
'టీఆర్ ఎస్ లో చేరుతున్నాననడం శుద్ధ అబద్ధం'
హైదరాబాద్: తాను టీఆర్ ఎస్ లో చేరుతున్నాననడం శుద్ధ అబద్ధమని మాజీ మంత్రి, గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. కె. కేశవరావుతో మంగళవారం ఆమె సమావేశమయ్యారు. భేటీ ముగిసిన తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడుతూ... గద్వాల జిల్లా ఏర్పాటు ప్రాముఖ్యతను వివరించేందుకే తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ కు పంపించానని వెల్లడించారు.
ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా గద్వాల జిల్లా ఏర్పాటుపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని అన్నారు. గద్వాల జిల్లా ఏర్పాటు ప్రాముఖ్యత గురించి హైపర్ కమిటీకి వివరించానని తెలిపారు. కాగా, గద్వాల జిల్లా ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నామని కేసీఆర్ వెల్లడించారు.