jupalli
-
ఎన్నికల ప్రచారంలో జూపల్లికి చేదు అనుభవం
-
‘నయీమ్ ఎన్కౌంటర్ వెనుక చీకటికోణం’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటి వరకు జరగనంత అతిపెద్ద భూకుంభకోణానికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన బినామీ జూపల్లి రామేశ్వరరావులు పాల్పడుతున్నారని కొడంగల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. విలేకరులతో మాట్లాడుతూ.. అసైన్డ్ భూములపై ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకే హడావిడిగా అసెంబ్లీ సమావేశాన్ని ముగించారని తెలిపారు. లబ్దిదారులకు మేలు చేస్తున్నామన్న ముసుగులో ఆర్డినెన్స్ తేవాలని చూస్తున్నారని చెప్పారు. ఈ ఆర్డినెన్స్ ద్వారా కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయల భూదందాకు తెరలేపిందన్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే తన ఆరోపణలపై స్పందించాలని సవాల్ విసిరారు. ఈ కుంభకోణంలో కేసీఆర్, ఆయన బినామీ జూపల్లి రామేశ్వరరావు ఉన్నారని.. శంషాబాద్, మహేశ్వరం పరిసరాల్లో నాలుగు వేల ఎకరాల భూమి జూపల్లి చేతిలో ఉందని వెల్లడించారు. హెచ్ఎండీఏ ప్రాంతంలో అసైన్ ల్యాండ్ రెగ్యులరైజ్ వ్యతిరేకించినందుకే బీఆర్ మీనాను బదిలీ చేశారని విమర్శించారు. రామేశ్వరరావుకు మేలు చేసేందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భూములను కట్టబెట్టారని ఆరోపించారు. శంషాబాద్, మహేశ్వరం మండలంలో రామేశ్వరరావుకు భూములెన్ని ఉన్నాయో, వాటిలో అసైన్డ్ భూమి ఎన్ని ఎకరాలు ఉన్నాయో చెప్పాలని సూటిగా అడిగారు. కేసీఆర్ తన చుట్టం జూపల్లి కోసం.. చట్టం తేవాలని చూస్తున్నారని రేవంత్ అన్నారు. సీఎం, ఆయన బంధువులపై తాను ఆరోపణలు చేస్తున్నానని.. ధైర్యముంటే తనపై కేసులు పెట్టుకోవచ్చునని సవాల్ విసిరారు. నయీమ్ ఎన్కౌంటర్ వెనక, ఈ భూమికి సంబంధించిన చీకటి కోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మొత్తం భూ దందాపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తనను రెచ్చగొట్టేందుకు తిట్ల కోసం కాకుండా.. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని టీఆర్ఎస్ నేతలను సూటిగా అడిగారు. నిషేధించిన చట్టాన్ని మార్చాలని కేసీఆర్ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. -
వ్యవసాయానికి 24గంటలూ కరెంట్
► వచ్చే ఏడాది నుంచి ఇస్తాం మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్‌రూరల్: వచ్చే ఏడాది నుంచి రైతులకు 24గంటల కరెం ట్ను ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం పట్టణ సమీపంలో ఈదమ్మ జాతర ముగిం పు ఉత్సవాలను పురస్కరించుకుని సీనియర్ విభాగంలో భాగంగా ఎడ్లపు బండలాగుడు పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను మంత్రి జూపల్లి కృష్ణారావు పూజ చేసి ప్రారంభించారు. అనంతరం రైతులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది ఉమ్మడి జిల్లాలో ఎనిమిది లక్షల ఎకరాలకు ప్రాజెక్టుల ద్వారా సాగునీరు ఇస్తామన్నారు. అన్ని వర్గాల ప్రజల కష్టాలు పరిష్కారమైనప్పుడే బం గారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. ఉమ్మడి జిల్లాలోని రైతులు వాణిజ్య పంటలు వేసుకోవటానికి ముందుకు రావాలన్నారు. బండలాగుడు పోటీలు వినోదంగా ఉండాలని, రాగద్వేషాలకు పోవద్దన్నారు. కోడి పందాలకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చిన్న నిరంజన్‌రావు, జెడ్పీటీసీ హన్మంతునాయక్, మంత్రి వ్యక్తిగత కార్యదర్శి జూపల్లి రామారావు, సింగిల్‌విండో చైర్మన్ రఘుపతిరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండీ ఎక్బాల్, ఆదర్శ రైతు సంఘం అధ్యక్షుడు పెబ్బేటి కృష్ణయ్య, కార్యదర్శి బిజ్జ వేణు, టీఆర్ఎస్ నాయకులు సంపంగి నర్సింహ్మ, బోరెల్లి మహేష్, తదితరులు ఉన్నారు. -
అరుణ రాజీనామాలో నిజాయితీ లేదు
– గద్వాలలో రాజకీయ పునాదులు కదులుతున్నాయనే రాజీనామా – పంచాయతీరాజ్ శాఖ మంత్రి కృష్ణారావు జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ రాజీనామాలో నిజాయితీ లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొట్టి పారేశారు. శనివారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి విలేకర్లతో మాట్లాడారు. సందర్భం వచ్చినప్పుడు రాజీనామాలు చేయకుండా పారిపోయిన అరుణ, ప్రస్తు తం గద్వాలలో పునాదులు కదులుతున్నాయనే రాజీనామా డ్రామాలకు తెరతీసిన ట్లు అభిప్రాయపడ్డారు. వ్యక్తుల కోసం జి ల్లాను ఏర్పాటు చేయడం లేదని అలాగని అరుణ అనుకుంటే రాష్ట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లా జిల్లా చేయడం లేదని గుర్తు చేసుకోవాలన్నారు. టీఆర్ఎస్ పార్టీలు ఉన్న చోట జిల్లాలు చేస్తున్నారనడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి వనపర్తిని జిల్లా చేయడాన్ని మరిచిపోవద్దని అన్నారు. అరుణ చేసే వాఖ్యలు పూర్తిగా అర్థరహితమని సొంత ప్రాభల్యం కోసమే రాజీనామా డ్రామాలు ఆడుతుందని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం జూరాల, నెట్టెంపాడు నుంచి గద్వాలను సస్యశామలం చేస్తుందని దీంతో గద్వాలలో తన రాజకీయ భవిష్యత్ కోసం రాజీనామాలు చేస్తున్నారని అన్నారు. సీఎం గారు గద్వాల జిల్లాను తుది ముసాయిదాలో ప్రకటిస్తే నా రాజీనామాను మీరు ఆమోదించగలరని మనవి అని అరుణ రాజీనామా లేఖలో స్పష్టంగా పేర్కొన్నారని, అంటే దీని అర్థం గద్వాల జిల్లా కాదని తన రాజీనామాను ఆమోదించకండని ఆమె స్పష్టంగా చెబుతుందని యెద్దేవా చేశారు. కారణాలు చూపుతూ రాజీనామా చేస్తే ఆ రాజీనామా అమోదం కాదని సీనియర్ ఎమ్మెల్యే అయిన అరుణకు తెలియపోవడం సిగ్గు చేటన్నారు. అరుణ రాజీనామా చెత్తబుట్టతో సమానమని, విలువ లేని రాజీనామాలు ఎన్ని చేసినా ప్రజలు నమ్మరన్నారు. ఒక్క రూపాయి ఇవ్వనన్నప్పుడు ఎం చేశారు? అసెంబ్లీ సాక్షిగా ఆంధ్ర సీఎం తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనన్నప్పుడు ఈ రోషం ఏమైందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. పదవుల కోసం బానిసలుగా మారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆంధ్ర నాయకులకు తాకట్టు పెట్టిన విషయం మరిచిపోయారని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి జరగాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నచోట అధిక నిధులు సీఎం కేసీఆర్ కేటాయిస్తున్నారని చెప్పారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు గద్వాల జెడ్పీటీసీ అయిన కృష్ణమోహన్‌రెడ్డికి ఐదేళ్ల కాలంలో ఒక్క రూపాయి ఇవ్వని విషయాన్ని గుర్తు చేశారు. తన రాజీనామాలు ప్రజలు తిప్పి కొడుతారని చెప్పారు. సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా అ««దl్యక్షుడు శివకుమార్, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'ప్రతిపక్షాలనూ గౌరవించే సంస్కృతి మాది'