చెరువులను నింపేందుకు ఓటి మంజూరైనట్లు డీఈ తెలిపారు. రైతులు అభ్యంతరం తెలపడంతో పనులు నిలిపివేసినట్లు డీఈ తెలిపారు.