
సూర్యప్రకాష్ మృతదేహం
గద్వాల (గట్టు): వ్యవసాయ పనులు చేసి అలసిపోయారు. పూరిగుడిసెలో నిద్రకుపక్రమించారు. అప్పటికే దుప్పట్లో దూరిన విష సర్పాన్ని గమనించలేకపోయారు. ఇద్దరు బిడ్డల్ని పాము కాటేసిన విషయం తెలిసి గుండెలు బాదుకుంటూ ఆస్పత్రికి పరుగులు తీశారు. కానీ ఇద్దరిలో బాబు కన్నుమూయగా.. పాప ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికలపాడుకు చెందిన నర్సమ్మ అలియాస్ సరోజమ్మ, నాగరాజు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు.
ఎప్పటిలాగే శనివారం రాత్రి తమ పూరిగుడిసెలో అందరూ నిద్రకు ఉపక్రమించారు. అప్పటికే దుప్ప ట్లో పాము దూరిఉంది. ఆదివారం తెల్లవారుజాము న వారి కుమారుడు సూర్యప్రకాష్ (4), కూతురు సురక్షిత (5) పాటుకాటుకు గురయ్యారు. వెంటనే తల్లిదండ్రులు ఇద్దరినీ గట్టు పీహెచ్‌సీకి తరలించారు. అనంతరం పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ ఉదయం బాలుడు మృతి చెందగా, బాలిక ప్రాణాపాయస్థితిలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment