
నార్కట్‌పల్లి మండలం అక్కెనపల్లిలోని మైనార్టీల సమస్యలు తెలుసుకుంటున్న ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్
నార్కట్‌పల్లి: సీఎం కేసీఆర్ దళితబంధు, డబుల్ బెడ్‌రూం ఇళ్ల పేరుతో పేదలను వంచిస్తున్నారని, ఆ మాటలు విని ప్రజలెవరూ మోసపోవద్దని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర 22వ రోజు ఆదివారం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు, అక్కెనపల్లి గ్రామాల్లో సాగింది.
చెర్వుగట్టులోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అక్కెనపల్లిలోని మసీదును సందర్శించారు. చెర్వుగట్టులో ప్రజలనుద్దేశించి ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో తాగునీటి సమస్య నేటికీ పరిష్కారం కాలేదని, మిషన్ భగీరథ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయని విమర్శించారు. ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లించడంలో, కొత్త పించన్లు మంజూరు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment