అరుణ రాజీనామాలో నిజాయితీ లేదు
Published Sat, Oct 1 2016 11:34 PM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM
– గద్వాలలో రాజకీయ పునాదులు కదులుతున్నాయనే రాజీనామా
– పంచాయతీరాజ్ శాఖ మంత్రి కృష్ణారావు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ రాజీనామాలో నిజాయితీ లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొట్టి పారేశారు. శనివారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి విలేకర్లతో మాట్లాడారు. సందర్భం వచ్చినప్పుడు రాజీనామాలు చేయకుండా పారిపోయిన అరుణ, ప్రస్తు తం గద్వాలలో పునాదులు కదులుతున్నాయనే రాజీనామా డ్రామాలకు తెరతీసిన ట్లు అభిప్రాయపడ్డారు. వ్యక్తుల కోసం జి ల్లాను ఏర్పాటు చేయడం లేదని అలాగని అరుణ అనుకుంటే రాష్ట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లా జిల్లా చేయడం లేదని గుర్తు చేసుకోవాలన్నారు. టీఆర్‌ఎస్ పార్టీలు ఉన్న చోట జిల్లాలు చేస్తున్నారనడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి వనపర్తిని జిల్లా చేయడాన్ని మరిచిపోవద్దని అన్నారు. అరుణ చేసే వాఖ్యలు పూర్తిగా అర్థరహితమని సొంత ప్రాభల్యం కోసమే రాజీనామా డ్రామాలు ఆడుతుందని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం జూరాల, నెట్టెంపాడు నుంచి గద్వాలను సస్యశామలం చేస్తుందని దీంతో గద్వాలలో తన రాజకీయ భవిష్యత్ కోసం రాజీనామాలు చేస్తున్నారని అన్నారు. సీఎం గారు గద్వాల జిల్లాను తుది ముసాయిదాలో ప్రకటిస్తే నా రాజీనామాను మీరు ఆమోదించగలరని మనవి అని అరుణ రాజీనామా లేఖలో స్పష్టంగా పేర్కొన్నారని, అంటే దీని అర్థం గద్వాల జిల్లా కాదని తన రాజీనామాను ఆమోదించకండని ఆమె స్పష్టంగా చెబుతుందని యెద్దేవా చేశారు. కారణాలు చూపుతూ రాజీనామా చేస్తే ఆ రాజీనామా అమోదం కాదని సీనియర్ ఎమ్మెల్యే అయిన అరుణకు తెలియపోవడం సిగ్గు చేటన్నారు. అరుణ రాజీనామా చెత్తబుట్టతో సమానమని, విలువ లేని రాజీనామాలు ఎన్ని చేసినా ప్రజలు నమ్మరన్నారు.
ఒక్క రూపాయి ఇవ్వనన్నప్పుడు ఎం చేశారు?
అసెంబ్లీ సాక్షిగా ఆంధ్ర సీఎం తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనన్నప్పుడు ఈ రోషం ఏమైందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. పదవుల కోసం బానిసలుగా మారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆంధ్ర నాయకులకు తాకట్టు పెట్టిన విషయం మరిచిపోయారని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి జరగాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నచోట అధిక నిధులు సీఎం కేసీఆర్ కేటాయిస్తున్నారని చెప్పారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు గద్వాల జెడ్పీటీసీ అయిన కృష్ణమోహన్‌రెడ్డికి ఐదేళ్ల కాలంలో ఒక్క రూపాయి ఇవ్వని విషయాన్ని గుర్తు చేశారు. తన రాజీనామాలు ప్రజలు తిప్పి కొడుతారని చెప్పారు. సమావేశంలో టీఆర్‌ఎస్ జిల్లా అ««దl్యక్షుడు శివకుమార్, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement