వ్యవసాయానికి 24గంటలూ కరెంట్
వ్యవసాయానికి 24గంటలూ కరెంట్
Published Wed, Mar 1 2017 12:37 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
► వచ్చే ఏడాది నుంచి ఇస్తాం మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్‌రూరల్: వచ్చే ఏడాది నుంచి రైతులకు 24గంటల కరెం ట్‌ను ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం పట్టణ సమీపంలో ఈదమ్మ జాతర ముగిం పు ఉత్సవాలను పురస్కరించుకుని సీనియర్ విభాగంలో భాగంగా ఎడ్లపు బండలాగుడు పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను మంత్రి జూపల్లి కృష్ణారావు పూజ చేసి ప్రారంభించారు. అనంతరం రైతులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది ఉమ్మడి జిల్లాలో ఎనిమిది లక్షల ఎకరాలకు ప్రాజెక్టుల ద్వారా సాగునీరు ఇస్తామన్నారు.
అన్ని వర్గాల ప్రజల కష్టాలు పరిష్కారమైనప్పుడే బం గారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. ఉమ్మడి జిల్లాలోని రైతులు వాణిజ్య పంటలు వేసుకోవటానికి ముందుకు రావాలన్నారు. బండలాగుడు పోటీలు వినోదంగా ఉండాలని, రాగద్వేషాలకు పోవద్దన్నారు. కోడి పందాలకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చిన్న నిరంజన్‌రావు, జెడ్పీటీసీ హన్మంతునాయక్, మంత్రి వ్యక్తిగత కార్యదర్శి జూపల్లి రామారావు, సింగిల్‌విండో చైర్మన్ రఘుపతిరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండీ ఎక్బాల్, ఆదర్శ రైతు సంఘం అధ్యక్షుడు పెబ్బేటి కృష్ణయ్య, కార్యదర్శి బిజ్జ వేణు, టీఆర్‌ఎస్ నాయకులు సంపంగి నర్సింహ్మ, బోరెల్లి మహేష్, తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement