గద్వాలలో ‘డర్టీ పిక్చర్‌’! | 3 Arrested For Shooting Nude Videos Of Women In Gadwal District | Sakshi
Sakshi News home page

గద్వాలలో ‘డర్టీ పిక్చర్‌’!

Published Tue, Nov 8 2022 2:04 AM | Last Updated on Tue, Nov 8 2022 2:04 AM

3 Arrested For Shooting Nude Videos Of Women In Gadwal District - Sakshi

కేసు వివరాలను వెల్లడిస్తున్న  ఎస్పీ రంజన్‌రతన్‌ కుమార్‌  

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: జోగుళాంబ గద్వాల జిల్లాలో కొందరు మహిళలు, యు­వ­తు­­లను లోబర్చుకుని, న్యూడ్‌ వీడియోల­తో బ్లాక్‌మెయిల్‌ చేసిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ బాగో తంలో ఇప్పటివరకు అరెస్టైన ముగ్గురు ఓ ప్రధాన పార్టీకి చెందిన యువ నాయకులే. వారితోపాటు ఓ ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడు, ఇద్దరు కౌన్సిలర్లు, ఓ కౌన్సిలర్‌ భర్త, పలువురు పోలీసులకు కూడా ఇందులో పాత్ర ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఓ కీలకనేత రంగంలోకి దిగారని, తమకూ మరకలు అంటుతుండటంతో ఈ వ్యవహారాన్ని నీరుగార్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

గొడవపడి.. బయటపెట్టుకుని..
గద్వాలకు చెందిన కొందరు కొన్నాళ్లుగా మహిళలను, అమ్మాయిలను ట్రాప్‌ చేసి లోబర్చుకున్నారు. వారి నగ్న వీడియోలు, కాల్స్‌ రికార్డు చేసి బ్లాక్‌మెయిల్‌ చేస్తూ.. మరింతగా వేధించడం మొదలుపెట్టారు. ఇటీవల పలువురు మహిళల అర్ధ నగ్న వీడి యోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమ వడంతో ఈ ట్రాప్‌ అంశం వెలుగులోకి వచ్చింది.

ఫిర్యాదు చేసేందుకు బాధితులెవ రూ రాకపోవడంతో.. ‘సాక్షి’తోపాటు పలు పత్రికల్లో వచ్చిన కథనాలను పోలీసులు సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టారు. గద్వాలకు చెందిన తిరుమలేష్‌ అలియాస్‌ మహేశ్వర్‌రెడ్డి ఫోన్‌ నుంచి సదరు ఫొటోలు, వీడియోలు బయటికి వచ్చినట్టు గుర్తించారు. అతడిని విచారించగా.. గద్వాలకే చెందిన నిఖిల్, వినోద్‌ల పాత్ర వెలుగులోకి వచ్చింది. వారి మధ్య విభేదాలు తలెత్తడంతోనే ఒకరికి సంబంధించిన రహస్యాలను మరొకరు బయటపెట్టినట్టు తేలింది.

తారుమారు చేశారా?
ఈ వ్యవహారానికి సంబంధించి సోమవారం పోలీసులు వెల్లడించిన వివరాలు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశాయి. ‘‘తిరుమలేష్‌ (మహేశ్వర్‌రెడ్డి) ఓ పార్టీలో మద్యంతాగి స్పృహలేకుండా పడిపోయినప్పడు కాశపోగు నిఖిల్‌ అతడి ఫోన్‌లోని మహిళల సెమీ న్యూడ్‌ ఫొటోలు, వీడియోలను చూసి తన మిత్రుడు వినోద్‌కు పంపాడు. వినోద్‌ తన స్నేహితుడైన క్రాంతికి పంపాడు.

తిరుమ లేష్, క్రాంతి ఇద్దరు కలిసే తిరుగుతుంటారు. దీనితో తిరుమలేష్‌ గురించి చెప్పేందుకు క్రాంతితోపాటు ఓ కౌన్సిలర్‌ భర్త రంజిత్‌కు పంపాడు’’ అని ఎస్పీ రంజన్‌ రతన్‌ కుమార్‌ వెల్లడించారు. అయితే ఈ కేసును తారుమారు చేశారంటూ వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నుంచి విమర్శలు వస్తున్నా యి. కేసులో ఒకరిని తప్పించేందుకు రూ.30లక్షల బేరం కుదిరిందని ముందు నుంచే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఓ స్టడీ సర్కిల్‌ వేదికగా ట్రాప్‌
ప్రభుత్వం కొన్నినెలల క్రితం ఉద్యోగ ప్రక టనలు విడుదల చేసిన క్రమంలో జిల్లాలో ఓ స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేశారు. దాన్ని వేదికగా చేసుకుని ఓ ముఠా అమాయక యువతులు, మహిళలకు గాలమేసి ఫొటో లు, న్యూడ్‌ వీడియోలతో బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడినట్టు సమాచారం. గత నాలుగైదు నెలల్లో 50మంది వరకు వారిబారిన పడ్డారని.. కానీ పరువు పోతుందనే భయంతో బయటికి చెప్పడం లేదని తెలిసింది.

గద్వాలలో మూడు ముఠాలు ఇలా మహిళలను ట్రాప్‌ చేసి, బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కాగా గద్వాల వ్యవహారంలో ప్రధాన నిందితులను తప్పించే ప్రయత్నాలు జరుగు తున్నాయని.. కొందరు పోలీసుల çసహకా రం ఉందని వినిపిస్తోందని పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్‌ ఎక్బాల్‌పాషా ఆరోపించారు. దీనిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

సీఐని ఎందుకు బదిలీ చేశారో!
ఈ వ్యవహారంలో గద్వాలకు చెందిన ఓ ఎస్సై పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ నిందితుడితో సదరు ఎస్సైకి ‘ఖరీదైన’ స్నేహంతోపాటు భాగస్వామ్యం ఉన్నట్టు చెప్తున్నారు. ఈ కోణాల్లో విచారణ చేపట్టామని, ఇప్పటివరకు పోలీసుల పాత్ర ఏమీ తేలలేదని ఎస్పీ మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో చెప్పారు. కానీ సాయంత్రమే సదరు ఎస్సైని బదిలీ చేయడంపై జిల్లాలో చర్చ జోరుగా సాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement