
అయిజ: ఎన్నికల్లో గెలిచిన అనంతరం కుర్చీ వేసుకొని కూర్చొని ఆలంపూర్ ఆయకట్టుకు నీరు పారిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్‌కు ఇంత వరకు కుర్చీనే దొర కలేదా? జాగా దొరకడం లేదా? అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఎద్దేవా చేశారు.
బహుజన రాజ్యాధికార యా త్ర మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలో కొనసాగింది. ఉత్తనూ రు సమీపంలో ప్రవీణ్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం సిద్ధించినా ఆలంపూర్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు.